కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 2/1 పేజీలు 30-31
  • పాఠకులనుండి ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకులనుండి ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • మేకప్‌ వేసుకోవడం, నగలు పెట్టుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మీ వస్త్రధారణనూ కేశాలంకరణనూ—దేవుడు పట్టించుకుంటాడా?
    తేజరిల్లు!—1998
  • తగుమాత్రపు వస్త్రములు దేవునికి గౌరవాన్ని తెస్తాయి
    మన రాజ్య పరిచర్య—2003
  • హుందాగా కనబడే తీరు
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 2/1 పేజీలు 30-31

పాఠకులనుండి ప్రశ్నలు

ఆభరణములు లేదా అలంకరణ, తన తలవెంట్రుకలకు రంగువేయుట, లేక అట్టి కార్యములను చేయుట క్రైస్తవ స్త్రీకి తగునా?

బైబిలును అనుసరించుచున్నామని చెప్పుకొను కొందరు గతములోను, మనదినములందును అలంకరణ విషయములో దృఢమైన, చాలా భిన్నమైన దృక్పథములను వృద్ధిచేసికొనిరిa.

కొన్ని చర్చీలలోని స్త్రీలు నగలను, అలంకరణను పూర్తిగా నిషేధిస్తారు. దృష్టాంతమునకు ది ఎమిష్‌ పీపుల్‌ అను పుస్తకము నివేదించునదేమంటే, “ఏ సభ్యుడైనా లోకరీతిగా కన్పించాలని ఆశ కల్గియుంటే అతడు వంచింపబడునని తాము భావించుచున్నందున భౌతిక అలంకరణను నిషేదించుచున్నారు, ఎందుకంటే [అట్టి] ఆసక్తి భౌతిక విషయములకంటే ఆత్మీయ సంగతులపై కేంద్రీకరించబడాలి. కొంతమంది. . .ఇందుకు లేఖనములను ఎత్తిచూపుదురు.”

పిమ్మట అచ్చట ఎత్తిచూపబడిన లేఖనము 1 సమూయేలు 16:7: “యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను: ‘అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.” అయితే దావీదు అన్నయైన ఏలీయాబుయొక్క ఎత్తునుగూర్చి ఆ లేఖనము మాట్లాడుచున్నది. దావీదు లేక అతని అన్నలు తమ తలదువ్వుకొను విధమును లేదా దుస్తులపై అలంకారంగా వస్తువులను వాడిరా, లేదా యను కేశాలంకారమును గూర్చి దేవుడు వ్యాఖ్యానించుటలేదని సందర్భమునుబట్టి స్పష్టమగుచున్నది.—ఆదికాండము 38:18; 2 సమూయేలు 14:25, 26; లూకా 15:22.

తప్పుగా అన్వయించబడిన లేఖనముల మద్దతు తీసుకొని క్రైస్తవులు ఏవిధమైన అలంకరణ నగలు వాడకూడదని, నిరాడంబరముగా ఉండాలని కొందరు తలంచుచున్నట్లు యిది చూపుచున్నది. వాస్తవానికి తలదువ్వుకొను విషయములో బైబిలు వివరణాత్మక చర్చనియ్యలేదు; కొన్నిరకముల పరిమళ ద్రవ్యములను అంగీకరించి మరికొన్నింటిని నిషేధించనూ లేదు. సహేతుకమైన నడిపింపును మాత్రమే అది అందించినది. వాటిని మనమిప్పుడు పరిశీలించి, నేడు వాటిని ఎలా అన్వయించగలమో చూచెదము.

అపొస్తలుడైన పౌలు ప్రేరేపిత నడిపింపు నిచ్చెను: “స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారైయుండి, తగుమాత్రపు వస్త్రములచేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించు కొనవలదని కోరుచున్నాను.” (1 తిమోతి 2:9) పేతురు కూడ అలానే వ్రాసెను: “జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.”—1 పేతురు 3:3, 4.

“అలంకరణ” “తగుమాత్రము” మరియు “అలంకారము” లని తర్జుమాచేయబడిన గ్రీకు పదములు కాస్‌మోస్‌ నకు ప్రతిరూపములు, అదే కాస్మోటిక్‌ (పరిమళ ద్రవ్యములు) అను పదమునకు మూలమైయున్నది. “మరిముఖ్యంగా ముఖ వర్చస్సును సౌందర్యవంతముగా తీర్చిదిద్దుట” అని దాని భావము. కనుక పరిమళ ద్రవ్యములను లేదా అలంకరించుకొనుట, నగలు మరి యితర స్త్రీ అలంకరణలను వాడవచ్చునా అను ప్రశ్నలకు సమాధానమిచ్చుటకు ఆ లేఖనములు మనకు సహాయపడగలవు.

క్రైస్తవులు తమ జుత్తును జడలు అల్లుట, ముత్యములు బంగారు ఆభరణములు ధరించుట లేదా దానికి తోడు పరిమళ ద్రవ్యములను వాడుట విడనాడవలెనని పౌలు, పేతురుల భావమా? కాదు. అదేగాని దాని భావమైతే క్రైస్తవ సహోదరీలు పై వస్త్రములను కూడ విడనాడవలసి వస్తుంది. అయితే పేతురు పునరుత్థానము చేసిన దొర్కా యితర సహోదరీలకొరకు “వస్త్రములను” తయారుచేసినందుకు ప్రియముగా ఎంచబడెను. (అపొస్తలుల కార్యములు 9:39) కనుక, సహోదరీలు జడలు అల్లుట, ముత్యా ఆభరణములు, పైవస్త్రములు మున్నగునవి విడనాడవలెనని 1 తిమోతి 2:9 మరియు 1 పేతురు 3:3, 4 భావము కాదు. స్త్రీలు తలదువ్వుకొను విషయములో అణుకువ స్వస్థబుద్ధి కల్గియుండు అవసరతనుగూర్చి పౌలు నొక్కి తెల్పుచుండెను. స్త్రీలు అవిశ్వాసులైన తమ భర్తలను సంపాదించుకొనుటకు గాను, బాహ్యసౌందర్యమునకు లేదా అలంకరణకు ప్రాధాన్యత నియ్యక తమ అంతరంగ స్వభావమునకు ఎక్కువ ప్రాధాన్యత నియ్యవలెనని పేతురు చూపెను.

ఒక్కమాటలో చెప్పాలంటే, ఒకని రూపమును శృంగారించుట లేదా మెరుగుపర్చుకొనుటకు చేయు ప్రయత్నములన్నింటిని బైబిలు నిషేధించుటలేదు. దేవుని సేవకులైన కొందరు స్త్రీలు, పురుషులు కూడ ఆభరణములను ధరించారు. (ఆదికాండము 41:42; నిర్గమకాండము 32:2, 3; దానియేలు 5:29) యథార్థవంతురాలైన ఎస్తేరు గోపరస తైలము, సుగంధ ద్రవ్యములు, పరిమళములతో మరింత సౌందర్యంగా తయారుచేయువారికి అప్పగించబడెను. (ఎస్తేరు 2:7, 12, 15; దానియేలు 1:3-8 పోల్చుము.) దేవుడు తాను ఇశ్రాయేలీయులకు అలంకారార్థముగా చేతులకు కడియము, మెడకు గొలుసు, ముక్కు కమ్మి, చెవి పోగులు ధరింపచేసితినని చెప్పెను. అట్టివి ఆమెను “మిక్కిలి సౌందర్యవతిని” చేయుటకు దోహదపడినవి.—యెహెజ్కేలు 16:11-13.

అయితే, యెహెజ్కేలు నందలి ఈ వర్ణన, మన రూపు రేఖలపై మన దృష్టిని సారించు విషయములో పాఠమును కల్గియున్నది. దేవుడిట్లనెను: “నీ సౌందర్యమును నీవు ఆధారముచేసికొని, నీకు కీర్తివచ్చి నందున నీవు వేశ్యవై దారినిపోవు ప్రతివానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి.” (యెహెజ్కేలు 16:15; యెషయా 3:16, 19) ఆవిధంగా యెహెజ్కేలు 16:11-15. బాహ్య అలంకరణకు ప్రాధాన్యత యివ్వవద్దని అటుపిమ్మట పౌలు, పేతురు యిచ్చిన సలహాయొక్క జ్ఞానాన్ని గురుతు చేయుచున్నది. ఒక స్త్రీ నగలతో తన్ను అలంకరించుకొనదల్చితే, మితిమీరిన విధంగా, లేక డంబముగా, శృంగారంగా అలంకరించుకొనక నమ్రతకు తగినరీతిగా చేసుకొనవలెను.—యాకోబు 2:2.

లిప్‌స్టిక్‌ (పెదవుల రంగు), చెంపలకు రంగుపూయుట, కనురెప్పలకు పూత, కనుబొమ్మలను దిద్దుట వంటి అలంకరణలను క్రైస్తవ స్త్రీ వాడవచ్చునా? ఇశ్రాయేలు దాని పరిసర ప్రాంతములందు పురావస్తు పరిశోధకులు, అలంకరణ పాత్రలు, ఒంటికి వ్రాసుకునే పదార్థము, అద్దములను కనుగొన్నారు. అవును, నేటి ఉత్పత్తులనేకములు ఎదురుచూచిన పరిమళ ద్రవ్యములను ప్రాచీన తూర్పు దేశీయుల స్త్రీలు వాడియున్నారు. యోబు కుమార్తె, పేరు కెరెంహప్పుకు అనగా “నల్లని (కంటి) రంగు కొమ్ము” లేదా కంటి అలంకరణ పాత్ర అని యర్థము.—యోబు 42:13-15.

ఇశ్రాయేలీయుల మధ్య కొన్ని పరిమళములు వాడబడినను, దానిని అధికముగా వాడుట వలన వచ్చు అపాయమును బైబిలు దృష్టాంతములు చూపుచున్నవి. ఇశ్రాయేలీయుల రాణిగా అయిన కొన్ని సంవత్సరములకు యెజెబెలు తన కన్నులకు నల్లని రంగుపూసి తన తలను అందముగా అలంకరించెను! (2 రాజులు 9:30 NW) అటుతరువాత, ఇశ్రాయేలీయులు అన్యజనాంగముల అవినీతి ఆకర్షణను ఎలా అనుసరించిరో వర్ణించుచు, దేవుడిట్లనెను, ఆమె ‘సువర్ణ భూషణములు ధరించి, కాటుక చేత తన కన్నులు పెద్దవిగా చేసికొని తన్నుతాను సౌందర్యంగా తీర్చి దిద్దుకొనెను.’ (యిర్మీయా 4:30 NW; యెహెజ్కేలు 23:40) ఈ వచనములుగాని మరి యితర ఏ లేఖనములు కూడ ఒకనిరూపమును మెరుగు పర్చుకొను కృత్రిమ పద్ధతులను వాడుట తప్పిదమని చెప్పడంలేదు. అయినను, దూరమునుండి, రాజభవనమునకు వెలుపలనున్న యెహూ కూడ, గుర్తించగల్గేంత విస్తారంగా ఆమె తన కండ్ల చుట్టూ నల్లరంగు పూసెనని యెజెబెలు కథ తెల్పుచున్నది. ఇందలి పాఠమేమిటి? మరీ అంత విస్తారమైన అలంకరణను అతిశయాస్పదముగా చేయురీతిలో చేసికొనవద్దు.b

అయితే ఆభరణములనుగాని, అలంకరణనుగాని వాడు ఏ స్త్రీ తన స్వంత పద్ధతులు, పరిమితులు సరియైనవికావని ఒప్పుకోదు. అయినను, పరిధులు లేక పోవడం లేదా మోసముతో కూడిన వ్యాపార ప్రకటనలమూలంగా స్త్రీ తాను ఎక్కువ మొత్తములో అలంకరణను వాడు అలవాటును వృద్ధిచేసికొనగలదనుటలో సందేహములేదు. అంతేగాక ఎక్కువ మంది క్రైస్తవ స్త్రీల “అణుకువ స్వస్థబుద్ధితో” అది భిన్నముగా యున్నదని తాను గుర్తించలేనంతగా అట్టి అలంకరణకు ఆమె అలవాటుపడుచుండవచ్చును.—యాకోబు 1:23, 24ను చూడుము.

అభిరుచులు విభిన్నముగా ఉంటాయి, ఒప్పుకున్నాము; కొందరు స్త్రీలు అలంకరణను, లేదా ఆభరణములను కొద్దిగానే వాడవచ్చు లేదా అసలు వాడకనే పోవచ్చును, మరి యితరులు ఎక్కువగా వాడుచుండవచ్చు. కాబట్టి వేరే విధంగా అలంకరించుకొనిన లేదా ఆభరణములను ధరించిన వారి విషయములో తీర్పు తీర్చకుండుట మంచిది. మరొక విషయమేమంటే ప్రాంతీయ అలవాట్లు. వేరే ప్రాంతములలో కొన్ని సొగసులు, (లేదా ప్రాచీనకాలములో సర్వసామాన్యమైనవి) అనుమతించబడినవి కావున నేడు మన ప్రాంతములలో అవి మంచివేనని దాని భావము కాదు.

జ్ఞానముగల క్రైస్తవ స్త్రీ తన కేశాలంకరణనుగూర్చి అప్పుడప్పుడు పునఃపరిశీలించి తనను తాను ప్రశ్నించుకొనును: నా ప్రాంతమందలి అనేకమంది క్రైస్తవుల కంటే నేను ఎక్కువ (లేదా పెద్దవైన) ఆభరణములను ధరించుచున్నానా లేదా అలంకరణను నేను సామాన్యంగా వాడుచున్నానా? నా కేశాలంకరణ ప్రజా పంథాలోను లేదా సినిమా తారలను అనుకరించి ఉండునట్లు చేసికొనుచున్నానా, లేక 1 తిమోతి 2:9 మరియు 1 పేతురు 3:3, 4 నందలి సలహాను బట్టియే ముఖ్యంగా నడిపించుకొనుచున్నానా? అవును, నా కేశాలంకరణ అణుకువగాను, యితరుల అభిప్రాయాలకు, భావాలకు నిజముగా గౌరవము చూపేదిగాను ఉన్నదా?—సామెతలు 31:30.

క్రైస్తవ భర్తలను కల్గియున్న స్త్రీలు వ్యాఖ్యానములు, సలహాలకొరకు వారిని అడుగవచ్చును. అంతేకాకుండా, సహాయకమైన సలహాను నిజంగా కోరుచున్నట్లయితే, యితర సహోదరీలనుండి కూడ దానిని పొందవచ్చును. అట్టి అభిరుచులేయున్న స్నేహితులయొద్దకు వెళ్ళుటకంటే, ఎవరి సమదృష్టి, విజ్ఞానము గౌరవించబడుచున్నదో అట్టి వృద్ధ స్త్రీలతో మాట్లాడుట మంచిది. (1 రాజులు 12:6-8 పోల్చుము.) గౌరవనీయులైన వృద్ధస్త్రీలు “యౌవన స్త్రీలను స్వస్థబుద్ధిగలవారును, పవిత్రులును, దేవుని వాక్యము దూషింపబడకుండ ఉండవలెనని బుద్ధిచెప్పవలెనని” బైబిలు తెల్పుచున్నది. (తీతు 2:2-5) పరిణితి చెందిన ఏ క్రైస్తవ స్త్రీయైన నమ్రత లేని విధంగా ఆభరణములను లేదా అలంకరణను వాడి దేవుని వాక్యము లేదా ఆయన ప్రజలు “దూషింపడుటకు” కారకురాలగుటకు కోరుకొనదు.

ఒక క్రైస్తవ స్త్రీయొక్క కేశాలంకరణ, ఆమెను చిత్రీకరించి, ఆమెను గూర్చిన బలమైన వర్తమానము పంపగలదని తామారునుగూర్చిన బైబిలు వృత్తాంతము చూపుచున్నది. (ఆదికాండము 38:14, 15) క్రైస్తవ స్త్రీయొక్క కేశాలంకరణ, తల (రంగువేస్తే) రంగు లేదా ఆమె ఉపయోగించు ఆభరణములు, పరిమళ ద్రవ్యములు ఎట్టి వర్తమానమును అందించుచున్నవి? ఆమె పవిత్రమైన, అణుకువగల, సమదృష్టినికల్గిన దేవుని సేవకురాలని తెల్పుచున్నదా?

క్రైస్తవులను ఎవరైన ప్రాంతీయ సేవలో చూచినప్పుడు లేదా మన కూటములకు హాజరైనప్పుడు వారు సద్భావముతో ముగ్ధులు కావలెను. మనలను పరిశీలించుచున్నవారు సాధారణంగా ముగ్ధులగుచున్నారు. క్రైస్తవ స్త్రీలు ఒక ప్రక్క నాగరికత లేని వారిగా మరో ప్రక్క మితిమీరిన విధంగా అలంకరించుకుంటారనే అభిప్రాయమునకు వెలుపటివారు వచ్చేందుకు అనేకమంది అవకాశమియ్యడము లేదు; బదులుగా “దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా” తమ కేశాలంకరణ చేసికొనుచున్నారు.—1 తిమోతి 2:10. (w91 6/1)

[అధస్సూచీలు]

a సా.శ. మూడవ శతాబ్దములో టెర్టూలియన్‌, స్త్రీలు “తమ చర్మముపై ఔషధములను రుద్దుట, తమ చెంపలకు ఎర్రని పొడి పట్టించుట, తమ కండ్లకు కాటుక వ్రాసి వాటిని ప్రముఖంగా చేయుట వంటి చర్యలు ఆయనకు వ్యతిరేకముగా పాపమని” పేర్కొనెను. తమ తలకు రంగుపూసే వారిని కూడ ఆయన విమర్శించెను. మత్తయి 5:36 నందలి యేసు మాటలను తప్పుగా అన్వయించుచూ, టెర్టూలియన్‌ యిట్టి నేరమును మోపెను: “వారు ప్రభువును ఖండించుచున్నారు! వారిలా అనుచున్నారు, ‘చూడండి! నలుపు లేదా తెలుపునకు బదులు (మా వెంట్రుకలను) పసుపుగా చేయుచున్నాము.’” ఆయనింకా యిట్లనుచున్నాడు: “తాము వృద్ధులమైనందుకు సిగ్గుపడుచు తమ తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చు వ్యక్తులను కూడ నీవు కనుగొందువు.” అది టెర్టూలియన్‌ వ్యక్తిగత అభిప్రాయము. అయితే అతడు సంగతులను పెడత్రోవ పట్టిస్తున్నాడు. మానవులు అథోగతి పాలగుటకు స్త్రీలే కారణమని, కనుక ‘తొలిపాపమును చేసినందుకు’ ‘అవమానముతో దుఃఖించుచు, పశ్చత్తాపపడుచునుండు హవ్వవలె’ వారును నడుచుకొనవలసియున్నారనే తన దృక్పథముపై తన వాదన అంతా ఆధారపడియున్నది. అయితే బైబిలు అలా చెప్పడంలేదు. మానవుల పాపమునకు దేవుడు ఆదామును బాధ్యుని చేసెను.—రోమీయులు 5:12-14; 1 తిమోతి 2:13, 14.

b ఇటీవల కాలములో టి.వి.,లో సువార్తను ప్రచారముచేయు ఒక సువార్తకుని అవమానకర ప్రవర్తనను యునైటెడ్‌ స్టేట్స్‌లోని వార్తా విభాగములు ఎత్తిచూపినవి. తెరపై తనతో పాటు సమానవంతులో పాల్గొను తన భార్యకూడ అదేవిధమైన అవధానమునకు గురియైనది. వార్తా నివేదికల ప్రకారము, మొదట “ఆమె అలంకరణ, సినిమాలు” పాపకరమైనవి అని నమ్ముతూ వచ్చింది. అయితే తర్వాత ఆమె తన ఉద్దేశ్యమును మార్చుకొని “ఒక శిల్పమును తీర్చిదిద్దునంతగా అతి విపరీతమైన అలంకరణతో ఉన్నట్లుగా” గుర్తించబడినది.

[31వ పేజీలోని చిత్రం]

మధ్యప్రాశ్చములో పురావస్తు శాస్త్ర అన్వేషణలు: దంతపు పరిమళ ద్రవ్యముల పెట్టె, అద్దము, బంగారు కంఠభూషణము మరియు ఉంగరములకు వేసే ఎర్రని రాయి

[క్రెడిట్‌ లైను]

All three: Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి