కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 1/15 పేజీలు 20-23
  • పెద్దలారా—పని అప్పగించండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పెద్దలారా—పని అప్పగించండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇతరులకు తర్ఫీదిచ్చుటలోని విలువ
  • అప్పగించడమంటే అర్థమేమిటి?
  • పని అప్పగించేదెలా
  • ఇతరులకు బాధ్యతలను ఎందుకు అప్పగించాలి? ఎలా అప్పగించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • అణకువగల పురుషులు శిక్షణ ఇస్తారు, బాధ్యతలు అప్పగిస్తారు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • పెద్దలారా భారాన్ని మోసేందుకు ఇతరులకు శిక్షణనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ‘ఈ విషయాల్ని నమ్మకస్థులైన పురుషులకు అప్పగించు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 1/15 పేజీలు 20-23

పెద్దలారా—పని అప్పగించండి!

ఆయన ఓపికగలవాడు, సాత్వికుడు, తన జీవితములోని అనుభవములనుబట్టి న్యాయబుద్ధిని సంపాదించినవాడు. అందుచేతనే ముప్పై లక్షలమందికి పైగా పురుషులు, స్త్రీలు, పిల్లలు నమ్మకముతో ఆయన సలహా కొరకు కనిపెట్టారు. ఆయన వారిని నిరుత్సాహపరచకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వారి సమస్యలను విని, వారి వారి పరిస్థితులకు దేవుని నియమములు ఎలా అన్వయిస్తాయో చూడగలిగేందుకు ఓపికతో సహాయపడ్డాడు. అవును దాదాపు 3,500 సంవత్సరముల క్రితము మోషే అను ఒక్క మనుష్యుడే కొద్దికాలంపాటు ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి న్యాయం తీర్చాడు.

ఏమైనను, మోషే మామయైన యిత్రో దీనిని శ్రద్ధగా గమనించాడు. ఇంతటి వత్తిడిని మోషే ఒక్కడే ఎంతకాలము తాళుకొనగలడు? యిత్రో ఇలా అన్నాడు: “నీవు చేయుచున్న పని మంచిది కాదు; నీవును నీతోనున్న యీ ప్రజలును నిశ్చయముగా నలిగిపోవుదురు; ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయచాలవు.” (నిర్గమకాండము 18:17, 18) మరి పరిష్కార మేమిటి? తన బాధ్యతలలో కొన్నింటిని ఇతరులకు అప్పగించమని యిత్రో మోషేకు సలహాయిచ్చెను. (నిర్గమకాండము 18:19-23) మంచి సలహాయే!

ఈనాడు క్రైస్తవ సంఘములో మోషే వలె తాము నెరవేర్చలేని అనేక బాధ్యతలను నిర్వహించుటకు ఒంటిగా కష్టపడి పనిచేసే అనేకమంది పెద్దలున్నారు. కూటములను ఏర్పాటుచేయడం, సిద్ధపడి వాటి కార్యక్రమాలను క్రమముగా, సమర్థవంతంగా కూటములలో అందించడం చేస్తున్నారు. (1 కొరింథీయులు 14:26, 33, 40; 1 తిమోతి 4:13) అంతేగాక సంఘములోని ఆయా వ్యక్తుల అవసరతలను గూర్చి పెద్దలు శ్రద్ధవహిస్తున్నారు. (గలతీయులు 6:1; 1 థెస్సలొనీకయులు 5:14; యాకోబు 5:14) అన్నింటికంటె ప్రాముఖ్యమైన పనియైన రాజ్యసువార్త ప్రకటన పనిలో వారు నాయకత్వం వహిస్తున్నారు. (మత్తయి 24:14; హెబ్రీయులు 13:7) ప్రజలకు అందించటానికి సంఘములో తగినంతగా సాహిత్యములు అందుబాటులో ఉండేలా కూడా ఏర్పాటుచేస్తున్నారు.

వీటితోపాటు, కొంతమంది పెద్దలకు ప్రాంతీయ సమావేశము మరియు జిల్లా సమావేశ కార్యక్రమములలో భాగాలు నియమించబడుతున్నాయి. సమావేశ ఏర్పాటు సభ్యులుగాను, ఆసుపత్రి అనుసంధాన కమిటీ సభ్యులుగాను సేవ చేస్తుంటారు. కొందరు రాజ్యమందిర నిర్మాణములో సహాయపడతారు. అయినా, ఇవన్నీ వారి కుటుంబ బాధ్యతలు, తమమట్టుకు తమను ఆత్మీయంగా పోషించుకొనవలసిన బాధ్యతలకు అదనంగా ఉన్నవే. (యెహోషువ 1:8; కీర్తన 110:3; 1 తిమోతి 3:4, 5; 4:15, 16 పోల్చండి.) అయితే, అటువంటి క్రైస్తవ పురుషులు ఈ పని అంతటిని ఎలా నిర్వహించ గలుగుతున్నారు? మోషే వలె వారికి కూడా సహాయం తప్పక కావాలి. ఇతరులకు పని అప్పగించడాన్ని వారు నేర్చుకోవాలి. నిజానికి, ఇతరులకు పనిని అప్పగించని వాడు సరైన నిర్వాహణ క్రమం లేనివాడు.

ఇతరులకు తర్ఫీదిచ్చుటలోని విలువ

బాధ్యతలను అప్పగించుటకు ఇతర కారణాలును ఉన్నవి. యేసుయొక్క తలాంతుల ఉపమానములో యజమాని దూరప్రాంతమునకు ప్రయాణమై వెళ్లునప్పుడు, తన దాసులను పిలిపించి వారికి వివిధ మోతాదులలో బాధ్యతలనప్పగించాడు. (మత్తయి 25:14, 15) అలాచేయడం వలన యజమాని అనేక లక్ష్యాలను సాధించగలిగాడు. ఒకటి, ఆయన దగ్గరలో లేని కాలంలో దాసులు ఆయన స్థానమును చేపట్టి అవసరమైన పనిని, ఆలస్యం కాకుండా జరిగిపోయేలా చూశారు. రెండవది, మాటలకంటె క్రియలే బాగా మాట్లాడతాయి గనుక, యజమాని తన దాసుల సామర్ధ్యాన్ని, నమ్మకత్వాన్ని పరిశీలించగలిగాడు. మూడవది, తన దాసులు వారికి అవసరమైన అనుభవాన్ని సంపాదించుకొనే అవకాశాన్ని యజమానుడు వారికిచ్చాడు.

ఈ ఉపమానము నేడు మనకు అర్థాన్ని కలిగివుంది. యేసు భూమిని విడిచి వెళ్లినప్పుడు, ఆయన తన అభిషక్త శిష్యులకు బాధ్యతనప్పగించివెళ్లాడు. వారిలో ఇంకను మిగిలియున్నవారు ప్రపంచవ్యాప్తమైన రాజ్యాసక్తుల విషయంలో ఇప్పటికీ బాధ్యత కలిగియున్నారు. (లూకా 12:42) అభిషక్తుల ఆధునిక-దిన గృహనిర్వాహకత్వ కాలంలో యెహోవా ఆశీర్వాదము తన సంస్థపై ఉన్నట్లు రూఢియైనది. తత్ఫలితంగా, అది అద్భుతంగా పెరిగింది. కేవలం గత అయిదేండ్లలోనే పదిలక్షలకంటె ఎక్కువమంది క్రొత్తవారు తమ సమర్పణను నీటిబాప్తిస్మముద్వారా సూచించారు. ఇది వేలాది క్రొత్త సంఘములు మరియు వందలాది క్రొత్త సర్య్కూట్ల ఆవిర్భవానికి కారణమైంది.

యేసుక్రీస్తు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన” దాసునికి బాధ్యతలను అప్పగించినట్లే, వారును తిరిగి “వేరే గొర్రెల” లోని పెద్దలకు, మరియు పరిచారకులకు సంఘ బాధ్యతలను అప్పగించారు. (మత్తయి 24:45-47; యోహాను 10:16) అయినను, విస్తారంగా పెరిగిపోతున్న అభివృద్ధి విషయంలో శ్రద్ధతీసుకునేందుకు సమర్పించుకున్న పురుషులు అనేకమంది అవసరమైయున్నారు. వారు ఎక్కడనుండి వస్తారు? పెద్దలు వారికి శిక్షణ యివ్వాలి. సామర్ధ్యతగలవారిగా కనిపించే వ్యక్తులకు బాధ్యతలను అప్పగించకపోతే పెద్దలు అలాంటి పురుషులకు ఎలా శిక్షణ నివ్వగలరు? యౌవనులైన పురుషుల సామర్ధ్యాలను, వారి యథార్థతలను పరిశీలించే అవకాశాన్ని పెద్దలు ఎలా పొందగలరు?

అప్పగించడమంటే అర్థమేమిటి?

కొంతమంది దృష్టిలో “అప్పగించడం” అంటే భారాన్ని దింపుకోవడం, తొలగించుకోవడం, నిర్లక్ష్యంచేయడం, బాధ్యతలను తప్పించుకోవడం అనే అర్థమై వున్నది. కాని, సరైన రీతిగా ఉపయోగిస్తే, “అప్పగించడం” నిజంగా బాధ్యతలను నెరవేర్చే మార్గము. ఇంగ్లీషు క్రియాపదము “టు డెలిగేట్‌” అనేది, “మరొకరి బాధ్యతక్రింద అప్పగించడం; ఒకరిని ప్రతినిధిగా నియమించుకోవడం; అధికారాన్ని లేక బాధ్యతను అప్పగించడం” అని నిర్వచించబడింది. ఏదేమైనను, అది ఎలా నెరవేర్చబడిందనే దానికి చిట్టచివరకు అప్పగించేవాడే బాధ్యుడైయుంటాడు.

కొంతమంది దానిపై ఆధిపత్యం తొలగిపోతుందేమోనన్న భయంచేత ఇతరులకు బాధ్యతను అప్పగించడానికి వెనుకాడుతుంటారు. అయినా, అప్పగించడమంటే ఆధిపత్యం పోతుందని అర్థం కాదు. అదృశ్యుడై పరలోకము నుండి ఏలుచున్నను, క్రైస్తవ సంఘమును క్రీస్తుయేసు పూర్తిగా తన ఆధిపత్యం క్రింద ఉంచుకొనియున్నాడు. ఆయన తిరిగి ఆ సంఘమును అనుభవముగల పురుషుల కాపుదల క్రిందికి అప్పగిస్తున్నాడు.—ఎఫెసీయులు 5:23-27; కొలొస్సయులు 1:13.

కొందరు ఆ పనిని ఇతరులకంటే తామే తొందరగా చేసుకోగలమనే భావనతో బాధ్యతను అప్పగించడానికి యిష్టపడరు. కానీ యేసు ఇతరులకు తర్ఫీదునిచ్చే విలువను గుర్తించాడు. భూమిమీదనున్న ఎవరును యేసు కంటె ఎక్కువ సమర్థవంతంగా బోధించలేదు. (యోహాను 7:46) అయినా తన డెబ్బది మంది శిష్యులకు ఉపదేశాలిచ్చిన తర్వాత వారిని ప్రకటన పనిలోకి పంపెను. బోధించే సామర్ధ్యంలో వారు యేసు అంతటివారు కాకపోయినను తమ విజయాన్ని బట్టి వారు అమితానందముతో తిరిగి వచ్చారు. యేసు వారితోపాటు సంతోషించి వారిని అభినందించెను. ఎందుకంటే ఆయన వెళ్లిపోయిన తరువాత ఆపనిని వారు దీర్ఘకాలము కొనసాగించి, తాను ఒంటరిగా చేసే దానికంటె తుదకు ఎంతో ఎక్కువ సాధిస్తారని ఆయనకు తెలుసు.—లూకా 10:1-24; యోహాను 14:12.

పని అప్పగించడంలో అవసరమైన ప్రతిచిన్న పనులందును సహాయం చేయించు కోవడమనే భావం కూడా ఉంది. యేసు చనిపోయే ముందురోజున పేతురు యోహానులకు ఆయన చివరి పస్కా భోజనమును సిద్ధపరచే ఏర్పాట్లను చేయమని పని అప్పగించాడు. (లూకా 22:7-13) గొర్రెను, ద్రాక్షారసమును, పులియని రొట్టెను, చేదుకూరలను కొనే విషయంలో యేసు చింతించనవసరం లేదు. లేక పాత్రలు, వంటకు కావలసిన కర్ర లేక ఇతరములను సమకూర్చవలెనని వాటిని గూర్చి ఆయన చింతించనవసరం లేదు. వాటిని గూర్చిన పని పేతురు, యోహానులు చూసుకొన్నారు.

అలాగే ఈనాటి పెద్దలు కూడా యేసును అనుకరించినట్లయిన అలాంటి ప్రయోజనాలనే పొందగలరు. ఉదాహరణకు సాహిత్యములను చూసేవ్యక్తికి, రాబోవు కాంపైన్‌కు అవసరమైన సాహిత్యం అందుబాటులో ఉండేలాగున ఆర్డరు చేయమని చెప్పవచ్చును. ఫలానా సాహిత్యం గతములో ఎలా ఉపయోగించబడిందో తెలుసుకోవడానికి తన రికార్డులను పరిశీలించి చూసుకొమ్మని ఉపదేశించవచ్చును. అంతేగాక అతడు ఆర్డరు చేసేముందు, సంఘ సేవా ప్రాంతములోని వ్యక్తుల తత్వమెలా ఉంటుందో గమనించి ఆర్డరు ఫారం నింపవచ్చును. ఆ తదుపరి దానిని సంఘ కార్యదర్శి పరిశీలనకై ఆయనకివ్వవచ్చును. కాబట్టి ఒకసారి లిటరేచర్‌ సర్వెంటు తన పనిని ఎలా చెయ్యాలో నేర్చుకుంటే, ఇక సెక్రెటరీ ఆర్డరు ఫారంలో చూపిన పుస్తకాల సంఖ్య కారణసహితంగా ఉందో లేదో చూడటానికి రికార్డులను రెండుసార్లు పరిశీలన చేయవలసిన అవసరముండదు. కాబట్టి ఇలా స్వల్పమైన అప్పగించే క్రియనుబట్టి, తత్సంబంధమైన వారందరికి లిటరేచర్‌ ఆర్డరు చేసేపని ఎంతో సుళువైనది, సరళమైనదౌతుంది.

అలాంటి ప్రయోజనాలనుబట్టి, ఒక వ్యక్తి సమర్థవంతంగా తన పనిని ఇతరులకెలా అప్పగించగలడు?

పని అప్పగించేదెలా

పనిని వివరించండి. మొదట ఏ ఫలితాలు ఆశించబడుతున్నాయో విశదం చెయ్యండి. యేసు చెప్పిన మీనాల ఉపమానములో రాజకుమారుడు “నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని” తన పదిమంది దాసులతో చెప్పెను. (లూకా 19:12, 13) యజమాని వారు తీసుకున్న మినాలతో వారు లాభదాయకంగా వ్యాపారంచేసి ఆయన తిరిగివచ్చిన వెంటనే ఆ లాభాలను ఆయనకు నివేదించాలని కోరాడు. వారు చేయవలసిన పని ఏమిటో వారికి తెలుసు. నేటి ఆధునిక రాజ్యమందిర నిర్మాణ పథకంలో ఆ సూత్రం ఎలా అన్వయిస్తుంది? ఉదాహరణకు, పైకప్పు బాగుచేసే పని అప్పగించబడిన సహోదరునితో ఎలాంటి సామాగ్రిని వాడాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, పనిని ఎప్పుడు ప్రారంభించాలి, వాతావరణం అనుకూలిస్తుందా అనేవాటిని సామాన్యంగా చెప్పాలి. అలాంటి నిర్థిష్టమైన మార్గనిర్దేశకాలు మంచి వ్యవస్థీకరణకు తోడ్పడతాయి.

పనిలో ఏమేమి చేరివుందనేదే కాక, ఏ తీర్మానాలను తాను స్వంతగా చేయవచ్చు, ఏ విషయాలను ఇతరులతో సంప్రదించాలనే దాన్ని కూడా వివరించాలి. మోషే తాను నియమించిన మనుష్యులతో వారు అల్పవిషయములను తీర్చవచ్చునుగాని, గొప్పవ్యాజ్యెములను తనయొద్దకు తీసుకురావాలని తెలియజేశాడు.—నిర్గమకాండము 18:22.

బాధ్యతలను అప్పగించేటప్పుడు, ఒకే పనిని ఇద్దరికి అప్పగించకుండ ఉండేలా జాగ్రత్తపడాలి. ఆ పనిని ఒకరికంటె ఎక్కువమందికి అప్పగిస్తే గందరగోళం ఏర్పడుతుంది. యెహోవా సాక్షుల పెద్ద సమావేశాలలో మిగిలిన ఆహారాన్ని శుభ్రంచేసే పనిని పరిశుభ్రం చేసే విభాగానికి, అలాగే ఆహార సరఫరా విభాగానికి అప్పగిస్తే, లేక బాప్తిస్మమిచ్చే సమయంలో చూడటానికి ఇష్టపడేవారిని నడిపించే పనిని అటెండెంట్‌ విభాగానికి, అలాగే బాప్తిస్మపు విభాగానికి అప్పగిస్తే ఏమి సంభవిస్తుందో ఊహించండి.

సామర్థ్యం గలవారిని ఎంపిక చెయ్యండి. యిత్రో మోషేకు యిలా సలహాయిచ్చాడు: “నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వారిని ప్రజలపై నియమించుము.” (నిర్గమకాండము 18:21) నిశ్చయంగా, మొదట ఒక మనుష్యుడు ఆత్మీయ అర్హతలను కలిగివుండవలెను. అందుబాటులోవున్న ఒక పనిని చేయుటకు ఒకడు “సామర్థ్యము” గలవాడా అని నిర్ణయించుటకు, వ్యక్తిత్వపు లక్షణాలు, అనుభవము, తర్ఫీదు, సామర్ధ్యములు మొదలగువాటిని పరిగణలోనికి తీసుకోవాలి. అందునుబట్టి స్నేహపూర్వకంగా, ఆహ్లాదంగా, సహాయపడే మనస్తత్వముగల క్రైస్తవుడు పత్రికలనిచ్చే కౌంటర్‌లోనో, లేక అటెండెంట్‌గానో ఉంటే బాగుంటుంది. అలాగే, సంఘ కార్యదర్శికి సహాయకునిగా ఉండేవాడు చక్కని వ్యవస్థీకరణగలవాడై యుండటం సహేతుకంగా ఉంటుంది. అతడు ప్రతిదాన్ని విశదంగా చూసే వ్యక్తియేనా, విశ్వాసపాత్రుడా, నమ్మదగినవాడా? (లూకా 16:10) ఆత్మీయ అర్హతలకు తోడుగా ఇలాంటివాటిని పరిగణలోకి తీసుకోవడం ఆ పనికి సరైన వ్యక్తిని పెట్టుటలో సహాయకరంగా ఉండును.

తగినన్ని వనరులను అందించండి. ఒక పనికి నియమించబడినవాడు తన పనిని పూర్తిచేయుటకు కొన్ని వనరులను అందుబాటులో కలిగివుండటం అవసరం. ఒకవేళ ఆ వ్యక్తికి పనిముట్లు, నిధులు, లేక సహాయము కూడా అవసరం కావచ్చును. అందుచేత కావలసిన వనరులను అందివ్వండి. ఉదాహరణకు ఒక సహోదరుని రాజ్యమందిరానికి అవసరమైన మరమ్మత్తులను చేయమని అడగవచ్చును. అప్పుడు నిశ్చయంగా ఆ వ్యక్తికి ఏమిచెయ్యాలో చెప్పబడుతుంది. అయితే ఆయనకు వెంటనే అవసరమైన వస్తువులను కొనడానికి చిన్నమొత్తంలో కొంతడబ్బు అవసరము కావచ్చును. ఆయనకు సహాయమవసరమౌతుంది. కాబట్టి పెద్దలు ఇతరులను ఆయనకు సహాయము చేయమని అడగవచ్చును. లేదా సంఘములో ఫలానా సహోదరుడు హాలులో ఫలానా పనిచేస్తున్నాడు, ఆయన మీలో ఎవరినైనా సహాయం కొరకు అడగవచ్చును’ అని ముందే సంఘంలో ప్రకటన చేయవచ్చును. అటువంటి ముందు తలంపు ఒకరిని సరైన వనరులు లేకుండా పని అప్పగించే విధానము నుండి కాపాడుతుంది. “సగం పని అప్పగించవద్దు” అని ఒక నిర్వాహణకర్తల సలహాదారుడు వ్యక్తపరచాడు.

బాధ్యతలను అప్పగించేటప్పుడు, నీ బదులు ఆయన పనిచేస్తున్నాడని ఇతరులకు తెలియజెప్పుము. నీ స్థానం తీసుకొని పనిచేయడానికి అధికారం పొందటం కూడా ఒక వనరే. యెహోషువ ఇశ్రాయేలీయుల “సర్వసమాజము” ఎదుట, వారి నూతన నాయకునిగా నియమించబడెను. మోషేకు తన “ఘనతలో కొంత ఆయనకివ్వ” మని చెప్పబడెను. (సంఖ్యాకాండము 27:18-23) సంఘములో ఎవరెవరికి ఏమేమి పనులు అప్పగించ బడియున్నాయో సమాచార బోర్డు మీద వారి పేర్లను వ్రాసిపెట్టుట ద్వారా దానిని చేయవచ్చును.

వారి తీర్మానములను బలపరచుము. నియమించబడినవాడు ఇక తన పనిని చేసుకుంటూ వెళ్లవచ్చును. అయితే ఆయన చేసే మంచి తీర్మానములను బలపరచుట ద్వారా ఆయనకు నీవు నిజమైన ప్రోత్సాహకరంగా ఉండగలవు. ఉదాహరణకు, ఒక పెద్దగా రాజ్యమందిరపు వేదికపై సామాగ్రినేగాని, మైక్రోఫోన్‌నేగాని అమర్చే విషయాలలో నీ వ్యక్తిగత అభిరుచియుండవచ్చును, బహుశా అది ఆ పనికి నియమించబడిన సహోదరుని అభిరుచికి భిన్నంగాను ఉండవచ్చును. అయితే, వేదికనుగూర్చి శ్రద్ధ తీసుకోవడానికి నియమించబడిన వ్యక్తికి ఇలాంటిపనులలో కొంత స్వాతంత్ర్యమునిస్తే, అతనికి తన పనియెడల నమ్మకం పెరిగి అనుభవము సంపాదించుకుంటాడు. అంతేగాక ఆయన దానిలో అభివృద్ధికూడా చేసుకోవచ్చును. ఒక వ్యాపార సలహా దారుడు ఇలా అంటున్నాడు: “పనిని అప్పగించుము, అది ఎలా చేయబడుతుందనేది కాదు. . . .తరచు సృజనాత్మకత ఆవిర్భవిస్తుంది.”

అంతేగాక, ఒక ప్రత్యేకమైన పనిచేసే సహోదరునికి, దానిని గూర్చి మంచి అవగాహన కల్గివున్నందువలన దానికి సంబంధించిన సమస్యలను బాగా అర్థం చేసుకొనవచ్చును. ఆలాంటి సమస్యలను అతడు సులభంగా పరిష్కరించగలగవచ్చును. బయటినుండి చూస్తున్నవారికి కన్పించని వాస్తవాలనుకూడా అతడెరిగియుండవచ్చును. అందుకే ఒక క్రైస్తవ అధ్యక్షుడు అనుభవము కలిగిన తన సహాయకుని గూర్చి ఇలా అంటున్నాడు: “ఫలానా దాంట్లో కొన్ని సమస్యలున్నాయని అతడు చెబితే, నేను నమ్మాల్సిందే.”

అవును, క్రైస్తవ పెద్దలకు ఎంతోవిలువైన నిధి ఏమంటే, ఎలా నడిపిస్తే అలావెళ్లి పనిచేయుటకు యిష్టపడే సమర్పించుకున్న పురుషులు, స్త్రీలే. పెద్దలారా ఈ శ్రేష్ఠమైన పద్ధతిని ఉపయోగించండి! పని అప్పగించడమనేది వినయమునకు గురుతు. అది వత్తిడిని, వ్యాకులతను తగ్గించును. ఆ విధంగా మీరు ఎక్కువ చేయడానికి నడిపించబడటమే కాకుండా ఇతరులు కూడా అవసరమైన అనుభవాన్ని సంపాదించుకోవడానికి మీరు అవకాశమిస్తారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి