కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 2/15 పేజీలు 26-29
  • కొనిపోబడుట—దేవుడు బయల్పర్చిన సిద్ధాంతమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కొనిపోబడుట—దేవుడు బయల్పర్చిన సిద్ధాంతమా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మత సిద్ధాంతం ఉద్భవించడం
  • లేఖనాలు నిజంగా ఏమి చెబుతున్నాయి?
  • మరియ—విశ్వాసంగల ఓ స్త్రీ
  • ‘ఇదిగో! యెహోవా దాసురాలిని!’
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • మరియ దేవుని తల్లా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ‘ఇదిగో! యెహోవా దాసురాలు!’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఆమె ‘వాటి గురించి ఆలోచించింది’
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 2/15 పేజీలు 26-29

కొనిపోబడుట—దేవుడు బయల్పర్చిన సిద్ధాంతమా?

యేసు తల్లియైన మరియ భౌతిక శరీరంతో పరలోకానికి ఎక్కిపోయింది—కొనిపోబడిందనే సిద్ధాంతం, లక్షలాది రోమన్‌ కాథోలిక్కుల హృదయాలకు ఎంతో ప్రీతికరమైంది. చరిత్రకారుడైన జార్జి విలియమ్‌ డగ్లస్‌ యిలా అన్నాడు: “ఈ కొనిపోబడడం లేక మరియ పరలోకానికి ఎక్కిపోవడం, ఆమె వేడుకల్లో అతి గొప్పదానిగానూ, ప్రతి సంవత్సరం చర్చిలో జరిగేవాటిలో ముఖ్యమైన మతపండుగగాను కొనియాడబడుతోంది.

అయితే, మరియ అలా పరలోకానికి ఎక్కిపోవడాన్ని గూర్చి బైబిలు మాట్లాడ్డంలేదని కాథోలిక్కు వేదాంతులు ఒప్పుకుంటున్నారు. వాస్తవానికి ఈ ప్రియమైన సిద్ధాంతం శతాబ్దాలుగా వివాదాంశంగానూ తీవ్ర తర్కంగాను ఉందని కొందరు కాథోలిక్కులు గ్రహిస్తున్నారు. కాబట్టి చర్చి, మరియ కొనిపోబడ్డాన్ని ఒక మత సిద్ధాంతంగా అసలు ఎలా అంగీకరించింది?a అది దైవీకంగా బయల్పరచబడిందనడానికి కారణాలేమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు జవాబులు కేవలం సైద్ధాంతికం కావు. సత్యంయెడల ప్రేమ ఉన్నవారెవరికైనా అవి గొప్ప అర్థాన్నిస్తాయి.

మత సిద్ధాంతం ఉద్భవించడం

మొదటి శతాబ్దంలో, యేసు చనిపోయిన తర్వాత మరియ పరలోకానికి కొనిపోబడడం ఆ నాటి క్రైస్తవులకు పూర్తిగా క్రొత్తదని తెలుసుకోవడం మిమ్మల్ని ఆశ్చర్యపర్చవచ్చు. కాథోలిక్కు వేదాంతియైన జన్‌ గాలో, లొసార్వాటోరా రొమానోలో యిలా రాస్తున్నాడు: “మొదట్లో, మరియ మరణానికి సంబంధించి ఏ జ్ఞాపకమూ క్రైస్తవ మతానికి ఏ సంబంధమూ లేకపోయింది.”

అయినప్పటికి, త్రిత్వ బోధ చర్చి అధికారిక సిద్ధాంతమైనప్పుడు, మరియకు అధిక ప్రాముఖ్యత యివ్వడం ప్రారంభమైంది. “దేవుని తల్లి,” “పాపరహితంగా గర్భం ధరించింది,” “మధ్యవర్తి,” “పరలోక రాణి” అనే వెలుగొందే పదాలు ఆమెకు ఆపాదించడం ప్రారంభమైంది. ఈమధ్య, వేదాంతికుడైన గాలట్‌ యిలా వాదిస్తున్నాడు: “మరియ మరణాన్ని గూర్చి సనాతనాచారం మౌనంవహించడం, మరియ పరిపూర్ణతను గుర్తించి ఆమెను కొలవాలనుకునే క్రైస్తలవులను ఏమాత్రం తృప్తిపర్చలేదు. ఆ విధంగా, ప్రఖ్యాత కల్పన మూలంగా కల్గిన కొనిపోబడుటను గూర్చిన వివరణలు తయారయ్యాయి.”

నాలుగవ శతాబ్దం కల్లా, కొనిపోబడుటను గూర్చిన బైబిలేతర ప్రచురణలు వ్యాప్తి చెందాయి. ఈ వ్రాతలు, మరియ పరలోకానికి కొనిపోబడిందనడానికి కల్పనా వృత్తాంతాలను అందించాయి. ఉదాహరణకు, “దేవుని పరిశుద్ధ తల్లియైన మరియ నిద్రించడం” అనే రచనను పరిశీలించండి. దీని రచించింది ఎవరో కాదు యోహానే అని చెబుతుంటారు, అయితే దాదాపు యోహాను మరణించిన 400 సంవత్సరాల తర్వాత అది వ్రాయబడింది. ఈ అప్రమాణిక వృత్తాంతం ప్రకారం, క్రీస్తు అపొస్తలులు మరియ దగ్గరకు అద్భుతంగా చేర్చబడి, అక్కడ ఆమె గ్రుడ్డివారిని, చెవిటివారిని, కుంటివారిని స్వస్థపరచడం చూశారు. ఇక్కడ చెప్పినట్లుగా చివరికి, మరియతో యేసు యిలా చెప్పడం విన్నారు: “ఇదిగో! ఈనాటినుండి నీ విలువైన శరీరము పరదైసుగా మార్చబడుతుంది, నీ ఆత్మ, ఆనందమయ పరిశుద్ధ దూతలుండే పరలోకమందు గొప్ప కాంతితో నా తండ్రి నిధిలో ఉంటుంది, అక్కడ నిరంతరం ఉంటుంది.”

అటువంటి వ్రాతలకు విశ్వాసులు ఎలా ప్రతిస్పందించారు? మరియ పరిశోధకురాలైన రినా లొరాన్‌టాన్‌ యిలా వివరిస్తోంది: “వారి ప్రతిస్పందనలు వేరువేరుగా ఉన్నాయి. మరో ఆలోచనలేకుండా, ఈ అందమైన కథ వెలుగు జిలుగులవల్ల అనేక మంది అమాయకులు మోసపోయారు. ఇతరులు, తరచూ వివాదాస్పదంగా, అధికారపూర్వకంకాని ఈ అప్రమాణిక వృత్తాంతాలను అసహ్యించుకున్నారు.” ఆ విధంగా కొనిపోబడడం అనే సిద్ధాంతం అధికారికంగా అంగీకరించబడ్డానికి ఓ పోరాటం పోరాడాల్సివచ్చింది. దీనికితోడు కొన్ని స్థలాల్లో మరియ భౌతిక శరీర భాగాలని నమ్మి వాటిని ప్రజలు పూజించడం మరింత గందరగోళాన్ని రేపాయి. ఆమె భౌతిక శరీరం పరలోకానికి కొనిపోబడిందనే నమ్మకముతో దీనిని పొందిక చేయడం కష్టము.

ఇతర వేదాంతుల్లాగానే 13వ శతాబ్దంలో థామస్‌ అక్వినాస్‌, కొనిపోబడ్డాన్ని ఒక మత సిద్ధాంతం చేయడం సాధ్యపడదనీ, ప్రత్యేకంగా “లేఖనాలు దాన్ని బోధించడంలేదనీ” అన్నాడు. అయినప్పటికి, ఆ విశ్వాసం ప్రఖ్యాతినొందుతూ వచ్చింది, మరియ కొనిపోబడిందనే దాన్ని ప్రఖ్యాత చిత్రకారులైన రాఫెల్‌, కర్రిగియో, టైటన్‌, కారాట్‌చి, రూబెన్స్‌ గీచిన చిత్రాలు మరింత ఎక్కువయ్యాయి.

ఇటీవలి కాలంవరకు ఆ వివాదం పరిష్కరించబడలేదు. గిసెప్‌ ఫిలొగ్రాస్సీ అనే జేసూట్‌ ప్రకారం, మన శతాబ్దం మధ్య భాగంలో కాథోలిక్కు విద్వాంసులు, కొనిపోబడుట అనే సిద్ధాంతానికి “ఎల్లప్పుడూ అనుకూలంకాని పరిశోధననూ చర్చలను” ప్రచురిస్తూ వచ్చారు. లియో XIII, పయస్‌ X, బెనిడిక్ట్‌ XV వంటి పోపులు సహితం “ఈ విషయంలో మితంగానే ఉన్నారు.” అయితే 1950 నవంబరు 1న, చర్చి చివరికి ఒక నిర్దిష్ట నిర్ణయానికి వచ్చింది. పోప్‌ పయస్‌ XII యిలా ప్రకటించాడు: “దేవుని కళంకరహితురాలైన తల్లి, కన్య మరియ తన భూజీవితాన్ని ముగించిన తర్వాత పరలోక మహిమలోకి ఆమె శరీరమూ ఆత్మతో కొనిపోబడిందన్న దాన్ని దేవుడు బయల్పర్చిన మత సిద్ధాంతంగా మేము నిర్వచిస్తున్నాము.”—మునిఫికెన్‌టిసిమస్‌ డావుస్‌.

మరియ శరీరంతో పరలోకానికి వెళ్లడం కాథోలిక్కుల్లో యిప్పుడు యిష్టానుసారంగా నమ్మగల సిద్ధాంతం కాదు—యిప్పుడది చర్చి మత సిద్ధాంతం. “ఒకవేళ ఎవరైనా . . . మేము నిర్వచించిన దాన్ని తృణీకరించినా లేక స్వచ్ఛందంగా అనుమానించడానికి సాహసించినా, అతను దైవిక మరియు కాథోలిక్‌ విశ్వాసానికి చెందిన ప్రమాణాలను అమలుపర్చడంలో విఫలుడయ్యాడని అతను తెలుసుకోవాలి,” అని పోప్‌ పయస్‌ XII ప్రకటించాడు.

లేఖనాలు నిజంగా ఏమి చెబుతున్నాయి?

అయితే ఏ ఆధారంపై చర్చి యింతటి సాహసానికి ఒడిగట్టింది? కొనిపోబడుట అనే సిద్ధాంతానికి “లేఖనాల్లో దాని పునాది ఉందని” పోప్‌ పయస్‌ XII పేర్కొన్నాడు. మరియ కొనిపోబడిందనడానికి ఆధారంగా చూపించే లేఖనాల్లో లూకా 1:28, 42 ఒకటి. ఈ లేఖనాలు మరియను గూర్చి యిలా చెబుతున్నాయి: “కృపతో నిండినదానా నీకు శుభము, ప్రభువు నీకు తోడుగావున్నాడు: నీవు స్త్రీల్లో ఆశీర్వదించబడినదానివి . . . , నీ గర్భఫలమునూ ఆశీర్వదించబడును.” (డుయే) మరియ “కృపతో నింపబడినది” గనుక ఆమె ఎన్నడు చనిపోదని, కొనిపోబడుటను సమర్థించే వేదాంతులు వాదిస్తారు. అంతేకాకుండా, తన “గర్భఫలము” వలెనే ఆమెకూడ “ఆశీర్వదించ”బడింది గనుక, యేసుకున్న ఆధిక్యతలన్నీ, అంటే ఆయన పరలోకానికి ఆరోహణమవ్వడంతో సహా అన్నింటిని ఆమె కూడ పొందాలి. ఇది సరైన వాదనని మీరనుకుంటున్నారా?

ఒక విషయమేంటంటే, “కృపతో నింపబడడం” అన్నది సరైన అనువాదం కాదని, లూకా ఉపయోగించిన గ్రీకు మూల పదం “దయాప్రాప్తం” అని మరింత నిర్దిష్టంగా అనువదించబడిందని భాషా విధ్వాంసులు చెబుతున్నారు. కాబట్టి కాథోలిక్‌ జెరూసలేమ్‌ బైబిల్‌ లూకా 1:28ను యిలా అనువదించింది: “గొప్ప దయను పొందినదానా, ఆనందించు!” మరియ దేవుని నుండి “గొప్ప దయను” పొందడంవల్ల శరీరంతో పరలోకానికి కొనిపోబడిందని తీర్మానించడానికి ఏ కారణాలూ లేవు. మొదటి శతాబ్దపు క్రైస్తవ హతసాక్షియైన స్తెఫెన్‌ కూడా దయాప్రాప్తుడని “గొప్ప దయ” పొందినవాడని కాథోలిక్‌ డూయే బైబిలు వర్ణించింది. శారీరక పునరుత్థానం అతనికి ఎన్నడూ ఎన్నడు ఆపాదించబడలేదు.—అపొస్తలుల కార్యములు 6:8.

అయినప్పటికి, మరియ ఆశీర్వదించబడలేదా లేక కృపచూపబడలేదా? అవును, అయితే ఆసక్తికరంగా, ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల కాలంలో యోయేలు అనే స్త్రీ కూడా “స్త్రీలలో ఆశీర్వదించబడినద”ని పరిగణించబడింది. (న్యాయాధిపతులు 5:24, డుయే) తప్పనిసరిగా, యోయేలు కూడా శరీరంతో పరలోకానికి కొనిపోబడిందని ఎవ్వరూ వాదించరు. అంతేకాకుండా, కొనిపోబడుట అనే సిద్ధాంతం యేసు పరలోకానికి భౌతిక శరీరంతో పోయాడన్న దానిపై ఆధారపడింది. అయితే, యేసు “ఆత్మలో,” “తిరిగి జీవించాడు,” లేక పునరుత్థానం చేయబడ్డాడు అని బైబిలు అంటోంది. (1 పేతురు 3:18, డుయే; 1 కొరింథీయులు 15:45 పోల్చండి.) ఇంకా, “శరీరము, రక్తము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు” అని అపొస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు.—1 కొరింథీయులు 15:42-50, డుయే.

నిజమే, నమ్మకమైన అభిషక్త క్రైస్తవులు ఆత్మీయ శరీరంతో పరలోక పునరుత్థానం చేయబడతారని బైబిలు చెబుతోంది. అయితే, 1 థెస్సలొనీకయులు 4:13-17, దుష్టవిధానపు అంత్యకాలంలో “ప్రభువు ప్రత్యక్షత” వరకు పునరుత్థానం ప్రారంభం కాదని స్పష్టపరుస్తోంది. అంతవరకు మరియ వేల కొలది యితర నమ్మకమైన క్రైస్తవులతో మరణమందు నిద్రిస్తుంది.—1 కొరింథీయులు 15:51, 52.

మరియ—విశ్వాసంగల ఓ స్త్రీ

మేము ముందుగా ప్రస్తావించిన విషయంలో మరియను అగౌరవపర్చే ఉద్దేశం లేదని మీరు నమ్మండి. నిస్సందేహంగా, మరియ మాదిరికరమైన స్త్రీ—ఆమె విశ్వాసం అనుకరించదగినదే. ఆమెకు వచ్చే అన్ని శ్రమలు, త్యాగాలతో సహా, తనకు అందించబడిన బాధ్యతతో కూడిన ఆధిక్యతను ఆమె వెంటనే గైకొనింది. (లూకా 1:38; 2:34, 35) ఆమె యోసేపుతో పాటు, యేసును దైవిక జ్ఞానంలో పెంచింది. (లూకా 2:51, 52) మ్రానుపై యేసు బాధను అనుభవిస్తున్నప్పుడు ఆమె ఆయనతో కూడా ఉంది. (యోహాను 19:25-27) అంతేకాకుండా ఒక నమ్మకమైన శిష్యురాలుగా, విధేయతగలదై ఆమె యెరూషలేములో ఉండి, పెంతెకొస్తు నాడు దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు దాన్ని అనుభవించింది.—అపొస్తలుల కార్యములు 1:13, 14; 2:1-4.

మరియను గూర్చిన ఈ తప్పుడు అభిప్రాయం అటు దేవున్నిగాని మరియనుగానీ గౌరవించదు. కొనిపోబడుట అనే మత సిద్ధాంతం, మరియ దేవునికి మధ్యవర్తియనే ఆధారరహిత వాదాన్ని ఏర్పరుస్తుంది. అయితే యేసు ఎన్నడైనా అటువంటి బోధను ఆమోదించాడా? దీనికి విరుద్ధంగా, ఆయన యిలా అన్నాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.” (యోహాను 14:6, 14; అపొస్తలుల కార్యములు 4:12 పోల్చండి.) అవును, మరియ కాదు యేసుక్రీస్తు ఒక్కడే సృష్టికర్తకు మధ్యవర్తిత్వం వహిస్తాడు. మరియ ద్వారా కాదు యేసు ద్వారానే “అవసరమున్నప్పుడు సహాయం” కొరకు మనం మన జీవదాతను చేరాలి.”—హెబ్రీయులు 4:16, రివైజ్డ్‌ స్టాన్‌డార్డ్‌ వర్ష్‌న్‌, కాథోలిక్‌ ఎడిషన్‌.

మరియను గూర్చిన సత్యాన్ని అంగీకరించడం కొందరికి కష్టతరం కావచ్చు. తక్కువలో తక్కువగా, కొన్ని దీర్ఘకాల విశ్వాసాలను, ప్రియమైన కల్పనలనూ పరిత్యజించడం అని దీని భావం. అయితే, కొన్నిసార్లు బాధాకరంగా ఉన్నప్పటికి, చివరికి ‘సత్యం ఒకరిని స్వతంత్రులను చేస్తుంది.’ (యోహాను 8:32) “ఆత్మతో సత్యంతో” ఆరాధించేవారి కొరకు తన తండ్రి వెదకుతున్నాడని యేసు చెప్పాడు. (యోహాను 4:24, డుయే) యథార్థపరులైన కాథోలిక్కులకు, ఈ మాటలు ఒక సవాలుగా ఉంటాయి.

[అధస్సూచీలు]

a ఓ సామాన్య విశ్వాసంలా కాక కాథోలిక్కుల్లో మత సిద్ధాంతం అంటే, సమస్త క్రైస్తవుల సభ లేక పోపు యొక్క “అమోఘమైన బోధనాధికారం” ఉమ్మడిగా ఏర్పర్చిన సత్యమని చెప్పబడుతోంది. కాథోలిక్కు చర్చి నిర్వచించే అలాంటి సిద్ధాంతాల్లో, మరియ కొనిపోబడుట అతి క్రొత్తది.

[27వ పేజీలోని బాక్సు]

మరియ చనిపోయిందా?

మరియ పరలోకానికి ఎక్కిపోవడమన్నది జరగకముందు ఆమె చనిపోయిందా? ఈ విషయంపై కాథోలిక్‌ వేదాంతులకు పొసగని రెండు సిద్ధాంతాలున్నాయి. “క్రీస్తు కూడా పొందని, మరణరాహిత్యాన్ని మరియ పొందిందని చెప్పడం చాలా కష్టం” అని న్యూవొ డిజియోనారియో దె థియోలొజియా సూచిస్తోంది. మరో వైపు, మరియ నిశ్చయంగా చనిపోయిందనడం కూడా అంతే క్లిష్టమైన అంశాన్ని రేపుతుంది. “మొదటి పాపానికి శిక్ష మరణం, అయితే [“అమర్త్య తలంపు” సిద్ధాంతం] ప్రకారం అది మరియకు వర్తించలేదు” అని కారె బొరాసెన్‌ అనే వేదాంతురాలు పేర్కొన్నది. మరి ఏ ఆధారంపై ఆమె చనిపోయింది? కొనిపోబడుట అనే మత సిద్ధాంతాన్ని నిర్వచించేటప్పుడు పోప్‌ పయస్‌ XII మరియ మరణ విషయాన్ని జాగ్రత్తగా జారవిడవడంలో పెద్ద ఆశ్చర్యంలేదు.

సంతోషకరమైన బైబిలు బోధ అటువంటి గందరగోళం నుండి స్వతంత్రంగా ఉంది. మరియ “పాపరహిత గర్భధారణ” వల్ల జన్మించిందని బైబిలు బోధించడంలేదు, కనీసం సూచించనూ లేదు. దానికి విరుద్ధంగా, మరియకు కూడా విమోచన అవసరమైన అపరిపూర్ణురాలు అని అది సూచిస్తోంది. దీని కారణంగా, యేసు జన్మించినప్పుడు ఆమె ఆలయానికి వెళ్లి పాప పరిహారార్థ బలిని దేవునికి అర్పించింది. (లేవీయకాండము 12:1-8; లూకా 2:22-24) ఇతర అపరిపూర్ణ మానవులందరిలా, మరియ చివరకు చనిపోయింది.—రోమీయులు 3:23; 6:23.

ఈ సరళమైన సత్యం, కొనిపోబడుట అనే మత సిద్ధాంతం రేపిన జవాబులేని ప్రశ్నలకు పూర్తి భిన్నంగా ఉంది.

[26వ పేజీలోని చిత్రం]

‘కన్యక కొనిపోబడుట’ చిత్రీకరణ టైటన్‌ (సి. 1488-1516)

[క్రెడిట్‌ లైను]

Giraudon/Art Resource, N.Y.

[28వ పేజీలోని చిత్రం]

యేసు జన్మించిన తర్వాత మరియ పాప పరిహారార్థ బలిని అర్పించడం ద్వారా, తాను కూడా విమోచన అవసరమైన ఒక పాపాత్మురాలేనని ప్రదర్శించుకుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి