“వెలుగు సంబంధుల” జిల్లాసమావేశములకు ఆహ్వానము
సృష్టిదినములలో మొదటి దినము భూమికొరకు వెలుగు సృజింపబడుటను చూచెను. యెహోవా దేవుడు, “వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను” అని మనము చదువుదుము. (ఆదికాండము 1:3) అది అపొస్తలుడైన యోహాను వ్రాసిన: “దేవుడు వెలుగైయున్నాడు; ఆయనయందు చీకటి ఎంత మాత్రమును లేదు” అను దానితో పొందిక కలిగియున్నది.—1 యోహాను 1:5.
దేవుని కుమారుడు తన తండ్రితో ఐక్యతను కలిగియున్నాడు గనుక, “నేను లోకమునకు వెలుగైయున్నాను” అని యేసు చెప్పుటలో ఆశ్చర్యము లేదు. (యోహాను 9:5) యెహోవా దేవునియందు, ఆయన కుమారునియందు విశ్వాసముంచుటద్వారా మనము చీకటిలోనుండి వెలుగునకు రావచ్చును. “నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను” అని కూడ యేసు ధృవీకరించెను. (యోహాను 12:46) కావున, యేసుక్రీస్తు తన నిజమైన అనుచరులను గూర్చి సరిగానే ఇట్లు చెప్పెను: “మీరు లోకమునకు వెలుగైయున్నారు . . . మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.”—మత్తయి 5:14, 16.
“నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు” స్పష్టము చేసినట్లుగా దేవుని వాక్యమును అర్థము చేసికొని సత్యమును కలిగియుండుట ఎంత ఆశీర్వాదకరము! (మత్తయి 24:45-47) త్రిత్వమందలి నమ్మకము ద్వారా మనమింక ఎంతమాత్రము మోసగింపబడము; సర్వశక్తిగల మరియు ప్రేమగల దేవుడు దుష్టత్వమును, హింసను ఎందుకు అనుమతిస్తున్నాడో మననింకా కలవరపర్చలేదు; మృతుల స్థితి ఎట్టిదను విషయములో మనకింకా సందేహము లేదు. వెలుగు మనకు నిరీక్షణనిచ్చెను. రాజ్య నిరీక్షణనిచ్చెను, సృష్టికర్త ఎంతటి మహత్తరమైన దేవుడో అది మనకు తెల్పెను. సత్యమనెడి వెలుగు మన జీవితమునకు సంకల్పమునిచ్చెను. మనమెందుకు సృజింపబడితిమో ఆ సంకల్పమును నెరవేర్చుటకు, అనగా మొదట మన సృష్టికర్తయైన యెహోవా దేవుని మహిమపరచు జీవిత సంకల్పమును ఆ వెలుగు మనకిచ్చెను. ఆ వెలుగును కలిగియుండుట గొప్ప ఆధిక్యత, గౌరవప్రదమైనది. కానీ అది చాలా బాధ్యతాయుతమైనదికూడ. ఆ బాధ్యతకు న్యాయము చేయుటకు, యెహోవా దయచేయు సహాయమంతటిని మనము ఉపయోగించవలెను. కావున మన 1992 జిల్లా సమావేశములు “వెలుగు సంబంధుల” జిల్లాసమావేశములనబడుట ఎంతగా సరిపోయినది!
వెలుగు సంబంధులుగా మన పాత్రయెడల మెప్పును, నైపుణ్యతను వృద్ధిచేసికొనుటకు, ఈ సమావేశములలో కనీసము ఒకదానికి హాజరై, ప్రారంభ కీర్తననుండి ముగింపు ప్రార్థనవరకు ఉండుటకు కోరుకొందుము. వేదికనుండి చెప్పబడుచున్నవాటిని అనగా ప్రసంగములేగాని, పరిచయములేగాని, అనుభవములేగాని, లేక ఒక డ్రామాయేగాని శ్రద్ధతో విందము. నోట్సు వ్రాసికొనుట, మర్చిపోయిన వాటిని తరువాత గుర్తుచేసికొనుటకు దోహదపడుటయే కాకుండా, మరియెక్కువగా అందింపబడు దానిపై మనస్సునిల్పుటకు మనకు సహాయపడును. అవును, సమావేశ కార్యక్రమమంతటా ‘మనమెట్లు విందుమో శ్రద్ధ కలిగియుండుటకు’ మనము కోరుకొందుము.—లూకా 8:18. (w92 2/15)