గిలియడ్ విద్యాశీర్వాదములు ప్రపంచమంతట విస్తరిస్తున్నవి
ఈ లోకమందలి విద్యకు కేవలం పరిమితమైన విలువ మాత్రమే ఉంది. దేవుని సత్యానికి బదులు అది అధికంగా మానవ తలంపులపైనే ఆధారపడియుంది గనుక, అది జీవితంలో నిజమైన సంకల్పాన్ని కలుగజేయలేదు. అయితే గిలియడ్ పాఠశాల అందుకు భిన్నంగా ఉన్నది. గిలియడ్ పాఠశాల 93వ తరగతినుండి పట్టభద్రులను చేసే సందర్భంలో తన తొలి వ్యాఖ్యలందు, నిజమైన సారాంశమున్న విద్యను ఈ పాఠశాల సమకూర్చునని పరిపాలక సభ సభ్యుడైన థియోడర్ జారక్స్ అన్నారు. కీర్తన 119:160 చెప్పినట్లుగా, “[దేవుని] వాక్య సారాంశము సత్యము.” కాబట్టి 1992 సెప్టెంబరు 13న జరిగిన పట్టభద్రులయ్యే కార్యక్రమాన్ని తిలగించుటకు హాజరైన దాదాపు 6,000 మంది అమితోత్సాహంతో విన్నారు.
ఉదయం, “లోకాన్ని, దాని పాలకుని ఎడతెగక జయించుడి” అనే మూలాంశంపై మొదటి ప్రసంగాన్ని వాచ్‌టవర్ ఫామ్స్ కమిటీ సభ్యుడైన లోన్ షిల్లింగ్ యిచ్చారు. సహోదరుడైన షిల్లింగ్ ప్రకటన 12:11పై దృష్టినిల్పి జయించడానికి, (1) గొర్రెపిల్ల రక్తము, (2) సాక్ష్యపు పని, (3) స్వయం త్యాగ స్వభావం అనే మూడు మార్గాలను ఈ వచనాలు చూపిస్తున్నాయని సూచించారు. అటువంటి ఆత్మనే అనేకమంది యెహోవా సేవకులు చూపించారని, వారి భక్తిని, యథార్థతను కాపాడుకోవడానికి మరణాన్ని సహితం ఎదుర్కోవడానికి వారు యిష్టపడ్డారని ఆయన వారికి జ్ఞాపకం చేశారు.
“మీ శ్రేష్ఠమైన నమ్మకత్వాన్ని సంరక్షించుకోండి” అనే అంశంపై పరిపాలక సభ సభ్యుడైన జాన్ ఇ. బార్ ప్రసంగించారు. ఆప్యాయత నిండిన స్వరంతో ఆయన తన సహజ ధోరణిలో మాట్లాడుతూ, యెహోవాకు ఆయన సేవకుల మధ్యవుండే పరస్పర నమ్మకాన్ని చక్కని వివాహజత మధ్య ఉండే నమ్మకంతో పోల్చారు. రెండవ తిమోతి 1:12, 13 లోని అంశాలను ఉపయోగిస్తూ, బైబిలు నందలి “హితవాక్య ప్రమాణమునకు” హత్తుకొనుట ద్వారా తమ నమ్మకత్వాన్ని సంరక్షించుకొనుడని ఆయన ఉద్బోధించారు. వారి దిన కార్యక్రమమందు వ్యక్తిగత పఠనాన్ని ఆవశ్యకం చేయుటను నొక్కిచెబుతూ, కూటములలో వారి వ్యాఖ్యానములు ఎన్నటికి ఏదో పేరుకు మాత్రమే కాకుండా అర్థవంతముగా ఉండవలెనని ఆయన విద్యార్థులకు దయాపూర్వక హితవు చెప్పారు.
సేవా విభాగపు కమిటీ సభ్యుడైన విలియం వాన్ డి వాల్ ఆ తర్వాత, “గొర్రెలాంటి వ్యక్తుల యెడల ప్రేమపూర్వక శ్రద్ధను ప్రదర్శించండి” అనే ప్రసంగాన్ని యిచ్చారు. ఒక ఫ్యామిలీ డాక్టరునుండి వారేమి ఆశిస్తారని ఆయన విద్యార్థులనడిగి, వారు విలువైనవిగా ఎంచే అదే విధమైన సహానుభూతిని, జాలిని, కనికరాన్ని పెంపొందించుకొనవలెనని ఆయన వారికి ఉద్బోధించారు.
పరిపాలక సభ సభ్యుడైన డేనియేల్ సిడ్లిక్ “సమస్తము దేవునికి సాధ్యమే” అనే అంశంపై ఉత్తేజకరమైన ప్రసంగాన్నిచ్చారు. తమ వృద్ధాప్యమందు పిల్లలనుకనే ఉత్తరాపేక్ష అసాధ్యమన్నట్లు కన్పించిన విషయమై నవ్విన అబ్రాహాము శారాలను ఆయన విద్యార్థులకు జ్ఞాపకం చేశారు. మానవ రీత్యా దేవుని వాగ్దానములు అసాధ్యంగా కన్పించవచ్చు; అయితే దేవదూత అబ్రాహామును అడిగినట్లు, “యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా?” (ఆదికాండము 18:14) అసాధ్యమైనవి సాధ్యపరచే దేవుని సామర్థ్యంపై విశ్వాసముంచుమని, వారెన్ని పరీక్షలను ఎదుర్కొన్నను ఆ విశ్వాసం ఎన్నటికి క్షీణించిపోకుండా లేదా ఊగిసలాడకుండా జాగ్రత్తపడాలని సహోదరుడైన సిడ్లిక్ విద్యార్థులకు ఉపదేశించారు.
ఉపదేశకుల సలహా
ఆ తర్వాత ఇద్దరు గిలియడ్ ఉపదేశకులు మాట్లాడారు. మొదట, జాక్ డి. రెడ్ఫోర్డ్ “దేవుని ఎదుట మంచి పేరు సంపాదించుట” అనే అంశంపై ప్రసంగించారు. ఒకని పేరు మంచిదా లేక చెడ్డదా అనేది ఆ పేరు పెట్టుకున్న వానిమీద ఆధారపడి వుంటుందని ఆయన తర్కించారు. ఆయన ఆదాము, నిమ్రోదు, యెజెబెలు, సౌలు, యూదాకును ఆలాగే నోవహు, అబ్రాహాము, రూతు, పౌలు, తిమోతీలకు మధ్యనున్న భేదాన్ని చూపించారు. ప్రతి పేరుకూడ దానిని ధరించిన వాని జీవన విధానాన్నిబట్టి అది మిగుల విలువైన విషయాల్ని తెలియజేస్తుంది. ఇప్పటినుండి రాబోయే 10, 100, లేక 1,000 సంవత్సరాలలో వారెలాంటి పేరును—అంటే మానుకునేవాడని లేదా ఫిర్యాదు చేసేవాడని లేదా నమ్మకమైన మిషనరీయనే పేరు తెచ్చుకుంటారా? అని ఆయన విద్యార్థులను ప్రశ్నించారు. సమస్యలపై కాక పరిష్కారముల మీద, ఉద్దేశాలమీద దృష్టి నిల్పండని ఆయన వారికి సలహానిచ్చారు.
“మీ విశ్వాసాన్ని మీరు ఎంత చక్కగా సంరక్షించుకుంటారు?” అనే ఆలోచన రేకెత్తించే ప్రసంగాన్ని యులిసిస్ వి. గ్లాస్ యిచ్చారు. అన్ని సమయాలలో సరియైన దిశను చూపించే మంచి దిక్సూచితో ఆయన బలమైన విశ్వాసాన్ని పోల్చారు. భూమికి సంబంధించినవే కాకుండ ఇతరత్రావుండే అయస్కాంత క్షేత్రాలద్వారా కూడ మోటారు వాహనమందలి దిక్సూచి ప్రభావితమౌతుంది, కాగా అటువంటి క్షేత్రాలను తటస్థపరచాల్సిన అవసరముంటుంది. అదే విధంగా, మనం అనుమతిస్తే, మన విశ్వాసాన్ని ఊగిసలాడేటట్లు చేసే లేదా బలహీనపరచే అనేక ప్రభావాల్ని ఈ పాత లోకం కలుగజేస్తుంది. అటువంటి ప్రభావాలను గూర్చి ఆ తరగతి వారిని హెచ్చరిస్తూనే సహోదరుడైన గ్లాస్ ఇతరుల దృక్పధాలు మరియు భావాల విషయంలో వారి సున్నితమైన మెలకువ కొరకు కూడ వారిని మెచ్చుకున్నారు.
ఆ ఉదయం, పరిపాలక సభ సభ్యుడైన ఆల్బర్ట్ డి. ష్రోడర్ చివరి ప్రసంగాన్ని ఇచ్చారు. ఆ పాఠశాలకు తాను రిజిస్ట్రారుగా పనిచేసిన 1943వ నాటి మొట్టమొదటి బ్యాచ్ మిషనరీలు చూపిన స్ఫూర్తినే చూపిస్తున్నందుకు వారిని మెచ్చుకుంటూ, “మిషనరీ స్ఫూర్తిని కాపాడుకొనుడని” ఆయన వారిని ప్రోత్సహించారు. ఆ బ్యాచ్‌వారు ప్రజలనే ధ్యేయంగా పెట్టుకుని సేవచేశారని, స్వభావసిద్ధమైన ప్రచారకులని, దేవుని ఆత్మచే నడిపింపబడుటకు ఇష్టపడిన వారని ఆయన చెప్పారు. అదే స్ఫూర్తిని పెంపొందించుకొనుడని, వ్యక్తిగత పఠనంలో న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్‌ను సంపూర్ణముగా ఉపయోగించుడని ఆయన వారికి ఉద్బోధించారు. దానికొక ఉదాహరణగా కీర్తన 24లోని ప్రతి వచనాన్ని చర్చించి ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఆ తర్వాత, గిలియడ్ విద్యార్థులు గిలియడ్ పట్టభద్రులయ్యారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య వారి మిషనరీ నియామకములను పెద్దగా చదువుచుండగా వారి యోగ్యతాపత్రాలు వారికి అందించబడినవి.
మధ్యాహ్నం, ఫ్యాక్టరీ కమిటీ సభ్యుడైన కాల్విన్ చైక్ వాచ్‌టవర్ పఠనాన్ని నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థుల ఐదునెలల శిక్షణా కాలంలో వారికి కలిగిన ప్రాంతీయ సేవా అనుభవాలు చేర్చబడిన ఆనందభరితమగు కార్యక్రమంతోపాటు వారు నియమించబడిన కొన్ని దేశాల స్లైడ్సు కూడ చూపబడినవి. దానికితోడు, ఒక వృద్ధ దంపతులను పరిచయం చేయగా వారు తమ అనేక సంవత్సరాల మిషనరీ సేవలో సంపాదించిన అపారమైన అనుభవాన్ని జ్ఞానాన్ని గూర్చి వారికిచెప్పి సంతోషించారు. “మోసపోకుడి లేక దేవుని వెక్కిరించకుడి” అనే సమయోచిత పేరుగల నాటకంతో మధ్యాహ్న కార్యక్రమం ముగిసింది.
దేవుని సత్యమందు ఇవ్వబడే విద్య ఏమి చేయగలదో చూసి ప్రేక్షకులు ఉత్కంఠతతో, పులకించిపోయారు, ఆలాగే అటువంటి విద్యాప్రయోజనాలు ఎడతెగక ప్రపంచ వ్యాప్తంగా కనబడతాయని తెలిసికొనుటకు వారెంతో సంతోషించారు. ఈ 48 మంది మిషనరీలు తమ నియామక ప్రాంతాలకు బయలుదేరి వెళ్లుచుండగా, ఈ విశ్వాసులు ఎక్కడెక్కడికి వెళ్లుదురో అక్కడున్న దేవుని ప్రజలకు వారొక ఆశీర్వాదము కాగలరనే నమ్మకంతో హృదయపూర్వక నిరీక్షణను వ్యక్తపరస్తూ అనేకమంది వారికొరకు ప్రార్థిస్తారు.
[19వ పేజీలోని బాక్సు]
ఈ తరగతి గణాంక వివరాలు
ప్రాతినిధ్యం వహించబడిన దేశాల సంఖ్య: 7
నియమించబడిన దేశాల సంఖ్య: 18
విద్యార్థుల సంఖ్య: 48
దంపతుల సంఖ్య: 24
సగటు వయస్సు: 32.8
సత్యమందు సగటు సంవత్సరాలు: 15.3
పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 10.4
[20వ పేజీలోని బాక్సు]
గిలియడ్ విస్తరణా తరగతి పట్టభద్రులు
జర్మనీ, సెల్టర్స్/టానస్లలో జరిగిన గిలియడ్ విస్తరణా పాఠశాల తరగతి నుండి జూన్ 21, 1992న 24 మంది మిషనరీలు పట్టభద్రులయ్యారు. ఆ తరగతిలో ఏడు దేశాలనుండి వచ్చిన 11 మంది దంపతులు ఇద్దరు అవివాహిత సహోదరీలు ఉన్నారు. వారి సగటు వయస్సు 32 సంవత్సరాలు, వారు బాప్తిస్మము పొంది 14 సంవత్సరాలు కాగా వారు పూర్తికాల సువార్త సేవలో సగటున 8.5 సంవత్సరాలు గడిపారు. పట్టభద్రులను చేసే ఆ కార్యక్రమానికి దాదాపు 2,000 మంది హజరయ్యారు.
సహోదరుడైన జారక్స్ సామెతలు 11:24ను చర్చిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడిలా వుంది: “వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు.” విద్యార్థులు వెదజల్లబడబోతున్నారని, అలా వారు నిశ్చయంగా అభివృద్ధిపొందుతారని ఆయనన్నారు.
జర్మనీ బ్రాంచి కార్యాలయ సమన్వయకర్తయగు రిచర్డ్ కెల్సీ; సేవా విభాగమందలి వుల్ఫ్‌గాంగ్ గ్రుప్పే; బ్రాంచి కార్యాలయ సభ్యులైన వార్నర్ రుడ్కే మరియు ఆన్స్టాడ్; పాఠశాల ఉపదేశకులైన డిట్రిచ్ ఫోస్టర్ మరియు లోథర్ కామెర్ వీరందరు లేఖనానుసారమైన ప్రోత్సాహకరమగు ప్రసంగాలిచ్చారు. పరిపాలక సభ సభ్యుడైన ఆల్బర్ట్ ష్రొడర్ “ఆత్మీయ రత్నాలను అన్వేషించే వారిగా కొనసాగుట” అనే ఆసక్తికరమైన అంశంపై ప్రసంగించారు. ఆ కార్యక్రమ చివరి అంశంగా ఆఫ్రికా, మధ్య అమెరికా, తూర్పు ఐరోపాలలోని 11 దేశాలకు వారి నియామక పత్రాలను అందించగా, ఆ తరగతినుండి ఒక పట్టభద్రుడు పరిపాలక సభయెడల తమ హృదయపూర్వక మెప్పును వ్యక్తపరుస్తూ ఒక లేఖ చదివాడు.
[18వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ గిలియడ్ పాఠశాల యొక్క 93వ తరగతి నుండి పట్టభద్రులైన వారు
క్రింద ఇవ్వబడిన పట్టికలో, ముందు నుండి వెనుకకున్న వరుసలలోని, పేర్లు ప్రతివరుసలో ఎడమనుండి కుడికి ఇవ్వబడినవి.
(1) హిట్స్మాన్, సి.; వెస్ట్, పి.; ఇవాన్స్, డి.; హిప్స్, ఎమ్.; సైమోనెల్లీ, ఎన్.; ఉడ్, ఎస్.; కార్కిల్, ఎమ్.; ఫ్లోర్స్, సి.; థామస్, జె.; (2) జోన్స్, ఎమ్.; నిస్సినెన్, జె.; స్పానెన్బెర్గ్, ఎమ్.; జాకరీ, కె.; రావన్, జి.; బాక్మాన్, ఎమ్.; వెట్టర్గ్రెన్, ఎ.; ఇవాన్స్, డి.; ఫ్లోర్స్, ఆర్.; కాపొరాలె, జి. (3) సైమోనెల్లీ, ఎన్.; రిచెస్టినీర్, ఎమ్.; రిచెస్టినీర్, ఎమ్.; రూయిజ్-ఎస్పార్జా, ఎల్.; జెర్బిగ్, బి.; సింప్సన్, సి.; జానెవిచ్, సి.; జాచరీ, బి.; రిక్కెట్స్, ఎల్. (4) సింప్సన్స్, జె.; బాక్మాన్, జె.; కార్కిల్, జి.; జెర్బిగ్, ఎమ్.; రిక్కెట్స్, బి.; బాగర్-హాన్సెన్, ఎల్.; జోన్స్, ఎ.; జానెవిచ్, కె.; రావన్, జె.; హిప్స్, సి. (5) స్పానెన్బెర్గ్, ఎస్.; హిట్స్మాన్, ఎ.; కాపొరాలె, ఎల్.; రూయిజ్-ఎస్పార్జా, ఎస్.; థామస్, ఆర్.; బాగర్-హాన్సెన్, బి.; ఉడ్, ఎమ్.; వెస్ట్, ఎమ్.; వెట్టర్గ్రెన్, సి.; నిస్సినెన్, ఇ.