కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 9/1 పేజీ 10
  • తటస్థసాక్ష్యము ఫలించును

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తటస్థసాక్ష్యము ఫలించును
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • అనియత సాక్ష్యమివ్వడానికి సిద్ధంగా ఉన్నారా?
    మన రాజ్య పరిచర్య—2009
  • మీరు అనియత సాక్ష్యం ఇవ్వగలరు!
    మన రాజ్య పరిచర్య—2010
  • సాక్ష్యమిచ్చుటకు ప్రతి అవకాశమును దృఢముగా చేబట్టుము—1వ భాగము
    మన రాజ్య పరిచర్య—1989
  • సువార్తనందించుట—తటస్థసాక్ష్యమిచ్చుటకు అవకాశములను కలుగజేసికొనుట ద్వారా
    మన రాజ్య పరిచర్య—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 9/1 పేజీ 10

రాజ్య ప్రచారకుల నివేదిక

తటస్థసాక్ష్యము ఫలించును

యేసు ఒక సమరయ స్త్రీతో “నాకు దాహమునకిమ్ము” అని సంభాషణను ప్రారంభించెను. (యోహాను 4:7) ఇది బలమైన తటస్థ సాక్ష్యమునకు దారితీసెను. తటస్థసాక్ష్యమునకుగల అవకాశముల యెడల మెలకువగానున్న యెడల నేడు మనము కూడ అటువలెనే బలమైన సాక్ష్యమీయగలము. ఆస్ట్రేలియాలో ఒక సహోదరుడు ఒకపార్కులోని బెంచిపై దినవచనమును చదువుచు తటస్థ సంభాషణను ప్రారంభించెను. ఆసక్తిగల ఒకవ్యక్తి ఆ ప్రచురణచూసి తాను లేఖనములయెడల ఆసక్తిగలవాడనని తెల్పెను. అతడు ఆచరణ లేని కేథోలిక్‌ మతస్తుడు. కేథోలిక్‌ పాఠశాలయందు పరిణామ సిద్ధాంతమును బోధింపబడినవాడు. ఇప్పుడు ఏది నమ్మవలయునో ఎరుగని స్థితిలోనున్నాడు. సహోదరుడు, లైఫ్‌—హౌ డిడ్‌ ఇట్‌ గెట్‌ హియర్‌? బై ఎవల్యూషన్‌ ఆర్‌ బై క్రియేషన్‌?a అను పుస్తకమును అతనికి ఇచ్చుటకు ఏర్పాటుచేసెను. రెండురోజుల తరువాత సహోదరుడు ఆ పుస్తకమును తీసికొని అతడు పనిచేయు స్థలమునకు వెళ్లగా ఆయన లేకుండెను. ఆయన సెక్రెటరీ ఆ పుస్తకమును చూసి “దీనికొరకే మేము ఎదురు చూస్తున్నాము” అని చెప్పి అమాంతములాగి తీసికొనెను.

రెండు గుంటల తరువాత సహోదరునికి ఆ వ్యక్తినుండి ఫోన్‌ వచ్చినది. క్రియేషన్‌ పుస్తకమును మరో రెండు కాపీలు తీసికొని తన కార్యాలయమునకు రావలసినదని ఆ వ్యక్తి కోరెను. సహోదరుడు కార్యాలయమునకు వెళ్లగా, అక్కడ ఆ వ్యక్తితోబాటు మరి యిద్దరు కనబడిరి. వారికి బైబిలు పఠనము ప్రారంభించబడెను. ఆయన సెక్రెటరీకూడ కలిసెను. వారమునకు రెండుమారులు పఠనమును ఏర్పాటుచేసికొనిరి. తదుపరి వారములలో ఆ వ్యక్తియొక్క స్త్రీ స్నేహితురాలు బైబిలు ప్రశ్నలడుగుచు ఉత్తరములు వ్రాయుచుండెను. ఆమె ‘తిరిగి జన్మించిన (born-again) క్రైస్తవురాలు.’ తదుపరి ఆమెకూడ పఠనములో చేరెను. ఆ వ్యక్తి వ్యాపార భాగస్వామి, పరిణామ సిద్ధాంతమును నమ్ము ఆయన స్నేహితుడుకూడ పఠనములో చేరెను.

వారు ఐదు మాసములు పఠించిరి. వారములోని రెండవ పఠనము పార్కులో జరుపుకొనిరి. తరువాత సెక్రెటరీయొక్క స్నేహితుడు పఠనములో చేరెను. త్వరలోనే మొదటివ్యక్తి వ్యాపార భాగస్వామి అతని స్నేహితుడు అమెరికాలోని ఇదహోకు వెళ్లి అక్కడ పఠనము చేసిరి. కొన్ని వారముల తరువాత మొదటివ్యక్తి వద్దకు ఒక క్రొత్తవ్యక్తి వచ్చి, పార్కులో జరుగుచున్న బైబిలు చర్చలు ఏమైనవని అడిగెను. అతడు వారి పఠనమును వినినట్లుగా కనబడుచున్నది. అతడు కూడ పఠించునట్లు ఏర్పాట్లు చేయబడినవి.

దీనియంతటి ఫలతమేమి? పార్కులో మొట్టమొదటి పరిచయమునుండి 18 మాసములైన తరువాత, మొదటి వ్యక్తి, అతని స్త్రీ స్నేహితురాలు బాప్తిస్మము తీసికొనిరి. సెక్రెటరీ, ఆమె స్నేహితుడు వివాహము చేసికొని బాప్తిస్మము తీసికొనిరి, అమెరికా వెళ్లిన వ్యాపార భాగస్వామి, అతని స్నేహితుడు బాప్తిస్మము తీసికొనిరి. వారిలో ఒకరు క్రమముగా సహాయపయనీరు సేవ చేయుచున్నారు. బైబిలు పఠనమును పార్కులో వినిన వ్యక్తి బైబిలు పఠించుచున్నాడు. ఆయన ఐర్లాండుకు వెళ్లెను. ఇప్పుడు బాప్తిస్మము తీసికొనుటకు ఎదుగుచున్నాడు!

ఒక సహోదరుడు లంచ్‌ సమయములో తటస్థసాక్ష్యము నిచ్చినందున ఇదంతయు జరిగెను. ఆయన ప్రయత్నములను యెహోవా ఆశీర్వదించెను. మనమును ప్రతి సమయమును సద్వినియోగము చేసికొనుచు యెహోవా రాజ్యసువార్తయెడల ఆకలిగొనినవారికి సువార్తను ప్రకటించుదము గాక! (w90 6/1)

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్టు సొసైటి వారిచే ప్రచురింపబడినది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి