దేవుని మంచితనము నిన్ను ఆకర్షిస్తుందా?
మీకు అతి సన్నిహిత స్నేహితులున్నారా? ఉంటే, ఆ వ్యక్తియెడల మీకున్న ఆకర్షణను మీరెప్పుడైనా ప్రతిబింబించారా? అది అతని (లేక ఆమె) అలంకరణా? నీవుకూడా అవే విషయములలో ఆసక్తి కలిగియున్నందువలననా? లేక అది దయాళుత్వము లేక జ్ఞానము అను అంతర్గత లక్షణములను బట్టియా? ఒకవేళ మీ స్నేహమును గట్టిపరచిన లక్షణము మంచితనమే అయితే మీ సంబంధము నిజముగా బలమైనది. నిజమైన మంచితనము నేడు చాలా అరుదుగా కన్పించును. ఏలయనగా ప్రజలలోనున్న అధికభాగము “మంచితనముయెడల ప్రేమలేని వారు.”—2 తిమోతి 3:3, NW.
ఒక క్రైస్తవునికి తన జీవితములో అతిప్రాముఖ్యమైన సంబంధము మరొక మానవునితో కాదుగాని అది దేవునితో గల సంబంధమైయున్నది. మీరు ఈ సంబంధమును గూర్చి ఆలోచించినపుడు మీరెప్పుడైనా “దేవుని ఏ లక్షణము నన్ను ఆయనకు అతి సమీపముగా నడిపించినది,” అని తలంచితిరా?
దేవుని ప్రాముఖ్య లక్షణములు
నిజానికి, బైబిల్ దేవునియొక్క అనేక ప్రాముఖ్యలక్షణములను గురించి వివరించుచున్నది. సాధారణముగా ఆయన ప్రేమ, ఆయన న్యాయము, ఆయన జ్ఞానము మరియు ఆయన సర్వశక్తి అతిప్రాముఖ్య లక్షణములుగా చెప్పబడినవి. (ద్వితీయోపదేశకాండము 32:4; యోబు 12:13; కీర్తన 147:5; 1 యోహాను 4:8) ఈ నాలుగు ప్రాముఖ్య లక్షణాలనుంచి మనము ఎన్నుకొనమంటే, బహుశ, దేవుని ప్రేమ మనను బహుగా ఆకర్షించెనని చెప్పగలము. ఏమైనను, ఆయన ప్రేమతో ఆయన అతి మంచితనము సమీప సహవాసము కలిగియున్నది. దీనిని గురించి బైబిల్ వ్రాతగాళ్ళు అత్యున్నతముగా వ్రాసిరి, మరియు అటువంటి మంచితనము వారి సృష్టికర్తతో ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన సంబంధమును కలిగియుండుటకు మానవులను ఆకర్షించును.
ఉదాహరణకు, సా.శ.పూ. ఆరవ శతాబ్దపు చివరి భాగములో ప్రవక్తయైన జెకర్యా యెహోవాను గూర్చి ఇట్లు ఆశ్చర్యపడెను: “ఆయన మంచితనము ఎంతగొప్పది. ఆయన సొగసు ఎంత గొప్పగానున్నది.” (జెకర్యా 9:17 NW) జెకర్యా కంటె అనేక సంవత్సరములకు ముందు యెషయా ఇదేవిధముగా దేవుని స్తుతించెను. “యెహోవా కృపాతిశయమును. . . . .ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా మంచితనమును నేను ప్రకటన చేసెదను.”—యెషయా 63:7 NW.
మూడు శతాబ్ధములకు ముందు, దావీదు రాజు కదలించురీతిగా దేవుని మంచితనమును గూర్చి వ్రాసెను. తన జీవితమంతయూ దేవుని మంచితనమును ఆస్వాదించి, అనుభవముతో దావీదు వ్రాసెను. దేవుడు దావీదు యెడల చాలా మంచితనమును కనపరచెను. మరిముఖ్యముగా, బత్సెబ మరియు ఆమె భర్త ఊరియా యెడల తీవ్రమైన తప్పిదమును చేసినప్పుడు దేవుడు దావీదుయెడల కనికరమును కనపరచెను. (2 సమూయేలు 12:9, 13) కీర్తన 31:19 లో దావీదు దీనిని మెచ్చుకొంటూ ఇట్లు ప్రకటించెను. “నీయందు భయభక్తులు గల వారినిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది!”
పురాతన ఆరాధికులు ఎంచినట్లుగా మీరుకూడ దేవుని మంచితనమును విలువైనదిగా ఎంచుచున్నారా? అట్లయితే, ‘దేవుని సమాధానము మీ తలంపులకు కావలియుండుటను’ మీరు అనుభవించుచు ఆయన చిత్తమును అన్నివేళలా చేయుటకు లోతుగా కదలింపబడుదురు. (ఫిలిప్పీయులు 4:7) కొద్ది క్షణాలపాటు దేవుని మంచితనము అనగా ఏమిటో, దాని పరిధి ఎంత గొప్పదో ఇప్పుడు ఆలోచించుదాము. మన ప్రేమగల పరలోకపు తండ్రియెడల ఇది తప్పకుండా మన మెప్పుదలను పెంపొందించును. (w89 12⁄1)