మీకు జ్ఞాపకమున్నవా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి వాటిని గుణగ్రహించారా అయితే, క్రింది ప్రశ్నలకు మీరు సమాధానములు చెప్పగలరేమో చూడండి:
▫ నేడు సంఘంలోని రోగులకు మరియు పెద్దవారికి ఏ ఆచరణాత్మక సహాయం అందించవచ్చు?
తొలి క్రైస్తవ సంఘమందు వస్తుదాయక మద్దతు నివ్వవలసిన విధవరాండ్ర పట్టిక ఉంచబడేది. (1 తిమోతి 5:9, 10) అదే విధంగా నేడు, కొన్ని సందర్భాల్లో పెద్దలు ప్రత్యేక శ్రద్ధనివ్వాల్సిన రోగుల, వృద్ధుల పట్టికను తయారు చేయవచ్చు. అయితే, ఈ విషయంలో చొరవ తీసుకోవడం కేవలం పెద్దలకు మాత్రమే పరిమితం చేయబడకూడదు. ఆ అవసరతల విషయమై సంఘంలోని వారంతా కూడా శ్రద్ధ వహించాలి. (1 తిమోతి 5:4-8)—8/15, 28-9 పేజీలు.
▫ యోనా ఒక సముద్ర జీవిచేత మ్రింగబడ్డాడనే బైబిలు కథ నమ్మశక్యం కానిదా?
కాదు, ఒక స్పెర్మ్ తిమింగిలం, ఒక గొప్ప తెల్ల సొరచేప, లేదా ఒక వేల్‌షార్క్ ఒక మనిషిని మ్రింగగలదు. అంతే కాకుండా, యోనా వృత్తాంతము సత్యమని యేసే తానుగా ధృవపర్చాడు. (మత్తయి 12:39, 40)—8/15, 32వ పేజీ.
▫ తాయెత్తులు మరియు మంత్రించబడిన అదృష్ట వస్తువులను మూఢ నమ్మకంతో ఉపయోగించడం వలన ఏమి హాని సంభవిస్తుంది?
వాటిని ఉపయోగించడం ప్రజలు సమస్యలను జ్ఞానయుక్తంగా ఎదుర్కోవడాన్ని నిరుత్సాహపరుస్తూ, సమస్తాన్ని బాగుచేసుకొనేందుకు అదృష్టంపైనే ఆధారపడటాన్ని ప్రోత్సహిస్తుంది. అది దాన్ని ఉపయోగించే వ్యక్తికి బూటకపు భద్రతా భావాన్నిస్తుంది. ఇంకా ప్రాముఖ్యంగా, మంత్రించిన అదృష్ట వస్తువులు మరియు అదృష్ట తాయెత్తుల్లో విశ్వాసాన్ని ఉంచే వ్యక్తి తన జీవితంపైని అదుపును అదృశ్య పిశాచ శక్తులకు ఇవ్వగలడు.—9/1, 4వ పేజీ.
▫ వివాహము దీర్ఘకాలం నిలిచేదిగా చేయడానికి సహాయపడే నాలుగు అంశాలు ఏమిటి?
అవేవంటే వినుటకు ఇష్టపడుట, క్షమాపణ చెప్పుకోగల్గుట, భావోద్రేకపరంగా స్థిరమైన ఎడతెగని మద్దతును ఇవ్వగల సామర్థ్యమును కలిగివుండుట, ఆప్యాయతతో స్పర్శించు కోరికతో నుండుట. (1 కొరింథీయులు 13:4-8; ఎఫెసీయులు 5:33; యాకోబు 1:19)—9/1, 20వ పేజీ.
▫ శ్రమలను ఎదుర్కొను వారికి యెహోవా సహనాన్ని అందించే ఒక మార్గం ఏమిటి?
తన వాక్యమగు బైబిలునందు వ్రాయబడినట్లు సహనం చూపిన వారి మాదిరుల ద్వారా యెహోవా అలా చేస్తాడు. (రోమీయులు 15:4) వీటిని మనం తలపోస్తుండగా, సహించుటకు మనం ప్రోత్సహింపబడుతున్నాము, మరియు ఎలా సహించాలో కూడ మనం ఎక్కువగా నేర్చుకుంటాము.—9/15, 11-12 పేజీలు.
▫ దైవభక్తి అంటే ఏమిటి?
దైవభక్తి మనం హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తాము గనుక కష్టభరితమైన శ్రమలున్నను, యెహోవాకు ప్రీతికరమైనది చేయుటకు మనల్ని పురికొల్పునట్లు ఆయన యెడల చూపే భక్తిని సూచిస్తుంది.—9/15, 15వ పేజీ.
▫ మనము దేవుని కనికరాన్ని ఎలా దృష్టించాలి?
దేవుని అపార కనికరాన్ని మనం ఎన్నడూ తేలికగా చూడకూడదు. మనము పౌలువలె ఉండి మన అసంపూర్ణతలకు విరుద్ధంగా పోరాడటం ద్వారా మన మెప్పును చూపాలి. (1 కొరింథీయులు 9:27) ఆ విధంగా మనము చాలా కష్టతర సమయాల్లో కూడా, మనకు సరైనది చేయాలన్న స్వచ్ఛమైన కోరిక ఉందని ప్రదర్శించగలము.—10/1, 23వ పేజీ.
▫ పౌలు దీర్ఘశాంతాన్ని ప్రేమ యొక్క మొదటి అంశంగా చెప్పడం సమంజసంగా ఎందుకు ఉంది?
దీర్ఘశాంతంతో లేక సహనంతో ఒకరిని ఒకరు సరిపెట్టుకుంటూ ఉండడం లేకుంటే క్రైస్తవ సహవాసం అనేదే లేదని చెప్పబడింది. అలా ఎందుకంటే మనందరము అసంపూర్ణులం, మన అసంపూర్ణతలు, తప్పిదాలు ఇతరులను ఇబ్బంది పెడతాయి. కావున, సహోదరుల మధ్య ప్రేమ ఉండాలంటే దీర్ఘశాంతం అతి ప్రాముఖ్యం.—10/15, 21వ పేజీ.
▫ తొలి క్రైస్తవులు దేవుని నామాన్ని ఉపయోగించారా?
అవును అని సాక్ష్యాధారాలు చెబుతున్నాయి. “నీ నామము పరిశుద్ధ పరచబడు గాక” అని దేవునికి ప్రార్థన చేయమని యేసు తన అనుచరులకు నేర్పాడు. (మత్తయి 6:9) తన పరిచర్య ముగింపులో, ఆయన యిలా ప్రార్థించాడు: “లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని.” (యోహాను 17:6) అంతే కాకుండా, సెప్టాజింట్ తొలి ప్రతులు దేవుని నామాన్ని హెబ్రీ చతురక్షర పదం రూపంలో కలిగి ఉండెను.—11/1, 30వ పేజీ.
▫ మనము మన తప్పులతో వ్యవహరించే పద్ధతి మన జీవితాలను ప్రభావితం చేయగలదని ఏ బైబిలు ఉదాహరణలు చూపుతున్నాయి?
రాజైన సౌలు మొండిగా ఉపదేశాన్ని తిరస్కరించాడు, అలా అతని తప్పిదాలు పెరిగి పోయి, చివరకు దేవుని అనంగీకారంతో అతడు చనిపోడానికి దారితీసాయి. (1 సమూయేలు 15:17-29) ఇంకో వైపు రాజైన దావీదు, తన తప్పిదాలు, పాపాలు ఉన్ననూ, పశ్చాత్తాపంతో గద్దింపును అంగీకరించి యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. మన తప్పిదాలను ఒప్పుకొనడం దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి సహాయం చేస్తాయని తద్వారా నిత్యజీవ ఉత్తరాపేక్షను కలిగి ఉండవచ్చని ఈ బైబిలు ఉదాహరణలు చూపిస్తున్నాయి. (కీర్తన 32:1-5)—11/15, 29-30 పేజీలు.
▫ ప్రకృతి వైపరీత్యాలు లేక మరితర కారణాలవల్ల తన ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు యెహోవా వారికి ఎలా సహాయపడతాడు?
యెహోవా ఏవో అద్భుతాల చేత ప్రకృతి శక్తులను మరల్చడంవల్లనో లేక ఏదో మానవాతీత కార్యం వల్లనో కాదుగానీ, అనేకులు నిజంగా అర్థం చేసుకోలేని మరో శక్తి వల్ల దాన్ని చేస్తాడు—అదే ప్రేమ. అవును, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు, అంతేకాకుండా, దాదాపు పూర్తి అద్భుతంగా కనిపించే దానిని ఆయన వారియెడల నెరవేర్చడానికి, ఒకరి యెడల ఒకరు బలమైన ప్రేమను కలిగి ఉండేలా ఆయన చేసియున్నాడు. (1 యోహాను 4:10-12, 21)—12/1, 10వ పేజీ.