దేవుడు బుద్ధిహీనుని తృణీకరిస్తాడు—ఎందుకు?
“బుద్ధిహీనుడు” అనే పదం మానసిక సామర్థ్యం లేని వ్యక్తిని సూచించే బదులు, బైబిలో ఉపయోగించబడినట్లు, సర్వసాధారణంగా వాస్తవాన్ని నిరాకరించి దేవుని నీతి సూత్రాలతో పొందికలేని నైతిక విషయాల్లో బుద్ధిహీనంగా ప్రవర్తించే వ్యక్తిని యిది సూచిస్తుంది. కెసిల్ (‘జ్ఞానములేనివారు’; సామెతలు 1:22), ఎవిల్ (‘మూఢుడు’; సామెతలు 12:15), నావల్ (‘బుద్ధిలేనివారు’; సామెతలు 17:7), లెట్స్ (“అపహాసకుడు”; సామెతలు 13:1) అనే హెబ్రీ పదాలు అలాంటి వ్యక్తిని సూచిస్తున్నాయి. గ్రీకు పదాలైన ఎఫ్రోన్ “వెఱ్ఱివానిని” (లూకా 12:20), ఎనొయిటోస్ “అవివేకిని” (గలతీయులు 3:1), మోరొస్ ‘బుద్ధిహీనులు’ లేక “బుద్ధిలేని”వారికి వర్తిస్తాయి.—మత్తయి 23:17; 25:2.
సత్య దేవుని ఎరిగియుండి కూడా సృష్టాన్ని ఆరాధించే ప్రజల వలె, బుద్ధిహీనుని మార్గం ఉంటుందని నాబాలు అనే వ్యక్తి ప్రవర్తన (1 సమూయేలు 25) చూపిస్తోంది. (రోమీయులు 1:20-25) బుద్ధిహీనులు లేక మూఢులు, వట్టి “మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు” అని యెషయా అన్నాడు. (యెషయా 32:6) బుద్ధిహీనుడు వివేకాన్ని, క్రమశిక్షణను తిరస్కరిస్తాడు. (సామెతలు 1:7) సలహాను గైకొనే బదులు, బుద్ధిహీనుడు “వాని దృష్టికి సరియైన” దని తోచిన మార్గాన నడుస్తాడు. (సామెతలు 12:15) అతను ప్రతీకారం తీర్చుకొనడానికి త్వరపడి, వివాదానికి కాలుదువ్వుతాడు. (ప్రసంగి 7:9; సామెతలు 20:3) “యెహోవా లేడు” అని తన హృదయంలో (తన పెదవులు పలకలేని వాటిని క్రియల్లో కనపరుస్తాడు) అనుకుంటాడు.—కీర్తన 14:1.
యేసు పరిసయ్యులు సద్దూకయులను “అవివేకులారా, అంధులారా” అని సరిగ్గా పేర్కొన్నాడు, అంటే, మానవులు చేసిన ఆచారాలతో వారు సత్యాన్ని విడనాడి, వేషధారణా మార్గాన్ని అనుసరించారు గనుక ఈ వ్యక్తులు వివేకములేనివారు, మరియు వారు నైతికపరంగా పనికిరానివారు. అంతేకాకుండా, వారి వివేకరాహిత్యాన్ని ఉదహరిస్తూ వారికి పెట్టిన ఈ పేర్లు సరైనవేనని యేసు దృఢపర్చాడు. (మత్తయి 23:15-22; 15:3) అయినప్పటికి, ఓ వ్యక్తి తన సహోదరుని తప్పుగా “వ్యర్థుడా” అని పిలిచి తీర్పుతీర్చి, తన సహోదరుడు నైతికంగా పనికిరానివాడని ఖండించడం ద్వారా తన్ను తాను గెహెన్నాకు పాత్రునిగా చేసుకుంటాడు.—మత్తయి 5:22; రోమీయులు 14:10-12; మత్తయి 7:1, 2.
ఇసుకపైన ఇంటిని నిర్మించుకున్న వ్యక్తి, తన భూమి సమృద్ధిగా పండినప్పుడు తన కొట్లను విస్తృతపరుచుకుని, జీవితాన్ని అనుభవించాలనుకున్న ధనవంతుడు వంటి దైనందిన జీవితంలోని చక్కటి ఉపమానాలను యేసు చెబుతూ, ఆత్మీయ విషయాలను నిర్లక్ష్యంచేసి నిజమైన ఆశీర్వాదాలను పోగొట్టుకునే బుద్ధిహీనతను ఎత్తిచూపాడు. అంతేకాక, పెండ్లికుమారుని ఎదుర్కొనడానికి వెళ్లినప్పుడు, తమ దివిటీల్లో నూనె లేకుండా వెళ్లే అయిదుగురు బుద్ధిలేని కన్యకలను గూర్చిన ఉపమానంలో, “మెలకువగా ఉండడ”ములో విఫలం కావడం ఆత్మీయ దృష్టిలో మూర్ఖత్వమౌతుందని యేసు నొక్కివక్కాణించాడు.—మత్తయి 7:24-27; లూకా 12:16-21; మత్తయి 25:1-13.
“ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే” గనుక, ఓ వ్యక్తి నిజంగా వివేకి కావడానికి లోకం దృష్టిలో అవివేకి కావాలి. లోకం దృష్టిలో వివేకులను యెహోవా ఎన్నుకోలేదు గానీ, జ్ఞానములేనివారని, బుద్ధిహీనులనీ చిన్నచూపు చూడబడేవారిని ఆయన తనకు ప్రతినిధులుగా ఎన్నుకున్నాడు. ఇది లోకం బుద్ధిహీనతను మరింత స్పష్టంచేస్తోంది. అంతేగాక, అనుగ్రహం పొందిన వ్యక్తి ప్రగల్భాలు పలికే కారణాలన్నింటిని అది తొలగిస్తుంది. బదులుగా, వివేకానికి మూలమైన యెహోవాకే ఘనత అంతాకూడా సముచితంగా చెందుతుంది.—1 కొరింథీయులు 3:18:19; 1:18-31.
ఓ బుద్ధిహీనుని దిగజారిన తర్క పద్ధతులను అవలంభించే దృష్టితో “వాని మూఢతచొప్పున” లేక దానికి అనుగుణంగా ప్రత్యుత్తరమివ్వడం ఆ బుద్ధిహీనుని నిర్హేతుకమైన తర్కనలతో లేక మార్గాలతో ఏకీభవించునట్లు చేస్తుంది. ఈ విషయంలో బుద్ధిహీనునిలా కాకుండ ఉండడానికి సామెతలు మనకిలాంటి సలహాను అందిస్తోంది: “వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్యకుము.” అయితే, అతని వాదనను విశ్లేషించడం, అవి అపహాసకరమైనవని వాటిని బహిర్గతం చేయడం, అతని స్వంత తర్కాలవల్లే అతను తలంచినదానికి పూర్తిగా విరుద్ధమైన నిర్థారణకు వచ్చాడని చూపించడంలో “వాని మూఢతచొప్పున” వానికి ప్రత్యుత్తరమివ్వడం ఉపయుక్తంగా ఉంటుందని సామెతలు 26:4, 5 చెబుతోంది.