కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 11/1 పేజీ 6
  • జీవము యొక్క పవిత్రత పట్ల గౌరవము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జీవము యొక్క పవిత్రత పట్ల గౌరవము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాసాక్షులు మరియు వైద్య సిబ్బంది సహకరిస్తున్నారు
    తేజరిల్లు!—1994
  • రక్త పవిత్రతను కాపాడుకోవడానికి సహాయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • విశ్వాసమును—సవాలుచేయు వైద్యపరిస్థితిని ఎదుర్కొనుటకు నీవు సిద్ధముగా యున్నావా?
    మన రాజ్య పరిచర్య—1990
  • యెహోవాసాక్షులకు రక్తమెక్కించకుండానే శస్త్రచికిత్స చేయుటలో ముందంజ
    తేజరిల్లు!—1992
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 11/1 పేజీ 6

రాజ్య ప్రచారకుల నివేదిక

జీవము యొక్క పవిత్రత పట్ల గౌరవము

రక్తము దేవుని దృష్టిలో అమూల్యమైనదని మరి దాని దుర్వినియోగాన్ని ఆయన ఖండిస్తున్నాడని బైబిలు చూపుతోంది. (లేవీయకాండము 17:14; అపొస్తలుల కార్యములు 15:19, 20, 28, 29) ఈ బైబిలు ఆదేశాల కారణంగా, యెహోవా సాక్షులు రక్తమార్పిడిని అంగీకరించరు.

ఈ విషయంపై యెహోవాసాక్షుల మతపర స్థానాన్ని అర్థం చేసుకొని, సాక్షులు ప్రత్యామ్నాయ చికిత్సలను అంగీకరిస్తారనే విషయాన్ని వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది గుణగ్రహించడానికి, వాచ్‌టవర్‌ సొసైటి పలు దేశాల్లో ఆసుపత్రి అనుసంధాన కమిటీలను (HLC) నెలకొల్పింది. ఈ కమిటీ సభ్యులు వైద్య సిబ్బందితో మాట్లాడటానికి ఆసుపత్రులను సందర్శిస్తారు. ఇటీవల, పోలెండులోని 12 పట్టణాల్లో మొత్తం 500కంటే ఎక్కువ మంది వైద్యులను కలుసుకోగలిగేలా 200లకు పైగా సందర్శనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సందర్శనాల్లో ప్రముఖంగా క్లినిక్‌లు లేదా ఆసుపత్రి వార్డుల్లోని అధికారులను కలుసుకోవడం జరిగింది. అలాంటి ఒక సందర్శనంలో యిలా జరిగింది:

“జెబ్రిజ్‌లోని కార్డియోసర్జికల్‌ క్లినిక్‌ని అలా సందర్శించడం చాలా ఫలవంతమైంది. ఈ క్లినిక్‌లోని వైద్య బృందం 1986 నుండి మన సహోదరులకు రక్తం లేకుండా శస్త్రచికిత్సలను జరుపుతోంది. ఇప్పటివరకు అటువంటి 40 శస్త్రచికిత్సలు అక్కడ జరిగాయి. పోలెండు నలుమూలలనుండి, దాని వెలుపలనుండి కూడా రోగులను చేర్చుకోడానికి ఈ క్లీనిక్‌ సిద్ధంగా వుంది. యాభై నిమిషాల చర్చ తర్వాత ఒక వార్డు అసిస్టెంటు మేనేజరు కొంతమంది రోగులకు HLC సభ్యులను పరిచయం చేస్తూ యిలా అన్నాడు: ‘ఈ ప్రజలు యెహోవాసాక్షులు. వీరు మా క్లినిక్‌తో సహకరిస్తారు, మాకు సహాయం చేస్తారు. వారి తోటి విశ్వాసులే కాకుండా యితర రోగులు సహితం వీరి సహాయం నుండి ప్రయోజనం పొందుతున్నారు. క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స కూడ రక్తం లేకుండా చేయడం సాధ్యమౌతుందని మేము గ్రహించగలిగాము, అందుకు యెహోవాసాక్షులకు మా కృతజ్ఞతలు.

“‘ఉదాహరణకు, [తన రోగులలో ఒకరి వైపు చూపుతూ] మేము యీ స్త్రీకి రక్తం ఎక్కించకుండా ఆపరేషన్‌ చేశాము, సోమవారం ఈవిడ యింటికి వెళ్తుంది. రక్త మార్పిడి హానికరం కనుక, మునుపు కంటే యిప్పుడు మేము రక్తాన్ని చాలా అరుదుగా ఉపయోగిస్తున్నామని నేను పేర్కొనాలను కొంటున్నాను. దానివలన HIV, హెపిటైటిస్‌ రావడం, అలాగే స్వస్థతకు ఎక్కువ కాలం పట్టడం జరుగుతుంది.

“‘నేనొక కాథోలిక్కును, కానీ మా యింట్లో యితరుల ఆలోచనలను మేమెల్లప్పుడూ గౌరవిస్తుంటాము. ఒకనాడు నేను నా పిల్లలతో స్లోన్స్‌స్కీ స్టేడియం వైపుకు వెళ్లాను. అంతకు ముందు, ఈ స్టేడియమును ఎవ్వరూ పట్టించుకునేవారు కారు, అయితే యిప్పుడది గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని మేము గమనించాము. ఈ మార్పు ఎలా వచ్చిందని అక్కడి పనివారిని నేనడిగాను. స్టేడియమును పునర్నిర్మించే ఆశను నిర్వాహకులు వదులుకున్నారని, అయితే దానిని యెహోవాసాక్షులకు అద్దెకు యిచ్చారని, వారు దాన్ని బాగుచేశారని అతడు చెప్పాడు.

“‘కాబట్టి ఈ ప్రజలనుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ వార్డులో యితరుల ఆలోచనలను సహితం మనం గౌరవించాలని నేను భావిస్తున్నాను.’ తర్వాత, కొద్ది రోజుల్లో ఆపరేషన్‌ చేయించుకోబోతున్న మరో సాక్షిని చూపిస్తూ అతనిలా అన్నాడు: ‘ఈ స్త్రీ యెహోవాసాక్షులలో ఒకరు, ఈవిడకు రక్తం లేకుండా ఆపరేషన్‌ జరుగబోతోంది.’”

యెహోవాసాక్షులు తమ నమ్మకాలను యితరులపై రుద్దడానికి ప్రయత్నించరు, కానీ వారు తామే స్వయంగా అపొస్తలుల మాదిరిని అనుకరిస్తూ “మనుష్యులకు కాదు దేవునికే . . . లోబడ”తారు. (అపొస్తలుల కార్యములు 5:29) రక్తంపట్ల గౌరవం కలిగి ఉండడం కూడా దీనిలో యిమిడి ఉంది. ఈ విషయంపై తమ మత విశ్వాసాన్ని యితరులు గౌరవించడాన్ని వారు ప్రశంసిస్తారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి