కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 3/1 పేజీ 31
  • కొలంబియాలో ఆత్మీయ విడుదల

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కొలంబియాలో ఆత్మీయ విడుదల
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు—కొలంబియా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మత స్వాతంత్ర్యం మీకు ఏ భావాన్ని కలిగివుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 3/1 పేజీ 31

రాజ్య ప్రచారకుల నివేదిక

కొలంబియాలో ఆత్మీయ విడుదల

స్పానిష్‌ యుద్ధవిజేతల కాలం నుండి దక్షిణ అమెరికా కాథోలిక్కు మతానికి ఆయువు పట్టుగా ఉంది. కొలంబియాలో అది చాలాకాలంగా దేశ అధికార మతంగా చెలామణయ్యింది. గత 105 సంవత్సరాలుగా వాటికన్‌ చర్చిని కాపాడుతూ, విద్య మరియు వివాహాల విషయంలో ప్రత్యేక ఆధిక్యతలను జారీచేసిన కొలంబియా ప్రభుత్వంతో ఒప్పదం కలిగియుంది.

డిశంబరు 1990లో కొలంబియా ప్రజలు ఒక క్రొత్త రాజ్యాంగాన్ని రూపొందించే ఒక కమీషన్‌ను ఎన్నుకున్నారు, 1991 మధ్యకాలానికి అది పూర్తయింది. ఆ క్రొత్త రాజ్యాంగం కొలంబియాలో మత విధానంలో మార్పులు తెస్తున్నది. చట్టం దృష్టిలో అన్ని మతాలకు సమాన హక్కులున్నాయి, ఆలాగే ప్రజా విద్యాలయాలలో పిల్లలపై బలవంతంగా మత బోధ చేయకూడదు. ఈ రాజ్యాంగ మార్పులను మనస్సులో ఉంచుకొని వాటికన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని సవరించే సమయం ఆసన్నమయింది.

ఈ గొప్ప మత స్వేచ్ఛ కాథోలిక్‌ చర్చి ప్రభావాన్ని తగ్గించి, యథార్థవంతులు బైబిలు జ్ఞానమును పొంది ఆత్మీయ స్వాతంత్ర్యము సంపాదించుటను సులభతరం చేస్తుంది.

ఈ ఆత్మీయ స్వేచ్ఛను ఆశతో అపేక్షిస్తూ ఆత్మీయ శరణార్థుల అవసరాలు తీర్చేందుకు ఆ దేశంలోని 51,000 మంది యెహోవాసాక్షులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. హైస్పీడ్‌ చతుర్వర్ణ ముద్రణా యంత్రంతో సహా విస్తరింపబడిన వసతులతో క్రొత్త బ్రాంచి భవన సముదాయము పూర్తికావస్తున్నది. తప్పిపోయిన యెహోవా గొర్రెలను వెదకుటకు తాత్కాలిక, ప్రత్యేక పయినీర్లు చిన్న పట్టణాలలోనికి పంపబడగా, అక్కడ అద్భుతమైన బైబిలు విద్యా పని నెరవేర్చబడింది. ప్రతిదీ దాదాపు 10,000 మంది జనాభావున్న 63 పట్టణాలలో, 47 సంఘాలు, గుంపులు ఏర్పడ్డాయి.

యథార్థ హృదయులైన ప్రజలను యెహోవా ఆత్మ ప్రేరేపిస్తుండగా, అనేకమంది యౌవనులు కూడా ప్రత్యుత్తరమిస్తున్నారు. క్వెశ్చన్స్‌ యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌—ఆన్సర్స్‌ దట్‌ వర్క్‌ అనే సాహిత్యం అటు యౌవనస్థులకు ఇటు తలిదండ్రులకు అమూల్యమైన సహాయక సాధనంగా నిరూపించబడింది. ఒక సాక్షి ఇంటింటి సేవలో ఉండగా, ఈ పుస్తకములోని కొంతభాగాన్ని చదివిన ఒక మనిషిని కలిశాడు. ఆ పుస్తకాన్ని పొరిగింటాయన ఆయనకు యిచ్చాడు. కుటుంబ సమస్యలను చర్చించడంలో ఆ పుస్తకం ప్రదర్శించిన ఆచరణయోగ్యమైన విజ్ఞానానికి ఆయనెంతో ముగ్ధుడయ్యాడు. తను తన భార్య వేరైపోయే ప్రమాదపు అంచులో ఉన్నందున, ఆయనకు ప్రత్యేకంగా “వై డిడ్‌ డాడ్‌ అండ్‌ మమ్‌ స్ప్లిట్‌” అనే 4వ అధ్యాయం బాగా నచ్చింది. పెద్ద విపత్తునుండి తనను ఆ పుస్తకం రక్షించిందని అతను చెప్పాడు. ఇప్పుడు అతను అతని కుటుంబం యెహోవాసాక్షులతో బైబిలు పఠనం చేస్తూ సంఘ కూటములకు హాజరవుతున్నారు. బైబిలు ద్వారా, ఆయన సంస్థ ద్వారా యెహోవా దయచేసే ఆచరణాత్మక వివేచనకు వారెంతో కృతజ్ఞత కలిగివున్నారు.

యెహోవా అద్భుతకరమైన సంకల్పాలను గూర్చి, సమీపంలో ఉన్న ఆయన నూతన లోకాన్ని గూర్చి నేర్చుకోవడానికి ఆత్మీయంగా ఆకలిగావున్న వారికి కొలంబియాలోని యెహోవాసాక్షులు సహాయము చేస్తున్న తరుణంలో ఈ అనుభవము, అక్కడ జరుగుతున్న ఆత్మీయ విడుదలను ఉదహరిస్తున్నది.—2 పేతురు 3:13.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి