కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 2/1 పేజీలు 17-19
  • మీరు కేవలము బాహ్యరూపమును మాత్రమే చూచెదరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు కేవలము బాహ్యరూపమును మాత్రమే చూచెదరా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు మాదిరిని ఉంచెను
  • మీరు “న్యాయమైన తీర్పు తీర్చుదురా”?
  • దేవునికంటే ఎక్కువను ఎదురుచూడకుము
  • బాహ్యరూపమును మించి చూచుటవలన కలుగు సత్ఫలితములు
  • మనుష్యులందరు రక్షణపొందుతారు
    మన రాజ్య పరిచర్య—2007
  • “పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • మీరు బాహ్యరూపాన్ని మాత్రమే చూస్తారా?
    మన రాజ్య పరిచర్య—1999
  • యేసు మత్తయిని ఆహ్వానించడం
    యేసే మార్గం, సత్యం, జీవం
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 2/1 పేజీలు 17-19

మీరు కేవలము బాహ్యరూపమును మాత్రమే చూచెదరా?

హెయిన్జ్‌, అను యౌవనుడు ద్వేషముతో నిండినవాడై తన మారుటి తండ్రిని చంప పథకము వేసెను. సంతోషదాయకముగా, దాని చేయుటకు అతనికి ధైర్యము చాలకపోయెను. కొన్ని సంవత్సరముల తర్వాత ఆత్మహత్యచేసుకొనుటకు తీర్మానించుకొనెను. అయితే అతడు దానినికూడ చేయలేకపోయెను. అతడు దొంగతనము, మాదక ద్రవ్యవ్యాపారములలో మునిగి, చివరకు పట్టుబడి జైలుపాలయ్యెను. ఆపిమ్మట అతని వివాహము విఫలమయ్యెను.

ఈ రోజు హెయిన్జ్‌ ఎంతమాత్రము మాదక ద్రవ్యములకు బానిసకాడు. ఆయన తన నమ్మకమైన సంపాదనతో జీవించుచున్నాడు. యిప్పుడు సంతోషదాయక వివాహమును కలిగియుండి అతడు తన మారుటి తండ్రితో మంచి సంబంధములను కలిగియున్నాడు. ఈ భేదమును ఏది కలిగించినది? ఆయన యెహోవా సాక్షులతో బైబిలును పఠించుటకు ఆరంభించెను. క్రమేణి, అతని జీవిత దృష్టి మారుటకు ప్రారంభమాయెను.

నిస్సందేహముగా, పాత హెయిన్జ్‌ను ఎరిగియుండిన అనేకులు యితను మారడని అతని దాటిపోయిరి. కృతజ్ఞతాదాయకముగా, యితనివంటి అనేకులను విడిపింప సాధ్యముకాని వారని దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకు? దానికి కారణమేమనగా: “మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”—1 సమూయేలు 16:7.

దేవునికి మానవునికి మధ్యవున్నవాటిలో అది ఒక పెద్ద భేదము. మనము బాహ్యరూపమును చూసియే నిర్ధారణచేయుటకు ఉద్దేశింతుము. “మొదట మనస్సున పడినదే చివరిదాకా వుండేది” అనికూడ మనమనవచ్చును. మరొకమాటలో చెప్పాలంటే, మొదటి ప్రత్యుత్తరములమీద ఆధారపడి మాత్రమే ప్రజలను వర్గీకరించుటకు మనము ఉద్దేశింతుము. అయితే దేవుడు, హృదయము చదువగలవాడైనందున, న్యాయవంతుడును నిష్పక్షపాతియై యున్నాడు. మరియు “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవ జ్ఞానము గలవారైయుండుటకు” ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును పంపెను. (1 తిమోతి 2:4) ఈ సంబంధముగా యావత్‌ మానవజాతికి దేవుని రాజ్యసువార్తను చురుకుగా ప్రకటించుటద్వారా సమర్పిత క్రైస్తవులు “దేవుని జతపనివారిగా ఉండు” ఆధిక్యతను కలిగియున్నారు. (1 కొరింథీయులు 3:9) అయినను, క్రైస్తవులకు కొన్ని పరిమితులు కలవు—వారు ప్రజల హృదయములను చదువలేరు. అందువలన వారు నిష్పక్షపాతముగా ఉండవలెను మరియు బాహ్యరూపమునుబట్టి దురభిమానము కలిగియుండుటను విడనాడవలెను.

మొదటి శతాబ్ద క్రైస్తవ సంఘములో ఈ ప్రమాదము విషయమై యేసు సహోదరుడైన యాకోబు ఎరిగినవాడైయుండెను. ఆయనిట్లనెను: “నా సహోదరులారా, మహిమతో పరిపాలించుచున్న మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మీరెన్నటికిని మనుష్యుల హోదానుబట్టి తారతమ్యమును చూపకుడి. ఉదాహరణకు, బంగారు ఉంగరములు పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొనిన, మరియు సామాన్య దుస్తులు ధరించుకొనిన బీదవాడు ఈ ఇద్దరు మీ ప్రార్థనా స్థలమున ప్రవేశించవచ్చును. బహుశ మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానికి ఎక్కువ ధ్యానము చూపువారైన యెడల . . . మీరు పొందికలేనివారని, అబద్ధ నియమములనుబట్టి నిర్ధారించువారని మీరు చూడరా?” దీని ఆధారముగా, మనము కొన్నిసార్లు మనరాజ్య మందిరమునకు వచ్చు ప్రజలను కొన్నిసార్లు తప్పుగా తీర్పుతీర్చుదుమా?—యాకోబు 2:1-4, ది న్యూ ఇంగ్లీషు బైబిల్‌.

యేసు మాదిరిని ఉంచెను

విడిపింప శక్యముగాని పాపులుగాకాక, సరియైన సహాయమును మరియు ప్రోత్సాహమునిచ్చినట్లయిన యథార్థ హృదయముగలవారు మార్చుకొనుటకు యిచ్ఛయించువారిగా యేసు ప్రజలను దృష్టించెను. అందుకే ఆయన “అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను.” (1 తిమోతి 2:6) తన ప్రచారపు పనిలో మంచి హృదయముగల ఎవరిని ఆయన అంటరానివారిగా, ధ్యానమివ్వ పనికిరానివారిగా దృష్టించలేదు. ప్రజలయెడల ఆయన దృష్టి స్వనీతియొక్క ఏలాంటి అహంకార భావములను బయటపెట్టలేదు.—లూకా 5:12, 13.

ఆయన ఎంతగా పరిసయ్యులవలె లేకుండెను, వారినిగూర్చి మనమీలాగు చదువుదుము: “పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి ‘ఆయన సుంకరులతో పాపులతోను కలిసి భోజనము చేయుచున్నాడే?’ అని శిష్యులనడుగగా, యేసు ఆమాటలు విని, ‘రోగులకేగాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదు’ అని వారితో చెప్పెను.”—మార్కు 2:16, 17.

అయినను, ఈ పాపులు మరియు సుంకరులు చేయు తప్పిదమైన మరియు మోసకరమైన పనులను యేసు క్షమించెనని దీని భావముకాదు. బహుశ ఉద్దేశ్యరహితముగా లేక ఆధీనపరచలేని కష్టమైన పరిస్థితులవలన ప్రజలు తప్పిదమైన జీవిత విధానములో పడిపోగలరని ఆయన ఎరిగియుండెను. కాబట్టి ఆయన అర్థము చేసుకొనినవాడై, “వారు కాపరిలేని గొర్రెలవలె ఉన్నందున వారిమీద కనికరపడెను.” (మార్కు 6:34) ఆయన ప్రేమపూర్వకముగా వారి చెడుక్రియలకు, వారి మంచి హృదయములకు మధ్య భేదమును తెలియజేసెను.

తన అనుచరులతో వ్యవహరించినప్పుడు కూడ, యేసు బాహ్యరూపముకంటే ఎక్కువను చూసెను. వారు పాపులైయుండి తరచు తప్పిదములను చేసిరి, అయితే ప్రతి చిన్న తప్పిదమునకు అదేపనిగా చీవాట్లువేయు కారణరహిత పరిపూర్ణవాదివలె యేసు ఉండలేదు. వారి ఉద్దేశ్యములు మంచివని, లేక మనమీనాడు చెప్పునట్లు, వారి హృదయము సరియైన స్థానమందుండెనని ఆయన ఎరిగియుండెను. వారికి సహాయము మరియు ప్రోత్సాహము అవసరమై యుండెను; కాగా దీనిని యిచ్చుటకు యేసు ఎన్నటికిని లోభియై యుండలేదు. దీనికి సందేహమే లేదు, ఆయన ప్రజలను దేవుడు చూచినట్లుగానే చూసెను. ఆయన అద్భుతమైన మాదిరిని మనము అనుకరించ ప్రయత్నింతుమా?

మీరు “న్యాయమైన తీర్పు తీర్చుదురా”?

తాను విశ్రాంతిదినమున చేసిన స్వస్థత విషయమై ఆగ్రహించి ఫిర్యాదు చేయుటకు గుంపుగావచ్చిన స్వనీతిపరులైనవారిని యేసు ఒకసారి ఎదుర్కొనెను. ఆయన వారికిట్లు ఉపదేశించెను: “వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి.” “ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా” చేసిన అద్భుతమైన పనివానిని యేసుయందు చూచి ఆనందించుటకు బదులు, ఆయనయందు విశ్రాంతి దినమును ఉల్లంఘించిన వానినిచూసి వారెందుకు “ఆగ్రహము” చెందినవారైరి? బాహ్యరూపమునుబట్టి తీర్పు తీర్చుటద్వారా, వారు వారి చెడు తలంపులను వెళ్లగ్రక్కిరి. అదే సమయములో వారు వారితీర్పు స్వనీతిపరమైనదని మరియు అనీతిమంతమైనదని వెల్లడిచేసిరి.—యోహాను 7:23, 24.

మనముకూడ బహుశ అదే తప్పిదమును ఎట్లు చేయగలము? పశ్చాత్తాపము పొందినవ్యక్తి వెనుకకు వచ్చినప్పుడు లేక పూర్తిగా లౌకికముగావున్న వ్యక్తి సత్యమును నేర్చుకొని ఆత్మీయ స్వస్థతనుండి ప్రయోజనము పొందుటకు ఆరంభించినప్పుడు ఆనందించుటకు విఫలమగుట ద్వారా. కొన్నిసార్లు మనము ప్రజల అప్రామాణిక దుస్తులు, తలదువ్వుకొనుటనుబట్టి వారెన్నటికిని యెహోవా సాక్షులు కానేరరని కొట్టిపారేసి వారియెడల తీర్పు తీర్చవచ్చును. అయినను, క్రితము హిప్పీలుగా ఉన్నవారు, అప్రామాణిక జీవన విధానములుగల యితరులు అనేకులు చివరకు క్రైస్తవ యెహోవా సాక్షులైరి. అలాంటివారు మార్పులు చేసుకొను గమనమందుండగా, వారి మంచి హృదయ పరిస్థితి యెడల గ్రుడ్డివారమగుటకు “వెలిచూపునుబట్టి తీర్పు తీర్చుటకు” అనుమతించ మనము యిచ్ఛయించము.

యేసు శ్రేష్టమైన మాదిరి ప్రకారము, వారికొరకు ప్రార్థించి క్రైస్తవ పరిపక్వతకు చేరేందుకు వారికి అభ్యాససిద్ధమైన సహాయమునందించుట ఎంత శ్రేష్ఠతరము! ఆనందించుటకు వారియందు కారణమును చూచుట కష్టముగా అన్పించవచ్చును. అయితే క్రీస్తుద్వారా వారిని యెహోవా తనయొద్దకు తీసుకొనుచుండగా, మన స్వంత సంకుచిత ప్రమాణము ఆధారముగా వారిని తిరస్కరించ మనమెవ్వరము? (యోహాను 6:44) హృదయము తెలియకుండ మరియు పరిస్థితులు తెలియకుండ ఎవరినైనా స్వనీతితో తీర్పు తీర్చుట, తీవ్ర తీర్పునెదుర్కొను మార్గమందు మనలను ఉంచగలదు.—మత్తయి 7:1-5.

అలాంటి క్రొత్తవారిని తీవ్రముగా తీర్పు తీర్చుటకు బదులు, మన మాదిరిద్వారా మనము వారికి సహాయము చేయవలెను, ప్రోత్సహించవలెను మరియు ముందు జాగ్రత్త చెప్పవలెను. ఏదిఏమైనను, దయచూపించు సమయముననే, బహుశ లోకమందు మంచిపేరున్న క్రొత్తవారిని మనము మిక్కిలి అభిమాన పాత్రులుగాను చేయకూడదు. అది ఒకరకముగా పక్షపాతమగును. అంతేకాకుండ, అది మన అపరిపక్వతకు కూడ సూచనగా ఉండును. మన ముఖస్తుతి ఆ వ్యక్తి తానుగా వినయస్థుడగుటకు సహాయము చేయునా? లేక అది, అతని కలవర పెట్టునా?—లేవీయకాండము 19:15.

దేవునికంటే ఎక్కువను ఎదురుచూడకుము

హృదయములను చదువు యెహోవాతో పోల్చుకుంటే, ఇతరులను గూర్చిన మనదృష్టి బహు పరిమితము. (1 దినవృత్తాంతములు 28:9) దీనిని గుణగ్రహించుట, మంచిదని మనము తలంచుదానిలో ప్రజలు సరిపడుటకు మన స్వంత మానవనిర్మిత నీతి విధానములోనికి వారిని వత్తిడిచేయుటకు ప్రయత్నించు, ఆధునిక-దిన స్వయం-నీతి పరిసయ్యులుగా కాకుండ మనలను అడ్డగించును. దేవుడు చూచునట్లుగా మనము వారిని చూచుటకు ప్రయత్నించినట్లయిన, ఆయన వారినుండి కోరుదానికంటే ఎక్కువను కోరము. మనము “వ్రాసియున్న సంగతులను అతిక్రమించి” వెళ్లము. (1 కొరింథీయులు 4:6) ఇది ప్రత్యేకముగా క్రైస్తవ పెద్దలు హృదయమునకు తీసుకొనుట ప్రాముఖ్యము.—1 పేతురు 5:2, 3.

దీనిని మనము దుస్తుల విషయమందు దృష్టాంతపరచ వచ్చును. బైబిలు అవసరత—దేవుని అవసరత—ఏమనగా, క్రైస్తవుని దుస్తులు చక్కగా, పరిశుభ్రముగా తగినరీతిలో కుదిరినవై ఉండవలెను, అంతేగాని “నమ్రత స్వస్థబుద్ధి” లోపించినదనుటను బయటపెట్టకూడదు. (1 తిమోతి 2:9; 3:2) స్పష్టముగా ఒక సంఘమందలి పెద్దలు కొన్ని సంవత్సరముల క్రితము, ఆ దేశములో సాధారణముగా రంగు దుస్తులు అంగీకరింపబడుచున్నను, తమ సంఘమందు బహిరంగ ప్రసంగమునిచ్చు ప్రతి వక్త తెల్లషర్టు వేసుకొనవలెనని కోరుటద్వారా “వ్రాసియున్న సంగతులను అతిక్రమించిరి.” రంగు షర్టులు వేసుకొని వచ్చిన అతిథి ప్రసంగీకులు, కేవలము యిటువంటి అత్యవసర పరిస్థితుల కొరకు రాజ్యమందిరమందు ఉంచబడిన తెల్లషర్టులలో ఒకదానిని వేసుకొనవలెనని అడుగబడిరి. మన వ్యక్తిగత అభిరుచులను యితరులమీద రుద్దకుండ మనమెంత జాగ్రత్తగా ఉండవలెను! మరియు పౌలు సలహా ఎంత సరియైనదిగా ఉన్నది: “మీ కారణయుక్తతతను సకల జనులకు తెలియబడనియ్యుడి.”—ఫిలిప్పీయులు 4:5 NW.

బాహ్యరూపమును మించి చూచుటవలన కలుగు సత్ఫలితములు

ప్రజల హృదయములను మనము చదువలేమని గుణగ్రహించుట, మనచుట్టువున్నవారు అనగా క్రైస్తవ సంఘములోనివారితో బయటవున్నవారితో మంచి సంబంధములను కాపాడుకొనుటకు సహాయము చేయును. వారి ఉద్దేశ్యములను ప్రశ్నించుటకు మారుగా యితరులనుగూర్చి అనుకూలముగా తలంచుటకు మనకు సహాయము చేయును, “ఎందుకనగా మనముకూడ మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమై యుంటిమి.” (తీతు 3:3) దీనిని తెలిసికొనినవారమై, ప్రతివారికి అనగా బయటకు అనర్హులుగా కన్పించువారికి సహితము ప్రకటించుటకు యిష్టపడుదుము. ఏదిఏమైనను, సత్యమును అంగీకరించుటయా లేక నిరాకరించుటయా అనేది వారే నిర్ణయించుకొనవలెను. ప్రతివారికి ప్రకటించు బాధ్యత మాత్రము మనది.

మొదట మనస్సున పడినదాని ప్రకారము తీర్పు తీర్చక, బాహ్యరూపమునుమించి చూసిన సహోదర సహోదరీలద్వారా క్రైస్తవ సంఘములోనికి ఆహ్వానింపబడినందుకు హెయిన్జ్‌వలె అనేకమంది యెహోవా సాక్షులు సంతోషముగా ఉన్నారు.

దక్షిణ జర్మనీలో ఒక ఆదివారమున యెహోవా సాక్షుల రాజ్య మందిరమునకు వచ్చిన ఫ్రాంక్‌నే తీసుకొనండి. ప్రేక్షకులు ఆయనెట్లుండుటను చూసిరి? అతడు చింపిరిజుట్టు, మాసిన గడ్డము, భుజములవరకు వ్రేళ్లాడుచుండిన జుట్టు, మురికి బట్టలు, తరచు బార్లకుపోయేవ్యక్తిగా పొగత్రాగేవ్యక్తిగా అందరికి తెలిసిన, మరియు తన స్నేహితురాలిని, వారికి కల్గిన కవలలైన ఆడపిల్లలను విడిచిపెట్టిన యౌవనస్థుడై యుండెను. అయినను, అతను ఆప్యాయముగా కూటమునకు ఆహ్వానింపబడెను. అది అతని మనస్సున ఎంత బలముగా నాటుకొనెననగా, ఆ మరుసటి వారము మరలా వచ్చాడు. యిప్పుడు ఆయనెట్లుండుటను వారు చూసారు? ఆ యౌవనుడు పరిశుభ్రమైన దుస్తులతో చక్కగా తలదువ్వుకొని యున్నాడు. మూడవ వారమున పొగత్రాగుటను మానుకొనినవాడై, తన స్నేహితురాలితో యిద్దరు పిల్లలతో రావడాన్ని వారు చూసారు. నాల్గవ ఆదివారమున, వారి సహచర్యమును అప్పుడే చట్టబద్దమైన వివాహముగా ఆమోదముపొంది వచ్చిన ఒక యౌవనుని ఒక యౌవనస్థురాలిని వారు చూసారు. ఐదవ ఆదివారమున, సమస్త అబద్ధమతమునుండి తనను వేరుపరచుకొనిన యౌవనుని వారు చూసారు. ఈనాడు, నాలుగు సంవత్సరముల తర్వాత, వారు వారిని యెహోవా సాక్షులలో ఒకరిగా చూస్తు యిలా అంటున్నారు, “వారు అనేక సంవత్సరములుగా మన సహోదరులై యున్నారని మీరు తలంచునంత శ్రేష్ఠముగా ఆ కుటుంబము మీ మనస్సును ఆకట్టుకొనును.”

ఒక పుస్తకముయొక్క అట్టగాని ఒక యింటి ముఖతలముగాని దాని నాణ్యతను తప్పనిసరిగా ప్రతిబింబించాలని లేదు. అదేవిధముగా, ఒక వ్యక్తియొక్క నిజమైన లక్షణము అతని బాహ్యరూపమందు తప్పనిసరిగా ప్రతిబింబించాలని లేదు. దేవుడు చూచునట్లుగా ప్రజలను చూచుటకు ప్రయత్నించు క్రైస్తవులు మొదట మనస్సున పడినదాని ప్రకారము తీర్పు తీర్చరు. దేవుడు “హృదయపు అంతరంగ స్వభావము” యెడల శ్రద్ధచూపును, దానికి మనము కృతజ్ఞతగలవారమై యున్నాము.—1 పేతురు 3:3, 4. (w89 11/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి