మీరు అనుకున్నదానికంటే అది ఆలస్యముగా ఉన్నదా?
తన మరణమునకు మూడు రోజులముందు, యేసు యెరూషలేములో అత్యంత పనితొందరగల దినమును గడిపెను, ఆ దినము ఈనాడు జీవించుచున్న క్రైస్తవులకు అతి ప్రాముఖ్యమైనదిగా తయారయినది. ఆయనను ఇరుకులో పెట్టుటకు యూదుల మతాధికారులు వేసిన ఎన్నో చిక్కు ప్రశ్నలను త్రిప్పికొడుతూ, ఆయన దేవాలయములో బోధించెను. చివరిగా, ఆయన శాస్త్రులు మరియు పరిసయ్యులపైన తీవ్రమైన బహిరంగ నిందను మోపి వారు గెహెన్నాకు పాత్రులైన వేషధారులు మరియు సర్పములు అని చెప్పెను.—మత్తయి, 22, 23 అధ్యాయములు.
ఆయన దేవాలయ ప్రాంతమును విడిచివెళ్లుచుండగా, అతని శిష్యులలో ఒకడు: “బోధకుడా, యీ రాళ్లు ఎట్టివో యీ కట్టడములు ఎలాటివో చూడుమని ఆయనతో అనెను.” యేసు, ప్రభావితుడు కాక, అతనితో: “ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే: రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని అతనితో చెప్పెను.” (మార్కు 13:1, 2) యేసు తరువాత ఆఖరి సారిగా దేవాలయమును విడిచి వెళ్లి, కిద్రోను లోయలోనికి దిగి, దానిని దాటి, ఒలీవల కొండయొక్క ఏటవాలులను ఎక్కెను.
కొండపైన, మధ్యాహ్నపు చివరి సూర్యరశ్మి, ఆయనపైన పడుతుండగా, లోయ అవతలవైపున మోరీయా కొండపైన ఉన్న దేవాలయము కనిపించురీతిగా ఆయన కూర్చొనియున్నప్పుడు, పేతురు, యాకోబు, మరియు అంద్రెయ ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చిరి. దేవాలయము పడవేయబడుటను గూర్చి యేసు మాటలు వారి మనస్సులో బరువుగా ఉండెను. “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుము” అని వారు అడిగిరి. (మత్తయి 24:3; మార్కు 13:3, 4) వారి ప్రశ్నకు ఆయన ఆ మధ్యాహ్నము ఇచ్చిన జవాబు మనందరికి ప్రాముఖ్యమైయున్నది. మనము “ఈ యుగ సమాప్తిని” గూర్చి ఆలోచించుటకు ఆలస్యముచేయకుండ మనకు సహాయముచేయును.
వారి ప్రశ్న రెండు భాగములు గలదైయుండెను. ఒక భాగము దేవాలయము మరియు యూదయ విధానముయొక్క అంతమును గూర్చినదైయుండెను; వేరొకటి ప్రస్తుతవిధాన అంతము మరియు రాజుగా యేసుయొక్క భవిష్యత్తులోని ప్రత్యక్షతను గూర్చినదైయుండెను. మత్తయి 24, 25, మార్కు 13, మరియు లూకా 21లో యేసు చెప్పినది ఈ రెండు ప్రశ్నలకు జవాబు ఇచ్చినది. (ప్రకటన 6:1-8 కూడ చూడుము) ప్రస్తుతలోకము, లేక ఈ విధానముయొక్క అంతమునుగూర్చి, యేసు వర్ణించిన అనేక ముఖలక్షణములను కలిపి చూసినప్పుడు, అంత్యదినములను గుర్తించుటకు సంయుక్త సూచనగా ఉండును. ఆ సంయుక్త సూచన ఇప్పుడు నెరవేరుతుందా? బైబిలులో చెప్పిన అంత్యదినములలో అది మనలను ఉంచుతున్నదా? దాని నెరవేర్పు మనము అనుకున్నదానికంటే తరువాత ఉండవచ్చునని మనలను హెచ్చరిస్తుందా?
యేసు ఇచ్చిన సంయుక్త సూచనలోని ఒక అంశము ఏదనగా: “జనముమీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును.” (మత్తయి 24:7) మొదటి ప్రపంచయుద్ధము, 1914లో మొదలయినది. ఆ దశాబ్దములోని యెహోవాసాక్షులు వెంటనే అప్రమత్తులయ్యారు. ఎందుకు? సుమారు 35 సంవత్సరములకు ముందు, డిశంబరు 1879లో, ది వాచ్‌టవర్ పత్రిక బైబిలు కాలానుక్రమమును ఆధారముచేసికొని, 1914 మానవచరిత్రలో ఒక ప్రాముఖ్యమైన సంవత్సరమౌనని చెప్పెను. చివరికి 28 దేశములు భాగము వహించి, 1 కోటి 40 లక్షల మంది ప్రజలు చనిపోయి, నిజముగా లోకవ్యాప్త శ్రేణిలో జరిగిన ఈ మొదటి యుద్ధము, అంతమునకు సంయుక్తసూచనగా యేసుచెప్పిన సంఘటనల నెరవేర్పులో మొదటిదా? సూచనయొక్క ఇతర అంశములు కూడ దాని వెంటనే నెరవేరునా?
“యేసుక్రీస్తు . . . అనుగ్రహించిన ప్రత్యక్షత”లో, ఈ విధమైన రక్తపాతము ప్రవచించబడెను. ఇచ్చట ఒక ఎఱ్ఱని గుఱ్ఱము మరియు దానిపై సవారిచేయువాడు “భూలోకములో సమాధానము లేకుండచేయును”. (ప్రకటన 1:1; 6:4) అది నిశ్చయముగా 1914 నుండి 1918 వరకు జరిగినది. మరియు మొదటి ప్రపంచయుద్ధము కేవలము ఒక ఆరంభము మాత్రమే. దాని తరువాత 1939లో రెండవ ప్రపంచ యుద్ధము సంభవించినది. ఆ పోరాటములోనికి 59 దేశములు ఈడ్వబడ్డాయి. మరియు సుమారు 5 కోట్ల మంది ప్రజలు చంపబడ్డారు. రెండవ ప్రపంచయుద్ధము తరువాత 45 సంవత్సరములలో, 125 యుద్ధపోరాటములు జరిగినవి. 2 కోట్లమంది ప్రజలు వాటిలో చంపబడ్డారు.
ఆ సూచనయొక్క మరియొక లక్షణమేదనగా: “అక్కడక్కడ కరవులు . . . కలుగును.” (మత్తయి 24:7) మొదటి ప్రపంచయుద్ధ సమయములో మరియు తరువాత ఒకచోటనుండి మరొకచోటకు వ్యాపించిన కరువు ఉండెను. ఒక రిపోర్టు 1914 నుండి ఎన్నో లక్షల జీవితములను బలిగొన్న 60 బారీ కరవులను చూపించుచున్నది. అంతేకాకుండ, ఇప్పుడు కూడ పోషకాహారకొరతవలన మరియు నివారణచేయగల వ్యాధులవలన ప్రతిదినము 40,000 మంది పిల్లలు చనిపోతున్నారు.
“అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును.” (లూకా 21:11) మొదటి ప్రపంచయుద్ధము మొదలయిన తరువాత అవి భూమిని కదలించివేసినవి. ఇటలీలో 1915 లో ఒక భూకంపము 32,610 జీవితములను బలిగొన్నది; 1920లో మరియొకటి చైనాలో 2,00,000 మందిని చంపినది; 1923లో జపానులో 99,300 మంది చనిపోయారు; 1935లో ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న ప్రాంతములో 25,000 మంది తమ ప్రాణాలను కోల్పోయారు; 1939లో టర్కీలో 32,700 నశించారు; 1970లో పెరూలో 66,800 మంది చనిపోయారు; 1976లో చైనాలో 2,40,000 (కొందరు 8,00,000 అంటారు) చనిపోయారు; 1988లో అర్మేనియాలో 25,000 తమ జీవితములను కోల్పోయారు. నిశ్చయముగా 1914 నుండి గొప్ప భూకంపములు జరిగినవి!
“తెగుళ్లును . . . తటస్థించును” (లూకా 21:11) 1918 మరియు 1919లో, సుమారు 100,00,00,000 ప్రజలు స్పానిష్ ఇన్ప్లూయన్జాతో రోగులైరి. మరియు 2,00,00,000 కంటే ఎక్కువమంది చనిపోయారు. అయితే అది కేవలము ఒక ఆరంభమే. అభివృద్ధిచెంతుతున్న దేశములలో, మలేరియా, నత్త జ్వరము, రివర్ బ్లైండ్నెస్, తీవ్రమైన అతిసారము, మరియు ఇతర వ్యాధులు వందలాది లక్షల ప్రజలను వికలాంగులను చేయుటలో మరియు చంపుటలో కొనసాగుతున్నవి. దానికి తోడుగా హృదయరోగము మరియు కేన్సర్ లక్షలకొలది జీవితములను బలిగొనుచున్నవి. లైంగికంగా వ్యాపించు రోగములు మానవజాతిని ధ్వంసము చేయుచున్నవి. మనుష్యుల హృదయములలో భయమును కలిగించు ఎయిడ్స్ అను ప్రాణాంతకమైన తెగులు అంచనాప్రకారము ప్రతినిముషము, ఒక క్రొత్తవ్యక్తికి వ్యాపిస్తుంది. మరియు దానికి ఏ నివారణ కనిపించటములేదు.
“అక్రమము విస్తరించుట.” (మత్తయి 24:12) 1914 నుండి అక్రమము విజృంభించినది, మరియు ఈనాడు ప్రబలమై పోయినది. హత్యలు, బలాత్కారములు, దొంగతనములు, గాంగ్ యుద్ధములు—అవి వార్తాపత్రికలలో మరియు రేడియో, టెలివిజన్లలో ముఖ్యవార్తలవుతున్నాయి. లక్ష్యములేని హింస నిరాటంకంగా కొనసాగుతున్నది. సంయుక్త రాష్ట్రములలో ఒక తుపాకిగల వ్యక్తి త్వరగా కాల్చగల తుపాకితో ఒక బడిపిల్లల గుంపుపై వందల గుండ్లను వెదజల్లాడు—5 గురు చనిపోయారు. 29 మంది గాయపడ్డారు. ఇంగ్లాండ్‌లో స్థిరబుద్ధిలేని మనుష్యుడొకడు AK-47 తుపాకితో 16 మందిని చంపాడు. కెనడాలో స్త్రీలను ద్వేషించు ఒకడు మాన్ట్రీయల్ విశ్వవిద్యాలయములోనికి వెళ్లి వారిలో 14 మందిని చంపాడు. అటువంటి ప్రజలు తోడేల్లు, సింహములు, కృరమృగములు, పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉన్నారు.—యెహెజ్కేలు 22:27; జెఫన్యా 3:3; 2 పేతురు 2:12.
“లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయముకలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.” ( లూకా 21:26) మొదటి అణు బాంబు పేలిన కొద్దిసమయము తరువాతనే, అణు శాస్త్రజ్ఞుడైన హార్ల్డ్ సి. యురీ భవిష్యత్తును గూర్చి ఇట్లనెను: “మనము భయముతో తిందుము, భయముతో నిద్రించుదుము, భయముతో జీవించుదుము మరియు భయముతో చనిపోవుదుము.” అణు యుద్ధమునుగూర్చిన భయమునకు హింస, కరువు ఆర్ధిక అస్థిరత నైతిక పతనము, కుటుంబము క్షీణించుట, భూమియొక్క కలుషితమును గూర్చిన భయము కూడ జతపరచబడినవి. వాస్తవముగా, చెడుకాలములను గూర్చి వార్త అందించు అనుదిన వార్తాపత్రికలు మరియు దూరదర్శిని ప్రతిచోట భయమును వ్యాపింపజేయుచున్నవి.
ఈ విధానముయొక్క అంత్యదినములలో ఉండు పరిస్థితులను గూర్చి అపొస్తలుడైన పౌలుకూడా వ్రాసెను. ఆయన వాక్యములను చదువుట దినపు వార్తలు చదివినట్లే ఉండును. ఆయన ఇట్లు వ్రాసెను: “అంత్య దినములలో అపాయకర కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు అపవిత్రులు, అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు ఇట్టివారికి దూరముగా ఉండుము.”—2 తిమోతి 3:1-5.
అన్ని విషయములు “సృష్టి ఆరంభముననున్నట్టే” కొనసాగుతున్నవా?
అపొస్తలుడైన పేతురు అంత్యదినముల మరియొక అంశాన్ని గూర్చి ప్రవచించెను: “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, ‘ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే’ అని చెప్పుదురు.”—2 పేతురు 3:3, 4.
ఈనాడు, అంత్యదినముల విషయము చర్చలోనికి వచ్చినప్పుడు, అనేకమంది ప్రజలు పేతురు యొక్క ప్రవచనార్ధక మాటలను నెరవేర్చుచూ, అపహసించుదురు మరియు ఇట్లందురు: ‘ఒహా ఆ విషయములన్నీ ముందు జరిగాయి. ఇది కేవలము చరిత్ర తిరిగి జరగడమే.’ కావున వారు తమ స్వకీయ దురాశలచొప్పున నడచుకొనుచు” హెచ్చరికలను త్రోసిపుచ్చుదురు. అంత్యదినములను ఎంతో స్పష్టముగా గుర్తించు ప్రవచనములు నెరవేరుటను “వారు బుద్ధిపూర్వకముగా” త్రోసిపుచ్చుదురు.—2 పేతురు 3:5.
అయినప్పటికినీ, యేసు ప్రవచించిన సంయుక్త సూచనయొక్క వేరు వేరు అంశములన్ని కలిసి ఇంత కొద్ది సమయములో ఇంత తీవ్రతతో మరియు ఇంత వ్యాప్తిగల పర్యవసానములతో క్రితమెన్నడు జరుగలేదు. (ఉదాహరణకు, మత్తయి 24:3-12; మార్కు 13:3-8; లూకా 21: 10, 11, 25, 26ను పునఃపరిశీలించుము.) మరియు ప్రకటనలో వర్ణించబడిన మరియొక ప్రవచించబడిన అంత్యదినముల అంశమువైపు మీ అవధానమును మళ్లించుటకు మేము ఇష్టపడుదుము.
మనము ప్రకటన 11:18 చూచెదము. క్రీస్తు రాజ్యము పరిపాలించుటకు ఆరంభించినపుడు మరియు జనములు కోపగించునప్పుడు మరియు తీర్పునకు సమయము వచ్చినప్పుడు, యెహోవా “భూమిని నశింప జేయువారిని నశింపజేయున”నని అది చెప్పుచున్నది. ఈనాడు కలుషితము పరిసరములను నాశనముచేయుటలేదా? నిజమే, మనుష్యులు ఎల్లప్పుడు భూమియొక్క వనరులను తాము ధనవంతులవుటకు ఉపయోగించుకున్నారు. అయితే అలా చేయునప్పుడు వారెప్పుడు నివాసయోగ్యమైన గ్రహముగా దానిని నాశనముచేయు స్థితిలో లేకుండిరి. ఇప్పుడు 1914 నుండి అభివృద్ధి అయిన సాంకేతిక విజ్ఞానము ద్వారా, మనుష్యులకు ఆ శక్తి ఉన్నది, మరియు సంపదకొరకు అత్యాశతో వెదకుటద్వారా, వారు వాస్తవముగా భూమిని నాశనము చేయుచున్నారు. పరిసరములను కలుషితముచేయుచు జీవమును కాపాడు భూమి యొక్క సామర్ధ్యమును ప్రమాదములో పెట్టుచున్నారు.
అత్యాశగల భౌతిక వాద సమాజము దానిని ఇప్పుడు భయము కలిగించే రీతిలో చేయుచున్నది. దానివలన పరిణమించే ప్రమాదకరమైన దుష్పలితాలు ఇవి: ఆమ్లవర్షము, మండల ఉష్ణము పెరుగుట, ఓజోను పొరలో రంధ్రములు, అమిత విసర్జిత వస్తువులు, విషపూరిత పారవేయు స్థలములు, ప్రమాదకరమైన క్రిమి సంహారక మరియు మొక్కల సంహారక మందులు, జీవరాసులు అంతమవు ప్రమాదము, మృతమైన చెరువులు, కలుషితమైన భూగర్భ నీరు, నాశనమౌతున్న అడవులు, కలుషితము అయిన మట్టి, పైనున్న మట్టి నష్టమౌట, మరియు మనుష్యుల ఆరోగ్యమునకు అదే సమయములో పంటలకు మరియు చెట్లకు హాని కలిగించు కలుషితమైన పొగమంచు.
ప్రొఫెసర్ బారీ కామనర్ ఇట్లనుచున్నాడు: “కొనసాగుతున్న భూమియొక్క కలుషితమును, ఆపుచేయక పోయినట్లయితే, చివరకు ఈ గ్రహము మానవ జీవితమును కలిగియుండు సామర్ధ్యమును నాశనముచేయును. . . . సమస్య శాస్త్రీయ అజ్ఞానము కాదు. కాని ఇష్టపూర్వకమైన పేరాశ.” స్టేట్ ఆఫ్ ది వర్ల్డ్ 1987 (లోకము యొక్క స్థితి 1987) అను పుస్తకము 5 వ పుటలో ఇట్లనుచున్నది: “మనుష్యుల కార్యక్రమముల శ్రేణి భూమి నివాస స్థలముగా ఉండు సామర్ధ్యమునే ప్రమాదములో ఉంచుతున్నది.” “భూగ్రహమును రక్షించుటకు పరుగు” అనే బహిరంగ దూరదర్శిని ధారావాహిక కార్యక్రమమును 1990 లో సంయుక్త రాష్ట్రములలో ప్రసారముచేశారు.
మనుష్యుడు భూమిని కలుషితముచేయుట ఎన్నటికి మానివేయడు; దేవుడు భూమిని నాశనముచేయువారిని నాశనము చేసినప్పుడు ఆయన దానిని చేయును. దేవుడు మరియు ఆయన యొక్క పరలోక సేనాధిపతి, యేసుక్రీస్తు, అంతిమ యుద్ధమైన ఆర్మగెద్దోనులో భౌతికవాదులైన దేశములపై న్యాయతీర్పు విధించుటద్వారా ఆయన దానిని చేయును.—ప్రకటన 16:14, 16; 19:11-21.
చివరిగా, అంత్యదినములను గూర్చిన యేసు ప్రవచనముయొక్క ప్రాముఖ్యమైన లక్షణమును గమనించుము: “ఈరాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యర్ధమై లోకమందంతటా ప్రకటించబడును.” (మత్తయి 24:14) దేవుని రాజ్యము ఇప్పుడు పరలోకములో పరిపాలించుచున్నదని మరియు అది ఈ దుష్టవిధానమును నాశనముచేయుటకు త్వరలో చర్య తీసుకొని భూమిపై పరదైసును పునరుద్ధరించునని ఈ సువార్త చెప్పుచున్నది. సువార్త ఇంతకు ముందు ప్రకటించబడినది అయితే లోకమందంతటా ముందెప్పుడు జరుగలేదు. అయితే, 1914 నుండి, యెహోవాసాక్షులు దాన్ని చేశారు. అదియు యేసు ప్రవచించిన హింసను ఎదుర్కొంటూనే—అనగా ప్రభుత్వ నిషేధములు, గుంపుగా పైబడుట, హింస, చెరసాల చిత్రహింస, మరియు అనేక మరణములు మొదలగువాటిని ఎదుర్కొంటునే అలా చేశారు.
ఈ రాజ్య సువార్తను ప్రకటించుచున్న యెహోవాసాక్షులు 1919 లో 4,000 మంది ఉండిరి. వారి సంఖ్యలు పెరుగుతూ, వచ్చాయి ఎంతవరకనగా గత సంవత్సరము 40,00,000 కంటే ఎక్కువ మంది 212 దేశములలో, సుమారు 200 భాషలలో ప్రకటించుచుండిరి, కోట్లకొలది బైబిళ్లను, పుస్తకములను, మరియు పత్రికలను అందించారు. లక్షల బైబిలు పఠనములను నిర్వహించారు, మరియు లోకములోని అన్ని భాగముల పెద్ద స్టేడియములలో సమావేశములను నిర్వహించారు. ఈ ఘన పరిమాణములలో సువార్త ప్రకటించు పని 1914 కు ముందు సాధ్యము కాకపోయేది. మనకాలములో ప్రత్యేకముగా అందుబాటులో అధికవేగముతో పనిచేయు ముద్రణా యంత్రములు, కంప్యూటర్లు, ఫాక్స్ యంత్రములు ఉత్తరప్రత్యుత్తర సౌకర్యములు వాడుట ద్వారా దానిని ఈ పరిమాణములో సాధించుటకు సాధ్యమైనది.
యిర్మీయా దినములలోని యోరూషలేము దానిపై వచ్చు నాశనమునుగూర్చి హెచ్చరించబడినది; దాని నివాసులు అపహసించిరి. కాని వారు అనుకున్నదానికంటే అది ఆలస్యముగా ఉండెను. ఈనాడు ఆర్మగెద్దోనుయొక్క నాశనమును గూర్చిన అతిగొప్ప హెచ్చరిక, ముంచివేయునంత బలపరచు నిదర్శనముతో ప్రకటించబడుతుంది. (ప్రకటన 14:6, 7, 17-20) లక్షలాది ప్రజలు దానికి చెవియొగ్గుటలేదు. అయితే సమయము గతించిపోతుంది; వారు అనుకున్నదానికంటే అది ఆలస్యముగా ఉన్నది. మీరు అనుకున్న దానికంటే అది ఆలస్యముగా ఉండునా? (w91 4/1)
[7వ పేజీలోని చిత్రం]
యిర్మీయా దినములలో వారు అనుకున్నదానికంటే అది ఆలస్యముగా వచ్చెను