కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 9/1 పేజీలు 30-31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • భయంకరమైన క్రూరమృగాలకు భయపడకండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • రెండు భయంకరమైన మృగాలతో పోరాడుట
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • మహాబబులోనును నాశనము చేయుట
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 9/1 పేజీలు 30-31

పాఠకుల ప్రశ్నలు

కొన్ని భాషాంతరములలో ప్రస్తావించబడినట్లు, యూనికొర్న్‌ల (Unicorns) (నడినెత్తిన కొమ్ముగల గుర్రములవంటి జంతువుల) ఉనికిని బైబిలు బలపరచుచున్నదా?

కింగ్‌జేమ్సు, డుయే, ఇతర భాషాంతరములు యూనికోర్న్‌లను గూర్చి ప్రస్తావించినవి. అయితే హెబ్రీభాషను ప్రామాణికముగా అనువదించు ఆధునిక భాషాంతరములు ఆ విధంగా ప్రస్తావించ లేదు.—కీర్తన 22:21; 29:6; 92:10 (21:22; 28:6; 91:11, డుయే.)

అనేక శతాబ్దాలుగా శరీరము తల గుర్రానిది, కాళ్లు జింకవి, తోక సింహానిదిగల ఒక విధమైన జంతువును గూర్చిన అనేక కల్పితకథలు చెప్పబడినవి. ఈ కల్పిత ప్రాణికున్న ఒక విభిన్నమైన ఆకృతియేమనగా, దాని నడినెత్తిన మెలికలు తిరిగియున్న ఒక కొమ్మువుండును.a

“యూనికోర్న్‌ కొమ్ములో విషానికి విరుగుడుగా ఉండెనని ప్రజలు ఒక్కప్పుడు నమ్మారు, మరియు మధ్యయుగాలలో, అటువంటి కొమ్ములనుండి తయారుచేయబడిన చూర్ణములను అత్యంత ఎక్కువ ధరకు అమ్మేవారు. యూనికోర్న్‌ రూపము ఖడ్గమృగాలను గూర్చిన ఐరోపా వృత్తాంతాల వదంతినుండి వచ్చినదని అనేకమంది విద్వాంసులు నమ్ముచున్నారు.” (ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా) అష్షూరీయుల, బబులోనీయుల కొన్ని పురాతన కట్టడాలు ఒక కొమ్ముగల జంతువుల చిత్రాలను చూపించినవి. అవి ప్రస్తుతము, ఒక వైపునుండి చూస్తే ఆ రెండు కొమ్ములు కూడ ఒకే కొమ్ముగా కన్పించు రీతిలో చిత్రీకరించబడిన మగజింకలు, కొండగొర్రె, ఆవులు, ఎద్దులుగా గుర్తించబడినవి.

రీమ్‌ అను హెబ్రీ పదము నుపయోగించుచు లేఖనములు తొమ్మిదిసార్లు ఒకానొక జంతువును సూచించుచున్నందున, బైబిలు విద్యార్థులకిది కొంత ఆసక్తిని కలిగించు విషయమైయున్నది. (సంఖ్యాకాండము 23:22; 24:8; ద్వితీయోపదేశకాండము 33:17; యోబు 39:9, 10; కీర్తన 22:21; 29:6; 92:10; యెషయా 34:7) అది ఏ జంతువును సూచించుచున్నదను విషయములో అనువాదకులు చాలాకాలం సందిగ్ధములో ఉండిరి. రీమ్‌ను గ్రీకు సెప్టాజింట్‌ ‘ఒక కొమ్ము,’ లేక యూనికోర్న్‌ అను అర్థమువచ్చు రీతిలో అనువదించినది. లాటీను వల్గేట్‌ తరచు దీనిని “ఖడ్గమృగముగా” అనువదించినది. ఇతర భాషాంతరములు ‘అడవి ఎద్దు,’ ‘అడవి జంతువులు,’ లేక ‘గేదె’ అని ఉపయోగించినవి. రాబర్ట్‌ యంగ్‌ ఆ విషయాన్ని పాఠకునికే వదిలివేయుచు, ఆ హెబ్రీపదాన్ని ఇంగ్లీషులోనే “రీమ్‌” అని అనువదించుచున్నాడు.

అయితే, ఆధునిక విద్వాంసులు రీమ్‌ విషయములో వున్న గందరగోళాన్ని చాలావరకు తొలగించారు. నిఘంటుకారులైన లుట్‌విక్‌ కోలెర్‌, వాల్టర్‌ బామ్‌గార్టినర్‌, బాస్‌ ప్రిమిజీనియస్‌ అను శాస్త్రీయ నామముతో కలిపి, దాని “అడవి ఎద్దులు” అను అర్థాన్నిచ్చారు. ఇది “పెద్దకొమ్ములతో, గిట్టలుగల జంతువుల కుటుంబానికి చెందినదై యున్నది.” ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇట్లు వివరించుచున్నది:

“పాతనిబంధనలోని కావ్యభాగాలు కొన్ని రీమ్‌ అని పిలువబడిన బలమైన, చూడముచ్చటైన కొమ్ముగల జంతువును సూచించినవి. ఈ పదము అనేక భాషాంతరములలో ‘యూనికోర్న్‌’ లేక ‘ఖడ్గమృగమని’ అనువదించబడినది, అయితే ఆధునికకాల అనువాదకులు అనేకమంది ‘అడవి ఎద్దు’ (ఓరొక్స్‌), అనుమాటను ఉపయోగించుటకు ఇష్టపడుచున్నారు, ఇది హెబ్రీ రీమ్‌నకు సరియైన భావమునిచ్చుచున్నది.”

ఇప్పటి ఇంగ్లీషునందు “ఎద్దు” అనుమాటకు వృషణాలు నలుగగొట్టబడిన మగది అను భావమున్నది గనుక, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ది హోలీ స్క్రిప్చర్స్‌ ఇందుకు పొందికగా, సరియైన రీతిలో రీమ్‌ను “వైల్డ్‌ బుల్‌” (అడవి ఎద్దు) అని అనువదించినది. ఓరొక్స్‌ (అడవి ఎద్దు, లేక పోతు) 17వ శతాబ్దమునాటికి అంతరించిపోయినట్లుగా కన్పించుచున్నది, అయితే విజ్ఞానశాస్త్రవేత్తలు అది కల్పిత యూనికోర్న్‌కు చాలా భిన్నమైనదని తేల్చిచెప్పారు. ప్రాచీన ఓరొక్స్‌ శరీరము 1.8 మీటర్లకు పైగా ఎత్తు, 3 మీటర్ల పొడవు ఉండేది. అది బహుశ 900 కిలోల బరువు ఉండవచ్చు, దాని కొమ్ములు 75 సెంటీమీటర్లకంటె ఎక్కువ పొడవుగా ఉండవచ్చును.

ఇది నిశ్చయముగా, రీమ్‌ లేక అడవి ఎద్దు అను బైబిలు ప్రస్తావనకు అనుగుణ్యముగా ఉన్నది. బలమునకు, లొంగని స్వభావమునకు, (యోబు 39:10, 11) ఆలాగే అమిత వేగానికి అది పేరెన్నికగలది. (సంఖ్యాకాండము 23:22; 24:8) కల్పిత యూనికోర్న్‌వలె కాక, నిదర్శనాధారముగా దానికి రెండు కొమ్ములు ఉండెను. యోసేపు కుమారులలోనుండి ఉద్భవించు రెండు బలమైన తెగలను ఉదహరించుచు మోషే దాని కొమ్ములను సూచించెను.—ద్వితీయోపదేశకాండము 33:17.

కాబట్టి పురాణ కథలలో పేరుగాంచిన యూనికోర్న్‌ల తలంపును బైబిలు బలపరచుట లేదు. బైబిలు కాలములలో మరియు ఇటీవలి వరకు ఉనికిలోవున్న పెద్దది, భయంకరమైన జంతువగు ఓరొక్స్‌ లేక అడవి ఎద్దునుగూర్చి పరిమితముగా తెల్పినప్పటికీ అది కచ్చితమైన రూపమునిచ్చుచున్నది. (w92 6/15)

[అధస్సూచీలు]

a పండితుడైన పాల్‌ హాప్ట్‌ ఇలా వివరించుచున్నాడు: ‘మధ్యయుగం నాటి సేకరణలలోని ఖడ్గమృగముల కొమ్ములు లేక నార్వల్‌ (కొమ్ముగల చేప లేక కొమ్ముగల తిమింగిలము అనికూడ పిలువబడెను) దంతాలు నడినెత్తిన యూనికోర్న్‌ కొమ్ములుగా చిత్రీకరింపబడెను.’

[30వ పేజీలోని చిత్రసౌజన్యం]

Treasury of Fantastic and Mythological Creatures: 1,087 Renderings from Historic Sources, by Richard Huber/Dover Publications, Inc.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి