మీకు జ్ఞాపకం ఉన్నాయా?
ఇటీవలి కావలికోట సంచికలను మీరు శ్రద్ధగా చదివారా? అలాగైతే, ఈ క్రింది వాటిని జ్ఞాపకంచేసుకోవడంలో మీరు ఆసక్తిని కల్గివుండగలరు:
▫ మనిషికి మృగాలకు గల ప్రాముఖ్యమైన తేడా ఏమిటి?
ప్రాముఖ్యమైన తేడా, మానవ మెదడు రూపం, సామర్థ్యం, నిర్వహణపై కేంద్రీకృతమై ఉంటుంది. సహజ జ్ఞానం అని పిలువబడుతున్న దానిలో జంతువు మెదడుకు సంబంధించిన దాదాపు అన్ని నిర్వహణలు ముందుగానే నిర్దేశించబడి ఉన్నాయి. మానవుల విషయంలో అలా కాదు. స్వేచ్ఛాచిత్తం జరిగించే శక్తి సామర్థ్యాలను దేవుడు మానవులకు బహుకరించాడు. (సామెతలు 30:24-28)—4/15, పేజీ 5.
▫ ఇశ్రాయేలీయుల ఆలయ ఆరాధనలో పాడడం ఏ పాత్రను వహించింది?
సంగీతం, ప్రత్యేకంగా గాయకులు, ధర్మశాస్త్రం యొక్క గంభీరమైన విషయాలను నేర్పించడానికి కాదుగానీ, ఆరాధనకు అవసరమైన సరైన స్ఫూర్తినిచ్చేందుకు ఓ ప్రాముఖ్యమైన స్థానాన్ని కల్గివుండేవారు. ఇది, ఇశ్రాయేలీయులు యెహోవాను ఉత్సాహపూరిత ఆత్మతో ఆరాధించడానికి సహాయపడేది. (1 దినవృత్తాంతములు 23:4, 5; 25:7)—5/1, 10, 11 పేజీలు.
▫ పిల్లలకు పసితనం నుండి ఏలాంటి శ్రద్ధ అవసరం?
కొత్తగా జన్మించిన బిడ్డకు తలిదండ్రులు ఎక్కువ మరియు ఎడతెగని శ్రద్ధను యివ్వాలి. పౌలు యిలా రాశాడు: “పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీవెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలకడగా ఉండుము. (2 తిమోతి 3:15) కనుక తిమోతి పసితనం నుండి పొందిన తలిదండ్రుల శ్రద్ధ, ఆత్మీయ విధమైంది కూడా.—5/15, 11వ పేజీ.
▫ సర్వ మానవజాతికీ అవసరమైన దేవుని సమాచారం బైబిలులో ఉందని నిరూపించే ఏ నాలుగు రుజువులున్నాయి?
(1) అందుబాటు. అది ప్రపంచ జనాబాలోని దాదాపు 98 శాతానికి అందుబాటులో ఉంది. (2) చారిత్రకత. బైబిల్లో నిరూపించలేని పురాణాలు కాదుగాని, చారిత్రాత్మక వాస్తవాలున్నాయి. (3) ఆచరణాత్మకత. ఆజ్ఞలు, సూత్రాలకు సన్నిహితంగా హత్తుకొని ఉండేవారికి మేలు కలుగజేసేలాంటి జీవన విధానాన్ని ఇవి అందజేస్తాయి. (4) ప్రవచనం. ప్రవచనాల పుస్తకంగా, భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాన్ని వివరంగా తెలియజేసే పుస్తకమిది.—6/1, 8, 9 పేజీలు.
▫ సరైన మతాన్ని తెలుసుకోవడంలో ఏ బాధ్యత ఉంది?
ఒక్కసారి మనం సరైన మతాన్ని కనుగొంటే మన జీవితాలను దానికి అనుగుణంగా నిర్మించుకోవాలి. అదే జీవిత విధానం. (కీర్తన 119:105; యెషయా 2:3)—6/1, 13వ పేజీ.
▫ వ్యక్తిగత బైబిలు పఠనం ఎందుకంత ప్రాముఖ్యము?
దేవుని సేవకులందరూ దేవుని వాక్యపు సత్యాన్ని గూర్చిన కొత్త మరియు లోతైన విషయాలను కనుగొనడం ద్వారా అందరూ తమ సంతోషాన్ని శక్తిని నిత్యమూ నూతనపర్చుకోవాలి. ఆ విధంగా వారు తమను తాము ఆత్మీయంగా పురికొల్పుకోవడంలో కొనసాగుతారు.—6/15, 8వ పేజీ.
▫ బైబిలు నందు ఉపయోగించబడినట్లుగా “పాపము” అనే పదానికి ఏ అర్థముంది.
బైబిలు సాధారణంగా ఉపయోగించే “పాపం” అనే పదాన్ని సూచించడానికి “తప్పిపోవడం” అనే అర్థము వచ్చే హెబ్రీ, గ్రీకు భాషల్లోని క్రియాపదాలను ఉపయోగించడం జరిగింది. అంటే, తప్పడం లేక గమ్యాన్ని, గుర్తును, లేక లక్ష్యాన్ని చేరలేకపోవడం అని అర్థం. దేవుని స్వరూపమందు సృష్టించబడే సంకల్పం నుండి మొదటి మానవ దంపతులు తప్పిపోయారు. మరో మాటలో చెప్పాలంటే వారు పాపం చేశారు. (ఆదికాండము 2:17; 3:16) —6/15, 12వ పేజీ.
▫ మత భ్రష్టుల ప్రచురణలను చదవడం ఎందుకు అవివేకమౌతుంది?
“ఇంపైన మాటల” వలన, “కల్పనావాక్యముల”తో కూడిన అబద్ధాలను అందించే వాటిని కొన్ని మత భ్రష్టుల ప్రచురణలు కల్గివుంటాయి. (రోమీయులు 16:17, 18; 2 పేతురు 2:3) మత భ్రష్టుల వ్రాతలన్నీ కేవలం విమర్శిస్తాయి లేక కూలదోస్తాయి. వాటిలో ఏవీ నిర్మాణాత్మకమైనవి కావు.—7/1, 12వ పేజీ.
▫ గ్రీసు దేశం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లా?
ప్రాచీన గ్రీసు దేశంలో, కేవలం కొన్ని పట్టణ ప్రభుత్వాల్లో మాత్రమే ప్రజాస్వామ్యం పాటించబడేది, అందులోనూ పురుషులు మాత్రమే ఓటు వేసేవారు. అంటే, ఐదులో నాలుగోవంతు జనాబా విడిచిపెట్టబడిందనమాట. కనుక అది ఎంత మాత్రమూ విస్తృత సర్వాధిపత్యం లేక ప్రజాస్వామ్యం కాదు.
▫ క్రైస్తవ వివాహం వర్ధిల్లడానికి ఏది కారణమౌతుంది?
వివాహ బంధంపై దేవుని దృష్టిని భార్యాభర్తలిద్దరూ గౌరవించి, ఆయన వాక్యంలోని సూత్రాలకు అనుగుణంగా నడిచే ప్రయత్నం చేసినప్పుడు అది వర్థిల్లుతుంది. (ఎఫెసీయులు 5:21-33)—7/15, 10వ పేజీ.
▫ మీ కుటుంబ పఠనం ఎలా ఆనందదాయకంగా ఉండగలదు?
పిల్లలందరూ పాల్గొనేట్లు ప్రయత్నించండి. సకారాత్మకంగా, పురికొల్పే విధంగా ఉంటూ మీ పిల్లలు భాగం వహించడాన్ని అనురాగంతో మెచ్చుకోండి. ఊరకే సమాచారాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించకుండా, మీ పిల్లల హృదయాలను చేరే ప్రయత్నం చేయండి.—7/15, 18వ పేజీ.
▫ ‘లోకులు—శాంతి భద్రతలున్నాయని చెప్పుకొనుచుండగా’ అనే మాటల భావమేమిటి? (1 థెస్సలొనీకయులు 5:3)
దేశాలు ‘శాంతి భద్రతలను’ పొందుతాయని బైబిలు చెప్పడం లేదని గమనించండి. ఇంతవరకూ లేని ఆశావాదం, నమ్మకాలతో, వారు దాన్ని గూర్చి కనీసం ప్రత్యేకమైన రీతిలో చెప్పుకుంటుంటారు. శాంతి భద్రతలు నెలకొనే అవకాశాలు మునుపెన్నటికన్నా యిప్పుడు అతి సమీపంలో ఉన్నట్లు కనిపిస్తుంది.—8/1, 6వ పేజీ.
▫ యెహోవా సహేతుకతను ప్రదర్శించే మూడు విధాలను పేర్కొనండి.
యెహోవా క్షమించడానికి సిద్ధ మనస్సును ప్రదర్శించాడు. (కీర్తన 86:5) కొత్త పరిస్థితులేర్పడినప్పుడు తాను గైకొనాలనుకున్న చర్యను దానికి తగినట్లు మార్చుకోవడానికి ఆయన యిష్టత కనపర్చాడు. (యోనా, 3వ అధ్యాయం చూడండి) అంతేకాకుండా, అధికారాన్ని ఉపయోగించండంలోనూ యెహోవా సహేతుకతను కనపర్చాడు. (1 రాజులు 22:19-22)—8/1, 12-14 పేజీలు.