మోయాబు రాతిపలక పగిలిపోయింది కానీ కనబడకుండ పోలేదు
మోయాబు లేక మేషా అనబడు ఈ రాతిపలకను 1868వ సంవత్సరములో కనుగొనిన సంవత్సరములోపలే దాన్ని బుద్ధిపూర్వకముగా ముక్కలుచేశారు. అది దాదాపు 3,000 సంవత్సరముల నాటిది. అది నునుపు చేయబడిన నల్లని ఓ తరహా రాతిముక్కపై కొన గుండ్రముగా చెక్కబడివుంది, అది దాదాపు నాలుగు అడుగుల ఎత్తు, రెండు అడుగులకంటె కొంచెం ఎక్కువ వెడల్పు, సుమారు రెండడుగుల మందం గలది. అది ముక్కలైన కొద్దికాలానికి, 2 పెద్దవి, 18 చిన్నరాతి ముక్కలు దొరకినవి, గాని మూడవముక్క దొరుకుతుందనే ఆశ లేకుండపోయింది.
మరి అట్టి అరుదైన కళాఖండం దాదాపు శాశ్వతముగా ఎలా మాయమైంది? బైబిలు విద్యార్థులకు అదెంత విలువైనది?
కృత్రిమము, అపనమ్మకము
ఐరోపీయుడైన ఎఫ్. ఎ. క్లెయిన్ ఆ రాయి ముక్కలు కాకముందు చూచిన మొదటివాడు, మరియు ఆఖరివాడు. మృతసముద్రానికి ఈశాన్యదిశగానున్న దీబోను శిధిలాల్ల అది చిక్కుకుపోయింది. పై అంచునవున్న 35 లైన్లలోని వ్రాతను క్లుప్తగా గీసుకొని, యెరూషలేమునకు వచ్చినతర్వాత ప్రూజియన్ అధికారికి ఆ విషయం నివేదించాడు. ఆ వ్రాత ఫెనోషియన్ భాషయని వెంటనే గుర్తించారు, దాని ప్రాముఖ్యతను గ్రహించారు. బెర్లిన్‌లో రాయల్ మ్యూజియం ఆ రాతిని కొనడానికి డబ్బు సేకరించిదిగాని ఇతరులు దానికొరకు పోటీ పడ్డారు. దాని విలువను గ్రహించిన స్థానిక షేకులు దాన్నిదాచారు, దాని ధరను హాస్యాస్పదముగా (విపరీతంగా) పెంచారు.
ఒక ఫ్రెంచ్ భూగర్భశాస్త్రజ్ఞుడు దానివ్రాతను ఏలాగో తడిచిన కాగితం మీదికి ఎక్కించాడుగాని ఆ కాగితం ఎండిపోకముందే అక్కడనుండి తీసివేయాలి గనుక నొక్కి తీసిన అక్షరాలు స్పష్టంగా కనబడలేదు. ఇంతలో డమాస్కస్‌లోని ప్రభుత్వాధికారులకు ఆ రాతిని అప్పగించవలెనని బెడోయిన్కు ఉత్తరువులు వచ్చినవి. వారిమాట వినకుండ బెడోయిన్ వారు దాన్ని నాశనము చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ విలువైన కళాఖండంచుట్టు అగ్నివేసి పలుమారులు దాన్ని నీళ్లలోముంచారు. రాయి ముక్కలైనప్పుడు ఆ ముక్కలను త్వరగా స్థానిక కుటింబీకులు పంచుకొని వాళ్ల ధాన్యపు కొట్లలో దాచుకున్నారు తద్వారా వారి పంటలు ఫలించాలని పైకి కనబరచుటకు. అంతేగాక పంచుకున్న ముక్కలను ఇతరులకు అమ్మడానికికూడ ఆ పద్ధతి బాగా ఉపయోగపడింది.
బైబిలు చరిత్ర వెలుగులోనికి వచ్చింది
కొనిన ముక్కలను పెద్దవిగాచేసే వుద్దేశ్యముతో ప్లాస్టర్ అతుకుల సహాయముతో కాగితపు నొక్కులతో రాతిమీదనున్న వ్రాతను చివరకు తిరిగి సంపాదించారు. పూర్తిపాఠం దొరికినప్పుడు శాస్త్రజ్ఞులు విస్మయమొందారు. అప్పుడా పురాతన స్థూపం “క్రితమెన్నడు కనిపెట్టనంత అత్యంత అరుదైన శిలాసనము” అని వర్ణించబడినది.
మోయాబు రాజైన మేషా తన దేవుడైన కేమోష్ కొరకు ఈ మోయాబు రాతిని నిలిపాడు, అది మేషా ఇశ్రాయేలీయుల ఆధిపత్యాన్ని అంతం చేసినందుకు తానన్నట్లు “ఆదేశమంటేనే తనకు కోపము” గనుక కేమోష్ దేవుని అనుమతిచొప్పున 40 సంవత్సరములు పోరాడెనని దానికి గుర్తుగా దాన్ని నిలబెట్టాడని చెప్పుకున్నాడు. మోయాబీయుల ఈ తిరుగుబాటు 2 రాజులు మూడవ అధ్యాయములో వ్రాయబడిన సంఘటనలకు సంబంధము కల్గివున్నది. ఆ రాతి పలకమీద మేషా ఎంతో భక్తిపరుడని, పట్టణాలను నిర్మించినవాడని, ఓ రహదారిని నిర్మించినట్లు ఇశ్రాయేలీయులపై విజయం సాధించినట్లు పొగడ్తలు రాసుకున్నాడు. ఇందులో అతడు తన దేవుడైన కేమోష్ను సమస్తమునకు కారకునిగా పొగడెను. మేషా అపజయం, తన స్వంత కుమారుని బలియర్పణనుగూర్చి—బైబిలునందు తెలుపబడినవి—అనుకున్నట్లుగానే, స్వయం మెప్పుదలగల ఈ రాతిపలకలో ఏమియు చెక్కబడలేదు.
తాను పట్టుకున్న ప్రాంతాలని మేషా చెక్కించిన అనేక స్థలాలు బైబిలునందు తెలుపబడినవి, వాటిలో మదెబా, అతారోతు, నెబో, యాహాజు అనునవి వున్నవి. అట్లు ఆరాయి బైబిలు వృత్తాంతాన్ని బలపరుస్తున్నవి. రాతిపలకలోని 18వ వరుసలో YHWH అనే నాలుగు అక్షరాలతోవున్న ఇశ్రాయేలీయుల దేవుని పేరును ఉపయోగించుట ఒక విశేషమే. అక్కడ మేషా ఇలా ప్రగల్భాలు పలికాడు: “నేను అక్కడ [నెబో] నుండి యాహావే [ఉపకరణాలను] తెచ్చాను, కేమోష్ ఎదుటనుండి వాటిని లాగితెచ్చాను.” బైబిలేతర స్థలాల్ల బహుశ ప్రప్రధమంగా ఇందులోనే దైవనామం వాడబడింది.
1873వ సంవత్సరములో ఈ మోయాబు రాతిపలక, తప్పిపోయిన పాఠాన్ని ప్లాస్టర్ అతుకులతో అతికించి పునరుద్ధరించబడి, పారిస్‌లోని లోరె మ్యూజియంనందు ప్రదర్శనకు నోచుకుంది, అది అక్కడేవుంది. దాని ప్రతిరూపాన్ని లండన్‌లోని బ్రిటీష్ మ్యూజియంలో చూడవచ్చును. (w90 4/15)
[27వ పేజీలోని చిత్రాలు]
(పైన) మోయాబు దేశము
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.
[క్రెడిట్ లైను]
Musée du Louvre, Paris
(కుడి) కళాఖండంపై కన్పించు నాలుగు అక్షరములతోవున్న దేవుని నామము
(ఎడమ) తిరిగి నిర్మించిన మోయాబు రాయి
[క్రెడిట్ లైను]
The Bible in the British Museum