ఒక నూతన లోకము చాలా సమీపముగా నున్నది!
ఈ లోకము మరణశయ్యపై నున్నది! అది నిజంగా వాస్తవమౌతుందా? అయితే, లోకపరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించుము.
భూమిమీదనున్న జనాబానంతటిని అనేక పర్యాయములు నాశనముచేయుటకు చాలినన్ని పరమాణు ఆయుధాలు ఉన్నవి. అంగోలా, మొజాంబిక్ వంటిదేశాలలో జరుగుచున్నటువంటి పౌరపోరాటాలు అనేక దేశాలలో చెలరేగుచున్నవి. దక్షిణాఫ్రికా, శ్రీలంక, మరి యితరదేశములలో వర్గపోరాటాలున్నవి. ఉగ్రవాదము మరియు క్లామము కూడా అనేక మానవప్రాణాలను భయంకరముగా బలిగొంటున్నవి.
ఎయిడ్స్ అనే తెగులు సంగతేమిటి? దక్షిణాఫ్రికా సండే టైమ్స్ పత్రిక అక్టోబరు 25, 1987లో దానికి “నల్లవారి క్రొత్తమరణము” అని పేరిడి యిట్లన్నది: “ఆఫ్రికానందలి ఎయిడ్స్‌ను గూర్చిన పూర్తి భయాందోళన బయటపడింది: కొన్ని దేశాలలో ప్రతిపదిమందిలో ఆరుగురు 1994 నాటికెల్ల చనిపోయే అవకాశమున్నది.”
అట్టిపరిస్థితుల దృష్ట్యా భయము వ్యాపించియున్నది. కొన్నిసంవత్సరముల క్రితము హెరాల్డ్ సి. యురే అను నోబుల్ బహుమతి గ్రహీత అన్నట్లు: “మనము భయమును తింటాము, భయముతో నిద్రిస్తాము, భయముతో జీవిస్తాము మరియు భయముతోనే మరణిస్తాము.” అభిప్రాయ సూచనగా, భూమిమీద మహాప్రవక్తగా పేరెన్నిన యేసుక్రీస్తు ఈ లోక అంత్యదినములందు మనుష్యులు “భయముకలిగి, ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురని” ప్రవచించెను.—లూకా 21:26.
కాని అనేకులు భయపడుటలేదు. బదులుగా, వారు సంతోషించుచున్నారు. ఎందుకు? ఈ లోకవిధానము (భూగోళము కాదు) అంతమునకు సమీపించినదని, ఒక నూతనలోకము చాలాసమీపంగా ఉన్నదని వారికి తెలుసు. వారు ఎందుకంత ఖచ్ఛితముగా చెప్పగల్గుచున్నారు? ఎందుకంటే అనేకమైన బైబిలు ప్రవచనముల నెరవేర్పు చూచినందున.
దృష్టాంతమునకు, తన ప్రత్యక్షతకును, లోకముయొక్క అంతమునుగూర్చి యేసుక్రీస్తు ప్రశ్నించబడినప్పుడు ఆయన యిలా అనెను: “జనముమీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము లేచును.” మొదటి ప్రపంచయుద్ధము 1914లో చెలరేగెను. అప్పటివరకు సంభవించిన యుద్ధములన్నింటికంటె ఎక్కువ ప్రాణనష్టమును అదికల్గించెను. ఎంతమంది పోరాటకులు సంహరించబడిరి? 90,00,000 మంది చనిపోయిరి. లక్షలాది మంది పౌరులు కూడా చనిపోయారు! అయితే రెండవ ప్రపంచయుద్ధము అంతకన్నా వినాశనకరమైనది, 5,50,00,000మంది ప్రాణాలను బలిగొన్నది! వీటికితోడు కరవులు, భూకంపములు, తెగుళ్లు మరియు అక్రమము విస్తరించునని యేసు తెల్పెను.—మత్తయి 24:7-13; లూకా 21:10, 11.
క్రైస్తవ అపొస్తలుడైన పౌలుకూడ ప్రస్తుత లోకపరిస్థితులను గూర్చి ఖచ్ఛితముగా ప్రవచించెను. ఆయన యిలా వ్రాసాడు: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్ధప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు. పైకిభక్తిగలవారివలె నుండియు దాని శక్తిని ఆశ్రయించని వారునైయుందురు. ఇట్టివారికి విముఖుడవైయుండుము.” (2 తిమోతి 3:1-5) ఈ మాటలను వ్రాయుటకు దేవుడు ఆయనను ప్రేరేపించెను గనుక ప్రస్తుత లోకపరిస్థితులను పౌలు అంత ఖచ్ఛితంగా ప్రవచింపగల్గెను.
అంతిమకాలమును గూర్చి తనస్వంతమాటలలో యేసుయిలా అనెను: “ఈ సంగతులు జరుగుటను మీరు చూచినప్పుడు దేవునిరాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.” (లూకా 21:31) యేసు నేర్పిన మాదిరి ప్రార్థనను లక్షలాదిమంది చేయుచు దేవునిరాజ్యము రావలెనని అడుగుచున్నారు. (మత్తయి 6:9, 10) అయితే, “ఈ రాజ్యము నిజంగా ఏమి చేస్తుంది?” అని అడిగినప్పుడు వారికి సమాధానము తెలియదు. దానికి భిన్నముగా బైబిలును బహుజాగ్రత్తతో పఠించిన లక్షలాదిమంది ఆ రాజ్యము ఈ పాతలోకమునకు అంతముతెచ్చి మానవాళికి అనంతమైన ఆశీర్వాదములను తెచ్చు నూతనలోకమును స్థిరంగా స్థాపించునని నేర్చుకొనియున్నారు. కాని ఎలా? ఎప్పుడు? (w88 11/15)