కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 5/1 పేజీలు 5-7
  • శాంతి వాస్తవమైనది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శాంతి వాస్తవమైనది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెషయా యొక్క వర్తమానము
  • దైవిక బోధ
  • సత్యారాధన
  • నిర్ణయించుకొను సమయము
  • యెహోవా మందిరం పైకెత్తబడింది
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
  • భూమ్మీద శాంతి సాధ్యమా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • నిజమైన శాంతిని వెదకి దానిని వెంటాడండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 5/1 పేజీలు 5-7

శాంతి వాస్తవమైనది

సురక్షితమైన శాంతికొరకు ఐక్యరాజ్యసమితి చేయు ప్రయత్నముల వెనుకనున్న సూత్రములను కొద్దిమంది విమర్శించుదురు. “మన కత్తులను నాగటినక్కులుగా సాగగొట్టుకొందము” అను వ్యాఖ్య ఐక్యరాజ్యసమితి యొక్క గమ్యము ప్రపంచ శాంతియని చెప్పుచున్నది, అని దివరల్డ్‌బుక్‌ ఎన్‌సైక్లొపీడియా చెప్పుచు “ఐక్యరాజ్యసమితికి రెండు గమ్యములున్నవి: అవి శాంతి మరియు మానవ హుందాతనము.”

ఇక్కడ చూపబడిన విగ్రహము క్రింద వ్రాయబడిన మాటలు బైబిల్‌ ప్రవచనము అయిన యెషయా 2వ అధ్యాయము 4వ వచనములలోనివి. ఆధునిక తర్జుమా ప్రకారము అవి ఇట్లు చదువబడును:

“వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు.”

ఈ గొప్ప మాటలు తప్పకుండా తమ సభ్యదేశాలను సురక్షితమైన శాంతి పొందుటకు మరియు పూర్తిగా ఆయుధమును విసర్జించుటకు ప్రేరేపించినాయి. అయితే, విచారకరమైన విషయమేమనగా 1945లో రెండవ ప్రపంచ యుద్ధము చివరలో ప్రారంభించిన నాటినుండి ఐ. రా. స. చరిత్ర వేరే విధముగా నున్నది. ఎందుకు? ప్రాథమికముగా యెషయానుండి తీసికొనబడిన ఈ మాటలను ప్రత్యేకముగా వారు తీసుకొనలేదు, ఎందుకనగా అవి మానవరాజ్యములైయున్నవి. ఈ మాటలు చెప్పిన సందర్భము చాలా ప్రాముఖ్యమైయున్నది. ఎందుకో ఆలోచించండి.

యెషయా యొక్క వర్తమానము

యెషయా ఒక ప్రవక్త. అన్ని జాతుల మధ్య సమాధానము మరియు పొందికగల ఒక మహిమగల దర్శనమును గూర్చి ఆయన మాట్లాడుచున్నాడు. ఈ దర్శనము నిజము కావాలంటే ప్రజలు చేయవలసినది ఒకటుంది. ఏమిటి? 2, మరియు 3 వచనములకు 4 వచనముతో గల సంబంధమును దాని ప్రాముఖ్యతను తలంచండి.

“[2] అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిరపర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. [3] ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవావాక్కు బయలుదేరును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి—యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఆయన తనమార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలో నడుతుము అని చెప్పుకొందురు. [4] ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును. వారు తమ ఖడ్గములను నాగటినక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుందురు. యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”

మొదటగా, మనము మన సృష్టికర్తయైన యెహోవాను “తన మార్గములను” మనకు బోధించువ్యక్తిగా ఒప్పుకొనవలయును. ఎందుకనగా యెషయా తరువాత వ్రాసినట్లు ‘అవి మన మార్గములకంటె ఉన్నతమయినవి.’ (యెషయా 55:9) అనేకమందికి, మరిముఖ్యముగా స్వంత ప్రాముఖ్యతగల ప్రపంచనాయకులకు దీనిని ఒప్పుకొనుట కష్టముగా నుండును. వారిదృష్టిలో వారి మార్గములే సరియైయున్నవి. ఇంకా, వారి మార్గములు ప్రపంచశాంతిని మరియు అస్త్రసన్యాసమును తీసికొనిరాలేదనే నిజము చూపునదేమనగా అట్టి మార్గములను అనుసరించుటవలన ప్రయోజనము ఉండదని అది ఖచ్చితముగా తెల్పుతున్నది.

రెండవదిగా, దేవుని చట్టమునకు ఇష్టపూర్తిగా లోబడే కోరికగల వ్యక్తులను గమనించండి: “మనము ఆయన త్రోవలో నడుతము.” కేవలము దీనిమీద ఆధారపడే భూవ్యాప్తముగా ఖడ్గములను నాగటినక్కులుగాను ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుకొందురు. ఎంతోకాలముగా ఎదురుచూచుచున్న అట్టి గమ్యమునకు ఎట్లు చేరుకొందురు?

దైవిక బోధ

యెహోవా దేవుని చట్టము కలిగియున్న బైబిలు ప్రతులను అనేకమంది కలిగియున్నారు కాని కలిగియుండుటకంటె వారెక్కువ చేయవలసియున్నది. యెహోవా చట్టము మరియు ఆయన వాక్కు యెరూషలేమునుండి బయలు వెళ్ళును అని యెషయా చెప్పుచున్నాడు. దాని అర్థమేమి? యెషయా దినములలో విశ్వసనీయ ఇశ్రాయేలీయులందరు రాజ్య అధికారము కొరకు అక్షరార్థమైన పట్టణము వైపు చూచేవారు. (యెషయా 60:14) తరువాత, యేసుక్రీస్తు అపొస్తలుల కాలములోకూడ యెరూషలేము కేంద్రీయ స్థానముగా నుండి ఆ పట్టణములోనున్న గవర్నింగ్‌ బాడి ద్వారా బోధ మరియు సూచనలు వచ్చేవి.—అపొ. కార్యములు 15:2; 16:4.

నేటి పరిస్థితి ఏమి? యెషయా ఈ మాటలతో తన వర్తమానమును ప్రారంభించుచున్నాడు. గమనించండి: “అంత్యదినములలో. . .ఇది జరుగును.” ఇతర తర్జుమాలు చెప్పునదేమనగా “చివరి దినములలో.” (న్యూ ఇంటర్‌ నేషనల్‌ వర్షన్‌) 1914 నుండి మనము చివరి దినములలో నివసిస్తున్నామనే ఋజువునకు మద్దతునిస్తూ ఈ పత్రిక పుటలలో వీటి నిదర్శనములు క్రమముగా తెల్పబడుతున్నాయి. కావున 3 మరియు 4 వచనముల ప్రకారము మనము దేనికై ఎదురు చూద్దాము?

తమ ఖడ్గములను నాగటి నక్కులుగా అప్పుడే సాగగొట్టుకొని ఇక యుద్ధము నేర్చుకొనుట మానివేసిన ఒక గొప్పసమూహము. మేము చూచినట్లుగా వారిని చూడండి! అన్ని జాతులకు చెందిన 40 లక్షలమంది పురుషులు, స్త్రీలు, పిల్లలు 200 దేశములనుండి వచ్చి ఒకటిగా కలిసి ఒకరియెడల ఒకరు సమాధానముతో జీవించుచు, సమాధానకర బైబిల్‌ వర్తమానమును తమ పొరుగువారికి ప్రకటించుచున్నారు. వారు ప్రపంచవ్యాప్తముగా యెహోవాసాక్షులని గుర్తింపబడియున్నారు.

దేవుని ప్రజల ప్రపంచవ్యాప్త కార్యక్రమములను నిర్వర్తించుటకు తగినంత నడిపింపు ఇచ్చుటకు అనేక భూభాగముల నుండి వచ్చిన క్రైస్తవ పెద్దలతో కూడిన గవర్నింగ్‌బాడి వారికున్నది. వీరు మొదటి శతాబ్ధములో యెరూషలేములో పెద్దలు మరియు అపొస్తలులవలె అభిషేకింపబడి, భూమిమీద ఆయన రాజ్యాసక్తియెడల శ్రద్ధవహించుటకు యేసుక్రీస్తుచే నియమింపబడిన బుద్ధిమంతుడును మరియు నమ్మకమైన దాసుని తరగతికి చెందిన సభ్యులైయున్నారు. పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద నడచుటకు వారిని నమ్మవచ్చునని చరిత్ర నిరూపించినది మరియు నిజమైన శాంతిని కలిగియున్న దేవుని మార్గములను ఆయన మందకు బోధించునపుడు వారెంత మాత్రము మానవ జ్ఞానముపై ఆధారపడరు.—మత్తయి 24:45-47; 1 పేతురు 5:1-4.

సత్యారాధన

సమాధానముతో జీవించుటలో తలలోనున్న జ్ఞానముకంటె ఎక్కువ లేక దేవుని చట్టప్రకారము జీవించుటకు ఇచ్ఛయించుట ఇమిడియున్నది. యెషయా కూడ స్పష్టపరచినట్లు, హృదయపూర్వక భక్తి, మన సృష్టికర్తయైన యెహోవాను ఆరాధించుట చాలా ప్రాముఖ్యము.

ప్రవక్త చెప్పునదేమనగా “యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడును.” పురాతన కాలములో కొన్ని కొండలు, పర్వతములు అబద్ధారాధనకు నెలవై మరియు అబద్ధదేవుళ్ళ ఆలయములు కలిగియుండేవి. రాజైన దావీదు మందసమును తెచ్చి సీయోను కొండమీద (యోరూషలేము) నున్న గుడారములో నెలకొల్పినపుడు అది సముద్రపు మట్టమునకు 2,500 అడుగుల ఎత్తుగలదై యున్నందున అతడు తప్పకుండా దైవిక నడిపింపుక్రింద పనిచేసెననుటలో సందేహములేదు. తరవాత, మోరియా కొండపై యెహోవా దేవునికి గొప్ప ఆలయమును నిర్మించినపుడు “సీయోను” అనుమాట యెరూషలేములోనున్న ఆలయ ప్రాంతమునకు వచ్చెను. ఎందుకనగా ఆ ఆలయము చుట్టునున్న అబద్ధదేవతల గుళ్ళకంటె మిక్కిలి ఎత్తైన స్థానములో నుండెను. యెరూషలేము తానే “పరిశుద్ధ పర్వతము”గా పేర్కొనబడెను; ఆవిధముగా యెహోవా సత్యారాధన ఉన్నత స్థానమందుంచబడెను.—యెషయా 8:18; 66:20.

కావున నేడు, యెహోవా దేవుని ఆరాధన ఒక ఆత్మీయ పర్వతమువలె మిక్కిలి ఎత్తైనస్థానమునకు ఎత్తబడెను. మరే ఇతర మతములు చేయనటువంటి దానిని చేసినందున అది ప్రాముఖ్యతగలదై అందరు చూచునట్లుగా ఉన్నది. ఏమిటది? అది యెహోవా ఆరాధికులను అందరిని ఐక్యపరచినది. వారు తమ ఖడ్గములను సంతోషముతో నాగటినక్కులుగా సాగగొట్టుకొని యుద్ధము చేయ నేర్చుకొనుట మానివేసిరి. జాతి మరియు జాతీయతయను కట్టుబాట్లు వారినిక ఎన్నటికి వేరుచేయలేవు. ప్రపంచములోని అనేక దేశములలో వారు విస్తరించియున్నను వారందరు ఐక్యమైన ప్రజగా ఒకే సహోదరత్వముతో జీవించుచున్నారు.—కీర్తన 33:12.

నిర్ణయించుకొను సమయము

ఇదంతా నీపై ఎట్టి ప్రభావమును కలిగియున్నది? మరొక హెబ్రీ ప్రవక్తయొక్క మాటలు సరియైనవిగా ఇక్కడ గోచరించును. “తీర్పుతీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. గుంపులు గుంపులుగా జనులు నిర్ణయముచేయుటకై లోయలో ఉన్నారు.” (యోవేలు 3:14) మానవజాతియంతటికి ఇది త్వరగా నిర్ణయము చేసికొను సమయమైయున్నది. దేవుని హస్తమందున్న సమాధాన మార్గములను నేర్చుకొనుటకు గాని లేక త్వరలోనే గతించనైయున్న యుద్ధాయుధ జీవమునకు మద్దతునిచ్చుటకు గాని వారు నిర్ణయించుకొనవలసియున్నది.

ఈ దినములలో ఒకగొప్ప ప్రకటించుపని నిర్వర్తించబడునని యేసుక్రీస్తు ముందుగనే ప్రకటించెను. యుద్ధముతో చింపివేయబడ్డ భూమిమీద దేవుని రాజ్యము సమాధానమును తెచ్చునను “సువార్త” ఆ ప్రకటనలో ఇమిడియున్నది. (మత్తయి 24:14) గత సంవత్సరము ప్రపంచవ్యాప్తముగా 36 లక్షలకంటె ఎక్కువ గృహ బైబిల్‌ పఠనములు క్రమముగా యెహోవాసాక్షులచే చేయబడినవి. వీటిలో కొన్ని వార పఠనములు ఒంటరి వ్యక్తులతో చేయబడినను, అనేకము కుటుంబ సమూహములతో చేయబడినవి. లక్షలకొలది పిల్లలకు తప్పక నెరవేరు ఒక భవిష్యత్తు నిరీక్షణ ఉన్నదని తెల్పబడినది. మరియు యెహోవా తయారుచేయు నూతన లోకములో ఒకప్పుడు వారి తలిదండ్రులు చవిచూచిన లేక పాల్గొన్న యుద్ధములు ఇక ఎన్నటికిని ఉండవనే గట్టి హామీ వారికి ఇవ్వబడెను.

ఒకరియెడల ఒకరికిగల నమ్మకము మరియు సమాధానముగల ఆ ప్రపంచ మెంత మంచిగా నుండును! యుద్ధాయుధములు గతించినవైయుండును. గనుక ఇక అస్త్రసన్యాసము కొరకై చింత పడనవసరములేదు. నీతియుక్తమైన రాజ్యములో పూర్తి జీవితమును అనుభవించుడని, అందు కొరకు ప్రేమ పూర్వకముగా హెచ్చరించుచు మనలను తయారుచేస్తున్న “సమాధానము నిచ్చు దేవుడై”న యెహోవాకు అందరి వందనములు చెల్లునుగాక.—రోమీయులు 15:33. (w89 12/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి