కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 5/1 పేజీ 31
  • పాఠకులనుండి ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకులనుండి ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాచే ఉపదేశించబడినట్లు నడువుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • రక్తముతో జీవమును రక్షించుకొనుట—ఎట్లు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 5/1 పేజీ 31

పాఠకులనుండి ప్రశ్నలు

న్యాయస్థానము ద్వారా ఆజ్ఞాపింపబడిన లేక అధీకృతము చేయబడిన రక్తమార్పిడిని మనఃపూర్వకముగా ఒక క్రైస్తవుడు ఎట్లు ఎదిరించవలెను?

ప్రతి సందర్భము ప్రత్యేకమైయుండును, కావున దీని విషయంలో అన్ని పరిస్థితులకు అన్వయించగల నియమమంటూ ఏదీలేదు. క్రైస్తవులు ‘కైసరువి కైసరునకు’ అనగా ఐహిక ప్రభుత్వ చట్టాలకు విధేయులై యుండుటలో పేరెన్నికగలవారై యున్నారు. అయినను, అన్నింటికంటే మిన్నగా ఆయన నియమమును ఉల్లంఘించకుండా “దేవునివి దేవునికి” చెల్లించు బాధ్యతను తాము కలిగియున్నామని వారు గ్రహించియున్నారు.—మార్కు 12:17.

రోమీయులు 13:1-7 ప్రభుత్వాల “పైఅధికారుల” యెడల క్రైస్తవుల సంబంధమును చర్చించుచున్నది. అటువంటి ప్రభుత్వములు ప్రజల సంక్షేమమును సామాన్యముగా వృద్ధిచేయుటకు, చట్టాలు జారీచేయుటకు లేక నడిపింపునిచ్చుటకు అధికారమును కలిగియున్నవి. మరియు ప్రభుత్వములు తమ నియమములను అమలుచేయుటకు ‘ఖడ్గము ధరించియున్నవి మరియు ‘తమ నియమము ప్రకారము చెడుచేయు వారిపై ఆగ్రహము చూపు’ అధికారమును కలిగియున్నవి. పైఅధికారులకు లోబడియుండువారిగా క్రైస్తవులు చట్టాలకు మరియు న్యాయస్థానాల ఆజ్ఞలకు లోబడవలెనని కోరుదురు, అయితే ఈ విధేయత తప్పక పరిమితమై యుండాలి. దేవుని ఉన్నత నియమమును ఉల్లంఘించు ఒకానొక నియమమునకు లోబడవలెనని ఒక క్రైస్తవుని అడిగినట్లయిన, దైవిక నియమము మొదట వచ్చును; అది అగ్రస్థానమున నిలుచును.

ప్రాథమికముగా మంచివైన కొన్ని ఆధునిక నియమములను ఒక క్రైస్తవునిపై రక్తమార్పిడిని బలవంతపెట్టుటను అధీకృతము చేయుటకు తప్పుగా అన్వయించవచ్చును. ఈ విషయములో అపొస్తలుడైన పేతురు గైకొనిన స్థానమునే క్రైస్తవులును గైకొనవలెను. “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.”—అపొ. కార్యములు 5:29.

యెహోవా ఇశ్రాయేలీయులకు ఇట్లు ఆజ్ఞాపించెను: “రక్తమును తిననే తినకూడదు. భద్రము సుమీ. ఏలయనగా రక్తము ప్రాణము; మాంసముతో ప్రాణాధారమైనదాని తినకూడదు.” (ద్వితీయోపదేశకాండము 12:23) 1917 నాటి ఒక యూదామత బైబిలు భాషాంతరము ఇట్లు చదువబడుచున్నది: “రక్తమును తినకుండుటలో కేవలము స్థిరముగా ఉండుడి.” ఐజక్‌ లీసర్‌ ఆ వచనమును ఇలా అనువదించెను: “రక్తమును తినకుండుటకు కేవలము దృఢముగా ఉండుము.” ఈ నియమమునకు కట్టుబడియుండుటలో దేవుని సేవకులు కేవలము పట్టనట్లు లేక ఉదాసీనముగా ఉండవలెనన్నట్లు అది సూచించుచున్నదా?

ప్రభుత్వము వేరొకరీతిగా నిర్దేశించిననూ, క్రైస్తవులు మంచి కారణముతో దేవునికే లోబడియుండుటకు తీర్మానించుకొనియుండిరి. పండితుడైన రాబర్ట్‌ ఎల్‌. విల్‌కెన్‌ ఇలా వ్రాయుచున్నాడు: “క్రైస్తవులు [రోమా] సైనిక వృత్తిని చేపట్టుటకు తిరస్కరించుటయే గాకుండా వారు ప్రభుత్వ పదవులను లేక నగరపాలనకు సంబంధించి ఎటువంటి బాధ్యతనైనను తీసికొనకుండిరి.” (ది క్రిస్టియన్స్‌ యాజ్‌ ది రోమన్స్‌ సా దెమ్‌) అలా తిరస్కరించుట వారు చట్టమును ఉల్లంఘించువారని లేక రోమీయుల వికృతపోరాట మైదానమందు పడవేయబడదగిన వారని భావమిచ్చెడిది.

అది తమను లౌకిక ప్రభుత్వముల సంబంధముగా ఏ చిక్కులో పడవేసినను, దైవిక నియమమును ఉల్లంఘించకుండుటకు ఈనాటి క్రైస్తవులు సహితం స్థిరముగా ఉండవలెను, దృఢముగా తీర్మానించుకొనవలెను. విశ్వమంతటిలో సర్వోన్నత నియమమైన—దేవుని నియమము—క్రైస్తవులు వ్యభిచారమును (లైంగిక దుర్నీతిని) విసర్జించుమని ఆజ్ఞాపించినట్లుగానే, వారు రక్తమును దుర్వినియోగపరచకూడదని కోరుచున్నది. ఈ నిషేధములను బైబిలు “అవశ్యకమైన సంగతులు” (NW) అని పిలుచుచున్నది. (అపొ. కార్యములు 15:19-21, 28, 29) కేవలము అనుకూలించినట్లయితే లేక సమస్యలు కల్గించనట్లయితేనే లోబడవలెనన్నట్లు అటువంటి దైవిక నియమమును తేలికగా తీసికొనకూడదు.

వాచ్‌టవర్‌ (w91 6/15) పుట 12లో ప్రస్తావించబడిన, ఒక యౌవన క్రైస్తవ స్త్రీ ఎందుకు “రక్తమార్పిడిని తన శరీరముపై చేయు దురాక్రమణగా పరిగణించెనో మరియు అత్యాచారముగా పోల్చెనో, మనము అర్థము చేసికొనగలము. లైంగిక ముట్టడిద్వారా వ్యభిచారమును జరిగించవచ్చుననుట చట్టరీత్యా అనుమతింపబడినను, యౌవనురాలైన లేక వృద్ధురాలైన ఒక క్రైస్తవ స్త్రీ ఎదురుచెప్పకుండా అత్యాచారమునకు లోబడునా?

అదే ప్రకారముగా, ఆ పుటలోనే ఎత్తిచెప్పబడిన 12 సంవత్సారాల బాలిక ‘కోర్టు ఆదేశించిన రక్తమార్పిడిని వ్యతిరేకించుటకు తన శక్తిమేరకు పోరాడునని అనగా అరిచి, పోట్లాడి, తన చేతికి అమర్చిన రక్తమార్పిడి సాధనములను ఊడబెరికి తన బెడ్‌కు పైగా వ్రేలాడదీయబడిన రక్తపుసంచిన నాశనముచేయుటకు ప్రయత్నించుననుటలో’ ఎలాంటి సందేహము లేదనెను. ఆమె దైవిక నియమమునకు లోబడుటకు దృఢముగా తీర్మానించుకొనెను.

తనను రాజును చేయవలెనని జనసమూహము కోరినప్పుడు యేసు అక్కడనుండి వెళ్లిపోయెను. అదేప్రకారము, కోర్టు ఆదేశించిన రక్తమార్పిడి అమలు జరుగునట్లు కన్పించినట్లయిన, ఒక క్రైస్తవుడు అటువంటి దైవనియమ ఉల్లంఘన తనపై జరుగుటను తప్పించుకొనవచ్చును. (మత్తయి 10:16; యోహాను 6:15) అదే సమయంలో, ఆ క్రైస్తవుడు తెలివిగా ప్రత్యామ్నాయ వైద్యచికిత్స కొరకు వెదకును, అలా ప్రాణమును కాపాడుకొని మరలా పూర్తి ఆరోగ్యమును సంపాదించుకొనుటకు నిజముగా ప్రయత్నించును.

రక్తము విషయమై దేవుని నియమమును ఉల్లంఘించుటను తప్పించుకొనుటకు ఒక క్రైస్తవుడు మనఃపూర్వకముగా ప్రతి ప్రయత్నము చేసినట్లయిన, అధికారులు అతడు చట్టమును అతిక్రమించుచున్నాడని లేక అతని శిక్షార్హునిగా చేయవలెనని ఆలోచించవచ్చును. తత్ఫలితముగా శిక్ష వచ్చిననూ, దానిని క్రైస్తవుడు నీతి విషయమై వచ్చిన బాధగా దృష్టించవచ్చును. (1 పేతురు 2:18-20 పోల్చుము.) అయితే అనేక సందర్భాలలో క్రైస్తవులు రక్తమార్పిడులను విసర్జించి సమర్థవంతమైన వైద్యచికిత్సతో కోలుకున్నారు, కావున కొనసాగు ఎలాంటి చట్టపరమైన సమస్యలు కలుగలేదు. అన్నింటికంటే ప్రాముఖ్యముగా, వారు తమ జీవదాత మరియు న్యాయాధిపతియగు దేవునియెడల తమ యథార్థతను కాపాడుకొనిరి. (w91 6/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి