లాటిన్ అమెరికా చర్చి సంకటంలో ఉంది—లక్షల ప్రజలెందుకు విడిచి వెళ్తున్నారు?
మెక్సికో ఉత్తర సరిహద్దు నుండి చిలీ దక్షిణ కొనవరకు తమ ముఖ్య వీధిలో రోమన్ కాథోలిక్ చర్చి లేని లాటిన్ అమెరికా గ్రామాలు, పట్టణాలు చాలా అరుదు. అయితే “లాటిన్ అమెరికాలో ఒక గొప్ప మార్పు సంభవిస్తోంది,” అని కాథోలిక్ కార్యక్రమాలు అభివృద్ధిచేసే సంస్థకు అధ్యక్షుడైన జోసెఫ్ ఇ. డేవిస్ ఒప్పుకున్నాడు. మూడు శతాబ్దాలకంటే ఎక్కువకాలం కాథోలిక్ చర్చి ప్రభావం క్రిందనున్న లాటిన్ అమెరికా ప్రాంతం, ఇప్పుడు ఎంతో మార్పుచెందే తుది ఘట్టమున ఉన్నదని కూడా ఆయన ఒప్పుకున్నాడు.
రోమన్ కాథోలిక్ చర్చి అధికారం వేగంగా క్షీణించిపోతున్నదనుట తేటతెల్లమగుచున్నది. ఇటీవల లాటిన్ అమెరికా జనాబాలో కేవలం 15 శాతం మంది ప్రజలే అసలైన కాథోలిక్లుగా ఉన్నారని అంచనావేయబడింది. మరి 1991 బ్రిటానికా బుక్ ఆఫ్ ది ఇయర్ యిలా నివేదించింది: “చారిత్రాత్మకంగా కాథోలిక్ దేశమైన లాటిన్ అమెరికా దాని మొదటి విశ్వాసము నుండి తొలగిపోవడం తీవ్రంగా పరిణమించిందని రోమన్ కాథోలిక్ బిషప్పులు, పోప్కూడా ఆందోళన వ్యక్తపరిచారు.” ఎందుకలా జరుగుతుంది? అనేకులు కాథోలిక్ సంఘమును ఎందుకు విడిచి వెళ్తున్నారు? వారేమౌతున్నారు?
వివరాలకై అన్వేషణ
తమ సమస్యలకు కారణం “మతశాఖలు” విస్తరించుటని కాథోలిక్ నాయకులు ఆరోపిస్తున్నారు. బొలీవియాలో పనిచేస్తున్న ఐరోపా మతాధికారి ఇలా ఫిర్యాదు చేశాడు: “చర్చి, కలుపు మొక్కల మూలంగా శక్తిని కోల్పోతున్న చెట్టును పోలియుంది.”
అర్జెంటీనాలో, ప్రతి సంవత్సరం 140 క్రొత్త మతములు వెలుస్తున్నవి. కాథోలిక్ చర్చి సభ్యత్వం 1970వ దశాబ్ద మధ్య భాగము మొదలుకొని 90 శాతం నుండి 60 లేక 70 శాతంవరకు ఎందుకు పడిపోయిందో లెక్కించుటకు యిది సహాయపడుతుంది. తిజువానా, మెక్సికోలోని 20 లక్షల నివాసులలోనుండి 10 శాతం మంది 327 కాథోలిక్కాని మతాలకు మారారు. టైమ్ పత్రిక ఇలా నివేదించింది: “ఆశ్చర్యకరంగా, బ్రెజిల్లో ఆదివారంనాడు కాథోలిక్లకంటే ప్రొటస్టెంట్లే ఎక్కువమంది చర్చిలలో ఉంటారనేది నిజం.” ఒక వార్తాపత్రిక ఇలా చెప్పిందంటే ఆశ్చర్యమేమిలేదు, “లాటిన్ అమెరికా కార్డినల్లు పోప్‌తో వాటికన్ పట్టణములో కలుసుకొని చర్చికి సంబంధించిన రెండు అతి ప్రాముఖ్యమైన విషయాలను చర్చించారు” అందులో ఒకటి “మతశాఖల వలన కలిగే సమస్య.”
“తమ చర్చి సిబ్బంది ప్రచారకులుగా తమ బాధ్యత యెడల ఆసక్తిచూపకుండా నులివెచ్చగా ఉండడమే” ఇతర మతాల విజయానికి కారణమని, మెక్సికో బిషప్పులతో జరిపిన కూటములో పోప్ పేర్కొన్నాడు. లాటిన్ అమెరికాలో అనేకులు బైబిలును గౌరవిస్తుండగా వారి ఆత్మీయావసరతలను తీర్చడంలో “చర్చి సిబ్బంది” ఎందుకు భిన్నంగా ఉన్నారు? లా పాజ్, బొలీవియాలోని అల్టిమ ఓరాలోని సంపాదకీయం దీనినిలా వివరించింది: “చర్చి లోక విషయాలలో ఎంతగా ప్రవేశించిందంటే, ప్రతి దినం అది తన స్వంత బాధ్యతలను విస్మరిస్తున్నట్లు కనబడుతున్నది. నిజానికి మతాధికారులు పాదిరులుగా ఉండకుండా, సమాజవాదులు, ఆర్థిక నిపుణులు, పాత్రికేయులు లేక రాజకీయ నాయకులుగా పనిచేయుట మనలను ఆశ్చర్యపరచనక్కర్లేదు, అది జరుగుతున్నదే.”
ప్రచారకుల కంటే రాజకీయనాయకులే ఎక్కువా?
చర్చి 70 మరియు 80వ దశాబ్దములలో రాజకీయములందు తలదూర్చడమే నిశ్చయంగా లాటిన్ అమెరికాలోని అనేకులకు కాథోలిక్ మతముపై విరక్తి పుట్టడానికి కారణమైంది. లాటిన్ అమెరికాలో అనేక మిషన్లుగల మేరీనోల్ అనే అమెరికా కాథోలిక్ మిషన్ సొసైటీని గూర్చి 1985లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ఇలా పేర్కొంది: “మేరీనోల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ హింసాత్మక విప్లవాన్ని గూర్చిన సందేశాన్ని విజయవంతంగా ప్రజాదరణలోనికి తెచ్చింది ఎందుకనగా అది కాథోలిక్ చర్చిలో ఒక భాగంగా పనిచేయుటకు అనుమతించబడింది. దాని సందేశము చర్చికి వెళ్లే సగటు వ్యక్తికే గాక, ప్రముఖ అమెరికా రాజ్యాంగ నిర్ణేతలవరకు చేరుకుంది.”
అసహ్యకరమైన యుద్ధం అని పిలువబడిన దానిని గూర్చి కూడా ఆలోచించండి, 70వ దశాబ్ద మధ్యకాలంలో 10,000 నుండి 30,000 మంది అర్జెంటీనా వాసులు బలత్కారముగా చెరపట్టబడి, విచారణ చేయబడకుండా చంపబడ్డారు. నేషనల్ కాథోలిక్ రిపోర్టర్, “అర్జెంటీనా చర్చికి రక్తపుమచ్చ” అనే శీర్షికనామం క్రింద ఇలా చెప్పింది: “అర్జెంటీనాలో జరిగిన దానికి నాజీ జర్మనీలో జరిగినదానికి దగ్గరపోలికలున్నవి, సువార్తను ప్రకటించి సత్యమునకు సాక్ష్యమిచ్చుటకంటె చర్చికి అధికారమే అతి ప్రాముఖ్యమా అనే ప్రశ్నను అది మరియొకసారి లేవదీస్తుంది.”
లోక ప్రభుత్వములలో అధికారము కావాలని చర్చి ఆశించుట దానికి దేవునితో స్నేహబంధము లేదని చూపుతున్నది. బైబిలు ఇట్లంటున్నది: “ఈ లోకముతో స్నేహముచేస్తే దేవునికి శత్రువులవుతారని మీకు తెలియదా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేస్తాడో వాడు దేవునికి శత్రువుగా తయారవుతాడు.” (యాకోబు 4:4, కాథోలిక్ జెరూషలేమ్ బైబిల్) కావున అనేకులు ఆత్మీయ నడిపింపు కొరకు కాథోలిక్ చర్చి వైపు చూడడంలేదంటే అది ఆశ్చర్యమేమి కాదు. అయితే కాథోలిక్ సంఘమును విడిచి వెళ్లిన వారికి ఏమి సంభవించింది?
కాపరి లేని గొర్రెలు
మొదటి శతాబ్దములో యూదా మతనాయకులు శ్రద్ధ తీసుకొనకుండా విడువబడిన ప్రజలవలె వారు ఉన్నారు. యేసు “వారు కాపరి లేని గొర్రెలవలె విసికి బాధపడుతున్నారని చూచి వారిమీద కనికరపడ్డాడు,” అని బైబిలు చెప్పుచున్నది. (మత్తయి 9:36, JB) అనేకులు కాథోలిక్ చర్చిని విడిచి సువార్త సంఘములు అని పిలుబడే వాటిలో చేరారు. తప్పిపోయి వచ్చిన ఈ గొర్రెలను వీరు శ్రద్ధతో చూశారా? యేసు తన నిజమైన శిష్యులను గూర్చి చెప్పిన దానిని ప్రొటస్టెంటులు చేస్తున్నారా? ఆయన తన నిజ అనుచరులను గూర్చి ఇలా అన్నాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.”—యోహాను 17:14.
కాథోలిక్కులు కాని అనేక మతాలు మత పారంపర్యాచారాలను అనుసరించేవారిగా కాక బైబిలును అనుసరించే వారిగా కనపడాలని ప్రయత్నిస్తారు. కాని ఇది కేవలం పైపైన కనిపించేదే. ప్రొటస్టెంట్ సంస్థల మూల సిద్ధాంతాలకు కాథోలిక్ చర్చి నమ్మే వాటికి ఎంతదగ్గర పోలిక ఉందంటే, చూచే వారనేకులు ఇండియా ప్రాంతము వారి సామెతను సులభంగా అన్వయిస్తారు: “ఎస్ లా మిస్మా చొలిటా కాన్ ఓట్రా పొల్యారా” (ఒక ఇండియన్ స్త్రీ వేరే దుస్తులు ధరించి వచ్చినట్లున్నది).
ఉదాహరణకు, దాదాపు అన్ని ప్రొటస్టెంట్ గుంపులు త్రిత్వమును బోధిస్తాయి, అయినా అది మాత్రం బైబిలు బోధ కాదు. ఎన్సైక్లోపిడియా ఆఫ్ రిలిజియన్ ఇలా ఒప్పుకొంటున్నది: “హెబ్రీ బైబిళ్లలో త్రిత్వమనే సిద్ధాంతము లేదని వ్యాఖ్యాతలు మరియు బైబిలు వేదాంతులు అంగీకరిస్తున్నారు . . . క్రొత్త నిబంధనలోకూడా త్రిత్వమనే స్పష్టమైన సిద్ధాంతము లేదు.”a
కాథోలిక్లవలె ప్రొటస్టెంట్లు కూడా ఈ లోకంతో స్పష్టముగా సంబంధము కలిగియున్నారు. ఎన్సైక్లోపిడియా ఆఫ్ లాటిన్ అమెరికా ఇట్లంటున్నది: “లాటిన్ అమెరికాలోని ప్రొటస్టెంట్లు కూడా ప్రజాదరణగల ఎన్నికల రాజకీయాలకు . . . అంకితమయ్యారు. స్థానిక పాదిర్లు రాజకీయ అధికారులతో సంబంధమేర్పరచుకొని, తమ చర్చికి మద్దతునిచ్చే ప్రభుత్వానికి వోట్లను బదులు చెల్లిస్తారు.” లాటిన్ అమెరికన్ రిసర్చ్ రివ్యూ ఇట్లంటున్నది: “గ్వాటిమాలలో మొదటగా ప్రవేశించిననాటినుండి ప్రొటస్టెంట్లు రాజకీయాలతో దగ్గర సంబంధము కలిగి ఉన్నారు,” అదింకా యిలా వ్యాఖ్యానించింది “రాజకీయ మరియు సామాజిక వ్యవహారములను ఒక మతరూపములో అందించుటకు అది వాహనమువలె పనిచేసింది.”
ప్రొటస్టెంటులు రాజకీయాలలో పాల్గొనుట ప్రొటస్టెంట్లు తరుచు యుద్ధాలలో పాల్గొనడానికి నడిపింది. అమెరికా చరిత్రలో చాలా పలుకుబడిగల ప్రొటస్టెంట్ మతనాయకుడిగా ఎంచబడిన దివంగత హేరీ ఎమర్సన్ ఫాస్డిక్, ఇలా ఒప్పుకొన్నాడు: “ఒక యుద్ధము తరువాత మరొక యుద్ధముచేయుటే మా పాశ్చాత్య చరిత్ర. యుద్ధం కొరకే ప్రజల్ని పెంచాము, యుద్ధం కొరకే తర్ఫీదు నిచ్చాము; యుద్ధాన్ని ఘనపర్చాము; యుద్ధశూరులను మా వీరులుగా చేసుకొన్నాము, మా చర్చీలలో యుద్ధ పతాకాల నెగురవేసాము . . . మా నోటితో ఒకప్రక్క సమాధానకర్తయగు అధిపతిని ఘనపరిచాము, మరోప్రక్క యుద్ధాన్ని ఘనపరిచాము.”
మీరేం చేయాలి?
అబద్ధమతమును లోక ప్రభుత్వములతో వ్యభిచారం చేస్తున్న సూచనార్థక వేశ్యగా వర్ణించిన తరువాత, బైబిలు పుస్తకమైన ప్రకటన గ్రంథము ఇట్లంటున్నది: “నా ప్రజలారా, బయటికి రండి, దాని పాపములలో పాలివారు కాకుండునట్లు దాని తెగుళ్లు మీపైకి రాకుండునట్లు దానిని విడిచి రండి.”—ప్రకటన 18:4, JB.
చర్చిలో చాలా అవినీతి ఉందని అనేకులు గుర్తిస్తారు, కాని విడిచి రావడానికి అనేకులు వెనుకంజవేస్తారు, ఎందుకంటే రోమా చర్చికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. అయితే గుర్తుంచుకోండి, యూదా వారి ఆరాధనా విధానం ఎంతో పురాతనమైనది, అయిననూ వారు తన నిజమైన బోధనలను విడిచి మతభ్రష్టులైనప్పుడు దేవుడు యూదులను తాను ఎన్నుకొన్న ప్రజలుగా ఉండకుండా తిరస్కరించాడు. బదులుగా దేవుడిప్పుడు క్రైస్తవ సంఘమును వాడుకుంటున్నాడని గ్రహించిన నమ్మకమైన దేవుని సేవకులు ఆ యూదా మతాన్ని విడిచిపెట్టారు. ఈనాడు నిజమైన క్రైస్తవసంఘమును నీవెలా గుర్తించగలవు?
గడచిన రెండు దశాబ్దములలో దాదాపు పదిలక్షల మంది లాటిన్ అమెరికా వాసులు యెహోవాసాక్షులయ్యారు. వారెందుకిలా మారారు? మర్టినేజ్ డి లా టోర్రే, వేరాక్రూజ్, మెక్సికోలోని ఒక వార్తా పత్రిక ఈ ప్రశ్నను పరిశీలించింది. అది ఇలా అన్నది: “ఈ బైబిలు విద్యార్థులు 100 శాతం వరకు గతంలో ఇతర మతాలలో ఉన్నవారే, ఎక్కువగా కాథోలిక్కులే. ఆ మతాలు రాజకీయాలవైపు మొగ్గుచూపడం, సర్వమత సమ్మేళనం, అనైతికత, మరియు హింస వంటి బైబిలు విరుద్ధమైన విషయాలను ఆమోదించడం మరియు అంగీకరించడం వారు గుర్తించారు. విగ్రహారాధన, మూలము తెలియని ఆచారాలవైపు తిరుగక లేఖనానుసారమైన సూత్రాలను అనుసరించుట వారికి సంతృప్తినిచ్చింది. ఇది విశ్వాసమందు శ్లాఘనీయమైన ఐక్యతను వారికిచ్చి తద్వారా వారెక్కడున్నప్పటికీ ప్రత్యేకమైన వారిగా గుర్తించుటకు సహాయపడుతుంది.”
మరియొక లాటిన్ అమెరికన్ వార్తాపత్రిక ఇలా చెప్పింది: “యెహోవాసాక్షులు కష్టపడి పనిచేసి, దేవునికి భయపడే, నిజాయితీగల ప్రజలు. వారు స్థిరచిత్తులును, సాంప్రదాయమును ప్రేమించువారునై యున్నారు మరియు వారి మతము బైబిలు బోధలపై ఆధారపడి ఉంది.” మీరు ఎక్కడ జీవిస్తున్నప్పటికీ యెహోవాసాక్షులతో బైబిలు పఠించుమని మిమ్ములను ఆహ్వానిస్తున్నాము. వారి నిరీక్షణ, వారి యావత్ జీవన విధానం బైబిలుపై ఆధారపడియున్నదని మీరు కనుగొంటారు. అవును, దేవుని “ఆత్మతోను సత్యముతోను” ఎట్లు ఆరాధించవలెనో మీరు నేర్చుకొనగలరు.—యోహాను 4:23, 24.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ వారు ప్రచురించిన త్రిత్వమును మీరు నమ్మవలయునా? అనే చిన్న పుస్తకమును చూడండి.
[21వ పేజీలోని చిత్రం]
కొన్ని లాటిన్ అమెరికా దేశాలలో యెహోవాసాక్షులు
— 1971 — 1992
దేశము — ప్రచారకులు — ప్రచారకులు
అర్జెంటీనా — 20,750 — 96,780
బొలీవియా — 1,276 — 8,868
బ్రెజిల్ — 72,269 — 3,35,039
చిలీ — 8,231 — 44,067
కొలంబియా — 8,275 — 55,215
కోస్టారికా — 3,271 — 14,018
డోమినికన్ రిపబ్లిక్ — 4,106 — 15,418
ఈక్వెడార్ — 3,323 — 22,763
ఎల్‌సాల్వడార్ — 2,181 — 20,374
గ్వాడెలోప్ — 1,705 — 6,830
గ్వాటిమాల — 2,604 — 13,479
హూండూరాస్ — 1,432 — 6,583
మెక్సికో — 54,384 — 3,54,023
పనామా — 2,013 — 7,732
పరాగ్వే — 901 — 4,115
పెరూ — 5,384 — 43,429
ప్యూర్టోరికో — 8,511 — 25,315
ఉరుగ్వే — 3,370 — 8,683
వెనిజ్యువాలా — 8,170 — 60,444
మొత్తము — 2,12,156 — 11,43,175