“గర్జించు సింహము వలె”
సాతాను ఉనికిలో ఉన్నాడని మీరు నమ్ముదురా? ఈనాడు అనేకులు అలా నమ్మరు. అటువంటి నమ్మకం “విజ్ఞానశాస్త్రం ప్రకారం తప్పని” వారు దృష్టిస్తున్నట్లు కన్పిస్తున్నది. వెనుకటికి 1911లో, ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా యిలా చెప్పింది: “సాతాను ప్రక్రియకు ఎలాంటి తావునివ్వకుండ విజ్ఞానశాస్త్రం బాహ్య ప్రకృత్తిని గూర్చి మానవుని అంతరంగ జీవిత విధానాన్ని గూర్చి ఎన్నో విషయాలు వివరించింది.” సాతాను కేవలం ఒక చిహ్నమని, పుక్కిటపురాణమని వేదాంతులు తర్కించారు. ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా యిలా అంటుంది: “అనేకమంది ఆధునిక వేదాంతులు, అపవాదిని మానవ స్వభావం యొక్క నీచాతినీచమైన లక్షణాలు దుష్ట శక్తికి ఒక చిహ్నంగా పరిగణిస్తున్నారు.”
అయితే వాస్తవాల విషయమేమి? మీరు బైబిలును నమ్మితే సాతాను నిజమని కూడ మీరు నమ్మాలి. యేసు, అతడు ఉనికిలో ఉన్నాడని నమ్మడమే కాదు, అతన్ని “ఈ లోకాధికారి” అని కూడా పిలిచాడు. (యోహాను 14:30) అపొస్తలుడైన పౌలు సాతానును “ఈ యుగ సంబంధమైన దేవత” అని పిలిచాడు. (2 కొరింథీయులు 4:4) వృద్ధుడైన అపొస్తలుడగు యోహాను యిలా చెప్పాడు: “లోకమంతయు దుష్టుని యందున్నది.”—1 యోహాను 5:19.
యోహానుతో మీరు విభేదించినట్లయిన, ఇటీవల చరిత్రను గూర్చి ఒక్కసారి ఆలోచించండి. మరణ దళాలను గూర్చి, ప్రభుత్వాలు జరిగించే హింసాకృత్యాలను గూర్చి ఆలోచించండి. మన తరం యుద్ధాలను, జాతి సంహారాలను చూసింది. మన వార్తాపత్రికలలో ప్రముఖంగా ప్రచురింపబడే కౄర నేరాలు అనగా సామూహిక హత్యలు, అత్యాచారాలు, హత్యా పరంపరలు, పిల్లలపై జరిగే అత్యాచారాలవంటివి చెప్పడానికి కొన్ని మాత్రమేనా? సాతాను కాకుండ ఈ లోకానికి మరింకెవరు దేవుడై యుండగలరు?
క్రైస్తవ అపొస్తలుడైన పేతురు యిలా హెచ్చరించాడు: “మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1 పేతురు 5:8) మీ చుట్టుప్రక్కల ఒక సింహము తిరుగుచున్నట్లయిన, అది ఉనికిలో ఉందా లేదా అని మీరు చర్చిస్తూ కూర్చుంటారా? లేక సురక్షిత స్థలానికి పారిపోతారా?
సాతాను ఉనికిలో ఉన్నాడని నమ్మండి. అతడు నిర్దయుడు, కౄరుడు మనకంటే బలం గలవాడు. కాబట్టి అతనికంటే బలం గలవానియొద్దకు పరుగెత్తండి. “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.” (సామెతలు 18:10) యెహోవా దేవుని ఆశ్రయించి, ఆ దుష్టుడైన సాతాను ప్రభావాన్నుండి మానవజాతి త్వరలోనే విడిపింపబడునని తెలుసుకొనండి. అదెంత ఆనందదాయకమైన ఓదార్పై ఉంటుంది!—ప్రకటన 20:1-3. (w92 12/1)