కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 2/15 పేజీలు 4-6
  • కొందరెందుకు తిరిగి జన్మించారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కొందరెందుకు తిరిగి జన్మించారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మానవజాతి యెడల దేవుని సంకల్పము
  • మరణించునప్పుడు ఆత్మకేమి సంభవిస్తుంది?
  • రాజులుగా పాలించుటకు తిరిగి జన్మించుట
  • భూమి విషయమేమి?
  • ఎవరు ప్రయోజనం పొందుతారు?
  • భూమి పరదైసుగా మారుతుందని నమ్మడం సహేతుకమే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మరణానంతర జీవితం—బైబిలేమి చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • పునరుత్థానంలో మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 2/15 పేజీలు 4-6

కొందరెందుకు తిరిగి జన్మించారు

“ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు.” (యోహాను 3:3) ఆ మాటలను 1,900 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు పలికినప్పటి నుండి అవి అనేకమంది ప్రజలను పులకరింపజేసి, కలవరపెట్టాయి.

తిరిగి జన్మించుటను గూర్చి యేసు పలికిన వాక్యములను సరిగా గ్రహించడానికి మొదట మనము ఈ ప్రశ్నలకు జవాబు పొందాలి: మానవజాతియెడల దేవుని సంకల్పమేమిటి? మరణించినప్పుడు ఆత్మకేమౌతుంది? దేవుని రాజ్యము ఏమి చేయవలసి ఉంది?

మానవజాతి యెడల దేవుని సంకల్పము

మొదటి మానవుడైన ఆదాము దేవుని పరిపూర్ణ కుమారునిగా సృష్టించబడ్డాడు. (లూకా 3:38) ఆదాము చనిపోవాలని యెహోవా ఎన్నడూ ఉద్దేశించలేదు. ఆదాము, ఆయన భార్యయైన హవ్వ నిరంతరము జీవిస్తూ, పరదైసు భూమిని నింపే పాపరహిత మానవ కుటుంబమును ఉత్పత్తిచేసే ఉత్తరాపేక్షను కలిగియుండిరి. (ఆదికాండము 1:28) స్త్రీ పురుషులు మరణించుట దేవుని మొదటి సంకల్పములో భాగమే కాదు. కేవలము దైవిక ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఫలితంగానే మానవ జీవితంలో అది చోటుచేసుకొన్నది.—ఆదికాండము 2:15-17; 3:17-19.

ఈ తిరుగుబాటు గొప్ప నైతిక వివాదాంశములను లేవదీసినది. అవేమనగా దేవుని సర్వాధిపత్యపు హక్కు, ఆయన చట్టాల యెడల నమ్మకస్థులుగా ఉండే మానవ సామర్ధ్యము మొదలగునవి. ఈ వివాదాంశములను పరిష్కరించడానికి సమయము అవసరమాయెను. అయినా, మానవజాతి యెడల దేవుని సంకల్పము మారలేదు. ఆరంభించిన దానిని నెరవేర్చుటలో ఆయన తప్పిపోజాలడు. పరదైసులో నిత్యజీవమును అనుభవించే పరిపూర్ణ కుటుంబముతో భూమిని నింపే పూర్ణ ఉద్దేశముతోనే ఆయనున్నాడు. (కీర్తన 37:29; 104:5; యెషయా 45:18; లూకా 23:43) అందుచేత తిరిగి జన్మించుటను గూర్చి యేసు చెప్పిన మాటలను పరిశీలించేటప్పుడు ఈ మూల సత్యాన్ని మనము తప్పక మనస్సునందుంచుకోవాలి.

మరణించునప్పుడు ఆత్మకేమి సంభవిస్తుంది?

దేవుని పరిశుద్ధాత్మ బైబిలు వ్రాతగాళ్లకు బయలుపరచిన దానిని ఎరుగక, గ్రీకు తత్త్వవేత్తలు జీవిత అర్థమును తెలుసుకోవడానికి పోరాడారు. కొద్ది సంవత్సరాలే, తరచు దుర్భలమైన స్థితిలో జీవించి మనుష్యుడు చివరకు నశించిపోవడానికే ఉన్నాడను దానిని వారు నమ్మలేక పోయారు. ఈ విషయంలో వారు సబబుగానే ఉన్నారు. కాని మరణించిన తరువాత మనుష్యునికి ఉంటాయని వారు తలంచిన ఉత్తరాపేక్షలు మాత్రం వాస్తవమైనవి కావు. మరణించిన తరువాత మరో రూపంలో మానవ ఉనికి కొనసాగుతూ ఉండే, అమర్త్యమైన ఆత్మ ప్రతిఒక్కరిలో ఉంటుందనే ముగింపుకు వారు వచ్చారు.

ఇటువంటి దృక్పథముల ప్రభావము యూదులపైనా నామకార్ధ క్రైస్తవులపైనా పడింది. హెవెన్‌—ఎ హిస్టరీ అనే పుస్తకము చెప్పునట్లు: “బబులోను చెర తర్వాత చెదరిపోయిన యూదులు, గ్రీకు జ్ఞానులను కలిసిన ప్రతిచోటా ఆత్మ అమర్త్యమైనదను తలంపు వ్యాపించింది.” ఆ పుస్తకము ఇంకా అనేదేమనగా: “ఆత్మను గూర్చిన గ్రీకు సిద్ధాంతములు యూదులపైనా చివరకు క్రైస్తవులపైనా చెరగని ముద్రవేసినవి. . బైబిలు సాంప్రదాయముతో ప్లేటో తత్వశాస్త్రమును గట్టిగా ముడిపెట్టుటలో ఫిలో [అలెక్జాండ్రియవాడైన మొదటి శతాబ్దపు యూదా తత్త్వవేత్త] తదుపరి క్రైస్తవత్వపు ఆలోచనాపరులకు మార్గాన్ని చూపాడు.”

ఫిలో నమ్మిన దేమిటి? అదే పుస్తకం ఇంకా ఇలా అంటుంది: “అతని దృష్టి ప్రకారం మరణమనేది ఆత్మను దాని తొలి దశకు అంటే జన్మకు ముందునాటి స్థితికి చేరుస్తుంది. ఆత్మ ఆత్మీయ లోకానికే సంబంధించినది కావున శరీరముతో జీవించటమనేది కేవలం స్వల్పకాలిక, దురదృష్టకర కథాంశమే.” ఏమైననూ ఆదాముయొక్క పూర్వ జన్మ స్థితి శూన్యమే. బైబిలు వృత్తాంతం ప్రకారము మరణం ద్వారా ఉన్నత స్థితికైనా లేక అధోస్థితికైనా యాంత్రికంగా మరో లోకానికి మారే ముందు భూమి కేవలం ఒక రంగ స్థలం మాదిరిగానే ఉండాలని దేవుడు ఎన్నడూ సంకల్పించలేదు.

దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలులో మానవ ఆత్మ అమర్త్యమైనదను నమ్మకమే బోధించబడలేదు. కనీసం ఒక్కసారైన అది “అమర్త్యమైన ఆత్మ” అను పదమును ఉపయోగించలేదు. ఆదికాండము 2:7 ఇట్లంటున్నది: “దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.” మానవజాతి యెదుట ఎప్పుడు కూడా పరలోకమందు నిత్యజీవమైనా లేక నరకాగ్నిలో నిత్యయాతనైనా భవిష్యత్‌ ఉత్తరాపేక్షగా ఉంచబడలేదు. మరణించే ఆత్మకు లేక వ్యక్తికి స్మారకముతో కూడిన ఉనికే లేదని బైబిలు చూపుతుంది. (కీర్తన 146:3, 4; ప్రసంగి 9:5, 10; యెహెజ్కేలు 18:4) అందువలన ఆత్మవిషయంలో తత్త్వవేత్తలందరు లేఖనానుసారముకాని దృక్పథములనే కలిగియున్నారు. తిరిగి జన్మించుటను గూర్చిన యేసు మాటలను గ్రహించుకొనేటప్పుడు మనం మన గ్రహింపుకు ఆటంకముగా అటువంటి మోసపూరిత తలంపులు అడ్డురాకుండునట్లు జాగ్రత్తపడవలసియున్నాము.

రాజులుగా పాలించుటకు తిరిగి జన్మించుట

నీకొదేముతో యేసు “క్రొత్తగా జన్మించినవారు (తిరిగి జన్మించినవారు NW) దేవుని రాజ్యములో ప్రవేశించుదురని చెప్పెను.” (యోహాను 3:3-5) ఆ రాజ్యమేమిటి? మానవ చరిత్ర ఆరంభములో యెహోవా దేవుడు, సూచనార్థక భాషలో ఒక ప్రత్యేక “సంతానము”ను—అనగా రాబోవు పరిపాలకుని—ఆది సర్పమైన అపవాదియగు సాతాను తలను నలుగగొట్టుటకు ఉపయోగించునని సూచించాడు. (ఆదికాండము 3:15; ప్రకటన 12:9) లేఖనములలో క్రమేపి బయలుపరచబడినట్లు దేవుని సర్వాధిపత్యపు సాటిలేని ప్రదర్శనగా ఉపయోగించబడే మెస్సియా రాజ్యాన్ని, సహపరిపాలకులతో పాలించే యేసుక్రీస్తుగా ఈ “సంతానము” గుర్తించబడింది. (కీర్తన 2:8, 9; యెషయా 9:6, 7; దానియేలు 2:44; 7:13, 14) ఇది పరలోక రాజ్యము. అనగా యెహోవా సర్వాధిపత్యపు సత్యత్వమును రుజువుపరచి మానవజాతిని పాప మరణ దాసత్వమునుండి రక్షించే పరలోక ప్రభుత్వమైయున్నది.—మత్తయి 6:9, 10.

యేసుతో పాటు సహపరిపాలకులుగా మానవులలోనుండి కొనబడిన 1,44,000 మంది ఉంటారు. (ప్రకటన 5:9, 10; 14:1-4) మెస్సియా రాజ్యములో క్రీస్తుతోపాటు పాలించుటకు, ఆదాముయొక్క అసంపూర్ణ మానవ కుటుంబమునుండే “మహోన్నతుని పరిశుద్ధులు”గా అగుటకు కొంతమందిని దేవుడు ఎన్నుకున్నాడు. (దానియేలు 7:27; 1 కొరింథీయులు 6:2; ప్రకటన 3:21; 20:6) ‘తిరిగి జన్మించాలి’ అని చెప్పబడిన ఈ స్త్రీ పురుషులు యేసుక్రీస్తు యందు విశ్వాసముంచుదురు. (యోహాను 3:5-7) ఎలా మరియు ఎందుకు ఈ జన్మము జరుగుతుంది?

ఈ వ్యక్తులు క్రీస్తుయొక్క అనుచరులుగా నీటిద్వారా బాప్తిస్మము పొందియున్నారు. క్రీస్తు విమోచన క్రయధన బలి ఆధారంగా దేవుడు వారి పాపములను క్షమించి, నీతిమంతులుగా తీర్చి, వారిని తన ఆత్మీయ కుమారులుగా స్వీకరించాడు. (రోమీయులు 3:23-26; 5:12-21; కొలొస్సయులు 1:13, 14) అటువంటి వారితో పౌలు ఇలా చెబుతున్నాడు: “మీరు. . .దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగినవారమై మనము—అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.”—రోమీయులు 8:15-17.

క్రీస్తు అనుచరులుగా వీరు నూతన జన్మను లేక జీవితములో నూతన ప్రారంభాన్ని కలిగియున్నారు. అది యేసుతోపాటు పరలోక స్వాస్థ్యమును పొందుదుమను దృఢమైన ఒప్పుదలనుబట్టి కలిగినది. (లూకా 12:32; 22:28-30; 1 పేతురు 1:23) ఈ నూతన జన్మను అపొస్తలుడైన పేతురు ఇలా వర్ణిస్తున్నాడు: “మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, ఆయన (దేవుడు) తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను.” (1 పేతురు 1:3, 4) దేవుడు యేసును పునరుత్థానముచేసినట్లే వారిని పునరుత్థానం చేస్తాడు గనుక అటువంటి వ్యక్తులకు పరలోకములో నూతన జీవితము సాధ్యమవుతుంది.—1 కొరింథీయులు 15:42-49.

భూమి విషయమేమి?

అయినను దీని భావము విధేయులైన మానవులు అందరు చివరకు భూమిని విడిచి పరలోకానికి వెళ్లేందుకు తిరిగి జన్మిస్తారని అర్థం కాదు. అటువంటి తప్పిదపు అభిప్రాయము ఫిలో లాంటి తత్త్వవేత్తలు కలిగియున్న దానిలా ఉంటుంది. ఆయన “శరీరముతో జీవితం స్వల్పకాలము గలదై తరచు దురదృష్ట కథాంశంగా ఉంటుందని” అనుకున్నాడు. కానీ యెహోవా దేవుని భూసంబంధమైన సృష్టిలో తొలుత ఏవిధమైన లోపము లేదు.—ఆదికాండము 1:31; ద్వితీయోపదేశకాండము 32:4.

మానవ జీవితం స్వల్పమైనదై, బాధాకరంగా ఉండాలని ఎన్నడూ ఉద్దేశించబడలేదు. యేసుక్రీస్తు మరియు ఆయనతోపాటు పరలోకంలో రాజులుగాను యాజకులుగాను సేవచేయుటకు తిరిగి జన్మించువారు సాతాను తిరుగుబాటు మూలంగా సంభవించిన హానికర ఫలితాలన్నిటిని లేకుండా చేస్తారు. (ఎఫెసీయులు 1:8-10) వాగ్దానముచేయబడిన ‘అబ్రాహాము’ సంతానముగా ఆయన ద్వారా “భూలోకములోని జనములన్నియు తమ్మును తాము ఆశీర్వదించుకుంటారు.” (గలతీయులు 3:29; ఆదికాండము 22:18 NW) విధేయులైన మానవ జాతికి ఇది పరదైసు భూమిపై ప్రస్తుత స్వల్పకాలిక, బాధాకరమైన జీవితం కంటె ఎంతో భిన్నమైన జీవితంగా పరిగణిస్తుంది.—కీర్తన 37:11, 29; ప్రకటన 21:1-4.

ఎవరు ప్రయోజనం పొందుతారు?

మానవజాతిని ఆశీర్వదించు దేవుని ఏర్పాటుద్వారా ప్రయోజనం పొందేవారిలో యేసు విమోచనా బలియందు విశ్వాసముంచునట్టి పునరుత్థానులగు మృతులు కూడా ఉంటారు. (యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15) వారిలో ఎక్కువమంది దేవుని గూర్చి, క్రీస్తును గూర్చి ఎన్నడూ నేర్చుకొనలేదు గనుక యేసునందు విశ్వాసముంచలేకపోయారు. యేసు మరణం పరలోకానికి మార్గం తెరవకముందే చనిపోయినట్టి బాప్తిస్మమిచ్చు యోహానులాంటి నమ్మకస్థులైనవారు కూడా అలా పునరుత్థానమగువారిలో ఉంటారు. (మత్తయి 11:11) వీరితోపాటు ‘ఆయా జనములలోనుండి వచ్చి, గొర్రెపిల్లయైన యేసుక్రీస్తు రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనిన గొప్పసమూహము’ కూడా ఉన్నారు. వారు ప్రస్తుతం యేసు యొక్క తిరిగి జన్మించిన “సహోదరుల” ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రాజ్య ప్రకటనా పనికి అనుకూలంగా ప్రత్యుత్తరమిస్తూ, శుభ్రపరచబడిన భూమిపై జీవించుటకు దేవుని యుద్ధమైన ఆర్మగెద్దోనులో తప్పించబడతారు. (ప్రకటన 7:9-14; 16:14-16; మత్తయి 24:14; 25:31-46) కావున పరలోకములో క్రీస్తుతోపాటు పరిపాలించుటకు తిరిగి జన్మించకపోయినప్పటికిని, దేవుని ఏర్పాటు ప్రకారము లక్షలమంది రక్షించబడతారు.—1 యోహాను 2:1, 2.

పరదైసు భూమిపై జీవితమును స్వతంత్రించుకొనబోవు వారిలో నీవును ఒకడవై యుందువా? యేసుక్రీస్తు విమోచనా బలియందు విశ్వాసముంచి, నిజమైన క్రైస్తవ సంఘముతో చురుకుగా సహవసించినయెడల వారిలో నీవును ఉండగలవు. ఆ సంఘం తత్వ సిద్ధాంతములచే కలుషితమైనది కాక, “సత్యమునకు స్తంభమును ఆధారమునైయున్నది.” (1 తిమోతి 3:15; యోహాను 4:24; 8:31, 32 ను పోల్చుము.) తిరిగి జన్మించిన దేవుని కుమారులు పరలోకములో పరిపాలిస్తుండగా, అద్భుతమైన పరదైసు భూమిపై దేవుని భూసంబంధమైన పిల్లలందరూ పరిపూర్ణతకు తిరిగి తేబడే ఆశ్చర్యకరమైన భవిష్యత్తు కొరకు మీరును ఎదురుచూడవచ్చును. కావున నిత్యాశీర్వాదములుగల ఆ నూతనలోకములో జీవాన్ని పొందే అవకాశం విడిచిపెట్ట వద్దు.—రోమీయులు 8:19-21; 2 పేతురు 3:13.

[6వ పేజీలోని చిత్రం]

అటు పరలోక జీవితమైనా లేక ఇటు నరకాగ్నిలో నిత్యయాతనైనా వీటిలో ఏదోఒకటి తప్పదన్న ఉత్తరాపేక్ష ఆదాము యెదుట లేదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి