కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 2/1 పేజీలు 21-22
  • విద్యాధికుడైన వ్యక్తి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విద్యాధికుడైన వ్యక్తి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆయన తార్సు నివాసి
  • రోమా పౌరుడు
  • సరియైన దృష్టి
  • రాజ్యాశీర్వాదాలను మీరూ పొందగలరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • “ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • అధికారుల ముందు సువార్తను సమర్థించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • విద్యాభ్యాసాన్ని దాని స్థానంలో ఉంచుట
    తేజరిల్లు!—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 2/1 పేజీలు 21-22

విద్యాధికుడైన వ్యక్తి

“సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్పవంశము వారైనను అనేకులు పిలువబడ లేదు.” (1 కొరింథీయులు 1:26) ఈ మాటలు సూచించునట్లు, లోక జ్ఞానమందు నిమగ్నమై యుండుటలో లేదా సమాజంలో ఉన్నత స్థానమందుండుటలో ప్రమాదమున్నది. ఒకడు సువార్త నంగీకరించుటకు అట్టి సంగతులు అడ్డంకుగా ఉండగలవు.—సామెతలు 16:5; మార్కు 10:25.

అయినప్పటికిని, పౌలు కాలంలో శరీర రీత్యా జ్ఞానులైన కొందరు సత్యము నంగీకరించారు, వీరిలో పౌలు కూడ ఉన్నాడు. పౌలు బాగా చదువుకున్న వానిగా బహుశ ఒక ప్రముఖ కుటుంబము నుండి వచ్చినా, ఆయన అత్యంత ఆసక్తిగల్గిన సువార్తికుడై యుండెను. ఆ విధంగా ఆయన ఈ లోకంలో ఆధిక్యతగలవారు, వారి హృదయం సరియైనదైతే యెహోవాను సేవించగలరని చూపించాడు. వారు తమకున్న లౌకిక సామర్థ్యాలను యెహోవా సేవలో కూడ ఉపయోగించ వచ్చును.—లూకా 16:9.

ఆయన తార్సు నివాసి

పౌలు ఆ తర్వాత వర్ణించినట్లుగా, ఆయన “గొప్పపట్టణమైన” తార్సులో జన్మించాడు. (అపొ. కార్యములు 21:39) ఆయన బహుశ అక్కడే తన మిషనరీ సేవలో అమూల్యమై ఉండగల వివిధ భాషల పరిజ్ఞానాన్ని—ప్రత్యేకంగా గ్రీకులో ప్రావీణ్యతను—సంపాదించాడు. తార్సులో పౌలు జీవితంపై యూదామత విధానాలే కాకుండ అన్యుల సంస్కృతి కూడ ప్రభావం చూపియుండవచ్చు, అన్యజనులకు అపొస్తలునిగావున్న ఆ తర్వాతి సంవత్సరాలలో ఆయన తనకున్న అట్టి అనుభవాన్ని ఉపయోగించాడు. అర్థమయ్యే రీతిలో సత్యాన్ని ఎలా వ్యక్తంచేయాలో ఆయనకు తెలుసు. (1 కొరింథీయులు 9:21) దానికొక ఉదాహరణగా, అపొ. కార్యములు 17వ అధ్యాయంలో ఏథెన్సు వారికి ఆయనిచ్చిన ప్రసంగాన్ని పరిశీలించుము. అక్కడాయన సత్యాన్ని గూర్చిన తన ప్రసంగానికి ఏథెన్సువారి మత రెఫరెన్సులను నైపుణ్యంతో ముడిపెట్టి వారి కవులలో ఒకరు చెప్పిన మాటలను సహితం ఎత్తిచూపాడు.

రోమా పౌరుడు

పౌలుకు లోకరీత్యా మరో ప్రయోజనముండెను. ఆయన రోమా పౌరుడు, కాగా ఆయన సువార్తను వ్యాప్తిచేయడానికి దానిని కూడ ఉపయోగించాడు. ఫిలిప్పీలో ఆయన, ఆయన సహవాసులు ఎలాంటి న్యాయ విచారణ లేకుండా కొట్టబడి, చెరసాలలో వేయబడ్డారు. ఒక రోమా పౌరుని విషయంలో ఇలా చేయడం అక్రమం, ఈ విషయాన్ని పౌలు అధికారుల దృష్టికి తీసుకురాగా, ఆయనక్కడేవుండి ఆ తర్వాత వేరొక ప్రాంతానికి వెళ్లు పర్యంతం సంఘానికి పరిచర్య చేయుటకు వారాయనను అనుమతించారు.—అపొ. కార్యములు 16:37-40.

ఆ పిమ్మట, గవర్నరయిన ఫేస్తు సముఖమునకు వచ్చినప్పుడు, పౌలు తన రోమా పౌరసత్వపు అవకాశాన్ని ఉపయోగించి తన విషయాన్ని కైసరుకు విన్నవించుకునే ఏర్పాటుచేయించుకున్నాడు. ఆ విధంగా ఆయన రోమా సామ్రాజ్య అత్యున్నత అధికారి యెదుట సువార్త పక్షమై వాదించాడు.—అపొ. కార్యములు 25:11, 12; ఫిలిప్పీయులు 1:7.

ఆ తర్వాతి కాలంలో ఉపయోగపడే అభ్యాససిద్ధమైన శిక్షణను పౌలు పొందాడు. బహుశ ఆయన తండ్రి ఆయనకు గుడారాలుచేసే పని నేర్పించియుండవచ్చును. అందుకు కృతజ్ఞతలు, ఎందుకంటె నిధులు కొరతగా ఉన్నప్పుడు కూడ తాను పరిచర్యలో నిలబడగలిగెను. (అపొ. కార్యములు 18:1-3) ఆయన మత సంబంధమైన విద్యనుకూడ ఎక్కువగా పొందాడు. ఆయన “పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి” వానిగాను పెరిగాడు. (అపొ. కార్యములు 23:6) అవును, ఆయన యూదామత బోధకులలో అత్యంత పేరుగాంచిన గమలీయేలునొద్ద చదువుకున్నాడు. (అపొ. కార్యములు 22:3) బహుశ ఈనాటి నాణ్యతగల విశ్వవిద్యాలయ విద్యకు పోల్చదగిన అట్టి విద్య, ఆయనది బహు ప్రాముఖ్యమైన కుటుంబమని సూచిస్తున్నది.

సరియైన దృష్టి

పౌలు గతజీవితం, ఆయన కివ్వబడిన శిక్షణ యూదామతంలో ఆయనకు ఉజ్వల భవిష్యత్తునిచ్చింది. ఆయన ఆ మతంలో ఎంతో విజయం సాధించి యుండగల్గేవాడు. అయితే, యేసును మెస్సీయగా అంగీకరించిన తర్వాత, పౌలు గురి మారిపోయింది. ఫిలిప్పీయులకు వ్రాస్తూ, లోకసంబంధమైన తన గత జీవిత ప్రయోజనాల్ని కొన్నింటిని ప్రస్తావించి ఆయనిలా అన్నాడు: “ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.”—ఫిలిప్పీయులు 3:7, 8.

ప్రాపంచిక విద్యతో తాను చేయగల్గిన దానిని కోరుకుంటూ ఈ విద్యావంతుడు వెనుదిరిగి చూడలేదు; లేక ఇతరులు తనకు భయపడునట్లు తన “పాండిత్యాన్ని” ఉపయోగించి వారిని బెదరగొట్టలేదు. (అపొ. కార్యములు 26:24 NW; 1 కొరింథీయులు 2:1-4) బదులుగా, ఆయన యెహోవా దేవునియందు పూర్తి విశ్వాసముంచి, తన గత ఉత్తరాపేక్షలను సూచిస్తూ యిలా అన్నాడు: “వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.” (ఫిలిప్పీయులు 3:13, 14) పౌలు ఆత్మీయ విషయాలకు ఎంతో విలువనిచ్చాడు.

అయినప్పటికిని, పౌలు గతమందు తాను పొందిన శిక్షణను యెహోవా సేవలో ఉపయోగించాడు. “వారు దేవునియందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను” అని యూదులను గూర్చి చెప్పినప్పుడు, ఆయన తన వ్యక్తిగత అనుభవం నుండే మాట్లాడాడు. (రోమీయులు 10:2) పరిసయ్యునిగా, ఆయన దేవుని యెడల, లేఖనముల యెడల నిశ్చయముగా ఎంతో ఆసక్తి కలిగియుండెను. క్రైస్తవుడైన తర్వాత పౌలు ఆసక్తి ఖచ్చితమైన జ్ఞానముచే పదునెక్కింది, మరియు ఆయన తనకున్న పూర్వ విద్యను ఒక నీతియుక్తమైన సంకల్పము కొరకు ఉపయోగించగల్గాడు. ఉదాహరణకు, హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో, క్రైస్తవ విధానపు ఉన్నతత్వాన్ని ప్రదర్శించుటకు ఆయన ఇశ్రాయేలీయుల చరిత్ర, ఆలయమందలి ఆరాధన విషయమై తనకున్న అపారమైన జ్ఞానాన్ని ఉపయోగించాడు.

ఈనాడు శరీరరీత్యా జ్ఞానులైన కొందరు కూడా సువార్తకు ప్రతిస్పందిస్తున్నారు. అన్నిరకాల విద్యార్హతలున్న వారు, ఆలాగే అన్ని రకాల వృత్తులు, ఉద్యోగాలున్న వ్యక్తులు సత్యాన్ని అంగీకరించి, తమ గత శిక్షణను యెహోవా సేవలో ఉపయోగించారు. వారి లౌకిక విద్య ఏదైనప్పటికిని, ఆత్మీయార్హతలు ఆవశ్యకమనే విషయాన్ని క్రైస్తవులెన్నడూ మర్చిపోరు. అవి మనలను నిత్యజీవానికి నడిపించ గలవు గనుక అవి “శ్రేష్ఠమైన కార్యములై” యున్నవి.—ఫిలిప్పీయులు 1:10.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి