విస్మయము నొందించు విశాలమైన దేవుని మంచితనము
దేవుడు మంచివ్యక్తి. ఈ మాటను ఎన్నిసార్లు వినియుందువు లేక నీకై నీవు ఎన్నిసార్లు దానిని వాడియుంటావు? నీ విషయములో దేవుని మంచితనము యొక్క పూర్తి వైశాల్యతను నీవెప్పుడైనా ప్రతిబింబించావా? అటువంటి ధ్యానము మనమెటువంటి దేవుని ఆరాధిస్తున్నామో ననుదానియెడల గల ప్రశంశను అభివృద్ధిపరచును.
మొదటిగా, మంచితనమును మనము అర్థముచేసికొను అవసరత గలదు. మంచితనము చెడును చేయుటకు వ్యతిరేకమైయున్నదని ఈ లక్షణమును గూర్చి చెప్పవచ్చునుగాని మంచితనము అంతకు మించినదైయున్నది. అది చురుకైన లక్షణము. మంచివ్యక్తి మంచిపనిని చేయును. మరియు దేవుడు తన మంచితనము వలన మన హృదయములను ఆయన కొరకు సంతోషపరచు అనేక మంచి విషయములను చేసెను.
సీనాయి అరణ్యములో మోషేతో పలికిన మాటలలో ఆయన మంచితనము యొక్క విశాలతను మనము చూడగలము. అక్కడ తన విశ్వాససేవకునికి ఆయనిట్లు ప్రమాణముచేసెను. “నామంచితనమంతయు నీయెదుట కనపరచెదను.” ఈ ప్రమాణమును నెరవేర్చుచు మరియు తన స్వకీయ నామమును వాడుచు దేవుడు ఇంకా ఇట్లుచెప్పెను. “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా వేలమందికి కృపచూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించునుగాని ఆయన దోషులను నిర్దొషులుగా ఏమాత్రమును ఎంచడు.”—నిర్గమకాండము 33:19; 34:6, 7.
కావున దేవుని మంచితనములో ఆయన కనికరముతో పాటు ఆయన కృప ఆయన ప్రేమ పూర్వక దయ మరియు ఆయన సత్యములు ఇమిడియున్నవి. వీటితోపాటు ఆయన మంచితనములో “కోపించుటకు నిదానించుట మరియు దీర్ఘశాంతమును” కూడ మనము కనుగొందుము. ఎల్లకాలము చేస్తున్న పాపమును అనుమతించు జాగ్రత్తలేని తండ్రివలెనున్నట్లుగా దీని అర్థము కాదు. పశ్చాత్తాపపడని పాపులను ఆయన ఎన్నటికిని నిర్దొషులగా ఎంచడు.’ ఒకమంచి దేవుడు తనిఖి చేయకుండా దుష్టత్వమును అనుమతించడు.
సమృద్ధిగానున్న దేవుని మంచితనము
దేవుడు తన మంచితనమును కనపరచిన కొన్నివిధములును ఇప్పుడు ఆలోచించుము. మొదటగా, ఆయన భూమిని సృజించినపుడు మానవులయెడల మంచితనము గలవాడైయుండెను. మానవజీవమునకు అవసరమైన కనీసపు అవసరతలనే ఆయన ఏర్పాటుచేయలేదు. దానికి బదులుగా, ఈ గ్రహముపై నివసించుట సంతోషమును కలిగించునదిగా ఆయన దీనిని సమృద్ధియైన వాటితో నింపెను. ఎన్నోవిధములైన ఆహారము మరియు పానీయములను ఆయన దయచేసెను, వివిధరకములైన జంతువులను, పక్షులను తయారుచేసి మరియు పరిసరములను అందముగా తీర్చు దిద్దునిమిత్తము రంగురంగుల పుష్పములను ఆయన సృజించెను. అదనముగా, ఆయన వివిధ వేర్వేరు రకముల దృశ్యములను కనులకింపుగా నుండునట్లు తయారుచేసెను. ఇంతెందుకు, మనము మహిమాన్వితమైన సూర్యాస్తమయము లేక గొప్ప మేఘముల రూపకల్పనను చూచినపుడల్ల దేవుని మంచితనముయొక్క నిదర్శనమును చూడగలుగుచున్నాము!
ఆయన పురుషునిగాను స్త్రీగాను సృజించినపుడు దేవుని మంచితనమును మనము మరలా చూతుము. ఆయన ఆదాము హవ్వలను పరిపూర్ణమైన, సంపూర్ణ ఆరోగ్యముగల దేహములనిచ్చి వారిని ఏదెను వనములో నుంచెను. ఆ తరువాత ఆయన వారికి ఒక ఆశ్చర్యకరమైన సవాలువంటి పని నప్పగించెను: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి.” ఆవిధముగా, వారి సంతానము మధ్య పరదైసులాంటి భూమిలో నిరంతరము జీవించు ఆధిక్యతను కలిగియుండిరి. (ఆదికాండము 1:26-28; 2:7-9) మొదటి మానవ జతకు అది ఎంత అద్భుతమైన వివాహకానుకయైయున్నది!
ఆదాము మరియు హవ్వ తిరుగుబాటు చేసినప్పుడు కూడా, దేవుడు వారిని పూర్తిగా వదలివేయలేదు. ఆ క్షణములో వారిని వెంటనే కలుగు మరణముతో శిక్షించినట్లయితే ఆయన న్యాయమును మాత్రమే నెరవేర్చినవాడగును. ఏమైనను, ఆయన పాపముచేసిన వివాహపు జతయెడల మంచితనము కలిగియుండెను. కొంతకాలము నివసించి సంతానమును కనుటకు ఆయన వారిని అనుమతించెను.—ఆదికాండము 5:1-5.
ఇంకా, దేవుని మంచితనము పడిపోయిన మానవజాతి యెడల అప్పటినుండి కొనసాగెను. రాజైన దావీదు చెప్పినట్లు “యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి.” (కీర్తన 145:9) తన ఆస్తియైన భూమిమీద నివసించుటకు మానవజాతికొరకు ఆయన సమృద్ధిగా ఏర్పాటుచేసెను. తనకాలములో నున్న యూదులకు యేసు ఇట్లు చెప్పెను: “ఆయన చెడ్డవారి మీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్తయి 5:45) ఇప్పుడున్న ఆకలి లేక లేమి అనునవి దేవుడు మానవులకు ఇచ్చుటలో విఫలమైనందువలన కాదు. అవి అవినీతి, క్రూరత్వము మరియు మానవుల చేతగాని తనము వలన కలిగిన ఫలితములైయున్నవి.
మానవులు ఖనిజసంపదను అనుభవించునట్లు దేవుడు వారిని అనుమతించెను. మరియు ఆకాశనక్షత్రముల వైశాల్యతను మరియు భౌతిక వస్తువుల తయారిని అర్థముచేసికొను జ్ఞానమును వారినుంచి దాచలేదు. కొంతమంది మూఢముగా దేవుడు లేడనిను, మరికొంతమంది తన తోటి వ్యక్తులను హింసించేంతగా దేవుని మంచితనమును తమ స్వార్థప్రయోజనములకొరకు దూషించినను, నిజముగా యెహోవా మానవజాతియెడల మంచితనమును కనపరచుచూ ఉన్నాడు.—కీర్తన 14:1.
నమ్మువారికి దేవుని మంచితనము
సాధారణముగా మానవజాతియెడల దేవుడు తనమంచితనము కనపరచినప్పటికిని, విశ్వసించువారియెడల ఆయన వ్యవహారములు నిజముగా హృదయమును ఉప్పొంగజేయును. మొదటగా, ఆదాము హవ్వలు తిరుగుబాటుచేసినపుడు, పాపముయొక్క దుష్పలితాలను అధికమించుటకు దేవుడు తన “సంతానము”ను పంపుదునని ప్రవచించెను. (ఆదికాండము 3:15) సమయము గడచుకొలది, ఆదాముయొక్క అసంఖ్యాక సంతానము తాము అసంపూర్ణులైనప్పటికిని దేవుని విశ్వాసముతో సేవించిరి. మరియు ఆ తొలి ప్రవచనము వారికి ఉజ్వలమైన భవిష్యత్తు కలిగియుందురనే నిరీక్షణను కలుగజేసినది. ఈ విశ్వాససేవకులలో, ఒకడైన అబ్రాహాము “యెహోవా స్నేహితుడు” అని కూడ పిలువబడెను.—యాకోబు 2:23.
తన సంతానము అనేకజనములుగా విస్తరించునని దేవుడు అబ్రాహామునకు వాగ్థానముచేసెను, మరియు అతని వంశములోనుండి వచ్చిన ప్రధానసంతానము కానాను దేశమును వారసత్వముగా పొందుననెను. ఈ ప్రవచన నెరవేర్పులో భాగముగా అబ్రాహాము సంతానమై ఇశ్రాయేలీయులు ఆ తదుపరి ఒకజనాంగముగా సంస్థీకరింపబడిరి. (ఆదికాండము 17:3-8; నిర్గమకాండము 19:6) మరలా, దేవుడు ఈ జనమునకు మంచివాడై యుండి వారిని ఐగుప్తుదాస్యమునుండి విడిపించి అరణ్యములో వారిని కాపాడి వారికి ధర్మశాస్త్రమును మరియు యాజకత్వమును ఏర్పాటుజేసి చివరకు ఫలవంతమైన కానాను దేశమును వారసత్వపు సంపదగా వారికనుగ్రహించెను.
క్రమేణ, ఇశ్రాయేలీయులు ఒక రాజ్యముగా రూపొందెను. మరియు ప్రపంచములో తన ఆరాధనకు కేంద్రీయస్థానమైన ఒక ఆలయమును యెరూషలేములో నిర్మించవలెనని యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యముయొక్క మూడవ రాజగు సొలొమోనుకు ఆ పని అప్పగించెను. ఆలయ నిర్మాణము పూర్తియైనప్పుడు అక్కడ దానిని అంకితముచేయు సందర్భము వారికి ఉత్సాహము సంతోషములుగల పండుగగా ఉండెను. తదుపరి నివేదిక తెల్పునదేమనగా “ఇశ్రాయేలీయులు రాజును పొగడి యెహోవాచేసిన మంచితనమును బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ గుడారములకు వెళ్లిపోయిరి.” (1 రాజులు 8:66) దేవుడు తమయెడల కనపరచిన మంచితనమునుబట్టి ఇశ్రాయేలీయుల హృదయములు సంతోషముతో ఉప్పొంగిన ఇతరసందర్భములు అనేకములు కలవు.
అసంతోషకరమైన విషయమేమనగా, ఒకే సత్యదేవుని ఆరాధించు ఆధిక్యతకు వారు అన్ని వేళలా మెప్పుదల కలిగిలేరు. తత్ఫలితముగా, ఇశ్రాయేలు జనాంగమంతయు అవిశ్వాసులైరి; మరియు సా.శ.పూ. 607వ సం.లో బబులోనుకు చెరగా పోవుటకు యెహోవా వారిని అనుమతించెను. దేవుడు మోషేతో చెప్పినట్లు, తన అతిమంచితనమువలన “దోషులను శిక్షించకుండా ఎన్నటికిని వదలివేయడు.”—నిర్గమకాండము 34:7 NW.
ఏమైనను, 70 సంవత్సరముల తరువాత తనయందు విశ్వాసముగల ఇశ్రాయేలీయుల శేషమును తిరిగి తమ స్వస్థలమునకు దేవుడు దయతో రప్పించెను. ఈవిధముగా చేయుటకు ఆయనను కదల్చినదేమి? ఆయన మంచితనమే! ఇశ్రాయేలీయులు బబులోనునుండి తిరిగివచ్చుటను ప్రవచన రూపేణా యిర్మీయా ఇట్లు వ్రాయుచున్నాడు. “వారు వచ్చి సీయోను కొండమీద ఉత్సాహ ధ్వని చేయుదురు; యెహోవాచేయు మంచితనమును బట్టి వారు తేజరిల్లుదురు.” ప్రవక్త ఇంకా ఇట్లు చెప్పుచున్నాడు “నాజనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందెదరు. ఇదే యెహోవా వాక్కు.”—యిర్మీయా 31:12, 14.
కాలక్రమేణా, యేసు ఈ భూమిమీదకు వచ్చి క్రితం ఏదెనులో చెప్పబడ్డ ప్రవచనములోని “సంతానము”గా నిరూపించుకొనెను. (ఆదికాండము 3:15) బైబిలిట్లు చెప్పుచున్నది “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) యేసు మరణము మానవజాతిని పాపము నుండి విడిపించు విమోచనా క్రయధనముగాను మరియు వారికి పరిపూర్ణతను పునరుద్ధరించునదిగాను ఉండెను. ఆవిధముగా, ఆదాము పాపముయొక్క దుష్పలితాలు రూపు మాపబడతాయి. పౌలు రోమీయులకు వ్రాసినట్లుగా “ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో ఆలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.” (రోమీయులు 5:19) దేవుని మంచితనమునకు వందనములు. సరైన హృదయముగల మానవులకు నిత్యజీవము పొందు నిరీక్షణ ఇప్పుడు కలదు. అబ్రాహామువలె వారు దేవునికి స్నేహితులు కూడ కావచ్చును.
తనను సేవించువారియెడల మంచితనమును కనపరుచుటను దేవుడు నేటివరకు కొనసాగించుచున్నాడు. తమ సమస్యలను పరిష్కరించుకొనుటకు ఆయన బైబిల్ ద్వారా సలహానిచ్చి సహాయపడుచున్నాడు. (కీర్తన 119:105) తన నీతి స్థాయిని చేరుకొనుటకు ఉచితబహుమతిగా తన ఆత్మను అందించి వారికి సహాయపడుచున్నాడు. ఈ పాత లోకవిధానము గతించినతరువాత చొచ్చుకు వచ్చు నూతన నీతిలోకము కొరకు కనిపెట్టుకొనియుండవలెనని ఆయన నిజక్రైస్తవులకు తన సంకల్పములను బయలుపరచియున్నాడు. (సామెతలు 4:18; 2 పేతురు 3:13) తన మంచితనమును బట్టి తన పరిపూర్ణమైన వాక్యములో దేవుడు వీటిని పొందుపరచెను. గాన క్రైస్తవులు ఇటువంటి విషయములలో పూర్తి నమ్మకమును కలిగియుందురు.—2 తిమోతి 3:16.
అవును దేవుని మంచితనమును తలంచినపుడు ఆయనయెడల మనహృదయము సంతోషముతో నిండుకొనియుండును. అయితే అది మరొక ప్రశ్నను లేవదీయును:
దేవుని మంచితనము వలన నీవెంతగా ప్రయోజనము పొందుదువు?
నిజానికి నీవెవరివైనా, ఇప్పటికే నీవు దేవుని మంచితనము వలన ప్రయోజనము పొందేయున్నావు. నీవు శ్వాసించుట, నీవు తినుట, నీవు త్రాగుట, నీవు జీవితమును అనుభవించుట ఇవన్నీ దేవుని బహుమానములే. కాని సాధ్యమైనంతవరకూ పూర్తి ప్రయోజనములను నీవు పొందియున్నావా? గుర్తుంచుకొనండి, ఆదాము హవ్వలు పాపముచేసిన తరువాత దేవుని మంచితనము వారికి పరిమితము చేయబడినది. అట్లే, ఆయన కనికరమునకు మనము సరియైన విధముగా ప్రతిస్పందించకపోయినట్లయితే ఆయన తన ఉదారత్వమును పరిమితముచేయును. అయితే దీనిని మనమెట్లు చేయుదుము?
కీర్తనల గ్రంథకర్త ఇట్లు ప్రార్థించెను “నేను నీ ఆజ్ఞలయందు నమ్మికయుంచి యున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము.” (కీర్త 119:66) మన ప్రార్థన కూడ అదే అయి ఉండవలెను. దేవుడు మంచివ్యక్తి గనుక మనము కూడ ఆయనవలె మంచిగా నుండుటకు నేర్చుకొనవలెను. పౌలు ఇట్లు తొందర పెట్టుచున్నాడు. “మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలినడచుకొనుడి”.—ఎఫెసీయులు 5:1.
మంచితనము అంటే ఏమిటో నేర్చుకొనుటకు మొదట బైబిల్ను పఠించుటద్వారా మనము దీనిని చేయుదుము. తరువాత, ఈ లక్షణమును పెంపొందించుకొనుటకు దేవుని సహాయమును కోరుదుము. మంచితనము ఇతర ఆత్మీయఫలములైన “ప్రేమ సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వీకము మరియు ఆశానిగ్రహములతో పాటు చేరియున్నది. (గలతీయులు 5:22, 23) మనము ఈ లక్షణముల నుంచుటద్వారా, మరియు అదే మనస్థత్వము గల క్రైస్తవులతో సహవసించుట ద్వారా పెంపొందించుకొనవచ్చును.—కీర్తన 1:1-3; 1 థెస్సలొనీకయులు 5:17; హెబ్రీయులు 10:24, 25.
బైబిల్ ఇంకా ఇట్లుచెప్పుచున్నది: “నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానముచేసెదరు.” (కీర్తనలు 145:7) అవును, దేవుడు తన మంచితనమును గూర్చి ఇతరులకు చెప్పవలెనని ఆయన కోరుచున్నాడు. మన పరలోకపు తండ్రి గురించి మనము ధారాళముగా మాట్లాడవలెను. చివరిగా దేవుని మంచితనము దానికై అదే వచ్చునని మనము తలంచరాదు. నిజమే, యెహోవా పాపులను క్షమించును. రాజైన దావీదు తాను ప్రార్థనచేసినపుడు తనకు అనుకూలమైన ప్రత్యుత్తరము దొరుకునని నమ్మకము కలిగియుండెను. “నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము.” (కీర్తన 25:7) దేవుడు తప్పకుండా క్షమిస్తాడనే తలంపుతో మనము పాపము చేయవచ్చునని దీని అర్థమా? ఏమాత్రమును కాదు. దేవుని మంచితనమనగా పశ్చాత్తాపపడని పాపులను ఆయన “శిక్షించకుండా నిర్దొషులగా ఏమాత్రమును వదిలివేయడు.”
దేవుని మంచితనమును అనుభవించుట
ఒకసారి మనము దేవుని మంచితనమును పూర్తిగా అనుభవించిన తరువాత మనహృదయములు ఆయన యెడల ఎంత వెచ్చగా నుండును! అపొ. పౌలు ఇచ్చిన మేలైన సలహాను పాటించమని మనము ప్రోత్సాహింపబడుచున్నాము: “వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువున కేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగుసంబంధులవలె నడచుకొనుడి.”—ఎఫెసీయులు 5:9, 10.
అనుదినము, దేవుడు మనయెడల కనపరచు ప్రేమాపూర్వకశ్రద్ధను మనము గుణగ్రహించవలెను. అతిక్లిష్టమైన పరిస్థితులలో సహితము ఆయన తనను ప్రేమించువారిని విడనాడడని మనకు తెలుసు. అవును, కీర్తనీయుని మానసిక సమాధానమును మనము అనుభవింతుము: “నేను బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.”—కీర్తన 23:6 (w89 12⁄1)