మీకు జ్ఞాపకమున్నవా?
మీరు యిటీవలి కావలికోటలను చదివి ఆనందించారా? అలాగైతే, ఈ క్రింది వాటిని జ్ఞాపకం చేసుకోడానికి మీకు ఆసక్తి ఉండవచ్చు:
▫ ఇశ్రాయేలీయుల వేగులవారు వేశ్యయైన రాహాబు యింట్లో ఉండడానికి ఎందుకు ఎన్నుకున్నారు?
ఇశ్రాయేలు వేగులవారు దేవుని కట్టడలకు అనుగుణంగా జీవించారు, కావున వారు లైంగిక కారణాల విషయమై రాహాబు యింట్లో దిగలేదు. వారు ఒక వేశ్య యింట్లో గనుక ఉంటే, అనుమానం వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉండవని వారు బహుశ సహేతుకంగా ఆలోచించి ఉండవచ్చు. ఆమె యిల్లు పట్టణ ప్రాకారంపై ఉండడం, సులభంగా తప్పించుకోడానికి కూడా దోహదపడుతుంది. ఇశ్రాయేలీయుల విషయమైన దైవిక నడిపింపును గురించిన వార్తల వలన ఆమె మనస్సు ఎంత చక్కగా ప్రతిస్పందించిందంటే ఆమె పశ్చాత్తాపము చెంది తన మార్గాలను మార్చుకుంది.—12⁄15, 24-5 పేజీలు.
▫ కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
కోపం ఒత్తిడిగల హార్మోన్లను తయారుచేస్తుంది. రక్షణకర మరియు ప్రమాదకర కొలెస్ట్రోల్ రకాల మధ్య సమతుల్యాన్ని పోగొట్టి హృద్రోగాల ప్రమాదానికి గురిచేస్తుంది.—12⁄15, పేజీ 32.
▫ కావలికోట, తేజరిల్లు! పత్రికల అందింపును విస్తృత పర్చడానికి ఏ సలహాలు మనకు సహాయ పడతాయి?
కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల యెడల ఆసక్తిని కలిగివుండండి; మీ అందింపును సరళంగా అనుగుణంగా పరిస్థితులకు మారేటట్లు ఉంచండి; వ్యక్తిగత గమ్యాలను ఏర్పర్చుకోండి.—1⁄1, 24-5 పేజీలు.
▫ అనుసరించడానికి మనకు మోషే ఎందుకు ఒక శ్రేష్ఠమైన దైవపరిపాలనా మాదిరిగా ఉన్నాడు?
మోషే అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ యెహోవా నడిపింపును కోరాడు. ఆయనకు ఏ స్వంత కోరికలూ లేవు, దేవుని మహిమకొరకే పాటుపడేవాడు. ఆయనకు బలమైన విశ్వాసం ఉంది, ఇశ్రాయేలు జనాంగానికి యెహోవాయే వాస్తవమైన పరిపాలకుడనే విషయాన్ని మోషే ఎన్నడూ మర్చిపోలేదు.—1⁄15, పేజీ 11.
▫ దైవిక బోధ జయించే కొన్ని విధానాలేవి?
దైవిక బోధ, యెహోవా ప్రజలకు లేఖనాలను గూర్చిన అంచెలంచెల అవగాహనను ఇవ్వడం ద్వారా జయిస్తుంది. ప్రజలను ఆత్మీయ వెలుగులోనికి తెచ్చి, దేవున్ని “ఆత్మతోను సత్యముతోను” ఎలా ఆరాధించాలో సాత్వీకులకు చూపిస్తుంది. (యోహాను 4:24) దైవిక బోధ శ్రమలపై, దుష్టవిధానంపై కూడా విజయాన్ని సాధిస్తుంది.—2⁄1, 10-12 పేజీలు.
▫ విజయవంతమైన సలహా యివ్వడానికి కీలకమేది?
ఇతరుల యెడల సరైన గౌరవమూ మర్యాదపూర్వకంగా వ్యవహరించబడాలని అతనికున్న హక్కు దానికి కీలకం. కాబట్టి, క్రైస్తవ సలహాదారుడు దయాపూర్వకంగా, దృఢంగా ఉండాలి, అయితే సలహా పొందేవానితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలి.—2⁄1, పేజీ 28.
▫ మేరి కొనిపోబడిందనే సిద్ధాంతాన్ని రోమన్ కాథోలిక్ చర్చీ ఎలా అంగీకరించింది?
మొదటి శతాబ్దంలో, యేసు చనిపోయిన తర్వాత మరియ పరలోకానికి కొనిపోబడడం ఆనాటి క్రైస్తవులకు పూర్తిగా క్రొత్తది. త్రిత్వ బోధ చర్చి అధికారిక సిద్ధాంతమైనప్పుడు, మరియకు అధిక ప్రాముఖ్యత యివ్వడం ప్రారంభమైంది. “దాన్ని దేవుడు బయల్పర్చిన మత సిద్ధాంతంగా మేము నిర్వచిస్తున్నాము” అని పోప్ పయస్ XII 1950 నవంబరు 1న ప్రకటించినప్పటి వరకు కొనిపోబడే సిద్ధాంతం ఓ మత సిద్ధాంతంగా అంగీకరించబడలేదు.—మ్యునిఫికెన్‌టిసిమస్ డావుస్—2⁄15, 26-7 పేజీలు.
▫ యిర్మీయా 24వ అధ్యాయంలో మంచి అంజూరపు పండ్లు చెడ్డ అంజూరపు పండ్లున్న రెండు బుట్టల అంజూరపు పండ్లు దేనిని సూచిస్తున్నాయి?
మొదట బబులోనుకు చెరగా కొనిపోబడినవారినుండి ఓ శేషము యూదాకు తిరిగివచ్చే యూదులను మంచి అంజూరపు పండ్లు సూచిస్తున్నాయి. చెడ్డ అంజూరపు పండ్లు, దేవుని పేరుమీద ప్రమాణం చేసినప్పటికీ రాజైన నెబుకద్నెజరుకు ఎదురు తిరిగిన రాజైన సిద్కియాను సూచిస్తుంది. దానికి పోల్చిచూస్తే, ఆధునిక కాలంలో క్రైస్తవమత సామ్రాజ్య మత నాయకులు కుళ్లిపోయిన ఫలాలను ఫలింపజేసి, దానికి భిన్నంగా ఆత్మీయ ఇశ్రాయేలీయులలో శేషించినవారు తమ జీవితాల్లో మంచి ఫలాలను ఫలింపజేశారు.—3⁄1, 14-16 పేజీలు.
▫ క్వార్టోడెసిమన్లు ఎవరు మరి క్రైస్తవులకు వారంటే ఆసక్తి ఎందుకు ఉంది?
అపొస్తలుల కాలం తర్వాత, అపొస్తలుల విధానాన్ని అనుసరిస్తూ ప్రభువురాత్రి భోజనాన్ని నీసాను 14న ఆచరించినవారు కొందరు ఉండేవారు. వారు “క్వార్టోడెసిమెన్స్” లేక “పద్నాల్గవ దినాన్ని ఆచరించేవారు” అని పిలువబడ్డారు. నేడు యిది మనకు ఆసక్తికరమైంది, కారణం అపొస్తలులు చనిపోయిన తర్వాత యేసు మరణ దినాన్ని నీసాను 14న ఆచరిస్తూ సరైన పద్ధతిని అవలంభించిన వారు ఉన్నారని అది చూపుతోంది.—3⁄15, 4-5 పేజీలు
▫ విలియమ్ విస్టన్ ఎవరు?
ఆయన 18వ శతాబ్దానికి చెందిన ఓ తెలివైన విద్వాంసుడూను సర్ ఐజక్ న్యూటన్ సన్నిహిత సహోద్యోగియై యున్నాడు. విస్టన్ క్రైస్తవ గ్రీకు లేఖనాలను అనువదించాడు, త్రిత్వ సిద్ధాంతాన్ని బాహాటంగా వ్యతిరేకించాడు, అంతరిక్ష శాస్త్రం, గణిత శాస్త్రంలో ఆయన ఓ లెక్చరర్. అయితే, యూదా చరిత్రకారుడైన ఫ్లేవిస్ జోసీఫస్ వ్రాతలను ఇంగ్లీషులోకి అనువదించడంలో పేరుగాంచాడు.—3⁄15, 26-8 పేజీలు.
▫ మానవుడు దేవుని స్వరూపంలో ఎలా సృజించబడ్డాడు? (ఆదికాండము 1:27)
దేవుని లక్షణాలైన ప్రేమ, న్యాయం, జ్ఞానం శక్తిని—అలాగే యితర వాటిని కూడా అనుసరించగల సామర్థ్యంతో సృజించబడ్డాడు.—4⁄1, 25 పేజీ.