మాంత్రికులు కాదు, దేవుళ్లూ కాదు
నైజీరియాలోని, మెర్సీ ఉవాసి చెప్పింది
మార్చి, 1992 దక్షిణాఫ్రికాలోని మండుతున్న మధ్యాహ్న సమయం. మా కుటుంబంతో కలిసి నేను దుంపలు కోయడానికి పొలానికి వెళ్లాను. అక్కడ ఉండగానే, నా కడుపులో మంట మొదలైనది. మేము ఇంటికి వచ్చేసరికి, ఆ బాధ వేగం అగ్నిలా పెరిగింది. వాంతి చేసుకున్నాను; గాలి పీల్చడం నాకు కష్టమైంది. ఆ నొప్పి ఎక్కువగా ఉండి నిలబడ్డానికే కష్టమైయినప్పటికి, మా అమ్మ నన్ను బలవంతంగా టాక్సీలో కూర్చోబెట్టి, వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకొని వెళ్లింది.
ఆసుపత్రిలో కలిసిన డాక్టరు ఒకసారి నేను బైబిలు నిరీక్షణను గూర్చి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తే కావడం జరిగింది. డాక్టరు నా పొట్టను తాకగా; అది ఉబ్బి యున్నది. అతడు నీకు రక్తస్రావం అవుతుందాయని అడుగగా, మా అమ్మ నాకిప్పుడు ఋతుస్రావపు సమయమని చెప్పింది.
“మీ కుమార్తె ఐదు నెలల గర్భవతి, రక్తస్రావం అవుతుందంటే ఆమె గర్భస్రావంనకు ప్రయత్నించుటయే కారణం.” అని ఆ డాక్టరు అన్నాడు.
అమ్మ ఆక్షేపించింది: “కాదు, డాక్టర్! ఆమె అటువంటి అమ్మాయి కాదు.”
“అలా చెప్పకండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఆమె గర్భవతి.”
నేను కలుగజేసికొని మాట్లాడాను. నేను ఒక యెహోవా సాక్షినని, క్రైస్తవుల కుటుంబంలో పెంచబడిన దానినని, బైబిలు తర్ఫీదు పొందిన నా మనస్సాక్షి ఇటువంటి అనైతిక చర్యను అనుమతించదని చెప్పాను.
దానికి సమాధానంగా ఆ డాక్టరు అమ్మతో: “మేడమ్, మతాన్ని ప్రక్కకు వదలి పెట్టి, వాస్తవికతకు రండి. నేను చెబుతున్నాను ఈ అమ్మాయి ఐదు నెలల గర్భవతి” అని అన్నాడు.
“లేచి రా. మనం మరొక ఆసుపత్రికి వెళ్దాం.” అని అమ్మ చెప్పింది. ఆ భవంతిని వదిలి వస్తూ, నేను అక్కడ పచ్చికపై ఏడుస్తూ కూర్చున్నాను. ఎందుచేతనంటే నొప్పి ఎక్కువగా ఉంది. అమ్మ వేగంగా ఇంటికి వెళ్లి, నా తండ్రితో డాక్టరు ఏమి చెప్పారో అంతా చెప్పింది.
వాళ్లు నన్ను పెద్ద ఆసుపత్రికి అనగా అధునాతనంగా అన్ని వసతులతోపాటు, వైద్య విద్యను బోధించే ఒక వైద్యశాలకు తీసుకు వెళ్లటానికి నిశ్చయించుకొన్నారు. వెళ్లేదారిలోనే, నేను అక్రమ గర్భధారణంతో మరణించానని ప్రజలు చెప్పుకోవడంద్వారా, ఆయన పరిశుద్ధ నామమునకు కళంకాన్ని తీసుకు రాకుండునట్లు, నన్ను బ్రతికించమని యెహోవా దేవునికి నేను ప్రార్థించాను. ఒకవేళ నేను చనిపోతే, ఈసారి యెహోవాసాక్షులు ఆ డాక్టరుకు ప్రకటించడానికి వెళ్లినపుడు: ‘కొంతకాలం క్రితం మీ ప్రజలలో ఒకరు గర్భవతియై వచ్చారు కదా?’ అని అంటారు. నాకు శక్తి ఉంటే మరల వెనుకకు వెళ్లి, ఆ డాక్టరుకు మరొకసారి సాక్ష్యం ఇచ్చుటకు అవకాశాన్ని అనుమతించమని కూడా ప్రార్థించాను.
“ఆమె ఇప్పటికీ కన్యకే!”
పెద్ద ఆసుపత్రిలోకూడా, మొదటి ఆసుపత్రిలో జరిగిన వాదనే తిరిగి చెలరేగింది; డాక్టర్లు నేను గర్భవతిననే తలంచారు. ఆ నొప్పి విపరీతమైంది. నేను ఏడుస్తూ ఉన్నాను. ఒక డాక్టరు కఠినంగా మాట్లాడుతూ: “మీరు ఆడపిల్లలు ఎప్పుడూ ఇలాగే చేస్తారు. గర్భం వస్తుంది, అప్పుడు అరవటం మొదలు పెడ్తారు.”
వాళ్లు కొన్ని పరీక్షలు చేశారు. ఈలోపున వాళ్లు నాకు అసంబంధమైన కొన్ని ప్రశ్నలను వేయడం ప్రారంభించారు. “నీకు పెండ్లయిందా?”
“లేదు,” అన్నాను.
“నీకు ఎన్ని సంవత్సరాలు?”
“పద్దెనిమిది.”
“నీకు ఎంతమంది ప్రియులున్నారు?”
“నాకు ఏ ప్రియులు లేరు.”
అంతలో సినియర్ డాక్టరు ఇలా: “నీ ఉద్దేశమేమిటి? పద్దెనిమిది సంవత్సరాలున్న నీకు ఏ ప్రియులు లేరని చెపుతావా?” అంటూ అరవటం మొదలుపెట్టాడు. మరల ఒకసారి, నేను మొదటి ఆసుపత్రిలో మాదిరే, నా క్రైస్తవ స్థానాన్ని గూర్చి వివరించాను. అప్పుడు ఆయన నీవు యెహోవా సాక్షులలో ఒకతెవా అని అడిగాడు. నేను ఔన్నాను. ఆ తరువాత, ఆయన ఏమీ ప్రశ్నించలేదు.
పరీక్షలు నేను గర్భవతిని కానని తేల్చాయి. డాక్టర్లలో ఒకరు ఇతరులతో: “ఆమె ఇప్పటికీ కన్యకే!” అని చెప్పుకొనుచుండగా అమ్మ విన్నది. డాక్టర్లు క్షమాపణ అడుగుతూ ఇలా అన్నారు: “మేము ఈ విధంగా ఆలోచించామని మాపై మీరు నింద మోపనక్కర్లేదు. అమ్మాయిలతో ఇటువంటి అనుభవం మాకు ప్రతిరోజు ఉంటుంది.” ఏమైనప్పటికి, ఆ కఠినపరీక్ష నా శోధనలకు ప్రారంభం మాత్రమే.
‘నీవు రక్తం ఎక్కించు కోవాలి’
అల్‌ట్రాసౌండ్ (అను దైర్ఘ్యతరంగాలు) పరీక్షలో నాలోని స్త్రీ బీజవాహికల్లో ఒకదానిపై కండ పెరిగిందని తెలిసింది. అది ఒక పెద్ద నారింజ పండు అంత ఉంది. శస్త్రచికిత్స అవసరమైంది.
నేను సంశయించకుండ రక్తమార్పిడి అయితే అంగీకరించను కాని, ఇతర ప్రత్యామ్నాయ ద్రవములను తీసుకొనుటకు ఇష్టపడతానని చెప్పాను. వాళ్లు మాత్రం రక్తం తప్పనిసరియని నిర్భంధపర్చారు.
డాక్టరు చదివే ఒక విద్యార్థి నన్ను కోపంతో చీవాట్లు పెడుతూ: “కొంతకాలం క్రితం మీ వాళ్లలో ఒకరు ముందే ఇలాగే అన్నాడు. అతని పరిస్థితి క్షీణించినప్పుడు, రక్తమార్పిడిని అంగీకరించాడు” అని మాట్లాడాడు.
“కాని నా సంగతే వేరు, నేను అవునంటే అవును, కాదంటే కాదు. నా యథార్థత కోసం నేనెప్పుడును రాజీపడను.” అని సమాధానమిచ్చాను.
తరువాత, ముగ్గురు డాక్టర్లు నా మంచం ప్రక్కకు వచ్చి నేను రక్తం తీసుకోక పోవడానికిగల కారణాన్ని విచారణ చేసారు. క్రైస్తవులు “రక్తమును . . . విసర్జించవలెను.” అని బైబిలు చెపుతుందని నేను వివరించాను.—అపొస్తలుల కార్యములు 15:20.
“అయితే నీవు నోటిద్వారా దీనిని తీసుకోవడం లేదు, నీ రక్తనాళం ద్వారానే తీసుకుంటావు.” అని వాళ్లు అభ్యర్థించారు.
ఒక వ్యక్తి నోటిద్వారా కాని లేక రక్తనాళంద్వారా కాని తీసుకోవడం భేదమేమిలేదు. ఏదైనా ఒక్కటే అని చెప్పాను.
నాకు నొప్పి వచ్చిన ఒక వారం తరువాత, అనగా శనివారం, మార్చి 14న, హెడ్ సర్జన్ పరీక్ష చేసాడు. ఆయన ఆపరేషన్ చేయవలసి ఉంది. ఇంతలో వాపు ఎదవరకు వ్యాపించింది.
“వాళ్లు నీవు రక్తం ఎక్కించుకోవాలని, చెప్పారా?” అని అడిగాడు.
“వాళ్లు చెప్పారు డాక్టరు, కాని నేను రక్తం ఎక్కించుకోను,” అని జవాబిచ్చాను.
“నన్ను ఒకటి చెప్పనివ్వు,” అంటూ, “నీవు తీసుకోంటావు. తీసుకోకపోతే చనిపోతావు. సోమవారం నేను వచ్చేసరికి, రక్తం సిద్ధంగా లేదంటే ఆపరేషన్ చేయను. రక్తం లేకపోతే, ఆపరేషన్ లేదు.”
ఆ తర్వాత ఆయన నా మంచం ప్రక్కన ఉన్న పుస్తకాన్ని చూసి “ఇది నీ బైబిలా?” అని అడిగాడు. నేను కాదన్నాను; అది నా జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకం.a నీవు చనిపోకుండా ఉండుటకోసం ప్రార్థన చేయడానికి ఈ పుస్తకంను ఉపయోగించాలి అన్నాడు. కాని, మేము ప్రార్థనలను పుస్తకాల నుండి చదువమని నేను వివరించాను. మాకెప్పుడైన సమస్య ఉంటే అప్పుడు, మా హృదయంతో యెహోవాకు ప్రార్థిస్తామని అన్నాను.
ఆ తర్వాతి రెండు రోజులుకూడా, డాక్టర్లు, నర్సులు నాదగ్గరకు వస్తూ రక్తమార్పిడికి లోబడిపొమ్మని ఒత్తిడి చేస్తూన్నే ఉన్నారు. ఇంత చిన్న వయస్సులో ఎందుకు చనిపోతావు. “రక్తం తీసుకొని బ్రతుకు!” అని అన్నారు.
“యెహోవా నా పక్షమున ఉన్నాడు”
ఆ కష్టకాలములందు, నేను కీర్తన 118, జ్ఞాపకం చేసుకొన్నాను ఆ భాగం ఇట్లు చెబుతుంది: “ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని. విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు?”—కీర్తన 118:5, 6.
నేను ఈ వచనాలను ధ్యానించిన తరువాత, యెహోవాయందు నా విశ్వాసం బలపర్చబడింది. ఆ రోజు ఉదయం నా తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చారు. నేను వారికి ఆ కీర్తన చూపించాను, వారి విశ్వాసం కూడా బలపర్చబడినట్లుగా అనుభూతిని పొందారు.
ఈలోగా, నేను రక్తం తీసుకోకుండా ఉండు నిర్ణయానికి నా తల్లిదండ్రులు మద్దతునివ్వడమే కాకుండా, నాకొరకు వారు ప్రార్థనకూడా చేస్తున్నారు. మా సంఘంలోని సభ్యులుకూడా నాకొరకు ప్రార్థన చేయుచూ లేఖానాలద్వారా నాకు ప్రోత్సాహమిచ్చారు.
“మేము మాంత్రికులము కాదు”
మార్చి 16, సోమవారం, ఉదయం ఆపరేషన్ చేయుటకు నిర్ణయించబడింది. డాక్టర్లలో ఒకరు నా గదికి వచ్చి, నేను పట్టుకొని ఉన్న నా వైద్య నిర్దేశ పత్రాన్ని, రక్తమార్పిడిని గూర్చి తెల్పు నా స్థానాన్ని చూసి, “ఇదేమిటి? నీవు చెప్పేదేమిటో నీకు అర్థమవుతుందా?” అన్నాడు.
“ఔను, నేను రక్తం తీసుకోవటం లేదు.”
“సరే, మేము నీ ఆపరేషన్‌ను రద్దు చేస్తున్నాము. ఆపరేషన్ లేదు.” అని చెప్పారు.
ఆ డాక్టరు నా గదిలో నుంచి మా అమ్మకు ఫోను చేసారు. అందుకు ఆమె ఇలా చెప్పింది: “ఆమెకై ఆమె నిర్ణయించుకొనే వయస్సుకు ఎదిగింది. నేనేమీయు ఆమెకొరకు నిర్ణయించను. బైబిలు తర్ఫీదు పొందిన ఆమె మనస్సాక్షి తాను రక్తం తీసికొనుటకు అంగీకరించుట లేదని చెప్పుతుంది.”
దాంతో అతడు నా రికార్డులను బల్లపై విసిరేస్తూ, కోపంతో నా గది నుండి వెళ్లిపోయాడు. మరో అయిదు గంటలవరకు ఆ విషయం వాళ్లేమీ మాట్లాడలేదు. నేను నొప్పితో బాధపడుతున్నాను. నేను ఏమి తినలేదు. ఆ ప్రాంతంలో మరో ఆసుపత్రికూడా లేదు.
అంతట, నన్ను ఆశ్చర్యపరుస్తూ, ఆపరేషన్ థియేటర్‌కు తీసుకొని వెళ్లుటకు స్ట్రెచర్ వచ్చింది. నేను నా “నోబ్లడ్ కార్డు”ను గట్టిగా పట్టుకొన్నాను. థియేటర్‌కు వెళ్లుదారిలో శస్త్రచికిత్స పరికరములతోపాటు, రక్తపు ప్యాకెట్‌లను నేను చూసాను. రక్తం తీసి కొనకుండునట్లుగా నేను అధికంగా రోదనం చేయుచూ, నేను ఆ పత్రంను నేలపై విడిచివేయాలని ఒక నర్సు చెప్పింది. నేను దానిని థియేటర్‌లోనికి తీసుకొని వెళ్లకూడదని ఆమె చెప్పింది. అది లేకుండా నేను లోనికి వెళ్లనని, అది చీఫ్ సర్జన్‌కు చూపాలను కుంటున్నానని చెప్పాను. అప్పుడు ఆ నర్సు నా చేతిలోనుంచి ఆ కార్డును తటాలున లాక్కొని, తీసుకొని, థియేటర్ లోనికి వెళ్లి, ఆ సర్జన్‌కు చూపింది. వెంటనే ఆ హెడ్ సర్జన్ మరియు ఐదుగురు డాక్టర్లు వారి ఆపరేషన్ దుస్తులతోనే నేను ఉన్న చోటునకు వచ్చారు.
ఆ హెడ్ సర్జన్‌కు ఆగ్రహం వచ్చింది. ఆయన మా అమ్మను పిలిపించి, నా కడుపును చూపిస్తూ, “చూడండి, మేడమ్. మాకు లోపల ఏముందో తెలియదు. అయిన మేము ఎక్కువగా శరీరబాగాన్ని తీసివేయవలసివస్తే దానివల్ల ఆమె చచ్చిపోయేంతగా ఎక్కువ రక్తం పోతుంది. నీకు ఫర్వలేదా?” అని అడిగాడు.
దానికి సమాధానంగా అమ్మ ఆయనతో: “డాక్టరు, యెహోవా ఆమెతో ఉన్నాడని నాకు తెలుసు. మరి ఆయన మీతో కూడా ఉంటాడు. మీకు చేతనైన మట్టుకు మీరు చేయండి మిగిలినది యెహోవాపైన వదిలిపెట్టండి.”
అప్పుడు డాక్టరు ఇలా: “మేము మాంత్రికులము లేదా ఓషధి శాస్త్రవేత్తలము కాదు. మేము ఏమి నేర్చుకొన్నామో దానిపై ఆధారపడియుంటాము. నేను రక్తం లేకుండా ఈ ఆపరేషన్ చెయ్యలేను.”
మళ్ళీ మా అమ్మ ఆయనను వేడుకొని మీరు చేయగలిగింది చేయమని అడిగింది. చివరకు, ఆయన రక్తం లేకుండా ఆపరేషన్ చేయడానికి అంగీకరించాడు. నీకు భయమేస్తుందా అని అడిగినాడు. దానికి జవాబుగా నేనిలా చెప్పాను: “మరణించడానికి నేను భయపడను. యెహోవా నాతో పాటుగా ఉన్నాడని తెలుసు.”
“నీ దేవుని సేవించుటలో కొనసాగు”
శస్త్రచికిత్స అంతా ఒక గంటలో చేయబడింది. సులభంగా వారు ఆ పుండుని తీసినప్పుడు, ఆసుపత్రి సిబ్బంది అంతా ఆశ్చర్యపడ్డారు.
ఆ తరువాత వైద్య విద్యార్థిగా ఉన్న డాక్టర్లు రాత్రివేళ నా విషయంపై వారి గదులలో మాట్లాడుకున్నట్లు అమ్మకు చెప్పారు. ఇప్పుడు నేనైనా లేక అమ్మ అయిన ఆసుపత్రికి వెళ్లితే, వాళ్ళు మమ్మల్ని ప్రత్యేకంగా అభిమానిస్తారు.
నా ఆపరేషన్ జరిగిన రెండు రోజుల తరువాత, ఆ సర్జన్ నా వార్డునకు వచ్చి, నేను ఎలా ఉన్నాను అని అడిగి: “నీవు నీ దేవుని సేవించుటలో కొనసాగాలి. ఆయన నిజంగా నీకు సహాయం చేసాడు.” అని చెప్పాడు. (g94 5/8)
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సోసైటీ వారి ప్రచురణ.