“దైవ భయము” జిల్లా సమావేశానికి రండి
పురాతన కాలంలో ధర్మశాస్త్రం ప్రకారం యెహోవా ప్రజలు సంవత్సరానికి మూడుసార్లు కొన్ని పండుగలు ఆచరించడానికి సమకూడాల్సి ఉండేది. ఇవి సంతోషకరమైనవి, అలాగే ఆత్మీయంగా బలపర్చే సందర్భాలు.—ద్వితీయోపదేశకాండము 16:16.
అదే విధంగా ఆధునిక కాలాల్లో కూడా యెహోవా సేవకులు సంవత్సరానికి మూడుసార్లు సమకూడతారు, అవి ఒక దిన సమావేశం, రెండురోజుల ప్రాంతీయ సమావేశం, మూడు లేక నాలుగు రోజుల జిల్లా సమావేశం. అలాగే 1994 సేవా సంవత్సరంలో యెహోవాసాక్షులు “దైవ భయం” జిల్లా సమావేశలో సమకూడతారు.
దైవిక భయం యొక్క ప్రాముఖ్యతను గూర్చి దేవుని వాక్యం ఎటువంటి సందేహాన్ని రేపడంలేదు. అటువంటి భయాన్ని గూర్చి దానిలో దాదాపు 200 సార్లు ప్రస్తావించబడింది. సామెతలు 16:6 నందున్నట్లుగా దైవ భయం సంరక్షణనిస్తుంది: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.” అంతెందుకు, యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలమని కీర్తన 111:10 నందు తెల్పబడింది!
దైవ భయంలో రెండు విషయాలున్నాయని చెప్పవచ్చు. ఒకటి, ప్రేమ వల్ల అటువంటి భయం కలుగుతుంది. మనకు దేవునిపైనున్న అపారమైన ప్రేమవల్ల ఆయన్ను మనం అప్రీతిపర్చడానికి భయపడతాం. (సామెతలు 27:11) తర్వాత, చెడును అభ్యసించేవారికి దేవుడు “దహించు అగ్నియైయున్నాడని” మనకు తెలుసు గనుక, మన వివేకం మనలో దైవ భయం నాటుకోడానికి సహాయపడుతుంది.—హెబ్రీయులు 12:29.
మన “దైవ భయము” జిల్లా సమావేశాల్లో, దైవ భయంలో మనం పెంపొందడానికిగాను, మనం ఎన్నో ఉపదేశాలనూ ఎంతో ప్రోత్సాహాన్ని పొందుతాం. అటువంటి బోధ, ప్రసంగాలు, ప్రదర్శనలూ, నాటకాలు, అనుభవాలు చెప్పడం ద్వారా అందించబడుతుంది.
పురాతన ఇశ్రాయేలీయుల్లాగే మనం కూడా సమావేశాలకు వట్టి చేతులతో వెళ్లకూడదు గనుక, సమావేశాలు జయప్రదంకావడానికి దాని ఆనందానికి మన వంతు మనం చేయాలి. (ద్వితీయోపదేశకాండము 16:17) యెహోవా బల్లను మనం గౌరవించడం ద్వారా మనవంతు మనం చేయగలం. అది ఎలా? సమయానికి రావడం, వేదిక నుండి చెప్పబడే వాటిని మనం అనిశ్చల అవధానంతో వినడం, పాటలను హృదయపూర్వకంగా పాడడం. కార్యక్రమ సమయంలో మనం మాట్లాడకుండా లేదా తిరగకుండా ఉండడం వల్ల మనం దానిని చేయగలం. వీలున్నంతవరకు మన సేవలను స్వచ్ఛందంగా అందించడం వల్ల కూడా మనం కొంత తోడ్పడగలం. సమావేశ వ్యవస్థీకరణలో ఎన్నో విభాగాలుంటాయి, అన్నింటికి సిబ్బంది అవసరం. యెహోవా మనలను ఆశీర్వదించినంతమట్టుకు మనం ద్రవ్య సహాయాలను కూడా యివ్వడానికి యిష్టపడతాము.
యెహోవా సేవకుల్లో ప్రతి ఒక్కరూ “దైవ భయము” జిల్లా సమావేశంలోని మూడు రోజులూ అంటే శుక్రవారం ఉదయం ప్రారంభ పాటనుండి, ఆదివారం మధ్యాహ్నం ముగింపు ప్రార్థన వరకు హాజరుకావడానికి యిప్పుడే పథకాలు వేసుకోవాలి.