కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 1/1 పేజీలు 28-29
  • లూకా సువార్తనుండి రత్నాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లూకా సువార్తనుండి రత్నాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కొన్ని విశేషాంశాలు
  • చలింపజేయు సంఘటనలు
  • వైద్యుని కలం నుండి రాలినవి
  • అలవాట్లను గూర్చిన సూక్ష్మదృష్టి (సాంప్రదాయ విషయాల్లో పరిజ్ఞానం)
  • వినయములో గుణపాఠాలు
  • లూకా ప్రియమైన జతపనివాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • లూకా సువార్తలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ప్రార్థన, వినయం చాలా ముఖ్యమైనవి
    యేసే మార్గం, సత్యం, జీవం
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 1/1 పేజీలు 28-29

లూకా సువార్తనుండి రత్నాలు

యెహోవాకుమారుడైన యేసుక్రీస్తు కరుణామయుడని ప్రసిద్ధి. గనుక సువార్తికుడగు లూకా కరుణ, జాలి, మరియు సోదరత్వాన్ని గూర్చి నొక్కి చెప్పుట ఎంతటి యుక్తము! యూదులకును అన్యులకును ఒకే విధంగా వుండునట్లు యేసు భూలోక జీవితాన్ని గూర్చి ఆయనెంతో మనోరజింకంగా వ్రాశారు.

ఈ సువార్తలోని కొన్ని అంశాలను పరిశీలిస్తే, ఓ గొప్ప విద్వాంసుడు (పండితుడు) దాన్ని వ్రాసినట్లు వ్యక్తమౌతుంది. ఉదాహరణకు విశిష్ట సాహిత్య కృతిగల ఉపోద్ఘాతం (ఇతిహాసంతో కూడిన ఉపోద్ఘాతం), విశేష పదజాలం ఉన్నవి. ఇందునుబట్టి లూకా గొప్ప విద్యావంతుడైన వైద్యుడనే వాస్తవం సరియైనదే. (కొలస్సీ. 4:14) యేసు మరణంవరకు తాను విశ్వాసికాక పోయినను, పౌలు మూడవసారి మిషనరీ ప్రయాణం ముగించిన తర్వాత ఆయనతోపాటు ఈయన కూడ యెరూషలేముకు వెళ్లాడు. అందుకే ఈయన పౌలు కైసరయలో బంధింపబడినప్పుడు జరిగిన సంఘటనలను గూర్చి ప్రత్యక్షసాక్షులతో విచారించి, లభ్యమయిన వ్రాతపూర్వక ఆధారాలనుబట్టి పరిశోధించి అన్నింటిని క్షుణంగా వ్రాయగలిగాడు. (1:1-4; 3:1, 2) ఆయన ఈ సువార్తను బహుశ సా.శ. 56-58, రెండు సంవత్సరాల కాలములో కైసరు ప్రాంతంనుండి వ్రాసివుండవచ్చును.

కొన్ని విశేషాంశాలు

యేసు చేసిన కనీసం ఆరు అద్భుతాలను లూకా సువార్తలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవేవనగా: విస్తారంగా చేపలను పట్టుట; (5:1-6) నాయీనను ఊరిలో ఒక విధవరాలి కుమారుని బ్రతికించుట; (7:11-15) నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరచుట; (13:11-13) జలోదర రోగంగల వానిని బాగు చేయుట; (14:1-4) పదిమంది కుష్టురోగులను శుద్ధులను చేయుట; (17:12-14) మరియు ప్రధానయాజకుని దాసుని చెవిని ముట్టి బాగుచేయుట.—22:50, 51.

లూకా సువార్త విశిష్టతలో యేసు చెప్పిన కొన్ని ఉపమానాలు కూడ వున్నవి. ఇందులో: ఇద్దరు రుణస్థులదొకటి (7:41-47); మంచి సమరమును 10:30-35); ఫలింపని అంజూరపు చెట్టు (13:6-9); గొప్ప విందు (14:16-24); తప్పిన పోయిన కుమారుడు (15:11-32); లాజరు ధనవంతుని కథ (16:19-31); మరియు ఓ విధవరాలు, అన్యాయస్థుడైన న్యాయాధిపతిని గూర్చినవి ఉన్నవి.—18:1-8.

చలింపజేయు సంఘటనలు

వైద్యుడగు లూకా, స్త్రీలు పిల్లలు మరియు వృద్ధుల యెడల శ్రద్ధ చూపాడు. ఎలీసబేతు గొడ్రాలని, పిదప ఆమె గర్భం దాల్చి యోహానును కనినదని ఈయన ఒక్కడే వ్రాశాడు. ఈయన సువార్తలోనే గబ్రియేలు దూత మరియమ్మకు ప్రత్యక్షమయిన విషయాన్ని గూర్చి ఆయన వ్రాశాడు మరియు ఏలీసబేతుతో మాట్లాడుచున్నపుడు ఆమె గర్భంలోని శిశువు గంతులు వేశాడని లూక ఆనందం పట్టలేక అన్నాడు. యేసు యొక్క సున్నతిని గూర్చియు, ప్రతిష్టించుట కాయనను దేవాలయానికి తీసుకెళ్లినపుడు సుమయోను, అన్న అను వృద్ధులిద్దరు ఆయన దర్శనము చేసికొనిన విషయాన్ని గూర్చి వ్రాసిన వ్యక్తి ఈయనేగదా. లూకా సువార్తనుండి యేసు, బాప్తిస్మమిచ్చు యోహానుల బాల్యదశను గూర్చి మనం తెలిసికోగలం.—1:1-2:52.

తన ఏకైక కుమారుడు చనిపోయినందుకు విలపించిన నాయీనను ఊరి విధవరాలిని గూర్చి లూకా వ్రాసేటప్పుడు యేసు ఆమెను చూచి కనికరపడి బాలుని బ్రతికించెనని తెలిపాడు. (7:11-15) లూకా సువార్తలో మాత్రమే సుంకరియైన జక్కయ్య వృత్తాంతం ఏంతో హృదయరంజకముగా వున్నది. అతడు పొట్టివాడు గనుక యేసును చూడటానికి ఓ చెట్టెక్కాడు. అది గమనించిన యేసు తాను జక్కయ్య ఇంట్లో బస చేస్తానన్నప్పుడు అతడెంత పులకించివుండవచ్చును! ఆతిధ్యమిచ్చిన అతడు గొప్ప దీవెనలందుకున్నాడని లూకా తెల్పుచున్నాడు.—19:1-10.

వైద్యుని కలం నుండి రాలినవి

ఈ సువార్తలో వైద్యానికి సంబంధించిన భావాలు లేక ప్రాముఖ్యతలున్న అనేక పదాలు లేక వాక్యాలున్నవి. గ్రీకు లేఖికులెవ్వరూ ఇలా వైద్యానికి సంబంధించిన పదాలను అసలు వుపయెగించనూలేదు లేక ఆ భావంతో వ్రాయలేదు. కానీ యీ వైద్యుని కలంనుండి అట్టి వైద్య విజ్ఞానం వెలువడినట్లు మనం గమనించవచ్చును.

ఉదాహరణకు, లూకా మాత్రమే పేతురు అత్త తీవ్రజ్వరంతో వుండెనని చెప్పాడు. (4:35) ఆయనింకను ఇట్లు వ్రాశాడు: “ఇదిగో కుష్టరోగముతో నిండిన యొక మనుష్యుడుండెను.” (5:12) ఇతర సువార్తలను వ్రాసిన వారైతే, కుష్టురోగముతో యొక మనుష్యుడుండెను అని మాత్రమే వ్రాశారు. గానీ వైద్యునిగా లూకా అలా వ్రాయలేదు. ఆయన ఆ మనుష్యునికి కుష్టురోగం ముదిరిందన్నట్లు వ్రాశాడు.

అలవాట్లను గూర్చిన సూక్ష్మదృష్టి (సాంప్రదాయ విషయాల్లో పరిజ్ఞానం)

యేసు జన్మించిన వెంటనే మరియ ఆ శిశువును పొత్తి గుడ్డలతో చుట్టినదని లూకా తెలిపాడు. (2:7) అప్పుడే పుట్టిన పసికందు యొక్క చర్మం ఎండి, గట్టి పడుటకుగాను శరీరమంతా ఉప్పుతో బాగా రుద్ది కడిగే అలవాటు ఆనాడు వుండేది. తదుపరి ఆ శిశువును మెల్లగా పొత్తిగుడ్డలతో చుట్టి ఓ బొమ్మలాగా కదలకుండా వుంచేవారు. చుట్టిన గుడ్డల మూలంగా శిశువు నిశ్చలంగావుండి, వెచ్చదనాన్ని పొందే వీలుండేది. మరియు గుడ్డలను గడ్డం క్రిందుగా తీసి తలమీద చుట్టినందువల్ల శిశువు తన ముక్కు శ్వాస పీల్చుకొనుటకై నేర్చుకొనవీలయ్యేది. బెత్లేహేమును దర్శించిన ఓ వ్యక్తి ఈ 19వ శతాబ్దంలో కూడ శిశువులను పొత్త గుడ్డలతో చుట్టే అలవాటు గూర్చి ఇలా అంటున్నాడు: “ఆ పసికందును నా చేతుల్లోనికి తీసుకున్నాను. వాని శరీరం గట్టిగా ఏమి వంగకుండ వున్నది. ఎందుకంటే వాడి శరీరాన్ని తెల్లని ఉదారంగు నార బట్టలతో గట్టిగా చుట్టివేశారు. వాని చేతులు కాళ్లు కట్టి వేసినట్టుగావున్నవి, వాని తలను చిన్న, మెత్తని, ఎర్రని శాలువాతో చుట్టివేశారు. అది వాని గడ్డం క్రింది నుండి నుదిటి మీదుగా చుట్టబడి వున్నది.”

లూకా సువార్త, మొదటి శతాబ్దంలోని శవసంస్కార అలవాట్లను (సాంప్రదాయాన్ని) కూడ తెల్పుచున్నది. యేసు, నాయీనను ఊరి గవిని యొద్దకు వచ్చేటప్పటికి విధవరాలి చనిపోయిన ఏకైక కుమారుని శవపేటికను బయటికి మోసుకొని వెళ్లున్నట్లు, దాని వెంట ఆమెతోపాటు వస్తున్న జనసమూహాన్ని కూడ చూశాడు. (7:11, 12) శవాలను సర్వసాధారణంగా ఊరి బయటనే పాతిపెడతారు. చనిపోయిన వారి బంధుమిత్రులు శవపేటిక వెంట సమాధివరకు వెళతారు. ఆ శవపేటిక బహుశ చెక్కతో చేయబడినదై, నాల్గువైపుల నల్గురు వ్యక్తులు తమ భుజాల మీద మోసికొని పోవుటకు వీలగునట్లు నాలుగు పొడవాటి కర్రలు వుండేవి, వాని వెంట జనం సమాధివరకు నెమ్మదిగా వెళ్లేవారు.

లూకా వ్రాసిన మరో ఉపమానములో, వారిలో ఓ వ్యక్తిని దొంగలు కొట్టిన సంగతిని యేసు ప్రస్తావించినట్టున్నది. పొరుగువాడయిన సమరయుడు అతనిని చూచి “నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టెను.” (10:34) గాయాలు తగిలిన వ్యక్తికి అలవాటుగా అలా చేసేవారు. ఒలీవ నూనెగాయాలను మెత్తపరచి మృదువుగా చేస్తుంది. (యెషయా 1:6) మరి ద్రాక్షారసం సంగతేమిటి? ది జర్నల్‌ ఆఫ్‌ది అమెరికన్‌ మెడికల్‌ ఆసోషియేషన్‌ ఇట్లనుచున్నది: “గ్రీకు దేశంలో ద్రాక్షారసాన్ని మందులలో ప్రముఖంగా వాడేవారు. . . . కోస్‌లోని హిప్సోక్రేట్స్‌ అనువారు (సా.శ.పూ. 460-370) ద్రాక్షారసాన్ని విరివిగా వాడే వారు గాయాన్ని కట్టుటకును, జ్వర తీవ్రతను తగ్గించే చల్లని సాధనంగాను, మలబద్ధకాన్ని తీసివేయుటకును, మంచి మూత్ర విసర్జనకొరకును దీన్ని వైద్యులు సిఫారసు చేసేవారు. యేసు చెప్పిన యూ ఉపమానములోని ద్రాక్షారసానికి రోగనిరోధనాశక్తి, అంటురోగ నిరోధనా లక్షణాలు ఉన్నవనియు, ఒలీవనూనె గాయాలను మాన్పుటకెంతో వుపకరిస్తుందని వ్యక్తమౌతుంది. అయితే ఆ ఉపమానము యొక్క పరమార్దమే మనగా నిజమైన పొరుగువాడు కనికరముతో మెలగుచుండును. అవును మనం ఇతరులను కనికరముతో చూడాలి.—10:36, 37.

వినయములో గుణపాఠాలు

విందులలో అగ్రస్థానాలను కోరేవారిని గూర్చి యేసు ఒక ఉపమానం చెప్పాడని లూకా మాత్రమే వ్రాశాడు. విందుకు వచ్చిన అతిధులు బల్లచూట్టూ మూడు వైపుల మూడు స్థానాలలో కూర్చుంటారు. వడ్డించేవారు నాల్గవవైపు నుండి వస్తారు. సాంప్రదాయపద్ధతిలో వారు ఒక బల్ల దగ్గర ముగ్గురేసి దానికి ఎదురెదురుగా కూర్చోని ఎడమ మోచేతి మీద ఆనుకుని, కుడి చేతితో భోజనం చేసేవారు. బల్లచుట్టున్న మూడువైపులు, ఉన్నత, మధ్యమ, ఆధమ అను మూడు స్థానాలను గుర్తు చేయును. మూడవ స్థానంలో కూర్చున్న వ్యక్తి అందరికంటే అధముడని (క్రిందిస్థానమందున్నాడని) అర్ధం. యేసు ఇలా అన్నాడు: “నీవు పిలువబడినప్పుడు, నిన్ను పిలిచిన వాడు వచ్చి—స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటిచోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును.” (14:7-10) అవును, వినయంతో ఇతరులను మనం మనకంటె ఘనులుగా ఎంచవలెను. వాస్తవానికి ఆ ఉపమానమును వర్తింపజేస్తు యేసు ఇట్లన్నాడు “తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గించబడును. తన్ను తాను తగ్గించు కొనువాడు హెచ్చింపబడును.”—14:11.

యేసు చెప్పిన మరో ఉపమానములో, దేవాలయమునందు సుంకరి, పరిసయ్యుడు చేసిన ప్రార్ధన వినయానికి తార్కాణమన్నట్లు వ్రాయుటలో లూకా సువార్త ఓ విశిష్టత కల్గివున్నది. పరిసయ్యుడు ఇలా ప్రార్ధించాడు: “వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచున్నాను.” (18:9-14) ధర్మశాస్త్ర ప్రకారం సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఉపవాసముండాలి. (లేవి 16:29) అయితే పరిసయ్యులు హద్దులుమీరి ఉపవాసముండేవారు. ఆ పరిసయ్యుడు వారంలో రెండవసారి ఉపవాసముండుటకు గల కారణం బహుశా ఆ సమయములోనే మోషే ఒకనాడు సీనాయి పర్వతం మీదినుండి పది ఆజ్ఞలున్న రెండు పలకలను తీసికొని వచ్చాడని గుర్తుచేసుకొని వుండవచ్చును. ఆనాడు మోషే వారంలోని ఐదవ రోజున పర్వతంమీది నుండి క్రిందికి దిగివచ్చాడు. (నిర్గమ. 31:18-32:15-20) పరిసయ్యుడు వారానికి రెండు మార్లు ఉపవాసముండుటయే తన భక్తికి నిదర్శనమని అన్నాడు. అయితే యీ ఉపమానమును బట్టి మనం వినయస్వభావాన్ని కనబరచుటకే కృషిచేయాలి గానీ స్వనీతిని స్థాపించుకొనుటకు కాదని తెలుసుకోవాలి.

ఈ రత్నాలవంటి అంశాలే, లూకా సువార్త ఓ విశిష్టమైన, ఉపదేశాన్నిచ్చే పుస్తకమని రుజువు చేస్తున్నవి. ఆ సువార్తలో తెలుపబడిన నిజాలు, యేసు తొలి జీవితదశలో సంభవించి చలింపజేసిన సంఘటనలుగా మనకు స్ఫూర్తినిస్తాయి. కొన్ని అలవాటు (సాంప్రదాయ పద్ధతులు) వాటి వెనుకనున్న చరిత్ర నుండి కూడ మనమంతో మేలును పొందుతాము. అయితే ప్రియ వైద్యుడగు లూకా సువార్తయందు చక్కగా బోధించిన కనికరము వినయము అను గుణపాఠాలను మనం అమలు చేస్తే మనకెన్నో దీవెనలు లభిస్తాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి