కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 5/15 పేజీలు 24-25
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • శరణార్థులు సువార్తను వింటున్నారు
  • వీడియో ఆసక్తిని రేకెత్తిస్తుంది
  • ‘సంతోషంతో యెహోవాను సేవించేలా’ పరదేశులకు సహాయం చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • పరిష్కారం ఏమిటి?
    తేజరిల్లు!—1996
  • పెరిగిపోతున్న శరణార్థుల సంఖ్య
    తేజరిల్లు!—1996
  • శరణార్థుల ఆటుపోట్లు—లక్షలమంది యుక్రెయిన్‌ను వదిలి వెళ్లిపోయారు
    అదనపు అంశాలు
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 5/15 పేజీలు 24-25

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు

“స్వతంత్రుల దేశం,” థాయిలాండ్‌ అనే పేరుకు అర్థం అది. దానిలో నివసించే 5,70,00,000 కంటే ఎక్కువమంది సాత్వికులు, కష్టజీవులైన నివాసులకు వివిధ మత సిద్ధాంతాలున్నాయి. అక్కడ బౌద్ధమతం వ్యాప్తమై ఉన్నప్పటికి, ఈ ఆగ్నేయ ఆసియా దేశంలో క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన మతాలు కూడా ఆచరించబడుతున్నాయి. ఈ ప్రజలందరూ దేవుని రాజ్య సువార్తను వినాల్సిన అగత్యత ఎంతైనా ఉంది.—మత్తయి 24:14.a

శరణార్థులు సువార్తను వింటున్నారు

మయన్నార్‌ సరిహద్దులో ఉన్న థాయిలండ్‌ పర్వతాలంతటా వ్యాపించివున్న శిబిరాల్లో, 10,000 కంటే అధికమంది కారెన్‌ శరణార్థుల్లో బైబిలు సత్యం నాటుకుంటోంది. ఆ ప్రాంతంలో జీవించే ఒక కారెన్‌ కుటుంబ సభ్యులు యెహోవాసాక్షులు. వారు సువార్తను శరణార్థుల మధ్య వ్యాపింపజేస్తున్నారు. వారి పని ఎలా ప్రారంభమైంది?

అనేక సంవత్సరాల క్రితం ఓ యువకుడు, ఆంగ్లికన్‌ చర్చితో తన సంబంధాలను తెగతెంపులు చేసుకుని యెహోవాసాక్షుల్లో ఒకడయ్యాడు. తమ పరిచారకుని ప్రోత్సాహంతో, అతని బంధువులు అతన్ని వ్యతిరేకించారు. అయితే, అతను ఓర్మితో సహించాడు, అప్పుడు అతని కుటుంబ వ్యతిరేకత క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆంగ్లికన్‌ చర్చీ మతనాయకులు దాదాపు రెండు సంవత్సరాల క్రితం అవినీతి క్రియలవల్ల బర్తరఫ్‌ చేయబడేంతవరకూ తమ అపహాస్యాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. అప్పుడు చర్చికి కాపరి లేకుండా పోవడంతో, ఆ సాక్షి కుటుంబ సభ్యులు యితర సంబంధులూ అకస్మాత్తుగా దెబ్బతిని, నిస్సహాయులయ్యారు. పదకొండు మంది చర్చినుండి రాజీనామా చేసి, సాక్షులను తమతోకూడా బైబిలును పఠించమని కోరారు. ఇతర శరణార్థులు పాల్గొనడంతో ఈ పఠనం చక్కగా అభివృద్ధి చెందింది. శరణార్థుల శిబిరాలగుండా ప్రవహించే నదిలో 17 కొత్త సాక్షులు బాప్తిస్మాన్ని పొందడంతో సత్యం త్వరగా వ్యాపించింది. ఎనభై ఎనిమిదేళ్ల అవ్వ వారితో బాప్తిస్మము తీసుకోడాన్ని తిలకించడం ఎంత ఆనందదాయకమైన దృశ్యం!

వీడియో ఆసక్తిని రేకెత్తిస్తుంది

శరణార్థుల మధ్య అభివృద్ధి చెందగల అవకాశం చాలా ఎక్కువగా ఉంది. జ్ఞాపకార్థ దిన ఆచరణకు 1993లో 57 మంది హాజరయ్యారు. అదే సంవత్సరం మే నెలలో ప్రాంతీయ కాపరి సందర్శన సమయమందు ఆయన ప్రసంగాల్లో ఒకదానికి 67 మంది కూడారు. అంతేకాదు, వాచ్‌టవర్‌ సొసైటి వారి జెహోవాస్‌ విట్నెసెస్‌—ది ఆర్గనైజేషన్‌ బిహైండ్‌ ది నేమ్‌ అనే విడియోను చూడడానికి దాదాపు 250 మంది హజరయ్యారు.

శరణార్థుల శిబిరంలో సాక్షుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ ప్రసంగానికి బాప్టిస్టు పాస్టర్‌ భార్య హాజరై, అక్కడ చర్చించబడిన బైబిలు లేఖనాలను రాసుకుంది. తమ చర్చిల్లో అదే పనిగా మరలా మరలా యివ్వబడే ప్రసంగాలతో ఆమె ఎంత అసంతృప్తి చెందుతుందో తన భర్తకు వివరించింది. ఒకవేళ ఆమె యెహోవాసాక్షుల కూటాలకు హాజరుకావడం ప్రారంభిస్తే తమ చర్చీకివచ్చే యితరులు కూడా అక్కడికే వెళతారని చెప్పి ఆయన నిరాకరించాడు. ఆమె మరలా కూటాలకు హాజరైనప్పుడు, ఆమె మరలా కూటాలకు హాజరైనప్పుడు, ఆమె భర్త కత్తి చేతబట్టుకుని ఆమెను తరిమి, ఆమె రాసుకున్న వాటిని, బైబిలు సాహిత్యాలను కాల్చేశాడు. అలా చేసినప్పటికీ, వీడియో చూపించినప్పుడు ఆమె మరలా వచ్చింది. తర్వాత ఆమె చూసినదాన్ని తన భర్తకు చెప్పింది. అప్పుడు మారిన వైఖరితో, ఆయన వీడియోను చూడగోరి, ఆమె రాసుకున్నవాటిని, బైబిలు సాహిత్యాన్ని కాల్చినందుకు బాధపడ్డాడు.

కాగా థాయిలాండ్‌లో ప్రజలు సువార్తను వింటున్నారు. కాబట్టి, “స్వతంత్రుల దేశంలో“ వారు ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ఆర్థిస్తున్నారు.—యోహాను 8:32.

[అధస్సూచీలు]

a అధిక సమాచారం కొరకు, 1994 క్యాలండర్‌ ఆఫ్‌ జెహోవాస్‌ విట్నెసెస్‌ చూడండి.

[24వ పేజీలోని బాక్సు]

దేశ గణాంకం వివరాలు 1993 సేవా సంవత్సరం

సాక్ష్యమిస్తున్నవారి శిఖరాగ్ర సంఖ్య: 1,434

నిష్పత్తి: 1 సాక్షికి 40,299

జ్ఞాపకార్థ దినానికి హాజరైనవారి సంఖ్య: 3,342

సగటు పయినీరు ప్రచారకులు: 232

సగటు బైబిలు పఠనాలు: 1,489

బాప్తిస్మము తీసుకున్నవారి సంఖ్య: 92

సంఘాల సంఖ్య: 39

బ్రాంచి కార్యాలయం: బాంకాక్‌

[25వ పేజీలోని చిత్రం]

రాజ్య ప్రచారకులు సువార్తను ఆసక్తితో ప్రకటిస్తున్నారు

[25వ పేజీలోని చిత్రం]

మొదటి బ్రాంచి కార్యాలయం, 1947

[25వ పేజీలోని చిత్రం]

ఫిబ్రవరి 8, 1992లో బాంకాక్‌ నందు సమర్పించబడిన కొత్త బ్రాంచి కార్యాలయం ఎదుట బేతేలు కుటుంబము

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి