కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 7/1 పేజీలు 28-30
  • విశ్వాసమును బలపరచు కుతూహలమైన దర్శనములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విశ్వాసమును బలపరచు కుతూహలమైన దర్శనములు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రీస్తు ప్రేమగల హెచ్చరికనిచ్చుట
  • గొర్రెపిల్ల గ్రంథపుచుట్టను విప్పుట
  • రాజ్యము పుట్టెను!
  • యెహోవా సేవకులు చర్య గైకొనుట
  • సూచనార్థకమైన ఇద్దరు స్త్రీలు
  • క్రీస్తు విజయుడై పరిపాలించుట
  • ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలు—II
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ప్రకటన విషయసూచిక
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలు—I
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • దేవుని కోపము సమాప్తమాయెను
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 7/1 పేజీలు 28-30

విశ్వాసమును బలపరచు కుతూహలమైన దర్శనములు

ప్రకటన నుండి ఉన్నతాంశములు

యెహోవా సేవకుడైన యోహాను ఆసియా మైనరు పశ్చిమ తీరానగల పత్మాసను చిన్న ద్వీపమున ఉన్నాడు. అక్కడ వృద్ధుడైన ఈ అపొస్తలుడు నిజముగా అద్భుతకరమైన, సూచనార్థకమైన, తరచు గగుర్పాటు కలిగించు మరియు ప్రాముఖ్యమైన సంగతులను చూచెను! యేసు పరలోకములో రాజైన 1914 నుండి ఆయన వెయ్యేండ్ల పాలన అంతమువరకు కొనసాగు, ప్రభువు దినమునకు ఆయన వచ్చెను. మానవజాతియొక్క బహు అంధకార ఘడియలో జరుగు సంఘటనలను యోహాను చూచినను, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనయొక్క దర్శనము ఎంత వైభవోపేతముగా ఉన్నది! అప్పుడు విధేయతచూపు మానవజాతి ఎంతగా ఆశీర్వదించబడును!

యోహాను ఈ దర్శనములను బైబిలు పుస్తకమగు ప్రకటనలో వ్రాసెను. సా.శ. 96లో వ్రాయబడిన ఈ పుస్తకము, ప్రవచనములకు దేవుడైన, యెహోవాయందు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు మనవిశ్వాసమును అది బలపరచగలదు.—వివరములకు, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్టు సొసైటి ఆఫ్‌ న్యూయార్కు, ఇన్‌కా., వారిచే ప్రచురింపబడిన, రెవిలేషన్‌—ఇట్స్‌ గ్రాండ్‌ క్లెమాక్స్‌ ఎట్‌ హేండ్‌! అను పుస్తకమును చూడుము.

క్రీస్తు ప్రేమగల హెచ్చరికనిచ్చుట

క్రీస్తుద్వారా దేవుడనుగ్రహించిన ప్రకటనలో తొలిభాగమందు క్రీస్తుతోడి రాజ్య వారసుల ఏడు సంఘములకు వ్రాయబడిన లేఖలు కలవు. (1:1–3:22) సమగ్రముగా, ఈ లేఖలు మెప్పును చూపించుచు, సమస్యలను గుర్తించుచు దిద్దుబాటును మరియు/లేక ప్రోత్సాహమును సమకూర్చుచు, నమ్మకముగా విధేయులగుటవలన వచ్చు ఆశీర్వాదములను ఎత్తిచూపుచున్నవి. ఎఫెసీయులు సహనము చూపినను, వారు కలిగియున్న మొదటి ప్రేమను విడనాడిరి. ఆత్మీయముగా సంపన్నమైయున్న స్ముర్న సంఘము శ్రమలమధ్యను నమ్మకముగా నిలిచియుండుటకు ప్రోత్సహింపబడెను. హింస పెర్గము సంఘమును జయించలేకపోయెను, అయితే అది భేదములు పుట్టించువారిని సహించెను. తుయతైరలోని క్రైస్తవులు క్రియాశీలతను వృద్ధిచేసినను, దానియందు యెజెబెలు ప్రభావము అక్కడవుండెను. సార్దీస్‌ సంఘము ఆత్మీయముగా మేల్కొనవలసియుండెను, ఫిలదెల్ఫియ కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుటకు ఉద్భోదించబడెను, మరియు నులివెచ్చని లవొదికయలోనివారికి ఆత్మీయ స్వస్థత అవసరమాయెను.

బావి పరలోక రాజులకు—వాస్తవానికి, క్రైస్తవులందరికి శిక్షణకొరకు ఎంతటి శ్రేష్ఠమైన మాటలు! ఉదాహరణకు, మనలో ఎవరమైనను నులివెచ్చగా తయారయ్యామా? అట్లయిన వెంటనే చర్యగైకొనవలెను! వేడిగాయున్న దినమందు ఎంతో సేదదీర్చు చల్లని నీరువలె తయారగుటకు, అయితే యెహోవా కొరకును ఆయన సేవకొరకును వేడియైన ఆసక్తిని కనబరచుటకు ఆరంభించుము.—పోల్చుము మత్తయి 11:28, 29; యోహాను 2:17.

గొర్రెపిల్ల గ్రంథపుచుట్టను విప్పుట

ఆ తర్వాత యెహోవా తన మహిమా సింహాసనముమీద కన్పించెను. (4:1–5:14) ఆయన చుట్టు 24 మంది పెద్దలు మరియు నాలుగుజీవులు ఉండెను. ఆయన చేతిలో యేడు ముద్రలు కలిగిన ఒక గ్రంథపుచుట్ట కలదు. ఆ గ్రంథపుచుట్టను ఎవరు విప్పగలరు? ఎందుకు, గొర్రెపిల్లయైన, యేసుక్రీస్తు ఆ విధముగా చేయుటకు అర్హుడైయున్నాడు.

గొర్రెపిల్ల ఆరు ముద్రలు విప్పగా నాటకీయ సంఘటనలు జరిగెను. (6:1–7:17) మొదటి ముద్ర విప్పబడగా, క్రీస్తు తెల్లని గుర్రముపై కన్పించెను, (1914లో) అతనికి కిరీటమియ్యబడెను, కాగా ఆయన జయించుచు వెళ్లెను. మరి మూడు ముద్రలు విప్పబడగా, ఇతర గుర్రపురౌతులు మానవజాతిపైకి యుద్ధము, కరవు మరియు మరణమును తెచ్చెను. ఐదవ ముద్ర విప్పబడుటతో క్రీస్తుకొరకు హతసాక్షులుగా మరణించినవారు తమ రక్తముకొరకు ప్రతీకారము తీర్చుకొనుమని ఎలుగెత్తి చెప్పుట వినబడెను, మరియు రాజ్యసంబంధమైన ఆధిక్యతలతో అమర్త్యమైన ఆత్మీయప్రాణులకు సంబంధించిన నీతియుక్తమైన స్థానమును సూచించుచు, వారిలో ప్రతివారికిని “తెల్లని వస్త్రము” ఇవ్వబడెను. (ప్రకటన 3:5; 4:4 పోల్చుము.) ఆరవముద్ర విప్పబడినప్పుడు, ఒక భూకంపముద్వారా దేవుని మరియు గొర్రెపిల్లయొక్క ఉగ్రత ప్రకటింపబడెను. అయితే దేవుని దాసులైన 144,000 మంది ముద్రవేయబడు పర్యంతము నాశనకరమైన తీర్పుకు సూచనగాయున్న “భూమియొక్క నాలుగుదిక్కుల వాయువులు” ఆపుచేయబడెను. వారు దేవుని పరిశుద్ధాత్మతో అభిషేకింపబడినప్పుడు, తమ పరలోక స్వాస్థ్యముకొరకు వారికి ముందుగనే ఒక కాసు—ముద్ర, లేక వాగ్దానము—ఇవ్వబడెను. కేవలము పరీక్షింపబడిన తర్వాతనే ఆ ముద్ర శాశ్వతమైనదిగా తయారగును. (రోమీయులు 8:15-17; 2 కొరింథీయులు 1:21, 22) పరదైసు భూమిపై నిత్యజీవ నిరీక్షణతో అన్ని జనాంగములలోనుండి ఒక “గొప్ప సమూహము” విస్తారమైన జనమును చూచుట యోహానును ఎంతగా ఆశ్చర్యపరచియుండవచ్చును! మానవజాతికి కలిగిన అసమాంతరమైన కాలమగు, “మహాశ్రమలనుండి” వారు వచ్చిరి.

ఏడవ ముద్ర విప్పబడినప్పుడు ఎటువంటి గగుర్పాటు కలిగించు సంఘటనలు జరిగెను! (8:1-11:14) పరిశుద్ధుల ప్రార్థనలు వినబడునట్లు ఒక అర్ధగంట సమయమివ్వబడెను, దాని వెంటనే బలిపీఠమునుండి అగ్ని భూమిమీదికి పడవేయబడెను. క్రీస్తుమత సామ్రాజ్యముపై దేవుని తెగుళ్లను ప్రకటించుటకు ఏడుగురు దూతలు బూరలతో సిద్ధమైరి. మహాశ్రమలు సంభవించు పర్యంతము అంత్యకాలమందంతటిలో ఈ బూరలు ఊదబడును. నాలుగు బూరలు భూమి, సముద్రము, మంచినీరు, మరియు సూర్యచంద్ర నక్షత్రములపై తెగుళ్లను ప్రకటించెను. ఐదవ బూర మిడుతలదండును పిలిచెను, ఇది పోరాటమునకై 1919 నుండి ముందుకు దూసుకువచ్చిన అభిషక్త క్రైస్తవులను సూచించుచున్నది. ఆరవబూర శబ్దముతో గుర్రపురౌతుల సైన్యముయొక్క ముట్టడి జరుగును. నెరవేర్పునందు, 1935 నుండి “గొప్పసమూహము” ద్వారా బలపరచబడి, అభిషక్తులైనవారు క్రీస్తుమతసామ్రాజ్య మతనాయకులకు వ్యతిరేకముగా బాధపరచు తీర్పు వర్తమానములను ప్రకటించిరి.

ఆ పిమ్మట యోహాను ఒక చిన్న పుస్తకమును తినెను, ఇది వారి పనిని మరియు క్రీస్తుమత సామ్రాజ్యమునకు వ్యతిరేకముగా ప్రకటించు దైవిక తీర్పులుగల మాటలున్న దేవునివాక్యమునుండి పోషింపబడుటను సూచించుచున్నది. అపొస్తలుడు దేవుని ఆలయమును బలిపీఠమును కొలుచుటకు ఆజ్ఞాపింపబడెను, ఇది ఆలయయేర్పాటు సంబంధముగా యెహోవా సంకల్పములలో కొన్నింటి నెరవేర్పును మరియు దానికి సంబంధించినవారు పాటించవలసిన దైవిక కట్టడలను సూచించుచున్నది. ఆ పిమ్మట గోనెపట్ట కట్టుకొని ప్రవచించిన దేవుని అభిషక్త “ఇద్దరు సాక్షులు” చంపబడిరి, కాని వారు తిరిగి లేపబడిరి. ఇది 1918-19ని సూచించుచున్నది, అప్పుడు వారి ప్రకటించుపని వారి శత్రువులచే దాదాపు స్తంభింపజేయబడెను, అయితే యెహోవా సేవకులు తమ పరిచర్యను కొనసాగించుటకు అద్భుతరీతిన పునరుజ్జీవింపచేయబడిరి.

రాజ్యము పుట్టెను!

ఏడవ బూర రాజ్యపుట్టుకను ప్రకటించెను. (11:15–12:17) పరలోకములో సూచనార్థకమైన ఒక స్త్రీ (యెహోవా దేవుని పరలోక సంస్థ) ఒక మగ శిశువుకు (క్రీస్తు రాజుగా దేవుని రాజ్యమునకు) జన్మనిచ్చెను, అయితే మహాఘటసర్పము (సాతాను) దానిని మ్రింగివేయవలెనని విఫల ప్రయత్నము చేసెను. 1914లో రాజ్యపుట్టుక తర్వాత పరలోకమందలి యుద్ధమును అంతమొందించుచు, విజయుడైన మిఖాయేలు (యేసుక్రీస్తు) ఆ మహాఘటసర్పమును అతని దూతలను భూమికి పడద్రొసెను. ఇక్కడ ఆ మహాఘటసర్పము పరలోక స్త్రీ సంతానమగు శేషింపబడిన అభిషక్తులకు వ్యతిరేకముగా యుద్ధము కొనసాగించుచున్నాడు.

యోహాను ఆ తర్వాత ఒక కౄరమృగమును చూచెను, దీనికొరకు ఒక హేయమైన ప్రతిమ చేయబడెను. (13:1-18) “సముద్రము” నుండి అనగా కలవరముతో నిండియున్న మానవ జనములనుండి—వీటినుండి మానవ ప్రభుత్వము పైకివచ్చును—ఏడుతలలు పదికొమ్ములుగల రాజకీయ కౄరమృగము పైకి తీసుకురాబడెను. (దానియేలు 7:2-8; 8:3-8, 20-25 పోల్చుము.) ఈ సూచనార్థక ప్రాణికి అధికారము ఎక్కడనుండి కలిగెను? ఎవరోకాదు, అది సాతానే! దానిని ఊహించుము! ఈ రాజకీయ మృగమునకు రెండుకొమ్ములుగల కౄరమృగము (ఆంగ్లఅమెరికన్‌ ప్రపంచ ఆధిపత్యము) ఒక “ప్రతిమను” చేసినట్లుగా చూడబడెను, ఇప్పుడది ఐక్యరాజ్యసమితిగా తెలియబడియున్నది. ఆ మృగమును ఆరాధించి, దాని పద్ధతిచొప్పున క్రియలుచేయుచు తమను పరిపాలించుటకు దానిని అనుమతించుటద్వారా దాని “ముద్రను” అంగీకరించుటకు అనేకులు బలవంతపెట్టబడుచున్నారు. అయితే యెహోవా సాక్షులు ఖండితముగా దయ్యముల సంబంధమైన ఆ మృగముయొక్క ముద్రను తిరస్కరించుచున్నారు.

యెహోవా సేవకులు చర్య గైకొనుట

దేవుని ఉగ్రతనిండిన ఏడు పాత్రలు కుమ్మరింపబడుచుండగా, ఆయన వివిధ సేవకులు పనిచేయుచున్నట్లుగా చూడబడెను. (14:1–16:21) ఇదిగో! పరలోక సీయోను పర్వతముమీద 144,000 మంది ఒక క్రొత్త కీర్తనను పాడుటను యోహాను వినెను. భూనివాసులకు నిత్యసువార్త ప్రకటించుచు ఆకాశ మధ్యమున ఒక దూత ఎగురుచున్నాడు. ఇది దేనిని సూచించుచున్నది? అనగా రాజ్యవర్తమానమును ప్రకటించుటలో యెహోవా సాక్షులకు దూతల సహాయము కలదని దాని భావము.

భూమిపై ద్రాక్షపంట కోయబడి, దేవుని ఉగ్రతగల ద్రాక్షతొట్టి త్రొక్కబడుచుండగా జనాంగములన్నియు నలుగగొట్ట బడుటను చూచుటకు యోహాను బహుగా ఆశ్చర్యపడియుండును. (యెషయా 63:3-6; యోవేలు 3:12-14 పోల్చుము.) యెహోవా ఆజ్ఞమేరకు, ఏడుగురు దూతలు ఆ పిమ్మట దైవిక ఉగ్రతగల ఏడు పాత్రలను కుమ్మరించిరి. భూమి, సముద్రము, మంచినీటి ఊటలు, ఆలాగే సూర్యుడు, కౄరమృగముయొక్క సింహాసనము మరియు యూఫ్రటీసు నది మీద మొదటి ఆరుపాత్రల కుమ్మరింపుకు గురియాయెను. దయ్యముల ప్రచారము మానవ రాజులను దేవుని యుద్ధమగు హార్‌మెగిద్దోనుకు సమకూర్చుచుండగా గమనించినప్పుడు యోహాను ఎంతగా ఉత్తేజుడైయుండును! ఏడవ పాత్ర వాయుమండలముమీద కుమ్మరింపబడినప్పుడు దాని ఫలితములు ఎంతో వినాశకరముగా యున్నవి.

సూచనార్థకమైన ఇద్దరు స్త్రీలు

ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమగు మహాబబులోను అంతమును, మరియు దాని నాశనము తర్వాత ఆనందకరమగు సంఘటనలు జరుగుటనుచూచి, నిశ్చయముగా యోహానుకు పులకరించిపోయెను. (17:1–19:10) పరిశుద్ధుల రక్తముతో మత్తిల్లినదై, అది ఏడు తలలు పదికొమ్ములుగల ఎర్రని కౄరమృగము (నానాజాతి సమితి మరియు దాని తర్వాత వచ్చిన ఐక్యరాజ్యసమితి) మీద కూర్చొనియుండుట చూడబడెను. ఆ కొమ్ములు దానిపై తిరగబడినప్పుడు అది ఎటువంటి నాశనమును అనుభవించును!

మహాబబులోను నాశనమైనప్పుడు యెహోవాను స్తుతించు స్వరములు పరలోకమందు వినబడెను. మరియు గొర్రెపిల్ల, పెండ్లికుమార్తె, పునరుత్థానులైన అభిషక్తుల వివాహము ఆర్భాటమైన శబ్దముతో కొనియాడబడుచు ఎంతగా ప్రకటింపబడెను!

క్రీస్తు విజయుడై పరిపాలించుట

సాతాను విధానమంతటిని నాశనముచేయుటలో పరలోక సైన్యములను నడిపించుచుండగా యోహాను ఆ తర్వాత రాజులకు రాజునైన వానిని చూచెను. (19:11-21) అవును, “దేవుని వాక్యమైన” యేసు, జనములకు వ్యతిరేకముగా యుద్ధముచేయును. కౄరమృగము (సాతానుయొక్క రాజకీయ సంస్థ) మరియు అబద్ధ ప్రవక్త (ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచ ఆధిపత్యము) “అగ్నిగుండములో” పడవేయబడుటను, సూచనార్థకముగా సంపూర్ణమైన, శాశ్వతమైన నాశనమును అనుభవించుటను అపొస్తలుడు చూచెను.

తర్వాత ఏమి? సాతాను అగాధములో బంధింపబడుటను యోహాను చూచెను. దానితర్వాత క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలననుగూర్చి పూర్వదృష్టి ఇవ్వబడెను, ఆ పరిపాలనలో యేసు ఆయన పునరుత్థానులైన సహపాలకులు మానవజాతికి తీర్పుతీర్చి విధేయులైన మానవులను పరిపూర్ణతకు చేర్చుదురు. (20:1-10) అప్పుడు అది కడవరి పరీక్షకు సమయము. అగాధమునుండి విడిపింపబడినవాడై సాతాను, పరిపూర్ణులైన మానవులను మోసపుచ్చుటకు బయలువెళ్లును, అయితే దయ్యముల సమస్త కృత్యములను మరియు దేవునియెడల తిరుగుబాటుచేసిన మానవులను నాశనము అంతమొందించును.

కాలగమనములో వెనుకకువెళ్లి హేడిస్‌ (మానవజాతి సామాన్య సమాధి), మరియు సముద్రములో మృతులైయున్న వారు పునరుత్థానులై ధవళమైన మహాసింహానముమీద ఆసీనుడైయున్న దేవునియెదుట తీర్పుపొందుటను చూచుటకు యోహాను ఎంతగా పరవశుడైయుండును! (20:11-15) మరెన్నటికిని తనవశము చేసికొనకుండ, మరణము మరియు హేడిస్‌ అగ్నిగుండములో పడవేయబడినప్పుడు నీతిమంతులు ఎంతగా విడుదలను అనుభవింతురు!

యోహాను దర్శనములు ముగింపునకు వచ్చుచుండగా, ఆయన నూతనమైన యెరూషలేమును చూచెను. (21:1–22:21) ప్రభుత్వసంబంధమైన పట్టణము పరలోకమునుండి క్రిందికివచ్చి, జనములకు వెలుగును ప్రకాశింపజేయును. ఆ నూతన యెరూషలేమునుండి ఒక “జీవజలముల నది” పారుచున్నది, ఇది లేఖనసత్యము మరియు పాపమరణములనుండి తేరుకొని నిత్యజీవము అనుగ్రహింపబడుట కొరకు యేసు బలిమీద ఆధారపడిన ప్రతివిధమైన దేవుని ఇతర ఏర్పాట్లకు చిత్రీకరణయైయున్నది. (యోహాను 1:29; 17:3; 1 యోహాను 2:1, 2) ఈ నది ఒడ్డున, స్వస్థపరచు ఆకులుగల వృక్షములను యోహాను చూచెను, ఇవి విధేయతగల మానవజాతికి నిత్యజీవమిచ్చు యెహోవా దయచేసిన వాటిలోని భాగమునకు చిత్రీకరణయైయున్నవి. దేవుడు మరియు యేసునుండి వచ్చిన ముగింపు వర్తమానముల తర్వాత ఆహ్వానము అందించబడెను. దప్పిగొనినవారందరు ‘జీవజలములను ఉచితముగా పుచ్చుకొనుమని’ ఆత్మయు పెండ్లికుమార్తెయు ఆహ్వానించుట ఎంత అద్భుతకరము! మరియు ప్రకటనయొక్క ముగింపు మాటలను మనము చదువుచుండగా, నిస్సందేహముగా యోహాను ఉద్రేకముతో అనిన మాటలయందు మనము పాలుపంచుకొందుము. ఆయనిట్లనెను: “ఆమేన్‌! ప్రభువైన యేసూ, రమ్ము.” (w91 5/1)

[28వ పేజీలోని బాక్సు/చిత్రం]

మెలకువగా ఉండుము: దేవుని యుద్ధమగు హార్‌మెగిద్దోనును (అర్మగిద్దోను) గూర్చి చెప్పబడిన ప్రవచనార్థక మాటల మధ్యను, ఇలా చెప్పబడినది: “ఇదిగో! నేను [యేసుక్రీస్తు] దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు.” (ప్రకటన 16:15) ఇది యెరూషలేములోని దేవాలయ శిఖరమందు పనులు నిర్వహించు పర్యవేక్షకుని, లేక అధికారియొక్క సూచిత విషయమైయున్నది. నిఘా ఘడియలందు, లేవీయులైన భటులు తమ స్థానములలో మెలకువగా ఉన్నారా లేక నిద్రించుచున్నారా చూచుటకు ఆయన దేవాలయముగుండా వెళ్లెను. ఏ భటుడైనను నిద్రించుచున్నట్లు కనుగొనబడినట్లయిన అతనిని కట్టెతోకొట్టి, అతనికి సిగ్గుకరమైన శిక్ష అన్నట్లుగా అతని పైవస్త్రములు కాల్చివేయబడుట జరిగేది. ఇప్పుడు హార్‌మెగిద్దోను ఎంతో సమీపమైయుండుటతో, “రాజుల . . . వంశము,” లేక “ఆత్మసంబంధమైన మందిరము” యొక్క శేషింపబడినవారు ఆత్మీయముగా మెలకువగా ఉండుటకు తీర్మానించుకొనియున్నారు. దేవాలయములో దేవునికి పవిత్రమైన సేవచేయుచున్న, వారి సహవాసులైన, భూనిరీక్షణగల “గొప్ప సమూహము” కూడ అదేవిధముగా ఉండవలెను. (1 పేతురు 2:5, 9; ప్రకటన 7:9-17) ప్రత్యేకముగా క్రైస్తవ పైవిచారణకర్తలు సంఘములో వృద్ధికాగల చెడు సంగతుల విషయమై జాగ్రత్తగా యుండవలెను. వారు మెలకువగా ఉందురు గనుక, యెహోవా సాక్షులుగా తమ గౌరవసేవను సూచించు, తమ “పైవస్త్రమును” దేవుని ఆత్మీయ ఆలయమందలి యథార్థ ఆరాధికులందరు కాపాడుకొనవలెను.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి