కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 4/15 పేజీలు 26-29
  • యెహోవాను ఆరాధించడానికి నిశ్చయించుకోండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను ఆరాధించడానికి నిశ్చయించుకోండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒంటరితనాన్ని అధిగమించడం
  • వ్యతిరేకతను ఎదుర్కొనేటప్పుడు స్థిరంగా ఉండడం
  • రాజీపడకుండా విధేయతను కనపర్చడం
  • “వాక్యం లేకుండానే రాబట్టడం”
  • ‘కన్నీటితో విత్తండి; సంతోషంతో కోయండి’
  • గాఢంగా ప్రేమింపబడే భార్య
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • “స్త్రీకి శిరస్సు పురుషుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • వివాహిత జంటలకు జ్ఞానవంతమైన మార్గనిర్దేశం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • భర్తగా ప్రేమను మరియు గౌరవమును చూపుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 4/15 పేజీలు 26-29

యెహోవాను ఆరాధించడానికి నిశ్చయించుకోండి!

“నీవు ప్రకటించేందుకు వెళ్లడానికి వీల్లేదు, అంతే!” “మీవాళ్లెవర్నీ యిక్కడకు రానివ్వకు!” అనేకమంది క్రైస్తవ భార్యలు తమ భర్తలనుండి యిటువంటి మాటలను, మరితర వాటిని వింటుంటారు. అయితే ఈ పురుషులు సైనికాధికారులైనపుడు వారి భార్యలు తమ విశ్వాస విషయమై ప్రత్యేకమైన సవాలును ఎదుర్కొంటారు. (యెషయా 2:4; యోహాను 17:16) అయితే, క్రైస్తవ స్త్రీలు తమను తాము ఆత్మీయంగాను ఆరోగ్యంగానూ రాజ్యమందిరంలో చురుకుగానూ ఎలా ఉంచుకోగల్గుతున్నారు?

యెహోవా యెడల యథార్థతతో కలగలసిన వ్యక్తిగత నిర్ణయం వారందులో కొనసాగడానికి సహాయపడుతుంది. “బహుశ అది నా స్వంత దృఢ నిర్ణయం కాబోలు” అని ఓ సైనికుని భార్యయైన ఎవన్‌ వివరిస్తోంది. “నా భర్త వ్యతిరేకతను తప్పించుకోడానికి ఉన్న మార్గాలు నాకు తెలుసు.” నిజంగా, మార్గాలు ఉన్నాయి.

సైనికాధికారితో వివాహమైన మరో క్రైస్తవ స్త్రీ, తన నిర్ణీత స్థానం తన భర్త జీవితాన్ని కూడా ఎలా సులభతరం చేసిందో చెబుతోంది. “ఆయనకు నా కార్యక్రమమూ తన కార్యక్రమమూ తెలుసు, సైన్యంలోని వారు దాన్ని ఎంతో మెచ్చుకుంటారు మరి,” అని ఆవిడ వివరిస్తోంది. అయినప్పటికి, ఆవిడ యెహోవా ఆరాధనలో కొనసాగడం సులభమైన కార్యం కాదు సుమా.

ఒంటరితనాన్ని అధిగమించడం

తమ గృహాలకు దూరంగా ఉద్యోగం నిమిత్తం, కేవలం కొన్ని రోజులముందు తెల్పబడి బదిలీ కావాలసిన సవాలును తరచూ ఎదుర్కొంటారు. అప్పుడు, అపరిచిత ప్రాంతంలో ఉన్నప్పుడు, ఒంటరితనాన్ని అనుభవించడం సహజం. అయితే అలా ఒంటరిగా ఉండాలని లేదు. యెహోవాను సేవించేవారికి ఓ ప్రయోజనం ఉంది. ఏమిటది? క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ప్రకారం అది ప్రపంచవ్యాప్త “సహోదరత్వము.” ఈనాడు 231 దేశాలందు లక్షలాదిగా ఉన్న యెహోవాసాక్షులు “సహోదరత్వములో” ఓ పెద్ద కుటుంబంలా ఉన్నారు. మీరు వారిని దాదాపు పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ కనుగొంటారు.—1 పేతురు 2:17, అథఃస్సూచి.

అకస్మాత్తుగా తన ప్రాంతంనుండి మారాల్సివచ్చిన సూజన్‌ తన భర్త నియమించబడిన వైమానిక స్థావరంలోకి చేరుకుంది. విశ్వాసంలో క్రొత్తగా ఉండి క్రైస్తవ పరిచర్యను విడనాడమని తన భర్త పెట్టేపోరును అనుభవిస్తున్న ఆమె యిలా వివరిస్తోంది: “నేను వెంటనే స్థానిక కూటాలకు వెళ్లాను, అక్కడ నేను యితర సహోదరీలతో కూర్చుని మాట్లాడగల్గాను. ఆ సహవాసమే, నన్ను కొనసాగనిచ్చిందని నేను యథార్థంగా చెప్పగలను.”

కొన్నిసార్లు ఒంటరితనం కృంగుదలకు దారితీస్తుంది. అప్పుడు కూడా సువార్త అంగీకారయుక్తమైన ఓదార్పునిస్తుంది. ఉద్యోగరీత్యా తన భర్తను విదేశాలకు పంపినప్పుడు ఆయనతో పాటు వెళ్లిన గ్లెనిస్‌ అనే ఇంగ్లాండ్‌ సహోదరి యిలా వివరిస్తోంది: “నేను చాలా కృంగిపోయినప్పుడు, అనుకోకుండా, ఎన్నో ఏళ్ల క్రితం నేను సైన్యంలో ఉన్నప్పుడు నాకు తెలిసిన ఒకామె తాను యిటీవల ఓ యెహోవాసాక్షిగా బాప్తిస్మము పొందిందని నాకు ఉత్తరం రాసింది. సరిగ్గా సమయానికి అది నన్ను ఎంతగానో ప్రోత్సహించింది.”

క్రైస్తవ కూటాలు తనకు అర్థంకాని భాషలో జరుగుతున్నప్పటికీ తన భర్తతో కెన్యాకు ప్రయాణించిన జేన్‌కు అవి జీవమార్గంగా నిరూపించుకున్నాయి. “నేను ఎక్కడ ఉండాలని యెహోవా కోరాడో ఆ స్థలం యిదేనని, నాకు తెలుసు నేను నా సహోదరులతో ఉన్నాను, నాకు వారు పుష్టినిచ్చే ఔషధంలా పనిచేశారు. వారు నన్ను ఆహ్వానించారు, అప్పుడు మేం ఓ కుటుంబానికి చెందిన వారమని నేను భావించాను.”

ఇలాంటి పరిస్థితిల్లో తనకున్నారని తెలియని ఆత్మీయ బంధువులను కనుగొన్న అనేకుల్లో జేన్‌ ఒకరు!—మార్కు 10:29, 30.

వ్యతిరేకతను ఎదుర్కొనేటప్పుడు స్థిరంగా ఉండడం

“నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి” అని యేసు హెచ్చరించాడు. “ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.” (మత్తయి 10:34) ఆయన భావమేమిటి? సమాధానం అపేక్షించబడుతున్న ఒక కుటుంబంలోనే “అకస్మాత్తుగా ఖడ్గము వేయబడుతుందని” ఎ. టి. రాబర్ట్‌సన్‌ వర్డ్‌ పిక్చర్స్‌ యిన్‌ ది న్యూ టెస్ట్‌మెంట్‌లో వ్యాఖ్యానించాడు. “ఒక మనుష్యుని సొంత యింటి వారే అతనికి శత్రువులగుదురు” అని యేసు పేర్కొన్నాడు. (మత్తయి 10:36) ఓ వివాహ భాగస్వామి సత్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ మాటలెంత నిజమని రుజువు చేస్తాయి!

డైయన్‌ యెహోవాసాక్షులతో బైబిలును పఠించడం ప్రారంభించినప్పుడు, వైమానిక అధికారియైన తన భర్తకు అది నచ్చలేదు. ఇది వారి వివాహంపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? “మా యిద్దరి మధ్యకు ఓ పెద్ద మంచు ముక్క వస్తున్నట్లుంది” అని డైయన్‌ వివరిస్తోంది. “మేం ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్నాం. హఠాత్తుగా మేం కేవలం అదే యింట్లో ఉండే వారిగా మిగిలిపోయాం.” మరి ఆవిడ ఈ పరిస్థితితో ఎలా తాళుకుంది? “వ్యక్తిగత విశ్వాసం, నిశ్చయత దానితోపాటు యెహోవా మరియు ఆయన ఆత్మ సహాయం నిజమైన ప్రాముఖ్యత కల్గివున్నాయి.” బైబిలులోని ప్రవక్తయైన దానియేలు మాదిరిని డైయన్‌ జ్ఞాపకం చేసుకుంది.

బబులోనుకు చెరగా తీసుకుపోబడి, దేవుని సేవకునికి తగని ఆహారాన్ని తినమని యిచ్చినప్పుడు “రాజు భుజించు భోజనమును . . . పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు.” అవును, దానియేలు జ్ఞానంగల నిర్ణయాన్ని చేశాడు. ఆ ఆహారం తిని తన్నుతాను ఎన్నడూ అపవిత్రపర్చుకోకూడదని ఆయన తన హృదయంలో తీర్మానించుకున్నాడు. “తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడుకొన్నప్పుడు’ ఆయన ఎంత ధైర్యాన్ని కనపర్చాడోకదా! దాని ఫలితం? యెహోవా అతని నిశ్చయతా స్థానాన్ని ఆశీర్వదించాడు.—దానియేలు 1:8, 9, 17.

అలాగే ఈనాడు కూడా, వ్యతిరేకించే భర్త తన భార్యను సంఘ కూటాలకు వెళ్లడం మానుకొమ్మని శాసించవచ్చు. ఆమె ఎలా ప్రతిస్పందించాలి? జేన్‌ తాను ఆ పరిస్థితిలో ఉన్నట్లు గమనించింది. “ఒత్తిడి సమయంలో నేను ఎన్నడూ వెనుకంజవేయను. రాజీపడే విషయమేదీ లేదని నాకు తెలుసు. నాకు కూటాలంటే ఎంత విలువైనవో నేను ప్రదర్శించాలి.” ఆమె అలా హాజరౌతూ ఉండగా ఆమె నిర్ణయాన్ని యెహోవా ఆశీర్వదించాడు.

“నేను కూటాలకు వెళ్లకుండా చేయడానికి నా భర్త ప్రయత్నించాడు, అయితే ఆ ప్రయత్నం ఎక్కువ కాలం కొనసాగలేదని” గ్లెనిస్‌ వివరిస్తోంది. “నేను వెళుతూనే ఉన్నాను. నేను యింటికి తిరిగి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆయన నన్ను కొట్టేవారు, మరికొన్ని సార్లు మాట్లాడకుండా మౌనం వహించేవారు.” అయినా ప్రార్థిస్తూ ఆమె తాళుకోగల్గింది. అంతేకాకుండా యిద్దరు సంఘ పెద్దలు ఆమెతో ప్రార్థించేవారు, అది ఆమె కూటాలకు హాజరౌతూ ఉండడానికి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది.—యాకోబు 5:13-15; 1 పేతురు 2:23.

కొన్నిసార్లు భర్త యొక్క ఉన్నతాధికారులు సువార్త ప్రకటించకుండా తన భార్యను నిరుత్సాహపర్చమని బలవంతపెట్టవచ్చు. డైయన్‌ తనకున్న ప్రాముఖ్యమైన విషయాలను తన భర్తకు స్పష్టం చేయాలనుకుంది. “నేను ఎడతెగక ప్రకటించే పనిని చేయడం వల్ల వచ్చే ఫలితాలను ఎదుర్కోడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆమె అన్నది. ఇది అపొస్తలులు ఎన్నుకున్న స్థానంవంటిదే! (అపొస్తలుల కార్యములు 4:29, 31) అయినప్పటికి, తన పరిచర్యలో ఆమె సావధానంగా ఉంది. “నేను టీకొరకు కొంతమందిని ఆహ్వానించి ఒకొక్కరికీ సత్యము పుస్తకాన్ని బహూకరిస్తూ ఉండేదాన్ని” అని ఆమె చెబుతోంది..—మత్తయి 10:16; 24:14.

రాజీపడకుండా విధేయతను కనపర్చడం

వివాహ ఒత్తిడివల్ల కృంగిపోయినప్పటికీ క్రైస్తవ భార్యలు భవిష్యత్తును చూస్తూ యెహోవాపైన ఆధారపడతారు. ఇది వారు సమతుల్యమైన దృష్టిని కల్గివుండడానికి సహాయపడుతుంది. వారి విశ్వాసంతో వారు రాజీపడకుండా వారి భర్తలకు అవసరమైన మద్దతును వారు అందిస్తారు. అలా చేస్తూ వారు పేతురు యిచ్చిన ప్రేరేపిత సలహాను అనుసరిస్తారు: “స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి.” (1 పేతురు 3:1) ది ఆంప్లిఫైడ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌లో ఈ అపొస్తలుల ఉపదేశం యిలా ఉంది: “మిమ్మల్ని మీరు లోబర్చుకుంటూ వారికి తక్కువవారిగా వారిపై ఆధారపడుతూ, వారికి అనుకూలంగా మిమ్మల్ని మీరు మలచుకోండి.” జేన్‌ ఈ సలహాను ఎలా పాటించిందో గమనించండి. “నేను చేసేదేదీ తన ఉద్యోగానికి ఏ విధంగా కూడా ఆటంకం కలిగించకూడదని నా భర్త నాతో అన్నారు” అని వివరిస్తోంది. “కనుక ఆయనకు సహాయపడే మార్గాలను నేను వెదికాను.”

అలా కొందరు క్రైస్తవ భార్యలు తమ భర్తలు ఆహ్వానించబడిన సాంఘిక వేడుకలకు హాజరు కావడానికి అంగీకరించారు. అయినా ఎన్నడూ తమ విశ్వాసంతో రాజీపడకూడదనే తీర్మానంతో వారున్నారు. దీన్ని గూర్చి జేన్‌ తన భర్తతో మాట్లాడ్డానికి ముందుకొచ్చింది. హాజరుకావడానికి తనకు యిష్టమే కానీ తాను అక్కడ ఉండడం ఆయనకు అవమానకరం కావడం తనకిష్టం లేదని ఆవిడ దయాపూర్వకంగా వివరించింది. “అప్పుడప్పుడు అక్కడకు హాజరైనవారంతా టోస్టుకు గౌరవార్థకంగా మద్యాన్ని సేవించడంలో భాగం వహించాలని అపేక్షించబడతారు. భక్తి యెహోవాకు మాత్రమే చెందాలని, టోస్టింగ్‌ అంటే కేవలం గౌరవం చూపడమే కాదని నేను నేర్చుకున్నాను. నా భర్త ఆ పరిస్థితి ఎంత అసహ్యంగా ఉంటుందో ఊహించుకున్నారు గనుక వెంటనే యిలా అన్నారు ‘రావద్దు!’ నేను వారి మాట విన్నాను.”

అయితే మరోవైపు గ్లెనిస్‌ తన భర్తతో అలాంటి వేడుకకు హాజరైంది అయితే, టేబుల్‌ హెడ్‌ దగ్గర ఆఫీసర్లున్నట్లు ఆమె గమనించింది. వారు టోస్టుకొరకు సిద్ధపడడం చూసి, ఆవిడ తెలివిగా విశ్రాంతి గదిలోకి వెళ్లిపోయింది! అవును, ఈ స్త్రీలు తమను తాము అనుకూలం చేసుకున్నారుగానీ ఎన్నడూ రాజీపడలేదు.

“వాక్యం లేకుండానే రాబట్టడం”

“నా స్వంత సామర్థ్యాన్ని నేను వృద్ధిచేసుకుంటూ ఉంటే, సత్యం నన్ను మారుస్తోందని నా భర్త గమనిస్తారు” అని యాన్‌ సహేతుకంగా చెప్పింది. కాబట్టి ఆమె కుటుంబ జీవితం పుస్తకంలోని “గాఢముగా ప్రేమించబడు భార్య”a అనే శీర్షికను పదేపదే చదివింది. ‘ఏడ్చువారు, గయ్యాళిగంపలు’ అనే ఉపశీర్షిక క్రిందున్న సమాచారానికి నేను ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాను. అయితే నేను నా భర్తతో మాట్లాడ్డానికి ఎంత ప్రయత్నిస్తే, సంగతులు అంత విషమించడాన్ని గమనించాను” అయితే చివరికి, ఆమె తన భర్త యెహోవాను సేవించడానికి అతనికి సహాయపడింది. ఎలా? 1 పేతురు 3:1లో భర్తలను “వాక్యము లేకుండానే . . . రాబట్టవచ్చుననే” సూత్రాన్ని అన్వయించడం ద్వారా చేయగల్గింది.

క్రైస్తవ స్త్రీలు తమ కుటుంబం కొరకు కనపర్చే శ్రద్ధను బట్టి యితరులు క్రైస్తవత్వాన్ని కొనియాడతారు. “నేను సత్యాన్ని వీలున్నంత ఆకర్షణీయంగా చేశాను” అని డైయన్‌ వివరిస్తోంది. “నేను కూటాలకు వెళ్లినప్పుడు, మావారు ఒంటరితనాన్ని అనుభవించేవారు, కనుక ప్రత్యేకంగా మేం యింటికి వెళ్లినప్పుడు నా పిల్లలు చక్కటి ప్రవర్తన కనపర్చేలాగున వారికి ఉపదేశించాలని తీర్మానించుకున్నాను. మేం వచ్చిన తర్వాత నేను ఆయనకు ప్రత్యేక ఆసక్తిని కనపర్చడానికి ప్రయత్నించాను.” ఆమె భర్త కుటుంబం కనపర్చే దయాపూర్వక శ్రద్ధకు ప్రతిస్పందిస్తూ క్రమంగా తన ప్రవర్తనను మార్చుకున్నాడు.

తోటి యెహోవా సేవకులు కూడా సహాయం చేయగలరు. తన భర్త కెన్యాలో కలిసిన మిషనరీ సాక్షుల సహవాసాన్ని ఎంతగానో యిష్టపడ్డాడని జేన్‌ వివరించింది. “వారు ఆయనతో స్నేహం చేసి ఫుట్‌బాల్‌ గూర్చి మాట్లాడారు. అనేక సందర్భాల్లో, మేం వేరువేరు మిషనరీ గృహాలకు భోజనం కొరకు ఆహ్వానించబడ్డాం.” తర్వాత ఆమె భర్త యిలా వివరించాడు: “జేన్‌ విశ్వాసాన్ని నేను పూర్తిగా మరో దృష్టితో చూడ్డం ప్రారంభించాను. తన స్నేహితులు చాలా తెలివిగలవారు వారు వేరువేరు విషయాలను గూర్చి మాట్లాడగలరు.” అదే విధంగా, డేన్‌ భర్త సత్యం యెడల ఆయనకున్న దృక్పథాన్ని మార్చుకున్నారు. ఆయన నడిపించే కారు పాడైనప్పుడు ఓ యౌవనుడైన సాక్షి ఆయనకు సహాయపడ్డాడు. “అది నన్ను నిజంగా ఆకర్షించింది” అని ఆయన అన్నాడు.

అయినా, వివాహ భాగస్వాములందరూ సత్యంలోకి రారు. అప్పుడు ఏం చేయాలి? నమ్మకమైన వారు సహించడానికి యెహోవా సహాయాన్ని అందిస్తాడు. (1 కొరింథీయులు 10:13) తనకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న సహోదరీలకు గ్లెనిస్‌ యిచ్చే ప్రోత్సాహాన్ని పరిశీలించండి: “యెహోవా వివాహాన్ని ప్రారంభించాడని, దంపతులు కలిసి ఉండాలని ఆయన కోరుతున్నాడనే విషయాన్ని ఎన్నడూ అనుమానించవద్దు. భర్త ఏమి చేసినప్పటికీ, మీ చుట్టూ ఉన్నవారి నుండి మీకు ఎలాంటి వ్యతిరేకత వచ్చినప్పటికీ, మీరు పడిపోడానికి యెహోవా ఎన్నడూ అనుమతించడు.” ఆమె భర్త యిప్పటికీ యెహోవాను ఆరాధించక పోయినప్పటికి, సత్యం యెడల ఆమె యెడల ఆయన దృక్పథం సున్నితమైంది.

‘కన్నీటితో విత్తండి; సంతోషంతో కోయండి’

నిజమే, ఈ క్రైస్తవ స్త్రీలు యెహోవాను ఆరాధించడానికి నిశ్చయించుకున్నారు. మీరు కూడా అలాంటి సందర్భంలో ఉన్నట్లయితే, దీన్నే మీ తీర్మానంగా చేసుకోండి. ఈ ఉద్బోధను జ్ఞాపకముంచుకోండి: “నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను.”—ద్వితీయోపదేశకాండము 10:20.

“పిడికెడు విత్తనములు చేత పట్టుకుని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును,” అని కీర్తనల గ్రంథకర్త అంటున్నాడు. (కీర్తన 126:6) “మీరు మీ వివాహ జతకు సత్యాన్ని చూపేటప్పుడు మౌనంగాకానీ, మౌఖికంగా కానీ మీరు ఎంతో కన్నీటిని విడుస్తారు,” అని ఓ సాక్షి ఒప్పుకుంటోంది. “అయితే చివరికి మీరు సంతోషంతో కేకలు వేస్తారు కారణం ఆయన సత్యాన్ని అంగీకరించకపోయినా, మీరు చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.”

ఇంట్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ, నమ్మకంగా యెహోవాను ఆరాధించే వారందరూ నిజమైన మెప్పు పొందుతారు. వారికి సంతోషమూ ప్రేమ అవసరం. వారు రాజీపడని తమ స్థానాన్ని పోగొట్టుకోకుండా యెహోవాను సేవించడానికి తీర్మానించుకోవాలి!

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ (1978) వారు ప్రచురించిన నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము.

[28వ పేజీలోని చిత్రం]

ప్రార్థనాపూర్వక పఠనం క్రైస్తవ తీర్మానాన్ని బలపరుస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి