కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 2/1 పేజీ 32
  • రూపములు ఎంత ప్రాధాన్యమైనవి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రూపములు ఎంత ప్రాధాన్యమైనవి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 2/1 పేజీ 32

రూపములు ఎంత ప్రాధాన్యమైనవి?

“నా రూపముయెడల నేను చాలా కలత చెందితిని” అని ఓ బాలిక బీవెర్‌ ఫాల్స్‌, పెన్సిల్వేనియా, యు.యస్‌.ఎ నుండి వ్రాసినది. ఆమె: “నేను వికారముగాను, ఆకర్షణలేనట్లుగాను భావించితిని. కొన్ని దినములు నేను సరిగా తినెడిదానను కాను. కొన్ని పౌన్ల బరువు కోల్పోవుదును. కాని తిననందున, చాలా ఆకలివేసి మరునాడు అమితముగ తిని మళ్లీ బరువును పొందెదను” అని వివరించినది.

తరువాత, ఒక క్రైస్తవ సమావేశములో “నేను అద్దములో చూసుకొని చాల భయంకరముగా నున్నానని’ తన స్నేహితురాలితో చెప్పితి’ నని ఆమె వివరించెను.

“ఆ ఆప్త స్నేహితురాలు నన్ను నీవు కొశ్చన్స్‌ యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ ఆన్సర్స్‌ దట్‌ వర్క్‌ అను పుస్తకములో ‘నీ వెట్లు కనబడుదువో’ అను భాగమును చదివావా అని అడిగినది. అందుకు నేను లేదు అని అంటిని. అప్పుడు ఆమె నాతో “నా ప్రియతమా యీరాత్రి నీవు యింటికి వెళ్లి దానిని చదువవలయును” అని అన్నది. నేను ఖచ్చితముగా అలాగే చేసితిని.

“నాకు నా జీవిత కథను నేను చదువుచున్నట్లనిపించింది. తదుపరి నన్నాలోచింపజేయు ఒక ప్రశ్నకు వచ్చితిని. ప్రజాదరణ పొందుటకు, విజయవంతమగుటకు లేక ఆనందముగ నుండుటకు నీకు ఓ మోస్తరు రూపమవసరమనే తలంపు నీకు కలుగజేసినదెవరు?”

ఈ ప్రశ్నకు జవాబు ఆమె జీవితములో అద్భుతమైన మార్పు తెచ్చినదని ఈ బాలిక తెల్పినది. “యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ అను పుస్తకములోని ప్రయోజనకరమగు సలహాలద్వారా నాకు ప్రధానమైనవేవో తిన్నగా గుర్తించు అవసరతను చూచితిని.”

నేడు యౌవనులు అనేక వత్తిడులలో ఉన్నారు. వాటిని విజయవంతముగా ఎదుర్కొనుటకు వారికి సహాయమవసరము. కొశ్చన్స్‌ యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌—ఆన్సర్స్‌ దట్‌ వర్క్‌ ఆ సహాయము నందించును. ఈ కూపను నింపి పంపుటద్వారా ఆకర్షణీయముగా వివరించబడిన యీ పుస్తకపు ప్రతిని నీవు పొందవచ్చును.

320-పేజీల కొశ్చన్స్‌ యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌—ఆన్సర్స్‌ దట్‌ వర్క్‌ అను పుస్తకమును పొందుటకు ఇష్టపడుతున్నాను. అందుకై 20-00 పంపుచున్నాను.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి