కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 9/1 పేజీలు 29-31
  • మీ పరిశుద్ధ సేవను గుణగ్రహించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ పరిశుద్ధ సేవను గుణగ్రహించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం మొదటిసారిగా దేవున్ని గూర్చి తెలుసుకున్నప్పుడు
  • అవి నిజంగానే త్యాగాలా?
  • ప్రతిఫలాలను గూర్చి ఆలోచించండి
  • సమర్పణకు సంబంధించిన చర్య
  • నమ్మకమైన సేవ చేయడంవల్ల కలిగే యితర ప్రతిఫలాలు
  • మీ బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?​— 2వ భాగం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • దైవభక్తిగల జీవితాన్ని గడపడం ఎందుకు సంతోషాన్ని తెస్తుంది
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • ‘మిమ్మల్నీ, మీ బోధ వినేవారినీ రక్షించుకోండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 9/1 పేజీలు 29-31

మీ పరిశుద్ధ సేవను గుణగ్రహించండి

పొందదగిన ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా, త్యాగాలు చేయడానికి మనం యిష్టతను కల్గి ఉండాలి. ఓ డాక్టరు కావడానికి సంవత్సరాల తరబడి చదువు, నిశ్చయత, అలాగే డబ్బు అవసరమౌతాయి. ఓ విజయవంతమైన జిమ్నాస్ట్‌ తన యౌవన కాలాన్నంతటినీ, పరిపూర్ణతను సాధించేందుకు అతి కష్టమైనవాటిని మరలా మరలా ఎడతెగక చేస్తూ గడుపుతాడు. నిష్టాతుడైన ఓ పియానో వాద్యకారుడు అదే రీతిలో సంవత్సరాలుగా సమర్పించుకుని అభ్యసించి ఉంటాడు.

అయితే, చేయవల్సిన ఎంతటి త్యాగానికైనా ప్రతిఫలాన్ని తెచ్చే లక్ష్యం ఒకటి ఉంది. అదేమిటి? అది, సర్వోన్నతుడైన యెహోవా దేవుని సేవకునిగా ఉండే ఆధిక్యతే. సమయం, ధనం, లేక శక్తి విషయాల్లో మనం ఏ త్యాగాలు చేసినా, మన సృష్టికర్తకు పరిశుద్ధ సేవనందించే ఆధిక్యత మనకు అసమాన్యమైన ప్రతిఫలాలను తెస్తుంది. అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలు నిజమే: “దైవభక్తి యిప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.” (1 తిమోతి 4:8) అది ఎలా నిజమో మనం చూద్దాము.

మనం మొదటిసారిగా దేవున్ని గూర్చి తెలుసుకున్నప్పుడు

సువార్తకు అనుకూలంగా ప్రతిస్పందించేవారూ అలాగే బైబిలును పఠించేవారు, మున్ముందు తమ జీవితాల్లో ఎంతటి మార్పులు రాబోతున్నాయో గుర్తించలేరు. మొదట, దేవున్ని అగౌరవపర్చే విషయాలని యిప్పుడు ఎంచే వాటిని వెంబడించడానికి తమతో ఎందుకు యిక ఎంతమాత్రమూ సహకరించడం లేదో అర్థంచేసుకోలేని కొందరు స్నేహితులను కొత్త బైబిలు విద్యార్థి పోగొట్టుకోవచ్చు. (1 పేతురు 4:4) కొందరు కుటుంబ వ్యతిరేకతను అనుభవించవచ్చు, అంతేకాకుండా వారి ప్రియమైన వారు, యెహోవా యెడల అయిష్టతనూ, ద్వేషాన్ని కూడా వ్యక్తపర్చడం చూసి బాధపడవచ్చు. (మత్తయి 10:36) అది ఎంతో కష్టంతో కూడిన త్యాగం కాగలదు.

పనిచేసే చోటకానీ లేక పాఠశాలలో కానీ, త్యాగం చేయవల్సివస్తుంది. కొత్త బైబిలు విద్యార్థి, లోకసంబంధమైన పార్టీలూ యితర ఉత్సవాల్లో పాల్గొనడం కొద్దికాలానికి మానుకుంటాడు. అటు తన సహోద్యోగులు లేక తోటివిద్యార్థులు మాట్లాడే అశుద్ధమైన మాటలను యిక ఎంతమాత్రమూ వినడు, యిటు వారితో అశ్లీల తమాషాలను అటు యిటూ పంచుకోడు. బదులుగా, ఎఫెసీయులు 5:3, 4లో ఉన్న ఉద్బోధను అతను ఆచరణలో పెట్టడానికి చూస్తాడు: “మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.”

అలాంటి మార్పు బైబిలు విద్యార్థిని అన్యుడిని చేయగలవు. ముఖ్యంగా యింకా పాఠశాలలో చదువుకునే యౌవనులకు అది కష్టంగా ఉండవచ్చు. ఒక పండుగ దినం తర్వాత మరొకదాన్ని ఎదుర్కోవల్సి వస్తుంది, అలాగే పరిణామం వంటి దైవేతర బోధలు, పదిమందిని అనుసరించాలనే ఒత్తిళ్లతో యౌవన క్రైస్తవులు నిత్యం విశ్వాసం నిమిత్తం తప్పక పోరాడుతూనే ఉండాలి. దేవుని మార్గాలను అనుసరించడం వారిని వేరుపరుస్తుంది, అంతేకాకుండ అది తోటి విద్యార్థుల, ఉపాధ్యాయుల అపహాస్యానికి గురిచేస్తుంది. ప్రత్యేకంగా సుకుమారమైన యౌవనకాలంలో యిది కష్టతరంగా ఉండవచ్చు, అయితే దేవుని అంగీకారం ఆ పారితోషికానికి తగినదే!

అవి నిజంగానే త్యాగాలా?

మొదట త్యాగాలుగా కనిపించిన యితర విషయాలు, తర్వాత ఆశీర్వాదాలుగా మారుతాయి. కొందరు పొగాకు అలవాటును వదులుకోవల్సి వస్తుంది. (2 కొరింథీయులు 7:1) ఇది ఓ పోరాటం కావచ్చు, అయితే ఆ అసహ్యమైన వ్యసనాన్ని చివరికి అధికమించినప్పుడు అది ఎంతటి ఆశీర్వాదమౌతుంది! ఇతర మాదక ద్రవ్యాలనూ లేక సురపాన సేవనాన్ని అధిగమించడం విషయంలో కూడా అదే చెప్పవచ్చు. అలాంటి నాశనకర అలవాట్లు లేని జీవితం ఎంత బాగుంటుందో కదా! ఇతరులు తమ వైవాహిక సంబంధాలను సరాళం చేసుకోవల్సి ఉంటుంది. వివాహం చేసుకోకుండా కలిసి జీవించేవారు, అటు వివాహమన్నా చేసుకుంటారు లేదా కలిసి జీవించడమన్నా మానేస్తారు. (హెబ్రీయులు 13:4) బహు భార్యలతో జీవించేవారు, తమ యౌవన కాలంలోని భార్యతోనే ఉంటారు. (సామెతలు 5:18) అలాంటి సర్దుబాట్లకు త్యాగం అవసరం, అయితే అవి యింట్లో శాంతిని చేకూరుస్తాయి.

ప్రతిఫలాలను గూర్చి ఆలోచించండి

వాస్తవానికి, యెహోవా న్యాయవిధులకు విధేయులైనవారు నిజంగానే ప్రయోజనం పొందుతారు. జీవితంలో మొట్టమొదటి సారిగా బైబిలు విద్యార్థి తన సృష్టికర్తను యెహోవా అనే పేరుతో సంబోధించడం మొదలుపెడతాడు. (కీర్తన 83:18) మానవజాతి కొరకు యెహోవా చేసిన అద్భుత విషయాలను గూర్చి, యికముందు చేయబోయే విషయాలను గూర్చి విద్యార్థి నేర్చుకుంటుండగా ఆయనను ప్రేమించడం మొదలుపెడతాడు. సామాన్యంగా, మరణించినవారి భయం ఉన్న దేశాల్లో, మృతుల పునరుత్థానం కొరకు ఎదురుచూస్తూ నిద్రిస్తున్నారని అతను తెలుసుకుని, ఈ మూఢనమ్మకపు భయాన్ని పోగొట్టుకుంటాడు, (ప్రసంగి 9:5, 10) అంతేకాకుండా యెహోవా, ప్రజలను నరకంలో నిత్యం బాధించడని తెలుసుకోవడం ఎంత ఉపశమనాన్నిస్తుంది! అవును, సత్యం నిజంగా అతన్ని స్వతంత్రుణ్ణి చేసింది.—యోహాను 8:32.

తన జీవితాన్ని యెహోవా సూత్రాలకు మరి ఎక్కువగా నిశ్చితం చేసినప్పుడు, ఆ విద్యార్థి స్వచ్ఛమైన మనస్సాక్షిని, ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకుంటాడు. నిజమైన క్రైస్తవునిగా జీవించడం నేర్చుకోవడం, అతను తన కుటుంబాన్ని మరింత చక్కగా చూసుకోడానికి సహాయపడుతుంది. అది ఎంతో గొప్ప సంతృప్తిని, ఆనందాన్ని తెస్తుంది. ఆ తర్వాత రాజ్యమందిరంలో కూటాలకు హాజరుకావడం కూడా ఉంది. అది ఎంత సంతోషకరమైన అనుభవం! ఔదార్యంతో కూడిన ప్రేమను కనపర్చే ప్రజలు యిక్కడున్నారు. దానినిబట్టే దేవుని ప్రజలు గుర్తించబడాలని బైబిలు చెబుతుంది. (కీర్తన 133:1; యోహాను 13:35) “దేవుని గొప్పకార్యములు” వారు మాట్లాడుతుండగా వారి మాటలు శుద్ధమైనవిగా, ప్రయోజనకరమైనవిగా అనిపిస్తాయి. (అపొస్తలుల కార్యములు 2:11) అవును, ‘సహోదరులందరి’తో సంబంధాన్ని ఏర్పర్చుకోడమనేది ఆనందానికి కారణమౌతుంది. (1 పేతురు 2:17) అలాంటి చక్కని మైత్రి, బైబిలు విద్యార్థులు, “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొన”డానికి సహాయపడుతుంది.—ఎఫెసీయులు 4:24

సమర్పణకు సంబంధించిన చర్య

ఓ వ్యక్తి జ్ఞానంలో అభివృద్ధి చెందుతున్నకొలది, చివరకు యెహోవాకు తన జీవితాన్ని సమర్పించుకుని, ఈ సమర్పణను నీటి బాప్తిస్మము ద్వారా కనపర్చడానికి ఆయన ప్రేమ అతన్ని పురికొల్పుతుంది. (మత్తయి 28:19, 20) ఈ చర్య గైకొనకముందే దాని లెక్క చూసుకోవాలనే సలహాను యేసు తన అనుచరులకు యిచ్చాడు. (లూకా 14:28) సమర్పిత క్రైస్తవుడు యెహోవా చిత్తాన్ని ముందుంచి శరీర కార్యములను విసర్జిస్తాడు. “శరీర కార్యములను” విడనాడడానికి అతను గట్టిగా కృషి చేస్తాడు, అంతేకాకుండ “ఆత్మ ఫలము”లను పెంపొందించుకుంటాడు. (గలతీయులు 5:19-24) రోమీయులు 12:2లో ఉన్న సలహా యిప్పుడు అతని జీవితంలో పూర్తిగా పనిచేస్తుంది: “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” కనుక, ఓ సమర్పిత క్రైస్తవుడు, పునరుద్ధరించబడిన సంకల్పంతో జీవిస్తాడు.

అయినప్పటికీ, తను పొందేవాటిని పరిశీలించండి. ఒక విషయమేమంటే, అతనిప్పుడు విశ్వ సృష్టికర్తతో వ్యక్తిగత సంబంధాన్ని కల్గివున్నాడు! (యాకోబు 2:23) మరింత లోతైన భావంతో, “పరలోకమందున్న మా తండ్రీ” అని దేవున్ని సంబోధిస్తాడు. (మత్తయి 6:9) కొత్తగా సమర్పించుకున్నవారికి గల మరో ఆశీర్వాదం జీవితానికి నిజంగానే ఓ సంకల్పం ఉందని తెలుసుకోవడం, అంతేకాకుండా ఆ సంకల్పానికి అనుగుణంగా తన జీవితాన్ని జీవిస్తాడు. (ప్రసంగి 12:13) యేసు నాయకత్వాన్ని అనుసరిస్తూ, నమ్మకంగా జీవించడం ద్వారా సాతాను అబద్ధికుడని అతను నిరూపించగలడు. అది యెహోవా హృదయానికి ఎంత ఆనందాన్ని తెస్తుంది!—సామెతలు 27:11.

నిస్సందేహంగా, నమ్మకమనే మార్గంలో ఓ క్రైస్తవుడు సహనంతో కొనసాగుతుండగా, చేయవల్సిన త్యాగాలు మరికొన్ని ఉన్నాయి. దేవుని వాక్యాన్ని అర్థవంతమైన రీతిలో వ్యక్తిగతంగా మరియు సంఘంగా పఠించేందుకు సమయం అవసరమౌతుంది. (కీర్తన 1:1-3; హెబ్రీయులు 10:25) ఇతర కార్యాల నుండి పరిచర్యకు సమయాన్ని తీసుకోవల్సి ఉంటుంది. (ఎఫెసీయులు 5:16) యెహోవాసాక్షుల కూటాలకు హాజరవ్వడానికి, వారి సభలూ సమావేశాలకూ ప్రయాణించడానికి కూడా సమయం శక్తి అవసరమౌతాయి. ఆర్థికంగా రాజ్యమందిరానికి సహాయపడడంలో భాగం వహించేందుకు స్వయం త్యాగం అవసరం. ప్రపంచవ్యాప్త ప్రచార పనికి డబ్బు అవసరమౌతుంది. అయినప్పటికీ, లక్షలకొలది క్రైస్తవులు సాక్ష్యమివ్వగల్గినట్లుగా, హృదయపూర్వకంగా అలాంటి విషయాల్లో భాగంవహించడం ఆనందాన్ని తెస్తుంది. యేసు యిలా అన్నాడు: “పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35.

యెహోవా పనికి మద్దతునివ్వడం వల్ల వచ్చే ప్రతిఫలాలు, త్యాగాలన్నిటి కంటే విలువైనవి. మనం పరిపక్వతకు ఎదుగుతున్నకొద్దీ, మన పరిచర్య మరింత ఫలభరితమౌతుంది, ఆనందదాయకమౌతుంది. వాస్తవానికి, బైబిలు సత్యాన్ని యితరులకు బోధించి, ఆ వ్యక్తి యెహోవా ఆరాధనను చేపట్టడం చూడడం కంటే మరేదీ అంత సంతృప్తిని తేజాలదు. ఆ ఆరాధికుడు కుటుంబ సభ్యుడైతే, బహుశ “ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోనూ” పెంచబడిన పిల్లవాడైతే, అది ప్రత్యేకమైన ఆనందాన్ని తెస్తుంది. (ఎఫెసీయులు 6:4) దేవుని “జతపనివారు”గా ఉండడానికి మనం చేసే ప్రయత్నాలపై ఆయన గొప్ప ఆశీర్వాదాలను చూస్తాము.—1 కొరింథీయులు 3:9.

నమ్మకమైన సేవ చేయడంవల్ల కలిగే యితర ప్రతిఫలాలు

నిజమే, ఈ విధానం ఉన్నంతకాలం మనకు సమస్యలు ఉంటూనే ఉంటాయి. బహుశ, అపవాది సమయం తగ్గేకొలది సమస్యలు మరింత తీవ్రమౌతాయి. మనం అటు హింసను అనుభవించాల్సి వస్తుంది, లేక యిటు శోధనను సహించాల్సి వస్తుంది. అయితే దేవుడు మనతో ఉన్నాడన్న జ్ఞానం మనలను ఓదార్చి, సహించుకోడానికి మనకు శక్తినిస్తుంది. (1 కొరింథీయులు 10:13; 2 తిమోతి 3:12) కొందరు తోటి క్రైస్తవులు, సంవత్సరాల తరబడి హింసను సహించారు, అయితే దేవుని యెడలగల ప్రేమను బట్టే వారు అలా కొనసాగుతూనే ఉన్నారు. అనేక విధాల శ్రమలను విజయవంతంగా సహించినవారు, కొరడా దెబ్బలు భరించిన తర్వాత విడిపించబడినప్పుడు అపొస్తలులు భావించినట్లుగా భావిస్తారు. అపొస్తలుల కార్యములు 5:41 యిలా వివరిస్తోంది: “ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహా సభయెదుటనుండి వెళ్లిపోయిరి.”

సహనం కనపర్చినందున యిప్పుడు వచ్చే ప్రతిఫలం కూడా ఆ త్యాగం కంటే గొప్పది. అయితే, దైవిక భక్తి, “నేటి జీవితానికే” కాకుండా “రాబోయే దానికి” కూడా వాగ్దానాన్ని కల్గివుందని జ్ఞాపకముంచుకోండి. (1 తిమోతి 4:8) సహించేవారికి గల ఉత్తరాపేక్ష ఎంత గొప్పది! మీరు నమ్మకంగా ఉంటే, ఈ విధానాంతాన్ని సూచించే మహా శ్రమలను తప్పించుకుంటారు. లేక ఆ మలుపు తిరిగే సంఘటనకు ముందే మీరు చనిపోతే, తర్వాత వచ్చే నూతనలోకంలో మీరు పునరుత్థానం చేయబడతారు. (దానియేలు 12:1; యోహాను 11:23-25) “యెహోవా సహాయంతో, నేను నమ్మకంగా ఉండగల్గి, నా ప్రతిఫలాన్ని పొందాను!” అని మీరు అనగల్గినప్పుడు మీరు పొందే అనుభూతిని ఒక్కసారి ఆలోచించండి. “యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యున్న” ఆ భూమిలో స్వాస్థ్యాన్ని పంచుకోవడం ఎంత పులకరింతగా ఉంటుంది.—యెషయా 11:9.

అవును, దేవున్ని సేవించాలంటే త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతిఫలాలతో పోల్చినపుడు ఆ త్యాగం చాలా తక్కువే. (ఫిలిప్పీయులు 3:7, 8) దేవుడు తన సేవకులకు యిప్పుడు చేసేవాటి దృష్ట్యా, భవిష్యత్తులో చేయబోయేవాటి దృష్ట్యా, కీర్తనల గ్రంథకర్త మాటలను మనం కూడా పలుకుతాము: “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేనాయనకేమి చెల్లించుదును?”—కీర్తన 116:12.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి