సాక్షులు ఎందుకు దర్శిస్తూనే ఉంటారు?
“అదిగో వాళ్లు మళ్లీ వచ్చారు! కేవలం కొన్ని వారాలకు ముందే వాళ్లు వచ్చి వెళ్లారు కదా!’ యెహోవాసాక్షుల్లో ఒకరు మిమ్మల్ని దర్శించినప్పుడు వారు చెప్పేది మీకు అర్థమౌతోందా? నేడు యెహోవాసాక్షులు లక్షలాది మందిని క్రమంగా దర్శిస్తున్నారు. అనేకులకు వారి వారి మతాలున్నాయని తెలిసిన్పటికి, లేక మతం మీద ఆసక్తి లేదని తెలిసినప్పటికీ వాళ్లు పదే పదే పట్టు విడవకుండా ఎందుకు దర్శిస్తారు? ఆ ప్రశ్నకు జవాబు అవసరము.
దేవుని ఎదుటవున్న బాధ్యత
మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమైనప్పటి నుండి ప్రస్తుత లోక విధానాంతము అలాగే ఈ భూమిపై దేవుని రాజ్య పరిపాలన రావడాన్ని గూర్చిన బైబిలు ప్రవచనాలను ప్రపంచ సంఘటనలు నెరవేరుస్తున్నాయని సాక్షులు లేఖనాల నుండి నేర్చుకున్నారు. సుమారు ఒక శతాబ్దపు దౌర్జన్యం, రక్తపాతం, ద్వేషాలు, తమ సమస్యలకు రాజకీయ పరిష్కారం లభిస్తుందనే ఆశనుండి మానవ జాతిని దూరంగా తీసుకువెళ్లినట్లుంది. మానవ కుటుంబాన్ని యింకా పట్టిపీడిస్తున్న యుద్ధాలూ ఉగ్రవాదం, మానవ పరిపాలన ప్రజల హృదయాలనూ మనస్సులనూ దృక్పథాలనూ మార్చలేక పోయిందనడానికి నిదర్శనాలుగా ఉన్నాయి. గతంలో జరిగిన సంఘటనల కారణంగా లోతుగా పాతుకుపోయిన ఆగ్రహం జాతి, తెగ, మతపర గుంపుల మధ్యనున్న సంబంధాలను యింకా విషపూరితం చేస్తోంది. దూర దూరాల్లో ఉన్న ఆఫ్గానిస్తాన్, ఇండియా, ఉత్తర ఐర్లాండ్, దక్షిణ ఆఫ్రికా, మధ్యప్రాశ్చ్యము, మునుపటి యుగోస్లావియా వంటి ప్రాంతాల్లో కూడా యిది వాస్తవమే. మరి ఏకైక శాశ్వత పరిష్కారం ఏమిటి?
సాక్షులను పురికొల్పేదేమిటి?
దేవుని పరిష్కారం అంటే, యేసుక్రీస్తు ద్వారా ఆయన వాగ్దాత్త రాజ్యం ఒక్కటే సాధ్యమైన పరిష్కారమని యెహోవాసాక్షులు గ్రహిస్తారు. యేసు, తన మాదిరి ప్రార్థనలో ఆ రాజ్య పరిపాలన కొరకు ఒక విన్నపాన్ని కూడా చేర్చాడు: “కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి,—పరలోకమందున్న మాతండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక; నీరాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” మానవ వ్యవహారాల్లో దేవుడు నిజంగానే జోక్యం కలుగజేసుకోవాలని ఈ ప్రార్థన కోరుతోందని సాక్షులు నమ్ముతారు.—మత్తయి 6:9, 10.
ఆ వార్తను అందించడానికి ఎడతెగక ప్రతి యింటికి వెళ్లాల్సిన అవసరముందని యెహోవాసాక్షులు ఎందుకు భావిస్తున్నారు? ఎందుకంటే, యేసు నొక్కి చెప్పిన రెండు ఆజ్ఞల ప్రకారం వారలా చేస్తారు: “అందుకాయన—నీ పూర్ణహృదయముతోను నీపూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.”—మత్తయి 22:37-39.
సాక్షులు తమకు దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారు, అలాగే వారు తమ పొరుగువారిని ప్రేమిస్తారు గనుక అవే ఆశీర్వాదాలను వారు కూడా పొందాలని కోరుకుంటారు. కాబట్టి, యేసు ఉదాహరణను అనుసరించడం ద్వారా, తమ పొరుగువారిని సందర్శించడానికి వారి నిస్వార్థ ప్రేమ వారిని బలవంతం చేస్తుంది. “శ్రీమంతుడైన దేవుడు” శుభ్రపర్చిన భూమిపై విధేయులైన మానవజాతికి వాగ్దానం చేసిన విషయాలను, వారు కనీసం తెలుసుకునే అవకాశాన్ని అందించాలని వారు కోరుకుంటున్నారు.—1 తిమోతి 1:11; 2 పేతురు 3:13;
క్రైస్తవ మిషనరీయైన పౌలు దేవుని వాగ్దానాలను నమ్మి, యిలా వ్రాయగల్గాడు. “దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తమును, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడను యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు . . . వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. అవును, “అబద్ధమాడనేరని” దేవుడు వినయంతో ఆయన్ను వెదకి, సేవించేవారికి నిత్య జీవితమును యిస్తానని “వాగ్దానము” చేశాడు.—తీతు 1:1, 2; జెఫన్యా 2:3.
సాక్షులకు వేతనం యివ్వబడుతుందా?
సాక్షులు చేసే సేవకొరకు వారికి డబ్బు చెల్లిస్తారని అప్పుడప్పుడు కొందరు ఆరోపించారు. ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయమే! కొరింథులోని సంఘానికి పౌలు చెప్పిన మాటలను వారు గంభీరంగా తీసుకుంటారు: “మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించుచున్నాము.”—2 కొరింథీయులు 2:17.
కొందరు మతనాయకులు డబ్బు కొరకే బోధిస్తుంటారు, అది మత సేవల కొరకే గానీ లేక తమ టివి పరిచర్యలో వాణిజ్య ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రచారం చేయడానికిగానీ, వేతనం పుచ్చుకుంటుంటారు. చాలా మతాలకు వేతనం మీద పనిచేసే మత గురువులున్నారు.
దీనికి భిన్నంగా, సాక్షులకు వేతన మివ్వాల్సిన మతగురువుల తెగ లేదు. అంతేకాదు ఆనేకులు స్వచ్ఛందంగా విరాళమివ్వడానికి పురికొల్పబడినప్పటికీ యథార్థమైన సత్యాన్వేషకులకు తరచుగా వారు తమ బైబిలు ప్రచురణను ఉచితంగానే యివ్వడం జరుగుతుంది. వారు పొందే విరాళాన్ని, ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికొరకు ఖర్చుచేయడానికే ఉపయోగిస్తారు. “ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి” అనే యేసు సలహాకనుగుణంగా సాక్షులు దేవుని సేవకొరకు ప్రతి సంవత్సరమూ కొన్ని లక్షల గంటలు పని చేయడానికి, తమ సమయము శక్తితో సహా తమ నిధులను మెండుగా వినియోగిస్తారు. అలా వారు యింటింటికి వెళ్లడం ద్వారా గృహ బైబిలు పఠనాలను నిర్వహించడం ద్వారా ఆసక్తి గల వ్యక్తులకు బోధిస్తారు.—మత్తయి 10:8; 28:19, 20; అపొస్తలుల కార్యములు 20:19, 20.
యెహోవాసాక్షులకు వ్యక్తిగతంగా, వాళ్ల సంఘాలకేగానీ లేక వాచ్‌టవర్ సంస్థకేగానీ ధనమార్జించాలనే దృక్పథమే లేదని వాస్తవాలు నిరూపిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లేందుకు ఎవ్వరూ వేతనాన్ని పొందరు. మరి పని జరగడానికి డబ్బు సహాయం ఎక్కడ నుండి వస్తుంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెప్పుదలగల ప్రజలు యిచ్చే స్వచ్ఛంద విరాళాల వలననే. డబ్బు సేకరించే పద్ధతి లేనే లేదు.
వారి సాక్ష్యపు ప్రభావం
సాక్షులు చేసే యింటింటి సేవ అలాగే వారి తటస్థసాక్ష్యం ప్రజా దృష్టిని చేరిందా? మాధ్యమాల్లో కనిపించే రుజువులు దానికి అవును అని ప్రతిధ్వనించే అది ప్రతిస్పందించే జవాబునిస్తున్నాయి. టివి కార్యక్రమాలూ సినిమాల్లో ఎవ్వరైన తలుపు తడుతున్నట్లు చూపినప్పుడు సాక్షులను ప్రస్తావించడం జరుగుతోంది. కార్టూన్లలో సాక్షులను గూర్చి ప్రస్తావించారు. వారి ఆసక్తిపూర్వకమైన కార్యం ఎంత ప్రఖ్యాతిగాంచిందంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్టూనిస్టులు యెహోవాసాక్షులను ప్రస్తావించారు. ఇవి వ్యంగ్యంగా కనిపించవచ్చు, కానీ సాక్షులు పట్టువిడువక యింటింటి పరిచర్యలో కొనసాగుతున్నందుకు పేరెన్నికగన్నారన్న అనుకూల వాస్తవంపైన అవి తరచూ ఆధారపడి ఉన్నాయి.—అపొస్తలుల కార్యములు 20:20.
ఇటీవల ఒక కార్టూన్ ఓ వ్యక్తి ఒక “గురువును” సంప్రదించడానికి కొండ మీదికి ఎక్కుతున్నట్లుగా చూపింది. ఆ వ్యక్తి, “సంభవించబోయే అద్భుత విషయాలను గూర్చి నాతో చెప్పు!” అన్నాడు. ఆ “గురువు” ఏం జవాబిచ్చాడు? “ఇదిగో, కరువులూ తెగుళ్లూ భూకంపాలను మనం చూస్తాం. సూర్యుడు చీకటిగా చంద్రుడు రక్త వర్ణంగా మారుతాయి.” ప్రశ్నించే వ్యక్తి మరలా, అయితే, మంచివార్త ఏమిటి? అని అడిగాడు. అందుకు “గురువు” యిలా జవాబిచ్చాడు: “దేవుడు ప్రతి బాష్పబిందువును తుడిచివేయును . . . మరణం దుఃఖం వేదనా ఉండనే ఉండవు!” “ఆ విషయాలు మీకెలా తెలుసు” అన్నాడు ఆ సందర్శకుడు. దాని సమాధానం? “యెహోవాసాక్షులను ఎవ్వరూ తప్పించుకోలేరు!” ఇంతకూ ఆ కార్టున్ కళాకారుడు కూడా యెహోవాసాక్షులను తప్పించుకోలేక పోయి ఉంటాడు.
ఈ కార్టూన్‌లో లేక దాని వంటి ఇతర కార్టూన్లల్లోని ప్రాముఖ్యమైన విషయమేంటంటే, అది సాక్షులు ఎడతెగక దర్శించడం, వారి బోధ అంతటా అనుగుణ్యంగా ఉండడం. కొద్ది మాటల్లో చెప్పాలంటే, ఆ కళాకారుడు సాక్షుల యింటింటి పరిచర్య యొక్క ముఖ్య భాగాన్ని ఎత్తిచూపే లేఖనాలను చూపాడు.—మత్తయి 24:7, 29; ప్రకటన 21:3, 4 పోల్చండి.
అనేక మంది ప్రజలు తమ సమాచారాన్ని తృణీకరిస్తారనే వాస్తవం సాక్షులను నిరుత్సాహపర్చదు లేక వారి ఆసక్తిని తగ్గించదు. అపొస్తలుడైన పేతురు యిలా హెచ్చరించాడు: “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,—‘ఆయన రాకడను గూర్చిన వాగ్దానమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే’ అని చెప్పుదురని మొదట తెలిసికొనవలెను.” ఇది యిలా ఉన్నప్పటికీ, ప్రేమతో పురికొల్పబడినవారై, సాక్షులు తమ పొరుగువారిని సందర్శిస్తూనే ఉన్నారు, మరి ప్రస్తుత దుష్ట విధానాన్ని దేవుడు అంతమొందించే వరకు వాళ్లు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు.—2 పేతురు 3:3, 4.
అంత్యదినాల్లో, మొదట సువార్త ప్రకటించబడాలని యేసు చెప్పాడు. అది ఎందుకు, ఎలా అన్న విషయాలను యింకా పరిశీలించడానికి తదుపరి రెండు శీర్షికలను పరిశీలించండి.—మార్కు 13:10.
[9వ పేజీలోని చిత్రాలు]
వేతనం పొందే మత గురువుల తరగతి యెహోవాసాక్షులలో లేదు—అందరూ స్వచ్ఛంద పరిచారకులే