కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 9/1 పేజీలు 31-32
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని నామంపై పడిన నింద తొలగించబడింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • పేరాశ లేని లోకమును ఊహించుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • దొంగతనం—ఎందుకు చేయకూడదు?
    తేజరిల్లు!—1995
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 9/1 పేజీలు 31-32

పాఠకుల ప్రశ్నలు

దొంగసొమ్ము కొనే విషయంలో యెహోవాసాక్షుల దృష్టి ఏమైయున్నది?

దొంగసొమ్ము లేక సామాన్లని తెలిస్తే క్రైస్తవులట్టి వాటిని కొనకుండా మానుకుంటారు.

దొంగతనము కచ్చితముగా తప్పే. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రము నిర్ద్వందముగా ఇట్లు చెప్పెను: “దొంగిలకూడదు.” (నిర్గమకాండము 20:15; లేవీయకాండము 19:11) దొంగ ఒకవేళ పట్టుబడినట్లయితే, పరిస్థితులనుబట్టి అతడు రెండింతలు, నాలిగింతలు, లేక ఐదింతలు నష్టపరిహారమును చెల్లించవలసి యుండెను.

ప్రాచీన కాలములనుండి, దోషారోపణ రుజువుతో తాము పట్టబడకుండునట్లు, దొంగలు తాము దొంగిలించిన సొమ్మును త్వరగా వదిలించుకొనుటకు ప్రయత్నించిరి. అలా చేయుటకు వారు, కొనుగోలుదారు లనేకమంది కొనుటకు వెనుకాడని రీతిలో దొంగ సొమ్మును తరచు చౌకగా అమ్ముదురు. నిర్గమకాండము 22:1లో మనము చదువు విషయములో అటువంటి క్రియ చేరియుండవచ్చును: “ఒకడు ఎద్దునైనను గొఱ్ఱెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ యెద్దుకు ప్రతిగా అయిదు ఎద్దులను ఆ గొఱ్ఱెకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెల ఇయ్యవలెను.”

అటువంటి నియమములలో ఉండు అంతస్సూచనలను గూర్చి రబ్బీయగు అబ్రాహామ్‌ చిల్‌ ఇలా వ్రాసెను: “అది దొంగసొమ్మని గుర్తింపబడక పోయినను, అటువంటి సొమ్మును కొనుట లేక తీసికొనుట నిషేధింపబడెను. కాబట్టి ఒకానొక గొర్రెలకాపరి బహుశ తన యజమానికి తెలియకుండా అమ్మి ఆ సొమ్మును కాజేయుటకు ఉద్దేశించియుండ వచ్చును గనుక, ఒకడు గొర్రెలకాపరియొద్ద మేకను కొనకూడదు.”—ది మిట్జ్‌వోట్‌—ది కమాండ్‌మెంట్స్‌ అండ్‌ దెయిర్‌ రేషనాలె.

తన యజమాని సొమ్మును కాజేయుటకు, అతడు దొంగ మేకను అమ్ముచున్నాడని కేవలము అనుమానముతో ‘గొర్రెలకాపరియొద్ద మేకను కొనుటను’ దేవుని ధర్మశాస్త్రము నిషేధించుట లేదు. కాని, ఒకడు అమ్మునది (మేక లేక మరేదైనా) అతనిది కాదని లేక దొంగదని స్పష్టముగా కన్పించుచున్నట్లయిన, యెహోవా సేవకులు మనఃపూర్వకముగా దానిని కొనువారై యుండకూడదు. ఆయన ఒకని ఆస్తిని గుర్తించునని దేవుని ధర్మశాస్త్రము చూపించుచున్నది, కాని దొంగ యజమానికి ఆయన ఆస్తి దక్కకుండా చేయుచున్నాడు. దొంగసొమ్ము కొనువారు దొంగలు కాకపోయినను, వారలా కొనుట దానిని పొగొట్టుకొనిన యజమాని బహుశ దానిని తిరిగిపొందు అవకాశమును తగ్గించివేయుదురు.—సామెతలు 16:19; పోల్చుము 1 థెస్సలొనీకయులు 4:6.

కొనువారు—వారు గృహిణిలైనా లేక ఒక కొనే కంపెని ప్రతినిధులైనా కావచ్చును—అమ్మకపు వస్తువును తగినంత తక్కువలో కొనుటకు ప్రయత్నింతురని మనందరికి తెలుసు. ప్రపంచవ్యాప్తముగా స్త్రీలు సరుకులు బాగుగా అమ్ముడుపోవు సమయము కొరకు ఎదురు చూస్తారు, వారు ధరలు తగ్గేంతవరకు కొనకుండా వేచియుండుటకు ప్రయత్నిస్తారు, లేదా స్వల్పఖర్చులు పెట్టుకొనైనను వెళ్లి టోకుబజారులోగాని, దుకాణంలోగాని తక్కువ ధరకు కొంటారు. (సామెతలు 31:14) అయినను, అలా బేరముచేసి కొను ఆసక్తికి నైతిక పరిమితులు ఉండాలి. విశ్రాంతి దినాలలో వస్తువులను బాగా బేరంచేసి కొనుక్కొనే అవకాశమున్నను, నెహెమ్యా కాలమందలి భక్తిపరులు విశ్రాంతిదినమందు అమ్మకపు వస్తువులను కొనుటకు నిరాకరించిరి. (నెహెమ్యా 10:31; పోల్చుము ఆమోసు 8:4-6.) క్రైస్తవులకును విషయమట్లే వున్నది. దొంగతనమును వారు విసర్జించుట దొంగసొమ్మని స్పష్టముగా తెలిసిన తక్కువధరగల వస్తువులను కొనాలనే ఎటువంటి శోధననైనను అదుపు జేసికొనుటకు వారికి సహాయము చేయును.

కొంతమంది దొంగసరుకు అమ్మువారని అందరికి తెలిసియుండ వచ్చును. లేక ఫలానివస్తువు చట్టరహితముగా సేకరించబడినదని ఎవరైనను ఇట్టే పసిగట్టగల రీతిలో ఆ వస్తువుయొక్క అతి తక్కువ ధర, రహస్యముగా వ్రాయబడి యుండవచ్చును. ఆ దేశపు చట్టముకూడ అటువంటి దానిని సముచితమని గుర్తించవచ్చును. ఒక న్యాయశాస్త్ర సంపుటి ఇలా వ్యాఖ్యానించుచున్నది:

“నేరారోపణకు ఆవశ్యకమైన వాస్తవాల కొరకు, ఎవరినుండి లేక ఎవరిద్వారా సొమ్ము దొంగిలించబడినది, ఎప్పుడు లేక ఎక్కడనుండి దొంగిలించబడినది, ఏ పరిస్థితులలో అది దొంగిలించబడినదో నిందితునికి తెలుసుననుట అవసరము లేదు, గాని అది దొంగిలించబడెనని అతనికి తెలిస్తే చాలు. . . . కొద్దిపాటి జ్ఞానముతో, ముందుజాగ్రత్తతో అది దొంగసొమ్మని సామాన్యుడెవరైననూ ఇట్టే పసిగట్టగల పరిస్థితులలో నిందితుడు ఆ సొమ్మును తీసుకొనుటనుబట్టి అతనిపై నేరారోపణ చేయవచ్చునను దృష్టిని కొన్ని న్యాయస్థానాలు కలిగియున్నవి.”

ఒక క్రైస్తవుడు దొంగసొమ్ము కొనడాన్ని విసర్జించు బలమైన హేతువును ఇది ఇచ్చుచున్నది. అటువంటి వస్తువులను కొనుట అతన్ని చట్టాన్ని ఉల్లంఘించు వ్యక్తిగా చేయగలదు. తాము తప్పించుకొన వీలున్నట్లయిన అనేకమంది ప్రజలు చట్టాన్ని ఉల్లంఘించుటకు ఎంతమాత్రము వెనుకాడరు. అయితే నిజమైన క్రైస్తవుల విషయములో ఇట్లుండ కూడదు. ఎందుకనగా, వారు “పైఅధికారులకు లోబడియుండుటకు” కోరుకొందురు. చట్టానికి లోబడియుండుట వలన వారు నేరస్థులుగా న్యాయవిచారణ చేయబడకుండ కాపాడబడుదురు, మరియు యెహోవా యెదుట నిర్మలమైన మనస్సాక్షిని కలిగియుండుటకు దోహదపడును.—రోమీయులు 13:1, 4, 5.

మనస్సాక్షి విషయములో దేవుని స్నేహితుడైన అబ్రాహాము ఒక చక్కని మాదిరినుంచెను. ఆయన కాలమందు, నలుగురు తూర్పుదేశాల రాజులు లోతు నివసించిన ప్రాంతములోని రాజులను ఓడించి, సైనిక దోపిడిగా ఎన్నో వెలగల వస్తువులను తీసుకుపోవుచుండిరి. అబ్రాహాము ఆ శత్రువులను తరిమి వారిని జయించి వారు దొంగిలించిన వస్తువులన్నింటిని తిరిగి తీసుకువచ్చెను. సొదొమరాజు అబ్రాహాముతో ఇట్లనెను: బహుమతిగా “ఆస్తిని నీవే తీసుకొనుము.” వాటిని తీసికొనుటకు బదులు, అబ్రాహాము వాటినన్నిటిని వాటివాటి యజమానులకు ఇచ్చివేస్తూ ఇట్లనెను: “నేను అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు . . . నీవాటిలో ఏదైనను తీసికొనను.”—ఆదికాండము 14:1-24.

దొంగసొమ్ముద్వారా ఎటువంటి ఆర్ధిక ప్రయోజనము పొందుటకైనను క్రైస్తవులు ఇష్టపడరు. ఇర్మీయా యిట్లు వ్రాసెను: “న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించు కొనువాడు తానుపెట్టని గుడ్లను పొదుకు కౌజుపిట్టవలె నున్నాడు.” (యిర్మీయా 17:11) దొంగసొమ్ము విషయమై కైసరు చట్టాలను ఉల్లంఘించకుండుట ద్వారా జ్ఞానమును ప్రదర్శించుటయే గాకుండ, క్రైస్తవులు దొంగతనమునకు సంబంధించిన ఎటువంటి అవినీతినైనను తిరస్కరించుచు దేవుని న్యాయమును సమర్థించుటకు కోరుకొందురు. దావీదు చక్కగా ఇట్లు వ్రాశాడు: “నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్ఠము.”—కీర్తన 37:16. (w92 6/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి