రాజ్యప్రచారకుల నివేదిక
వారు తమ జీవిత విధానమును మార్చుకున్నారు
నిస్సందేహముగా వీరు వీధులలో ఇతరులతో మాట్లాడడం, ఇంటింటికి వెళ్లి సందర్శించడం, లేదా తమ రాజ్యమందిరాలలో క్రైస్తవ కూటములకు హాజరుకావడం నీవు చూచేయుంటావు. చక్కగా కేశాలంకరణ చేసుకున్న యవ్వనులైన సాక్షులను గూర్చి మేము మాట్లాడుతున్నాము. వారి తలిదండ్రులు అలా నేర్పినందుకు వారు సాక్షులయ్యారని మరియు వారిలో అనేకుల విషయంలో ఇదే నిజమని నీవనుకొనియుండవచ్చును. దానికి బదులుగా ఈ యవ్వనస్థులలో కొంతమంది వారి పాత చరిత్ర, గతజీవితము ఇప్పటి జీవితముకన్నా పూర్తిగా వేరైయుండెను. ఈ ప్రక్క పేజీలో చూపించిన విధముగా రోజు మత్తు పదార్ధాలు వాడుతూ, నేరాలుచేసే గుంపులతో వారు సహవసిస్తుండేవారు. వారి జీవిత విధానమును పూర్తిగా మార్చుకొనుటకు వారినేది నడిపింది? మనమిప్పుడు నార్వేలోనున్న ఒక పట్టణమును దర్శించి మార్పులు చేసుకున్న యవ్వనులలో కొంతమందిని కలుసుకుందాం.
మార్పుకొఱకు పునాది
ఇద్దరు సాక్షులు ఇంటింటి పనిలో 19 సంవత్సరములు వయస్సుగల యానెట్‌ను కలుసుకున్నారు. “యెహోవాసాక్షులతో మాట్లాడవద్దని నాకు తరచూ చెప్పేవారు. కాని నేను కుతూహలంతో వారిని లోనికి ఆహ్వానించానని,” ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. ఆమె 11 సంవత్సరముల ప్రాయంనుండి మత్తు పదార్థాలకు అలవాటుపడింది మరియు అనేక దొంగతనాలకు, కారుదొంగతనాలకు పాల్పడింది.
రాజ్య వర్తమానము ఆమెను ఆకర్షించింది. ఆమె తన ఐదవ ఏట తల్లిని పోగొట్టుకున్నందున పునరుత్ధాన నిరీక్షణనుబట్టి ఆమె ముఖ్యంగా ప్రోత్సహింపబడింది. కాబట్టి ఆమె ఉచిత బైబిలు పఠనము చేయుటకు అంగీకరించింది. రాజ్యమందిరమునకు రావడం మొదలుపెట్టింది. ఆమె నేర్చుకుంటున్నదానిని తన స్నేహితుడికి, యితరులకు చెప్పింది. వారి ప్రతిస్పందన ఏలాగుండెను? వారు దానిని ఏమాత్రము అంగీకరించలేదు, బదులుగా యానెట్ తన బుర్రపాడుచేసుకుందని నిందించారు. అయినప్పటికి, వారిలో ఎవరైతే ఎక్కువ వ్యతిరేకించారో వారే, అటుతర్వాత బైబిలును పఠించుటకారంభించారు.
ఉదాహరణకు, 20 సంవత్సరాల ఎప్సెన్‌ను గమనిద్దాం. యానెట్ స్నేహితుడి వద్ద రాజ్యవర్తమానం గూర్చి ఇతడు విన్నాడు. వెంటనే బైబిలు పఠనం కావాలని కోరాడు. అయితే అతడు 4 మాసముల కారాగార శిక్షకొరకు వేచియున్నాడు. ఎందుకంటే యానెట్‌వలె యితడు కూడా అనేక దొంగతనాలు, రహస్య మత్తుపదార్ధాల దొంగరవాణా చేశాడు. అంతేకాకుండా, స్వయంగా పొగాకు, గంజాయి మరియు యితర మత్తుపదార్ధాలను వాడేవాడు. మరి వీటన్నిటికి పాల్పడిన ఒకవ్యక్తి బైబిలు పఠనం ఆరంభించుటకు ఏది నడిపించగల్గింది? శూన్యమైనదిగాను, ఉద్దేశ్యములేనట్లుగాను అతని జీవిత విధానమును ఎప్సెన్ గుర్తించాడు. “భవిష్యత్తును గూర్చి బైబిలునందుగల వాగ్దానములను బట్టి ఎంతో ఆకర్షితుడనయ్యాను, నా జీవితానికి అర్థము నిచ్చింది. అందుచేత నేను సత్యాన్ని నేర్చుకుంటున్నానా లేదాయని తెలుసుకోవడానికి పఠించడం మొదలుపెట్టాను” అని అతడు వివరించాడు.
ఇతరులు బైబిలును చదువగోరారు
అదేసమయములో అదే యౌవ్వన గుంపులోనున్న ఒక యౌవ్వనస్థునికి సువార్త వినే అవకాశం దొరికింది, అతడు కూడా కూటములకు హాజరవుటకారంభించాడు. తరువాత వీరిలో మరొక యౌవనస్థునితో బైబిలు పఠనం ప్రారంభించబడింది. అతడు కూటములకు హాజరగుటకారంభించాడు. కొద్దికాలము తరువాత, ఇంకా మరొక యౌవ్వనుడు బైబిలును పఠించుచున్న స్నేహితులతో చేరి, తానుకూడా ఆత్మీయాభివృద్ధి నొందుతున్నాడు. అదే గుంపులోని మరొక యౌవ్వనుడు వారి స్నేహితులు చేసుకుంటున్న సకలాత్మకమార్పులకు ముగ్ధుడై కొద్ది కాలంలోనే అతడు బైబిలును పఠించగోరాడు.
అదే గుంపులోనున్న గిల్‌బర్ట్ అనే యౌవ్వన సంగీతకారుడు, ఇప్పుడు బైబిలును చదువుటకారంభించాడు. క్యాన్సర్ వలన అతని తలిదండ్రులు యిరువురు చనిపోయారు, బైబిలునందుగల పునరుత్ధాన నిరీక్షణనుబట్టి అతడు ఓదార్చబడ్డాడు. (యోహాను 5:28, 29) అతడు కూడా గంజాయిని వాడుతూ, వ్యభిచార జీవితాన్ని గడుపుతుండేవాడు, రాక్ సంగీతంలో పేరు గడించాలనే అభిలాష అతనికుండేది. ఏమైనను, సమయము గడిచేకొలది, యితడు మంచి ఆత్మీయాభివృద్ధిని సాధించి తొందరలో యెహోవాసాక్షి అయ్యేందుకు నిర్ణయించుకున్నాడు. చివరిగా, ఎప్సెన్ చిన్నతమ్ముడు బైబిలును పరిశోధించి సాక్షులతో సహవాసం చేయుటకారంభించాడు.
బైబిలు సత్యము జీవితాలను మార్చును
దొంగతనాలు యితర నేరాలు చేసి, మత్తుపదార్ధాలు వాడి, మురికిబట్టలు ధరించి, చింపిరిజుట్టుతో ఉండిన యీ యౌవ్వనస్థులలో గొప్ప మార్పువచ్చింది. యానెట్ ఒక మంచి రాజ్య ప్రచారకురాలు, దాదాపు ఒక సంవత్సరం పయినీరుగా పనిచేసింది. ఎప్సెన్, గిల్‌బర్ట్ సహపయినీర్లుగా పనిచేశారు, మరియు వారు పరిచారకులుగా కూడా ఉన్నారు. వారిద్దరూ క్రైస్తవ సంఘములో ఉన్నవారినే వివాహము చేసుకున్నారు. ఆ పాత గుంపులోని మరో నలుగురు కూడా ఆసక్తిగల రాజ్యప్రచారకులయ్యారు!
నాల్గు మాసముల జైలు శిక్ష అనుభవించవలసియున్న ఎప్సెన్ విషయమేమిటి? ఇతడు తన జీవితములో మార్పులు చేసుకున్నందున అతని శిక్ష 80 గంటల ప్రజాసేవకు మార్చారు. పోలీసువారు మరి యితరుల అంగీకారంతో స్ధానికంగానున్న యెహోవాసాక్షుల రాజ్యమందిరములో పనిచేస్తూ ఈ గంటలను వెచ్చించాడు. ఈ ఏర్పాటు పోలీసులకు ఎంతగానో నచ్చింది.
అవును, ప్రపంచవ్యాప్తముగానున్న అనేక మంది యౌవ్వనులలో వారి గతచరిత్రలో నేరములు చేసినవారే. అయితే దేవుని వాక్యములోని సత్యం వారి ముఖ్య ప్రశ్నలకు సమాధానమునిచ్చింది మరియు భవిష్యత్తు నిమిత్తం నమ్మకాన్నిచ్చింది. అందుకే వారిక మత్తుపదార్ధాలు వాడరు. నేరములు చేయరు, మరియు వారు మురికి బట్టలతో వెళ్లరు. వారి జీవితాలలో మార్పులు చేసుకున్నందున వారు అచ్చం పైన తెలుపబడిన వారివలె—యౌవనులై, మంచి కేశాలంకరణ కలిగిన చురుకైన యెహోవాసాక్షులుగా ఉన్నారు. ఈనాడు యౌవ్వనులకున్న చాలా సమస్యలకు బైబిలు చూపే శాశ్వత పరిష్కారాల్ని గూర్చి ఇతరులకు తెలియజేయాలని వారు కోరుకుంటారు.—1 కొరింథీయులు 6:9-11 చూడండి.
[8వ పేజీలోని చిత్రం]
ఎప్సెన్, యానెట్, మరియు గిల్‌బర్ట్