‘నన్ను కలుగజేసిన విధము చూడగా . . . ఆశ్చర్యము పుట్టుచున్నది’
“నేనెక్కడనుండి వచ్చాను?” అనేక మంది చిన్న పిల్లలు, ఒకసారి కాకపోతే మరోసారి అడిగే ప్రశ్నే యిది. పిల్లలు పెరిగినప్పుడు, వారి ప్రశ్న తరచూ మరింత లోతైన జ్ఞానంతో కూడినదౌతుంది: “జీవం ఎక్కడనుండి వచ్చింది?” ఈ ప్రశ్న కొన్ని వేల సంవత్సరాలుగా చర్చించబడుతోంది, అంతేకాకుండా యిటీవల అనేక మంది వైజ్ఞానికులు జీవోత్పత్తికి సంబంధించిన చిక్కుముడికి చాలా సహేతుకమైన పరిష్కారం పరిణామమేనని దృష్టిస్తున్నారు. అసలు, జీవం ఆకస్మికంగా ఉద్భవించిందని పరిణామ వాదులు వివరిస్తుంటారు.
రాజైన దావీదు 3,000 సంవత్సరాల క్రితం యిలా రాశాడు: “నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి.” (కీర్తన 139:14) జీవం గూర్చి మనం ఎంత ఎక్కువగా నేర్చుకుంటామో ఈ మాటల్లో అంత సత్యాన్ని కనుగొంటాము. వాస్తవానికి, భౌతిక శాస్త్రవేత్తయైన ఫ్రెడ్ హోలె యిలా రాశారు: “జీవ రసాయన శాస్త్రజ్ఞులు, జీవం యొక్క ఆశ్చర్యకరమైన సంక్లిష్టతను గూర్చి మరెక్కువగా తెలుసుకుంటుండగా, అది యాదృచ్ఛికంగా కలిగే అవకాశాలు ఎంత తక్కువగా ఉన్నాయంటే అసలు ఆ అవకాశం లేదనే చెప్పవచ్చు. జీవం అకస్మాత్తుగా ఉద్భవించి ఉండదు.”
కాబట్టి, జీవం ఎలా ఉద్భవించింది? ఈ పత్రిక నందలి మొదటి రెండు శీర్షికలు ఈ ప్రశ్నను చర్చిస్తున్నాయి. మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, దయచేసి Watchtower, H-58 Old Khandala Road, Lonavla, 410 401, Mah, లేదా రెండవ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో మీకు అనుకూలమైన దానికి వ్రాయండి.