కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 6/15 పేజీ 19
  • ఆమె తన విశ్వాసము కొరకు పోరాడింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆమె తన విశ్వాసము కొరకు పోరాడింది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • “నేను విశ్వాసాన్ని కాపాడుకొంటిని”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మాంత్రికులు కాదు, దేవుళ్లూ కాదు
    తేజరిల్లు!—1994
  • రక్త దుర్వినియోగమునుండి మీపిల్లలను సంరక్షించండి
    మన రాజ్య పరిచర్య—1992
  • యెహోవాచే ఉపదేశించబడినట్లు నడువుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 6/15 పేజీ 19

ఆమె తన విశ్వాసము కొరకు పోరాడింది

మూడు సంవత్సరముల క్రితం, స్పెయిన్‌లో కాదిజ్‌నందు నివసిస్తున్న యెహోవాసాక్షియైన కారిడాడ్‌ బాసాన్‌ లిస్తాన్‌కు అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరమైంది. పిత్తాశయంలోని రాళ్లు ఆమెకు జ్వరమును కలుగజేసి రక్తాన్ని విషమయం చేయనారంభించాయి. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చినపుడు, రక్తమార్పిడిని నిరాకరించుటకు బైబిలుపై ఆధారపడిన తన నమ్మకాన్ని గూర్చి ఆమె వివరించింది. రక్తం ఎక్కించకుండా శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు అంగీకరించారు. అయితే, ఆమెను ఆపరేషన్‌ గదికి తీసుకెళ్లక ముందు, వైద్యులు ఆమెను ఒక పత్రంపై సంతకము చేయుమని కోరారు. రక్తమును గూర్చిన ఆమె నిర్ణయాన్ని గౌరవించుటకు వారు అంగీకరిస్తున్నారని, కాని ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ఎటువంటి చికిత్స అవసరమైనా దానిని అందించుటకు ఆమె అనుమతిని వారు కోరుతున్నారని దానిలో ఉంది.

ఆసుపత్రివద్ద అందుబాటులో ఉన్న ఒక సంఘ పెద్ద మరియు సాక్షియైన ఆమె కుమారుడు, ఆ పత్రంపై సంతకము చేస్తే వచ్చే పరిస్థితిని గూర్చి ఆమెకు వివరించారు. ఆమె సంతకము చేసినట్లయితే, అత్యవసర పరిస్థితిలో రక్తమును ఎక్కించుటకది వైద్యులకు అధికారమును ఇచ్చియుండేది. ఆసుపత్రి సిబ్బంది ఆమెను ఆపరేషన్‌ గదికి తీసుకెళ్లడానికి వచ్చినపుడు, తాను ఆ పత్రముపై సంతకం చేయదలచుకోలేదని ఆమె వివరించింది. ఆమెను వెంటనే తన గదికి మార్చి ఆమె మనస్సు మార్చడానికి ఆమెపై తీవ్ర వత్తిడిని తెచ్చారు.

ఆమెతో అనేకమారులు చర్చించిన తరువాత ఆమెను ఒప్పించడానికి వైద్య న్యాయవాదిని పిలిపించాలని వారు తీర్మానించుకున్నారు, కాని దానివలన ఫలితం దక్కలేదు. రక్తమునెక్కించుటకు ఆమె అనుమతించినట్లయితే దేవుని దృష్టిలో తాను దోషినవుతానని కారిడాడ్‌ వివరించింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ బలత్కరించబడునప్పుడు సహాయం కొరకు గట్టిగా అరిచి ఎదిరిస్తే ఆమె నిర్దోషిగా తీర్చబడేదని ఆమె తెల్పింది. (ద్వితీయోపదేశకాండము 22:23-27) “వైద్యులు నా ఇష్టాయిష్టాలను లెక్కచేయకుండా నా మనస్సాక్షిని కలుషితం చేయ ప్రయత్నిస్తున్నారు, కావున వారు నాపై అత్యాచారం చేస్తున్నారని భావించి నేను వారిని ఎదిరించాలి” అని ఆమె అన్నది.

అనేక గంటలు గడిచాయి, మరి చివరికి రక్తం లేకుండా ఆమెకు శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు ఒప్పుకున్నారు. ఆపరేషన్‌ గదిలో యెహోవాకు ప్రార్థనచేయడానికి కారిడాడ్‌ అనుమతి కోరింది. ఆమె అలా చేసింది, శస్త్రచికిత్స విజయవంతమయ్యింది.

అయిననూ, అటుతరువాత కారిడాడ్‌ పరిస్థితి విషమించింది, కావున వైద్యులు ఆమె కోరికను త్రోసిపుచ్చి ఆమెకు బలవంతంగా రక్తమార్పిడి చేయాలని నిర్ణయించారు. అందుకు ఒక వైద్యుడు, ఒక నర్సు ఆమెకు రక్తమార్పిడి చేయడానికి తయారయ్యారు. అయితే కారిడాడ్‌ అంత బలహీనంగా ఉన్నను, తన సంపూర్ణ శక్తితో ఎదిరించింది. రక్తం ప్రసరించే ట్యూబును ఆమె కొరకగలిగింది కూడా. చివరికి, ఆ వైద్యుడు తాము చేస్తున్న దానిని గూర్చి ఎంతో సిగ్గుపడి విరమించుకున్నాడు. “నేను దీన్ని చేయలేను. నేను విరమించుకుంటున్నాను” అని ఆయనన్నాడు.

కారిడాడ్‌ మరియే సమస్యలు లేకుండా ఆ సంకటము నుండి కోలుకుంది. వైద్యులు, నర్సులు ఆమె చూపిన విశ్వాసము, ధైర్యము వలన ప్రభావితులు కాకుండా ఉండలేకపోయారు. ఇదంతా కారిడాడ్‌ 94 సంవత్సరముల వయస్సులో ఉన్నపుడు జరిగింది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి