కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 7/1 పేజీలు 21-26
  • యెహోవాతోపాటు యథార్థముగా పనిచేయుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాతోపాటు యథార్థముగా పనిచేయుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనమెవరికొరకు పనిచేస్తున్నాము?
  • వ్యతిరేకులు పనిచేస్తున్నారు
  • నిరుపయోగమైన క్రియలు
  • ఈనాడు “సత్క్రియలు” చేయుట
  • మహాగొప్ప విలువనిచ్చేపని
  • సంఘముతో కలిసి పనిచేయుట
  • దేవునితో కలిసి పనిచేయడం​—⁠సంతోషించడానికి ఓ కారణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీ పనిలో ఆనందించండి
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • కష్టపడి పనిచేసి సంతృప్తిని పొందండి
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 7/1 పేజీలు 21-26

యెహోవాతోపాటు యథార్థముగా పనిచేయుట

“దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని.”—కీర్తన 71:17.

1. పని యెహోవా వరమని మనమెందుకు చెప్పగలం?

పని దేవుడు మానవునికిచ్చిన బహుమానములో ఒకటి. మన ఆది తలిదండ్రులైన ఆదాము హవ్వలతో యెహోవా ఇట్లనెను: “భూమిని నిండించి దాని లోబరచుకొనుడి.” అది సవాలుతోకూడిన కార్యమైనప్పటికినీ అది వారి శక్తి సామర్థ్యములకు సరిపడునటువంటిదే. అవసరమైన శారీరక మానసిక ప్రయత్నంవల్ల వారి జీవనసంతోషాన్ని అధికం చేస్తుంది అది వారి భూగృహములో తమతోపాటున్న జంతువులు అనుభవించినదానికన్న ఎక్కువ ఆనందాన్నిస్తుంది.—ఆదికాండము 1:28.

2, 3. (ఎ) ఈనాడు అనేకులకు పని అంటే ఎలావుంది, ఎందుకు? (బి) ఓ ప్రత్యేక పనిచేయు ఏ అవకాశమునుగూర్చి మనం పరిశీలించవలసిన అవసరమున్నది?

2 జ్ఞానియైన సొలొమోను వ్రాసినట్లు మన అసంపూర్ణతా స్థితిలో కూడ మనం “కష్టంవలన” కలిగే “మంచి” ఫలితం “దేవుని బహుమానమే.” (ప్రసంగి 3:13) మానవుడింకా తన మేధాశక్తిని వినియోగించవలసివున్నది. పనిలేకుండ వుండుట విచారకరం. అయితే అన్ని పనులు యోగ్యమైనవి లేక ఆరోగ్యకరమైనవి కావు. చాలామందికి పనియంటే వెట్టిచాకిరి క్రింద లెక్క. జీవనోపాధికొరకు మాత్రమే పుట్టిందనుకుంటారు.

3 అయితే, నిజంగా ఆనందాన్నిచ్చే పని ఒకటుంది, అందులో అందరు పాల్గొనవలెనని ఆహ్వానింపబడుచున్నారు. కానీ అందులో పాల్గొనువారికి చాలామంది శత్రువులున్నారు, మరియు వారు సమస్యలను ఎదుర్కోవలసివస్తుంది. ఈ పనికి మనం అర్హత పొందుట ఎందుకు ప్రాముఖ్యమైయున్నది? మనమెలా చేయగలం? ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకుముందు మొదట దీన్ని పరిశీలిస్తాం:

మనమెవరికొరకు పనిచేస్తున్నాము?

4. ఏపని యేసునకు సంతోషమును సంతృప్తినిచ్చినది?

4 యేసు ఇట్లన్నాడు: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది.” (యోహాను 4:34) యేసు యథార్థముగా యెహోవా సేవచేయుటవలన ఆయనకు అధికసంతోషం సంతృప్తి లభించింది. అది ఆయనకు జీవిత సంకల్పాన్నిచ్చింది, మరి ఆ ముప్పైమూడున్నర సంవత్సరముల పరిచర్య ముగిసిన తర్వాత, ఆయన తన పరలోకపు తండ్రితో ఇలా అనగలిగాడు: “చేయుటకు నీవు నాకిచ్చినపని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమపరచితిని.” (యోహాను 17:4) భౌతికాహారం ఎలా ప్రాణపోషణకవసరమో, ఆత్మీయదృష్టితో చేసే పనికూడ అంతే. యేసు హితవు చెప్తూ మరొక సందర్భములో ఈ విషయాన్ని నొక్కితెల్పాడు: “క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి.” (యోహాను 6:27) దీనికి విరుద్ధముగా, ఆత్మీయ ఫలితాలు లేనటువంటి పని, ఆశాభంగానికి, మరణానికి దారితీస్తుంది.

5. యేసు చేసినపనిని వ్యతిరేకించినదెవరు, ఎందుకు?

5 “నా తండ్రి ఇంతవరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను.” యేసు యూదులతో ఈ మాట అన్నాడు, ఎందుకనగా 38 సంవత్సరములనుండి రోగియైయున్నవానిని ఆయన సబ్బాతు దినమున స్వస్థపరచినందుకు వారాయనను విమర్శించారు. (యోహాను 5:5-17) యేసు, యెహోవా పనిలో వున్నప్పటికిని మతవ్యతిరేకులు ఈ సత్యాన్ని అంగీకరించలేదు ఆయన ఆపని చేయకుండ ఆపవలెనని తాము చేయగలిగినంతా చేశారు. ఎందుకు? ఎందుకనగా వారు యెహోవా పనిని ఎల్లప్పుడు వ్యతిరేకిస్తూ వస్తున్న తమ తండ్రియైన అపవాదియగు సాతాను సంబంధులు. (యోహాను 8:44) సాతాను “ప్రతి అవినీతి తంత్రాన్ని” వుపయోగించి “తానే వెలుగు దూతవేషము వేసికొనగలడు” గనుక మనం ఆత్మీయ వివేచనగలిగి, అతని పనులు ఎందుకొరకు వున్నవో గమనించగల మంచి ఆలోచన కలిగియుండాలి. లేకపోతే, మనం యెహోవాకే వ్యతిరేకంగా పనిచేసిన వారమౌతాము.—2 కొరింథీయులు 11:14; 2 థెస్సలొనీకయులు 2:9, 10.

వ్యతిరేకులు పనిచేస్తున్నారు

6. మత భ్రష్టులెందుకు “మోసగాండ్రయిన పనివారై” యున్నారు? ఉదహరించుము.

6 కొందరు ఈనాడు మతభ్రష్టులైన వారివలె, క్రైస్తవ సంఘములో క్రొత్తగా చేరిన సభ్యుల విశ్వాసాన్ని అణచటానికి సాతాను ప్రతినిధులవలె నమ్మక ద్రోహులుగా పనిచేస్తున్నారు. (2 కొరింథీయులు 11:13) సత్య బోధలకు బైబిలును సాధారణంగా ఆధారముగా తీసికొనక, యెహోవా సాక్షులు పూర్తిగా దానిమీదనే ఆధారపడ్డారన్నట్లుగా న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ది హోలీ స్క్రిప్చర్స్‌ను అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు అయితే ఇది అలా కాదు. ఈ శతాబ్దంలోని అధికభాగం యెహోవా సాక్షులు ముఖ్యముగా కింగ్‌జేమ్సు వర్షన్‌, రోమన్‌ కాథోలిక్కు డుయే వర్షన్‌ లేదా వారి భాషలో అందుబాటులోవున్న ఏదోఒక బైబిలును ఉపయోగించి యెహోవాను, ఆయన సంకల్పములనుగూర్చి నేర్చుకున్నారు. మృతుల స్థితినిగూర్చి దేవునికి, కుమారునికిగల సంబంధం, మరి చిన్నమందమాత్రమే ఎందుకు పరలోకం వెళ్తారు అనే సత్యాన్నిగూర్చి ప్రకటించుటకు వారు ఈ పాత బైబిళ్లను వాడిరి. ప్రపంచవ్యాప్తముగా వారి సువార్తపనిలో యెహోవా సాక్షులు బైబిలు ఇతర తర్జుమాలను ఉపయోగిస్తున్నారనే సంగతి పరిచయమున్న వారందరికి తెలుసు. అయితే 1961వ సంవత్సరమునుండి వారు ఆధునీకరణ, శ్రేష్ఠమైన తర్జుమా మరియు చదువుటకు యోగ్యమైన న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ వాటికి తోడుగా ఉపయోగిస్తున్నారు.

7. (ఎ) తనయందు విశ్వాసముంచువారిలో అనేకులను యేసు ఎందుకు తృణీకరిస్తాడు? (బి) 1 యెహాను 4:1 నందలి హెచ్చరికను లక్ష్యపెట్టుట ఎందుకు ప్రాముఖ్యము?

7 తనయందు విశ్వాసముంచు అనేకులను యేసు తిరస్కరిస్తానన్నాడు. వారాయన పేరున ప్రవచిస్తారు, దయ్యాలను వెళ్లగొడతారు, “అనేక సూచక క్రియలు” చేస్తారని ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఆయన వీరిని “అక్రమము” చేసేవారిక్రింద గుర్తిస్తాడు. (మత్తయి 7:21-23) ఎందుకు? ఎందుకనగా, వారాయన పరలోక తండ్రి చిత్తాన్ని చేయడంలేదు, యెహోవా దేవుని విషయములో నిష్ఫలులై యున్నారు. ఈనాడు అద్భుతాలుగా కనబడేవి, అసాధారణ క్రియలు అసలు మోసగాడైన సాతాను మూలముగా ఇంకా జరుగవచ్చును. యేసు మరణ పునరుత్థానముల అనంతరం 60 సంవత్సరములకు తన మొట్టమొదటి సాధారణ పత్రికను వ్రాస్తు అపొస్తలుడైన యోహాను క్రైస్తవులను “ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడని” హెచ్చరించాడు. మనము ఆలాగే చేయాలి.—1 యోహాను 4:1.

నిరుపయోగమైన క్రియలు

8. శరీరకార్యాలనుగూర్చి మనమెట్లు తలంచాలి?

8 ఆత్మీయ ప్రయోజన శూన్యమగు పనులలో మనం పాల్గొనకపోయినను, పాప శరీర కోర్కెలను తీర్చు పనులలో కొనసాగితే మన క్రియలు వ్యర్థమే. మనం “పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు” చేయుటలో చాలాకాలం వ్యయపరచామని అపొస్తలుడైన పేతురు అన్నాడు. (1 పేతురు 4:3,4) అయితే ఇప్పుడు సమర్పించుకున్న క్రైస్తవులందరూ అలాంటి పనులు చేశారని అర్థంకాదుగాని, అలా చేసినవారి మానసిక దృక్పధం, వారి ఆత్మీయదృష్టి పెరిగినకొలది చాలా త్వరగా మారివుండి వుండవలెనని ఖచ్ఛితముగా దాని అర్థమైయున్నది. వారి సంభాషణ విని లోకం వారిని దూషించవచ్చును; అలా దూషిస్తారని ఎదురు చూడగలం. అయినను, వారు యెహోవా సేవలో యథార్థవంతులైన సేవకులు కావలెనంటే వారలా మార్పుచేసికోవాలి.—1 కొరింథీయులు 6:9-11.

9. గాయనిగా శిక్షణనిచ్చే ఒకసాక్షి అనుభవంద్వారా మనమేమి నేర్చుకోగలం?

9 యెహోవా మనమానందించుటకు అనేక వరాలిచ్చాడు, సంగీతం అందులో ఒకటి. అయినను, “లోకమంతయు దుష్టుడగు” అపవాదియైన సాతాను ఆధీనమందున్నది గనుక సంగీత ప్రపంచంకూడ అందులో లేదా? (1 యోహాను 5:19) అవును, సంగీతం మోసపూరితమైన ఉరికావచ్చును, సిల్వానా చెప్పినట్లు, ఒక సంగీతకచేరి గాయనిగా ఆమె ఫ్రాన్స్‌లో ఇతరులకు శిక్షణనిచ్చే అవకాశమును కలిగియుండెను. “యెహోవాను సేవించవలెననే బలమైన కోరిక ఇంకా నాలో వుంది,” అని ఆమె అంటుంది. “నేను సహాయ పయనీర్‌ సేవలో ఆనందిస్తు నా జీవితములోని ఈ రెండు విషయాల్ల విజయం సాధించాలనుకున్నాను. అయితే నా పనిలో కొనసాగవలెనంటే మొట్టమొదట నేనెదుర్కోవలసిన సమస్య అవినీతికి సంబంధించినది. తొలుత, నా సహచరులు వారితోపాటు అసభ్యకరమైన మాటలు చెప్పనందుకు, వారిమాదిరి చేయనందుకు నన్ను ఎబ్బెట్టుగా చూసేవారు. ఆ తర్వాత ఆ చెడు వాతావరణమంతా నాకు అలవాటై, యెహోవా అసహ్యించుకునే వాటిని సహించేదాన్ని. పాటలకే అంకితమైపొమ్మని మా టీచర్లలో ఒకరు బ్రతిమాలుతునే వచ్చారు. మరి స్టేజిమీద చాలా దుడుకుగా వుండుటకును, ఇతరులకంటె నేనే గొప్పయని భావించునట్లు శిక్షణ పొందాను. ఇదంతా నాకు చాలా విసుగ్గావుండేది. చివరకు పరీక్షాసమయానికి సిద్ధపడవలసి వచ్చింది. నేనే మార్గాన వెళ్లాలో తెలుపుమని యెహోవాకు ప్రార్థించాను. నేను చాలా బాగాపాడాను, నాకు నమ్మకమేర్పడిందికూడ. కాని నన్ను ఎన్నుకోలేదు. ఆ తర్వాత నాకు తెలిసింది నన్నెందుకు ఎన్నుకోలేదో—పోటీకిముందే రహస్యముగా ఫలితాలు నిర్ణయించారని. అయితే నా ప్రార్థనకు ప్రత్యుత్తరం లభించింది మరినేను పాటకచేరిని వదలిపెట్టి ఇంటిలో నేర్పించే పద్ధతిని నిర్ణయించుకున్నాను.” ఈ సహోదరి ఆ పిమ్మట ఒక సంఘ పెద్దను పెళ్లాడెను. వారిద్దరు ఇప్పుడు రాజ్యసంబంధమైన వాటిని యథార్థముగా ప్రకటిస్తున్నారు.

10. యోహాను 3:19-21 నందలి యేసు మాటలనుబట్టి మనమే నిర్ణయానికి రావాలి?

10 యేసు ఇట్లన్నాడు: “దుష్కార్యముచేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకురాడు.” కాని “సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.” (యోహాను 3:19-21) యెహోవా చిత్తానికి సంకల్పానికి అనుగుణ్యముగా సేవచేయుట ఎంత దీవెనకరం! అయితే దాన్ని విజయవంతముగా చేయవలెనంటే, మన క్రియలు దేవుని వాక్యముయొక్క వెలుగులో పరిశీలింపబడుటకు ఎల్లప్పుడు అనుమతించాలి. మన జీవితమార్గాన్ని మార్చుకొనుటకును యెహోవా విలువైన సేవనుచేసే ఆహ్వానాన్ని అంగీకరించుటకు మనమేమి వృద్ధులం కాలేదు లేక ఆలస్యం అసలుకాలేదు.

ఈనాడు “సత్క్రియలు” చేయుట

11. “సత్క్రియలంటూ” కొందరుచేసే పనులేమిటి, అట్టివి ఎందుకు మనోవేదనకు దారితీయును?

11 ఈనాడు విలువైన పని, మనకాల అత్యవసరతను ప్రతిబింబించేదిగా వుండాలి. సాధారణముగా మానవుల ప్రయోజనార్థం చేసేవాటిని లేదా ఓ ప్రత్యేక ఉద్దేశ్యముతో చేసే పనులను “సత్క్రియలుగా” వర్ణిస్తూ యథార్థపరులు అట్టి పనులలో నిమగ్నులైయున్నారు, అంగీకరిస్తున్నారు. అయినను, ఈ రకమైన పని ఎంత మహావేదనకరమో! బ్రిటన్‌లో, CAFOD (కాథోలిక్‌ ఫండ్‌ ఫర్‌ ఓవర్‌సీస్‌ డెవలప్‌మెంట్‌), క్షామపీడితుల సహాయార్థంచేసే పనులనుగూర్చి ఇలా తెల్పుతుంది: “నాలుగు సంవత్సరాల క్రితం . . . లక్షలాది పౌండ్ల డబ్బు వసూలుచేసారు. వేలాది ప్రాణాలు కాపాడబడినవి. అయితే ఇప్పుడు అవేప్రాణాలు మరలా చిక్కుల్లపడ్డవి. . . . ఎందుకు? ఏంతప్పు జరిగింది?” CAFOD పత్రిక ఇంకా చెప్పుచూ, దీర్ఘకాలంగావున్న సమస్యలెన్నడు ముట్టుకోలేదు మరియు “మానవాభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ధనాన్ని యుద్ధానికి [అంతర్యుద్ధానికి] వాడిరి.” ఇటువంటి పనుల్ల నిమగ్నమైన ధర్మదాయా సంస్థల విషయంలో గగ్గొలుపెట్టే వాటిని నిశ్చయముగా నీవు వినివుంటావు.

12. ఈనాడు లోకమెదుర్కొను సమస్యలకు ఒకేఒక సమాధానమేమిటి?

12 క్షామం తీర్చవలసిన అత్యవసర సమస్య. అయిననూ ఈనాటి క్షామం, యుద్ధములు యేసుక్రీస్తు ఇచ్చిన ప్రవచన భాగమని ఈ ప్రస్తుత విధానానికి అంతమని సూచిస్తు తెలియజేసేవారెవరు? (మత్తయి 24:3, 7) బైబిలులోని ప్రకటన 6వ అధ్యాయములో విపులంగా వర్ణించబడిన నాలుగు గుర్రాలకు ఈ సంఘటనలను పోల్చి చెబుతూ దాని సాక్ష్యాధారాలను ప్రకటించేవారెవరు? యెహోవా సాక్షులే ఈ పత్రికలో ఆ విషయాలను యథార్థముగా ప్రకటిస్తున్నారు. ఎందుకు? శాశ్వత పరిష్కారం మానవునికి మించిన పనియని తెలియజేయుటకే. అంటే లోకసమస్యల యెడల క్రైస్తవులు అలక్ష్యముగా వున్నారని దీని అర్థంకాదు. ఎంతమాత్రము కాదు. వారు దయార్థహృదయులు, బాధలను దూరంచేయుటకు వారి శక్తివంచనలేకుండా కృషిచేస్తారు. అయితే దేవుని జోక్యంలేనిదే లోకసమస్యలెన్నటికి తీరవనే సత్యాన్ని వారు వాస్తవంగా ఒప్పుకుంటున్నారు. బీదలున్నట్లే, సాతాను ఈ లోకాధికారిగా వున్నంతకాలం ఈ సమస్యలు ఉండును.—మార్కు 14:7; యోహాను 12:31.

మహాగొప్ప విలువనిచ్చేపని

13. ఈనాడు ఏది అత్యవసరమైన పని, ఎవరుదాన్ని చేస్తున్నారు?

13 ఈనాడు చాలా అత్యవసరమైనదేమనగా యెహోవా దేవునిరాజ్యము త్వరలో లోకరాజ్యాలన్నింటిని తొలగించి, దేవుని భయంగల వ్యక్తులు ఆశించే విడుదలను తెచ్చుననే సువార్త ప్రకటించుటయే. (దానియేలు 2:44; మత్తయి 24:14) యేసుక్రీస్తు పాలస్తీనా ప్రాంతానికే తన ప్రకటన పనిని పరిమితము చేసినప్పటికిని పరలోక రాజ్య ప్రకటనను ఆయన తన జీవితంలో ప్రథమ ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఈనాడు యేసు ఇలా జరుగవలెనని చెప్పినట్లే, ప్రపంచవ్యాప్తముగా ఈ ప్రకటన జరుగుచున్నది. (యోహాను 14:12; అపొ.కార్యములు 1:8) దేవుని సేవలో, ఓ చిన్నపనిలోనైనను, భాగము వహించుట నిస్సందేహముగా ఆధిక్యతయైయున్నది. సువార్త బోధకులౌతారని కలలోకూడ వూహించని స్త్రీపురుషులు, చిన్నాపెద్ద, ఈనాడు యెహోవా సాక్షులుచేసే సువార్తపనిలో ముందుటున్నారు. నోవహు మరియు అతని కుటుంబమువలె దేవుని ఆజ్ఞానుసారముగా ఆయన సేవ యథార్థముగా చేస్తున్నారు గనుక వారు, ఈ విధానాంతానికి నాందిగా ఆయనయందు బలపడుచున్నారు.—ఫిలిప్పీయులు 4:13; హెబ్రీయులు 11:7.

14. సువార్తపని ఎట్లు ప్రాణరక్షణకరమైయున్నది, మరియు రక్షణకవచమై యున్నది?

14 ఈ అంత్యదినములలో యెహోవా సాక్షులు ఇచ్చే సాక్ష్యం వినువారికి, సువార్తవిని దానిప్రకారం ప్రవర్తించువారికి రక్షణసువార్తయైయున్నది. (రోమీయులు 10:11-15) ప్రకటించువారికికూడ అది రక్షణకవచమైయున్నది. మనకంటె ఎక్కువ సమస్యలున్న ప్రజలకు సహాయంచేసే శ్రద్ధచూపకుండ వుండవలెను. నీతినియమాలు క్షీణించే లోకము మనందాని మార్గంలో నడవాలని కోరుచున్నదని మన గ్రహిస్తున్నాం గనుక, సువార్త సేవచేయునప్పుడు మనం దేవుని ఆలోచనలతో మనమనస్సులను నింపుకొనుట విశ్వాసబలంకన్న గొప్పది; అది మన మేలుకొరకే. ఓ సాక్షి ఇలాఅన్నాడు: “నేను కలిసే ప్రజలను నేను మార్చుటకు ప్రయత్నించకపోతే వారేనన్ను మార్చివేయగలరు!”—2 పేతురు 2:7-9 పోల్చుము.

సంఘముతో కలిసి పనిచేయుట

15. ఉపకాపరులపై ఈనాడు ఏ బాధ్యతలు మోపబడినవి, 1 తిమోతి 3:1 దృష్ట్యా సంఘములోని పురుషులు ఎటువంటి తలంపు కలిగివుండాలి?

15 క్రొత్తవారు సంఘములో చేరినప్పుడు, వారు గొప్పకాపరియైన యెహోవా దేవుని, మరియు మంచి కాపరియైన యేసుక్రీస్తు ఆధ్వర్యము క్రిందికి వస్తున్నారు. (కీర్తన 23:1; యోహాను 10:11) ఈ పరలోక కాపరులకు ఈ భూమిమీద సంఘాలలో నియమించబడిన పెద్దలు, మందకు నమ్మకమైన ఉపకాపరుల స్థానములో ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. (1 పేతురు 5:2, 3) ఈ అంత్యదినాల్ల అట్టి స్థానం కలిగియుండుట ఎనలేని ఆధిక్యతయే. కాపరుల పని బాధ్యతాయుతమైన, సువార్త పనిలోను సంఘములోను బోధించుటయందు నాయకత్వము వహించుట మాత్రమేగాక మందను ఆత్మీయ మృగాల బారినుండియు, మనం జీవించే ఈ లోకంలోని తుపానువంటి పరిస్థితుల ఆటుపోటుల నుండికూడ కాపాడాలి. సంఘములోని పురుషులకు అభివృద్ధి చెందుచున్న సంఘసభ్యుల ఆత్మీయ అవసరతలను తీర్చుటకు సహాయం చేసేదానికన్న గొప్పవిలువైన పని వేరొకటి లేదు.—1 తిమోతి 3:1; యెషయా 32:1, 2 పోల్చుము.

16. క్రైస్తవ కాపరులు ఒకరికొరకు ఎట్లు సహాయపడగలరు?

16 అయిననూ మనమొకటి మర్చిపోకూడదు ఈ కాపరులుకూడ మందలోని వారివలె మానవులే, వివిధ వ్యక్తిత్వం కలిగిన అసంపూర్ణులే. మందను కాయుటలో ఒకరు ఒకవిధంగా సఫలంకావచ్చు, మరికొందరికున్న వరాలు సంఘానికి మరోవిధంగా ఉపయోగపడతాయి. క్రైస్తవ పెద్దలుగా వారి పనులు ఒకరికొకరికి ఉపయోగపడి సంఘాన్ని బలపరచును. (1 కొరింథీయులు 12:4, 5) వారిలో పోటీస్వభావం ఎన్నటికిని రాకూడదు. వారు కలిసికట్టుగా పనిచేస్తు (సంఘాన్ని) సంరక్షించి, రాజ్యసంబంధమైన వాటిని వృద్ధిచేస్తు, యెహోవాకు ప్రార్థించుటలో “పవిత్రమైన చేతులెత్తి,” వారి క్రియలన్నిటిలోను తీర్మానములలోను ఆయన నడిపింపును దీవెనను కోరుచూ వుండవలెను.—1 తిమోతి 2:8.

17. (ఎ) మనకు ఏ బాధ్యతవున్నది? (బి) మన బాధ్యతను మనం సరిగ్గా నిర్వర్తించాలంటే మనం వేటిని విసర్జించాలి?

17 సాతాను సామ్రాజ్యం అంతానికి సమీపిస్తున్న కొలది ఇప్పుడు ప్రచారపుపని యింకా అత్యవసరంగా ప్రకటించబడుతుంది. యెహోవా దేవుని వాక్యములోని సత్యాన్ని కలిగియున్న సాక్షులమైన మనం ప్రతి తరుణములోను సువార్త వ్యాపకముచేయు బాధ్యతను కలిగియున్నాం. మనం చేస్తున్న ఈపని అంతం వరకు కూడ చేస్తూవుండటానికి చేతినిండావుంది సుఖభోగాలు అవినీతితోకూడిన తుచ్ఛకోరికలు లేక ధనాపేక్షమూలముగా ప్రక్కదారికి పోకుండ జాగ్రత్తపడాలి. ఊహాజనిత ఆలోచనలోగాని, మాటలను గూర్చి తర్కించడంలో గాని పాల్గొనకూడదు ఎందుకంటే అది నిష్‌ప్రయోజనము, వృధాసమయము. (2 తిమోతి 2:14; తీతు 1:10; 3:9) శిష్యులు యేసును “ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా” అని అడుగగా యేసు వారిద్వారా అవధానమును ప్రాముఖ్యమైన పనివైపు మళ్లిస్తు ఇట్లనెను: “మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురు.” ఆ ఆజ్ఞ ఈ రోజువరకును అమలులోవుంది.—అపొ.కార్యములు 1:6-8.

18. యెహోవాతో కలిసి పనిచేయుట ఎందుకు ఎంతో దీవెనకరమై యున్నది?

18 యెహోవాతో కలిసిపనిచేయుట, ఈనాడు లోకవ్యాప్తంగావున్న ఆయన సంఘములతో కలిసి సువార్త ప్రకటించుట మూలంగా మనకు సంతోషం, సంతృప్తి, మన జీవితాలకు నిజమైన సంకల్పం లభించును. ఇది యెహోవాను ప్రేమించు ప్రతివారికి ఆయనయెడల భక్తి యథార్థతలను కనబరచే అవకాశమైయున్నది. వివిధ హంగులున్న ఈ పని ఎన్నడును పునరావృతం కాదు. నిత్యజీవనిరీక్షణ స్పష్టంగా మనయెదుట ఉన్నందున ఆయన మహిమార్థము, మన స్వరక్షణార్థము మనం యథార్థంగా “వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము.”—హెబ్రీయులు 12:28. (w90 8/15)

నీ జవాబేమిటి?

◻ యేసు ఎటువంటి పనిమూలముగా సంతోషాన్ని, సంతృప్తిని పొందాడు?

◻ యెహోవా పనిని వ్యతిరేకించినదెవరు, ఎందుకు?

◻ లోకస్థుల “సత్క్రియలను,” దేవునిరాజ్య సువార్త ప్రకటనయు ఎలా పోల్చబడినవి?

[24వ పేజీలోని చిత్రాలు]

యేసు తన శిష్యులతో సువార్త ప్రకటించుడని ఆజ్ఞాపించెను

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి