గాతిక్ బైబిల్ ఓ అధ్భుతమైన కార్యసాధకం
గాత్ ప్రజలు జర్మన్ తెగల చేరిక అయియుండిరి. బహుశా ఈ తెగ వారు స్కాన్‌డినేవియా నుండి వచ్చిన వారు కావచ్చు. మన సామాన్య శకం తొలి శతాబ్దాల్లో, వారు నల్ల సముద్రమూ డనుబె నది ఉన్నంత సుదూర దక్షిణ దిక్కు వైపుకు మరియు రోమా సామ్రాజ్య సరిహద్దు వరకూ వలస పోయారు.
జర్మన్ భాషలో మొట్ట మొదటి సాహితీ పని గాతిక్ బైబిలే. నేడు ఈ అనువాదం కేవలం కొన్ని భాగాలుగా మాత్రమే ఉనికిలో ఉంది. అయినప్పటికీ, అది నేటికి పరిశుద్ధ లేఖనాల విశిష్టమైన, విలువైన అనువాదంగా పరిగణించబడుతుంది. ఎందుకు?
ఉల్ఫలాస్—మిషనరీ మరియు బైబిలు అనువాదకుడు
ఈ బైబిలు అనువాదుకుని పేరు ఉల్ఫలాస్, గాతిక్ భాషలోనైతే అతని పేరు వుల్ఫలా. చరిత్రకారుడైన ఫిలాస్టోర్గీయస్ ప్రకారం, ఉల్ఫలాస్, తూర్పు టర్కీలో యిప్పుడు భాగమైన కప్పాడోసియా నుండి గాతిక్ పోరాటంలో ఖైదీలుగా కొనిపోబడినవారి వంశీయుడు. దాదాపు సా.శ. 311లో జన్మించి సుమారు 30 సంవత్సరాల తర్వాత నికొమిడియాకు చెందిన యూసిబియస్ చేత మతనాయకునిగా నియమించబడి, గాత్‌ల మధ్యలో మిషనరీగా పని చేయడానికి శిక్షణ పొందాడు.
“తాను మతం మార్చిన వారికి బోధించి వారి సంఖ్యను వృద్ధి చేయడానికి, అతను కేవలం రాజుల పుస్తకం తప్ప పూర్తి బైబిలంతా గ్రీకు నుండి గాతిక్‌లోకి ఓపికగా అనువదించాడు” అని చరిత్రకారుడైన విల్ డ్యూరాంట్ చెప్పాడు. (ది ఏజ్ ఆఫ్ ఫెయిత్) ఈనాడు గాతిక్ బైబిలు చేవాత్ర ప్రతులలో కేవలం నెహెమ్యా పుస్తకంలో కొన్ని భాగాలు మరియు క్రైస్తవ గ్రీకు లేఖనాలలో కొన్ని భాగాలు మాత్రమే ఉనికిలో ఉన్నాయి.
గాతిక్ భాషకు లిపిలేదు. కనుక ప్రత్యేకమైన సరళత అవసరమైన అనువాద సవాలును ఉల్ఫాలాస్ ఎదుర్కొన్నాడు. గ్రీకు, లాటిన్ అక్షరాలపైన ఆధారపడిన 27 చిహ్నాలు గల గాతిక్ అక్షరాలను కనుగొన్న ఘనతను ప్రాచీన బైబిలు చరిత్రకారులు, అతనికి ఆపాదిస్తారు. అంతేకాకుండా, “ఆయన జర్మన్ భాషలోని క్రైస్తవ శాస్త్ర పారిభాషిక పదాలనెన్నో కూర్చాడు. అందులో కొన్ని యిప్పటికి ఉపయోగంలో ఉన్నాయి,” అని ది న్యూ ఎన్‌సైక్లోపిడియా బ్రిటానికా గమనించింది.
గాతిక్ బైబిలు తొలి చరిత్ర
ఉల్ఫిలాస్ తన అనువాదాన్ని సా.శ. 381లో పూర్తిచేసి రెండు మూడు సంవత్సరాల తర్వాత చనిపోయాడు. అతను చేసిన పని ప్రఖ్యాతిని ది ఎన్‌సైక్లోపిడియా అమెరికానా ధృవీకరిస్తోంది. అది యిలా అంటోంది, “స్పెయిన్‌కూ ఇటలీకీ వలసవెళ్లిన గాత్ ప్రజలు సామాన్యంగా ఈ అనువాదాన్ని ఉపయోగించేవారు.” వాస్తవానికి, మిగిలిన భాగాల సంఖ్యనుబట్టి చూస్తే గాతిక్ బైబిల్ ప్రతులెన్నో తయారు చేయబడ్డాయన్నట్లు గోచరమౌతుంది. బహుశ, గాత్‌లు తమ రాజ్యాలను స్థాపించుకున్న ప్రాంతాలైన వెరోనా, రావినా పుస్తక భాండాగారాల్లో అనేక చేవ్రాత ప్రతులు ఉత్పత్తి చేయబడ్డాయి. చేవ్రాత ప్రతులు రాసి, వాటి ప్రతులు తీసే మఠాల్లోని గదులే ఈ పుస్తక భాండాగారాలు.
బైజాన్‌టైన్ చక్రవర్తియైన జస్టినియస్ । ఇటలీని తిరిగి జయించిన తర్వాత దాదాపు సా.శ. 555 నందు గాత్‌లు ఓ రాజ్యంగా అంతమైపోయారు. వారి నాశనం తర్వాత, “ఇటలీలో గాతిక్ భాషగానీ వారి పారంపర్యాలుగానీ కనీసం ఓ గుర్తును కూడా విడవకుండా అంతరించిపోయాయి. గాతిక్‌లోని చేవ్రాత పత్రులపై ఏ మాత్రం ఆసక్తి లేకుండా పోయింది. . . . తరచూ వాటిని విడదీసి, వాటిలోని వ్రాతలను తుడిచేసేవారు. ఖరీదైన తోలు కాగితం మరలా క్రొత్త విషయాలు వ్రాయడానికి ఉపయోగించబడేది” అని టోనెస్ క్లెబెర్గ్ చెప్పారు.
తాళుకొని నిలిచిన చేవ్రాత ప్రతులు
కొన్ని చేవ్రాత ప్రతులను తుడవడం సంపూర్ణంగా జరగలేదు గనుక మొదటి రాత యింకా అస్పష్టంగా కనిపిస్తూనే వుండేది. చెరిపి రాసిన ప్రతులు అని పిలువబడే వీటిని కనుగొని విడదీయడం జరిగింది. ఆశ్చర్యకరంగా, మత్తయి, యోహాను, లూకా, మార్కు క్రమంలో ఉన్న సువార్తలుగల ప్రఖ్యాత కోడెక్సె అర్జెంటియస్ పాడుకాకుండా కాపాడబడ్డాయి.
ఈ శోభాయమానమైన కోడెక్సె, సా.శ. ఆరవ శతాబ్ద మొదటి కాలంలో రావిన్నా పుస్తక భాండాగారం నుండి ప్రథమంగా వెలువడిందని భావించబడుతోంది. అది కోడెక్సె అర్జెంటియస్ అని పేర్కెనబడుతోంది, అంటే “వెండి పుస్తకం” అని భావం, కారణం అది వెండి సిరాతో రాయబడింది. దాని తోలు కాగితాలకు ధూమ్ర వర్ణము వేయబడింది. అది రాజ హోదాగల వ్యక్తికొరకు నియమితమై ఉండవచ్చని సూచిస్తోంది. ప్రతి సువార్తలోని మొదటి మూడు లైన్లూ అలాగే వేర్వేరు భాగాల మొదట్లో బంగారు అక్షరాలతో అలంకరించి ఉంటాయి. సమాచారమున్న కాలమ్‌ల అడుగు భాగాన అమర్చిన నాలుగు సమాంతర “తోరణ ద్వారముల” వద్ద సువార్తల రచయితల పేర్లు కూడా బంగారంలో దర్శనమిస్తాయి. ఇవి సమాంతర సువార్తలకు రిఫరెన్సులనిస్తాయి.
గాతిక్ బైబిలు సమాచారాన్ని పునఃస్థాపించడం
గాతిక్ రాజ్యం అంతరించిపోయిన వెనువెంటనే, విలువైన కోడెక్సె అర్జెంటియస్ అదృశ్యమైంది. మరలా 16వ శతాబ్దం మధ్య కాలంలో, జర్మనీనందలి కొలోన్ సమీపంలో వెర్డెన్ మఠమందు వెలుగులోకి వచ్చేంత వరకూ అది మరలా కనిపించలేదు.
దానికి మూలమైన ఆ బైబిలుకు అవధానమిస్తూ గాతిక్ భాషలో ప్రభువు ప్రార్థన 1569 సంవత్సరమందు ప్రచురించబడింది. కోడెక్స్ అర్జెంటినియస్ అనే పేరు 1597లో మొట్ట మొదటిసారిగా ముద్రణలో కనిపించింది. వెర్డెన్ నుండి ఈ చేవాత్ర ప్రతి ప్రేగ్ చక్రవర్తి కళా సమకూర్పులో చేరింది. అయితే 1648లో అంతమొందిన ముప్పై ఏళ్ల యుద్ధాంతంలో, జయమొందిన స్వీడన్ దేశీయులు యితర ధనంతో కోడెక్సె అర్జెంటియస్‌ను కూడా తీసుకు వెళ్లారు. ఈ కోడెక్సె 1669 నుండి, స్వీడన్ నందలి ఉప్సలా యూనివర్సటీ లైబ్రరీలో శాశ్వత స్థానాన్ని ఆక్రమించింది.
కోడెక్సె అర్జెంటియస్ ప్రథమంగా 336 ప్రతాలతో కూర్చబడింది, వాటిలో 187 ఉప్సలలో ఉన్నాయి. మరో పత్రం—మార్కు సువార్తలో చివరిది—1970లో జర్మనీ నందలి స్పెయిర్‌లో కనుగొనబడింది.
కోడెక్స్ మరలా కనిపించిన మరు క్షణం నుండే, మృతమైన గాతిక్ భాషను అర్థంచేసుకోడానికి దాని ముడి విప్పడానికి విద్వాంసులు ఆ సమాచారాన్ని పరిశీలించడం ప్రారంభించారు. అందుబాటులో ఉన్న అన్ని చేవ్రాత ప్రతులనూ అంతేకాకుండా సమాచారాన్ని మరలా పొందడానికి చేసిన గత ప్రయత్నాలను చేర్చి ఉపయోగిస్తూ జర్మన్ విద్వాంసుడైన విల్‌హెల్మ్ ష్ట్రీట్‌బెర్క్ గ్రీక్ గాతిక్ ఎదురెదురు పుటల్లో కనబడే విధంగా “డి గోటిష్కే బైబిల్”ను (గాతిక్ బైబిలు) 1908లో ప్రచురించాడు.
నేడు, ఈ గాతిక్ బైబిలు ప్రత్యేకంగా విద్వాంసులకు ఆసక్తిదాయకమైంది. అయితే, బైబిలు అనువాదం చేయబడే తొలి దినాలలో అది తయారు చేయబడి, ఎంతో ప్రియమైందిగా ఎంచబడ్డం, ఆనాడు ఆధునిక భాషలోకి దేవుని వాక్యాన్ని అనువదించాలనే ఉల్ఫలాస్ కోరిక, నిశ్చయానికి అది తార్కాణం. ఈ పద్ధతి ద్వారా మాత్రమే గాతిక్ ప్రజలు క్రైస్తవ సమాచారాన్ని అర్థం చేసుకోగలమని ఆశించగలరని అతను సరిగానే గుర్తించాడు.
[9వ పేజీలోని చిత్రసౌజన్యం]
Courtesy of the Uppsala University Library, Sweden