కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 2/1 పేజీలు 20-25
  • శేదరు నుండి రక్షణకు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శేదరు నుండి రక్షణకు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పస్కా—రక్షణ పండుగ
  • పస్కా గొర్రెపిల్ల కంటె ఉన్నతము
  • ప్రాణమును రక్షించు రక్తము
  • ఏ రక్షణ మరియు ఎక్కడ?
  • ఒక “నియామక కాలమున”
  • ఇది ‘మీకు జ్ఞాపకార్థంగా’ ఉండాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • పస్కా అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • పస్కా పండుగ, జ్ఞాపకార్థ ఆచరణ—పోలికలు, తేడాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ప్రభువు రాత్రి భోజనం—దేవుణ్ణి మహిమపరిచే ఆచరణ
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 2/1 పేజీలు 20-25

శేదరు నుండి రక్షణకు

“రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.”—కీర్తన 116:13.

1. ఎప్పటికిని ప్రియముగా ఉండు ఏ గీతము నీ భవిష్యత్తుపై ప్రభావము చూపవచ్చును?

నీవు దీర్ఘమైన మరియు సంతోషదాయకమైన భవిష్యత్తును కలిగియుండుటకు సంబంధించిన ఒక గీతమును ఎట్లు ఆనందించెదవు? అటువంటి గీతము నిజముగా నీకు ఎల్లప్పటికి ప్రియమైనదానిగానే ఉంటుంది. అయినను అర్థవంతమైన ఈ గీతమును గ్రహించుకొని ఆనందించుటకు అనేకులకన్న నీవు ఎంతో శ్రేష్టమైన స్థానమందున్నావు. యూదులు దానిని హల్లెలు (స్తుతి) అని పిలుచుదురు. కీర్తనలు 113 నుండి 118 లలో సమకూర్చబడియున్న ఇది “హల్లెలూయ” లేక “యెహోవాను స్తుతించుటను” ఆలపించుటకు మనలను గట్టిగా ప్రోత్సహపరచుచున్నది.

2. ఈ గీతము ఎట్లు ఉపయోగించబడినది, మరియు అది శేదరుకు ఎట్లు సంబంధమును కలిగియున్నది?

2 జంతువులను అర్పించు దేవాలయమును దేవుడు కలిగియున్న సమయమునుండి ఆలపించుచున్నట్లు స్పష్టమౌవుచున్న ఈ హల్లెలును యూదులు వారి పస్కా ఆచరణ సేవా సంబంధంగా పాడుదురు. ఈనాడు యూదుల గృహములందు పస్కా సేవ మరియు శేదరు అని పిలువబడు పస్కాభోజన సమయములోను అది పాడబడుచున్నది. కాని వారి శేదరు సమయములో దానిని పాడు కొద్దిమందియే కీర్తన 116:13 నందలి “రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవానామమున ప్రార్థనచేసెదను” అనుదానిలోని నిజమైన భావమును పొందుచున్నారు. అయితే, రక్షణ పస్కాతో ఎందుకు సంబంధము కలిగియున్నది, అందు నీ రక్షణ కూడ ఇమిడియున్నదా?

పస్కా—రక్షణ పండుగ

3. శేదరుయొక్క వెనుకటి వృత్తాంతమేమి?

3 బాధించునట్టి ఫరో క్రింద ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దాసులుగా ఉన్నారని గుర్తుకు తెచ్చుకొనుము. చివరకు, తన ప్రజలను స్వాతంత్ర్యమునకు నడిపించుటకు యెహోవా మోషేను లేపాడు. దేవుడు ఐగుప్తుపైకి తొమ్మిది తెగుళ్లను తెచ్చిన తరువాత, మోషే పదవదానిని ప్రకటించెను. ఐగుప్తీయుల గృహమందలి ప్రతి తొలిబిడ్డను యెహోవా మొత్తును. (నిర్గమకాండము 11:1-10) అయితే, ఇశ్రాయేలీయులు మాత్రము తప్పించబడుదురు. ఎట్లు? వారు ఒక గొర్రెను వధించి దానిరక్తమును యిండ్లద్వారా బంధపు కమ్ములమీదను, పైకమ్మి మీదను చల్లి, గొర్రెపిల్ల మాంసమును, పొంగని రొట్టెలతో, చేదుకూరలతోతిని యింటిలోనే యుండవలెను. ఆ శేదరు సమయమందు వారి తొలిబిడ్డను వధించకుండ దేవుడు వారిని “దాటిపోవును.”—నిర్గమకాండము 12:1-13.

4, 5. పస్కా అనేకులకు రక్షణగా ఎట్లు నడిచినది? (కీర్తన 106:7-10)

4 ఈ పదవ తెగులుకు జవాబుగా ఫరో మోషేతో ఇట్లనెను: “మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి.” (నిర్గమకాండము 12:29-32) హెబ్రీయులును వారి సానుభూతిపరులుగాయున్న “అనేకులైన అన్యజనుల సమూహమును” బయలువెళ్లిన తరువాత ఫరో తన మనస్సు మార్చుకొని వారిని వెంటాడెను. అప్పుడు దేవుడు అద్భుతరీతిగా ఎఱ్ఱసముద్రమునుండి తప్పించుకొని వెళ్లుటకు తన ప్రజలకు సహాయపడెను. దానిలో ఫరోయు వెంటాడుచున్న తన సైన్యము మరణించెను.—నిర్గమకాండము 12:38; 14:5-28; కీర్తన 78:51-53; 136:13-15.

5 ఎఱ్ఱసముద్రముయొద్ద మోషే ఇశ్రాయేలీయులతో: “భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఊరకనిలుచుండి చూడుడి” అని చెప్పెను. తరువాత వారు: “యెహోవాయే నా బలము. . .నాకు రక్షణ, నా దేవుడు, ఆయనను స్తుతించెద” మని పాడిరి. (నిర్గమకాండము 14:13; 15:2) ఔను పదవ తెగులు నుండియు, ఎఱ్ఱసముద్రము నుండియు వారి విడుదల వారికి రక్షణయైయుండెను. అందుకే గాయకుడు “దేశమందు మహారక్షణ కలుగ జేయువాడు ఆయనే” అని యెహోవా దేవుని వర్ణించగలిగెను.—కీర్తన 68:6, 20; 74:12-14; 78:12, 13, 22.

6, 7. పస్కా ఎందుకు ప్రవేశపెట్టబడినది, అయినను మొదటి పస్కాకన్న ఇప్పుడు అది ఎందుకు భేదములతో ఆచరించబడుచున్నది?

6 హెబ్రీయులు పస్కాను రక్షణకు జ్ఞాపకార్థముగా ఆచరించవలసియున్నారు. దేవుడు ఇట్లనెను: “కాబట్టి యీదినము మీకు జ్ఞాపకార్థమైనదనగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైన కట్టడగా దానినాచరింపవలెను.” (నిర్గమకాండము 12:14) ప్రతి పస్కా భోజనమునందు లేక శేదరునందు తండ్రి ఆ రక్షణనుగూర్చి కుటుంబమునకు జ్ఞాపకముచేయవలెను. యెహోవా ఇట్లు సూచించెను: “మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్మునడుగునప్పుడు మీరు-ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీయులను హతముచేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను.”—నిర్గమకాండము 12:26, 27.

7 ఆ యూదులు నేటివరకు పస్కా శేదరును ఆచరించుచున్నారనునది ఆ వృత్తాంతముయొక్క చారిత్రకతను స్థిరపరచుచున్నది. అయితే, వారి ఆచారములలో కొన్ని దేవుడు సూచించినవాటికి భిన్నముగా ఉన్నవి. ది ఆర్జిన్‌ ఆఫ్‌ శేదర్‌ ఇట్లు చెప్పుచున్నది: “బైబిలు పస్కాను మరియు పులియనిరొట్టెల పండుగనుగూర్చి విస్తారముగా చర్చించియున్నది. ఏమైనను, ఈ వివరణలు ఈదినపు తదుపరి ఆచరణలతో పోలికను కలిగిలేవు. ప్రత్యేకముగా బైబిలు ఆచరణ పస్కాబలిపై కేంద్రీకరించుచున్నది. అయితే బైబిలు తదుపరి వ్రాయబడిన సాహిత్యములలో దీనికి కేంద్రస్థానము లేదు.” ఇందుకు ముఖ్యకారణము జంతుబలులను అర్పించుటకు యూదులు దేవాలయమును కలిగియుండక పోవుటయైయున్నది.

8. పస్కాను పరిశీలించుటకు గల ఏ ప్రత్యేక కారణమును మనము కలిగియున్నాము?

8 పురాతన ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన పండుగలన్నిటినిగూర్చిa క్రైస్తవులు ప్రయోజనాత్మకముగా పఠించవచ్చును, కాని పస్కాయొక్క కొన్ని అంశాలు మన ప్రత్యేక అవధానమునకు అర్హమైనవి. ఒక యూదునిగా యేసు పస్కాను ఆచరించెను. ఆయన దానిని ఆచరించిన చివరి సమయమున క్రైస్తవులకున్న ఒకేఒక దైవిక ఆచరణను సూచించెను. అది యేసు మరణముయొక్క జ్ఞాపకార్థమైన ప్రభువు రాత్రిభోజనము. కాబట్టి ఈ క్రైస్తవ ఆచరణ పస్కాకు జతపరచబడియున్నది.

పస్కా గొర్రెపిల్ల కంటె ఉన్నతము

9, 10. పస్కా గొర్రెపిల్ల ఎట్లు ప్రత్యేకము లేక అద్వితీయమైన బలియైయుండెను?

9 హెబ్రీయులు 10:1 ‘ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ’ అని మనకు చెప్పుచున్నది. యం’క్లిన్‌టాక్‌ మరియు స్ట్రాంగ్‌ యొక్క సైక్లొపీడియా ఆఫ్‌ బిబ్లికల్‌, థియోలాజికల్‌ అండ్‌ ఎక్లీసియాస్టికల్‌ లిటరేచర్‌ చెప్పునదేమనగా: “ధర్మశాస్త్రమందలి రాబోవు మేలుల ఛాయలలో పస్కాపండుగకు సరిసమానమైనది ఏది లేదు.” అయితే ప్రత్యేకభావములో హెబ్రీయుల తొలిబిడ్డను రక్షించినది మరియు ఐగుప్తునుండి విడిపించినదానిని జ్ఞాపకముచేయు ఆచరణకంటే పస్కాగొర్రెపిల్ల విస్తారమైన భావమును కలిగియున్నది.

10 అనేక విధములందు గొర్రెపిల్ల అద్వితీయమైనది. ఉదాహరణకు మోషే ధర్మశాస్త్రమందలి అనేక బలులు ఒకవ్యక్తి తన వ్యక్తిగత పాపము లేక దోషము నిమిత్తమై అర్పించబడుతూ జంతువుయొక్క భాగములు బలిపీఠము మీద దహించబడుచుండెను. (లేవీయకాండము 4:22-35) సమాధానబలియందలి కొంత మాంసము అర్పించు యాజకునికి, లేక ఇతర యాజకులకు ఇవ్వబడుతుంది. (లేవీయకాండము 7:11-38) అయితే, పస్కాల్‌ లేక పస్కా గొర్రెపిల్ల బలిపీఠముమీద ఉంచబడుటలేదు, కొంతమంది ప్రజల సమూహముతో సాధారణముగా ఒక కుటుంబముతో అర్పించబడి వారే దానిని తినువారైయున్నారు.—నిర్గమకాండము 12:4, 8-11.

11. పస్కాగొర్రెపిల్లను గూర్చిన యెహోవా దృక్పథమేమి? మరియు అది దేనిని సూచించెను? (సంఖ్యాకాండము 9:13)

11 పస్కా గొర్రెపిల్లను యెహోవా “నాబలి” అని పిలుచనంత ఉన్నతముగా హెచ్చించెను. (నిర్గమకాండము 23:18; 34:25) విద్వాంసులు “పస్కాల్‌ బలి యెహోవాయొక్క అత్యంత శ్రేష్టమైన బలి” అని చెప్పియున్నారు. ఏవిధమైన ప్రశ్నలేకుండా ఇది యేసుబలిని సూచించి, దానికి ప్రతిరూపముగా ఉన్నది. అపొస్తలుడైన పౌలు యేసును “క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను” అనుటద్వారా దీనిని మనము తెలిసికొనియున్నాము. (1 కొరింథీయులు 5:7) యేసు “దేవుని గొర్రెపిల్ల”గా మరియు “వధింపబడిన గొర్రెపిల్ల”గా గుర్తించబడియున్నాడు.—యోహాను 1:29; ప్రకటన 5:12; అపొస్తలుల కార్యములు 8:32.

ప్రాణమును రక్షించు రక్తము

12. మొదటి పస్కాయందు గొర్రెపిల్ల రక్తము ఏ పాత్రవహించినది?

12 గతములో ఐగుప్తునందు రక్షణకు గొర్రెపిల్ల రక్తము ఆధారమైయున్నది. తొలిపిల్లలను హతము చేసినప్పుడు ద్వారబంధములపై రక్తమున్న యిండ్లను యెహోవా దాటిపోయెను. అంతేకాక, తమ తొలిబిడ్డయొక్క మరణమునుగూర్చి వారు దుఃఖించుట లేనందున ఎఱ్ఱసముద్రమునుండి స్వాతంత్ర్యమునకు దాటివెళ్లు స్థానమందుండిరి.

13, 14. యేసు రక్తము ఎట్లు ప్రాణమును రక్షించునది మరియు రక్షణకు అవసరము? (ఎఫెసీయులు 1:13)

13 ఈనాడును రక్షణయందు రక్తము చేర్చబడియున్నది. అది యేసు చిందించిన రక్తము. “పస్కా అను యూదుల పండుగ సమీపించినప్పుడు” సా.శ. 32న యేసు గొప్పజనసమూహముతో ఇట్లు చెప్పెను: “నాశరీరమును తిని నారక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. నాశరీరము నిజమైన ఆహారము, నారక్తము నిజమైన పానమునై యున్నది.” (యోహాను 6:4, 54, 55) తనను విను యూదులందరు రాబోవు పస్కానుగూర్చియు, ఐగుప్తులో గొర్రెపిల్ల రక్తమును ఉపయోగించుటను గూర్చియు మనస్సున కలిగియుందురు.

14 అప్పుడు యేసు ప్రభువు రాత్రిభోజనము నందు ఉపయోగించు చిహ్నములను చర్చించుటలేదు. ఆ నూతన ఆచరణ ఇంకొక సంవత్సరము వరకు ప్రవేశపెట్టబడలేదు. కావున సా.శ. 32న యేసు మాటలను వినిన అపొస్తలులకును దానిని గురించి తెలియదు. అయినను నిత్యరక్షణకు తన రక్తము అత్యంత ప్రాముఖ్యమని చూపుచున్నాడు. పౌలు ఇట్లు వివరించెను: “దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.” (ఎఫెసీయులు 1:7) కేవలము యేసు రక్తమునుబట్టి కలుగు క్షమాపణద్వారా మనము నిరంతరము జీవించగలము.

ఏ రక్షణ మరియు ఎక్కడ?

15. ఐగుప్తులోని హెబ్రీయులకు ఏ రక్షణ మరియు ఆధిక్యతలు సాధ్యమైనవి, మరియు ఏవి కాలేదు? (1 కొరింథీయులు 10:1-5)

15 పురాతన ఐగుప్తునందు కేవలము ఒక పరిమితిగల రక్షణ మాత్రమే చేరియున్నది. ఐగుప్తును వదలిన ఎవరును నిర్గమము తర్వాత నిరంతర జీవితము ఇవ్వబడుతుందని ఎదురుచూడలేదు. ఆ జనాంగమునకు లేవీయులను యాజకులనుగాను, యూదాగోత్రములోని కొంతమందిని తాత్కాలిక రాజులుగాను దేవుడు నియమించినను, వీరందరు మరణింతురు. (అ.కార్యములు 2:29; హెబ్రీయులు 7:11, 23, 27) వారితోపాటు ఐగుప్తును విడిచివచ్చిన “గొప్ప అన్యజనసమూహమునకు” అట్టి ఆధిక్యతలు లేకున్నను, హెబ్రీయులతో పాటు వాగ్థానదేశమునకు చేరి దేవుని ఆరాధించుటలో సాధారణ జీవితమును అనుభవించు నిరీక్షణను వారు కలిగియుండవచ్చును. అయినను, క్రైస్తవ సేవకులకు ముందటి యెహోవాసేవకులును, తగినకాలమందు మానవులు జీవించుటకు యెహోవా సంకల్పించిన భూమిపై నిరంతర జీవితమును కలిగియుండు నిరీక్షణకు ఆధారమును కలిగియున్నారు. ఇది యోహాను 6:54 లోని యేసు వాగ్థానమునకు అనుగుణ్యముగా ఉన్నది.

16. ఏవిధమైన రక్షణకొరకు పురాతన దేవుని సేవకులు నిరీక్షించిరి?

16 దేవుడు తన పురాతన సేవకులలో కొంతమంది భూమి నివాసయోగ్యముగా యుండుటకు సృష్టింపబడినదనియు, యథార్థవంతులు అందు నిత్యము నివసించెదరను ప్రేరేపిత మాటలను వ్రాయుటకు ఉపయోగించాడు. (కీర్తన 37:9-11; సామెతలు 2:21, 22; యెషయా 45:18) అయితే, సత్యారాధికులు చనిపోయిన యెడల అట్టి రక్షణను ఎట్లు పొందగలరు? వారిని తిరిగి భూమిపైకి దేవుడు జీవమునకు తెచ్చుటద్వారా అది జరుగును. ఉదాహరణకు యోబు, తాను జ్ఞాపకము చేసుకొనబడి, తిరిగి జీవమునకు తేబడుదునను నిరీక్షణను వ్యక్తపర్చెను. (యోబు 14:13-15; దానియేలు 12:13) స్పష్టముగా రక్షణలో ఒకవిధము భూమిపై నిత్యజీవమును పొందుటయైయున్నది.—మత్తయి 11:11.

17. ఇతరులు ఎటువంటి భిన్నమైన రక్షణను పొందవచ్చునని బైబిలు చూపుచున్నది?

17 పునరుత్థానమైన తరువాత యేసు వెళ్లిన పరలోకమందలి జీవమును పొందు రక్షణను గూర్చి కూడ బైబిలు మాట్లాడుచున్నది. “ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారులమీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.” (1 పేతురు 3:18, 22; ఎఫెసీయులు 1:20-22; హెబ్రీయులు 9:24) అయితే పరలోకమునకు తీసుకొనబడు మానవుడు యేసు ఒక్కడేకాడు. తత్సంబంధముగా ఇతరులైన కొద్దిమందిని కూడ భూమి మీదనుండి తీసుకొనుటకు దేవుడు నిర్ణయించుకున్నాడు. యేసు అపొస్తలులతో ఇట్లు చెప్పెను: “నా తండ్రియింట అనేక నివాసములు కలవు. లేనియెడల మీతో చెప్పుదును. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలమున మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.”—యోహాను 14:2, 3.

18. పరలోక జీవిత రక్షణపైన దృష్టిని కేంద్రీకరించుటకు మనము ఇప్పుడు ఏ కారణమును కలిగియున్నాము?

18 యేసుతోపాటు ఐక్యముగా పరలోకజీవిత రక్షణ మొదటి పస్కాకు సంబంధంగాయున్న కొద్దిపాటి రక్షణ కంటే ఎంతో ఉన్నతమైనది. (2 తిమోతి 2:10) ఇది అమలులో ఉన్న సాయంకాలపు చివరి శేదరు, లేక పస్కాభోజన మప్పుడు ఈ పరలోక జీవిత రక్షణపై కేంద్రీకరించిన నూతన ఆచరణను యేసు తన అనుచరులకు ప్రారంభించెను. అపొస్తలులతో ఆయన ఇట్లు చెప్పెను: “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.” (లూకా 22:19) ఈ ఆచరణను క్రైస్తవులు ఎట్లు చేయవలెనో పరిశీలించుటకు ముందు, దీనిని ఎప్పుడు చేయవలెనను దానిని పరిశీలించుదము.

ఒక “నియామక కాలమున”

19. పస్కాను ప్రభువురాత్రి భోజనముతో సంబంధపరచుట ఎందుకు సహేతుకము?

19 “నేను శ్రమపడకమునుపు మీతో కూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని” అని యేసు చెప్పియుండెను. (లూకా 22:15) ఆ తదుపరి ఆయన అనుచరులు తన మరణమును జ్ఞాపకము చేసికొనునట్టి ప్రభువు రాత్రిభోజనమును ఆయన సూచించెను. (లూకా 22:19, 20) పస్కా సంవత్సరమునకు ఒకసారి జరుపుకొనబడినది. కాబట్టి ప్రభువురాత్రి భోజనమును కారణసహితముగా సాంవత్సరికముగా జరుపుకొనవలెను. ఎప్పుడు? సహేతుకముగా, పస్కాసమయమందలి వసంతకాలమైయుండును. అనగా ఎల్లప్పుడు యేసు మరణించిన వారదినమైన శుక్రవారము కన్న ఇది నీసాను 14న వస్తుందని భావము.

20. నీసాను 14 నందు యెహోవాసాక్షులు ఎందుకు శ్రద్ధకలిగియున్నారు?

20 “కాబట్టి మీరు ఈ రొట్టెను తిని యీ పాత్రలోనిది త్రాగునపుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు” అని పౌలు వ్రాసినప్పుడు ఆయన మనస్సున కలిగియున్న తారీఖు నీసాను 14. (1 కొరింథీయులు 11:26) తదుపరి రెండు శతాబ్ధములలో అనేకమంది క్రైస్తవులు నీసాను 14నకు హత్తుకొనియుండిరి. లాటిన్‌లో “14నకు” సంబంధించిన వారుగా వారు క్వార్టొడెసిమన్స్‌ అని పిలువబడ్డారు. యం’క్లింటాక్‌ మరియు స్ట్రాంగ్‌ నివేదించునట్లు: “ఆసియా మైనరులోని చర్చీలు నీసాను 14నకు సరిపడు దినమున ప్రభువు మరణమును ఆచరించారు. పురాతన చర్చి ప్రకారము యేసును సిలువవేయుట ఆ దినమున జరిగినది.” ఈనాడు యెహోవాసాక్షులు ప్రభువురాత్రి భోజనమును నీసాను 14కు సరిపడు తారీఖున జరుపుకొందురు. అయినను, యూదులు పస్కాను జరుపుకొను తారీఖునకు ఇది వేరుగా ఉన్నదని కొందరు గుర్తించియున్నారు. ఎందుకు?

21. పస్కా గొర్రెపిల్ల ఎప్పుడు అర్పించబడవలసియుండెను, మరియు ఈనాడు యూదులు ఏమి చేయుదురు?

21 హెబ్రీయుల దినము సూర్యాస్తమయమునుండి (6 గంటల నుండి) మరుసటి సూర్యాస్తమయము వరకు లెక్కించబడుతుంది. దేవుడు పస్కా గొర్రెపిల్లను నీసాను 14న “రెండు సాయంకాలముల మధ్య” చంపవలెనని ఆజ్ఞాపించెను. (నిర్గమకాండము 12:6 NW) అదెప్పుడైయుంటుంది? ఆధునిక యూదులు రబ్బూల దృక్పథము ప్రకారము నీసాను 14 గతించు సాయంకాలమందు అనగా సూర్యుడు క్రుంగుటకు మొదలిడు సమయము నుండి (దాదాపు 3 గంటల నుండి) ఖచ్చితంగా సూర్యుడు అస్తమించు సమయమునకు మధ్య గొర్రె వధించబడ వలెనను దానిని చేపట్టియున్నారు. అందువలన వారు శేదరును సూర్యుడు అస్తమించిన తరువాత అనగా నీసాను 15 ప్రారంభమయిన తరువాత ఆచరింతురు.—మార్కు 1:32

22. యూదులు తాము పస్కాను జరుపుకొను తారీఖునకు జ్ఞాపకార్థముయొక్క తారీఖునకు భేదముండుటకు గల కారణమేమి? (మార్కు 14:17; యోహాను 13:30)

22 అయితే ఈ వ్యక్తీకరణను భిన్నముగా అర్థముచేసికొనుటకు మనము మంచికారణమును కలిగియున్నాము. ద్వితీయోపదేశకాండము 16:6 స్పష్టముగా ఇశ్రాయేలీయులకు ఇట్లు చెప్పినది: “సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించ” వలెనని చెప్పినది. (యూదుల తనాకా వర్షన్‌) ఈ రెండు సాయంకాలముల మధ్య అనునది సూర్యాస్తమయము తరువాత ఉండు కనుచీకటి నుండి (నీసాను 14 ప్రారంభము) ఖచ్చితంగా చీకటి పడువరకుగల మధ్య దానిని సూచించుచున్నది. పురాతన కరాయితి యూదులునుbసమరయులుc నేటివరకు అర్థముచేసికొను ఇదే తీరును అర్థం చేసికొనియున్నారు. “దాని నియామక కాలమున” పస్కా గొర్రె వధించబడి, తినబడినదనునది నీసాను 14యే కాని నీసాను 15న కాదను దానిని అంగీకరించుటయు యూదా తారీఖునకు మన జ్ఞాపకార్థసమయము భిన్నముగా ఉండుటకు మరొక కారణము.—సంఖ్యాకాండము 9:2-5.

23. హెబ్రీ కేలండరుకు ఎందుకు నెలలు చేర్చబడేవి, ఆధునిక దిన యూదులు దీనిని ఎట్లు చేయుదురు?

23 మన తారీఖు యూదుల దానికి భిన్నముగా ఉండుటకు ఇంకొక కారణమేమనగా వారు ముందుగానే నిర్ణయించి పెట్టబడిన కేలండరును ఉపయోగింతురు. ఈ విధానము సా.శ. నాలుగవ శతాబ్ధము వరకు నిర్ణయించబడలేదు. దీని ద్వారా నీసాను 1కి లేక పండుగలకు దశాబ్ధములు లేక శతాబ్ధముల ముందే వారు తారీఖులను నిర్ణయించగలరు. అంతేగాక పురాతన లూనారు కేలండరునకు ఋతువులకు అనుగుణ్యంగా ఉండుటకై సందర్భానుసారముగా 13వ నెలను కలుపుట అవసరమైయున్నది. అయితే ప్రస్తుత యూదా కేలండరు కొన్ని నిర్ణీత స్థానములందు దీనిని కలుపును. 19-సంవత్సరముల వృత్తమునందు ఇది 3, 6, 8, 11, 14, 17, మరియు 19 సంవత్సరములకు కలుపబడుచున్నది.

24, 25. (ఎ) యేసు కాలమందు నెలలు ఎట్లు నిర్ణయించబడేవి మరియు ఎట్లు అదనపు నెలల అవసరత నిర్ణయించబడెను? (బి) ప్రభువురాత్రి భోజనపు తారీఖు యెహోవాసాక్షుల వలన ఎట్లు స్థిరపరచబడుతుంది?

24 ఏమైనను ఎమిల్‌ షూరర్‌ చెప్పునదేమనగా “యేసు సమయమునకు [యూదులు] నిర్ణయించి పెట్టియున్న కేలండరును కలిగిలేరు. పూర్తిగా అశాస్త్రీయముగా స్వానుభవ పరిశీలను బట్టియే క్రొత్తగా చంద్రుడు రావటాన్నిబట్టియే ప్రతి క్రొత్త నెల నిర్ణయించబడింది.” అలాగే అటువంటి పరిశీలన ద్వారానే అవసరమును బట్టి నెలను చేర్చేవారు. “సంవత్సర అంతములో సూర్యుడు భూమధ్యరేఖను దాటుదినమునకు ముందే [దాదాపు మార్చి 21] పస్కా వస్తుందని గుర్తించిన నీసానుకు ముందు అదనపు నెల ప్రకటించబడును.” (ది హిస్టరీ ఆఫ్‌ ది జ్యావిష్‌ పీపుల్‌ ఇన్‌ ది ఏజ్‌ ఆఫ్‌ జీసస్‌ క్రైస్టె, వాల్యూమ్‌ 1) ఆవిధముగా అదనపు నెల సహజముగానే వచ్చునుగాని, ఒక నియమముగా జతచేయబడలేదు.

25 యెహోవాసాక్షుల పాలకసభ (గవర్నింగ్‌ బాడి) పురాతన పద్ధతికి అనుగుణంగా ప్రభువురాత్రి భోజనమునకు తారీఖును స్థిరపరచును. వసంత కాలపు సమరాత్రిదినకాలమునకు (స్ప్రింగ్‌ ఈక్వనక్స్‌) అతి సమీపముగా యెరూషలేములో సూర్యాస్తమయమందు క్రెత్తగా చంద్రుని గమనించుటను బట్టి నీసాను 1 నిర్ణయించబడును. అక్కడనుండి 14 దినములను లెక్కించిన నీసాను 14 వచ్చును. ఇది సాధారణముగా నిండు చంద్రుని దినమునకు సరిపోతుంది. (ది వాచ్‌టవర్‌ జూన్‌ 15,1977, పేజీలు 383-4 చూడుము.) ఈ బైబిలు పద్ధతి ఆధారముగా యెహోవాసాక్షులు ఈ సంవత్సరమునకు జ్ఞాపకార్థ దిన ఆచరణ మార్చి 30 సూర్యాస్తమయము తరువాత ఉంటుందని చూపబడియున్నారు.

26. ప్రభువురాత్రి భోజనపు ఏ ఇతర అంశాలకు మనము అవధానము ఇవ్వవలసియున్నాము?

26 ఈ తారీఖు అమలులోనున్న చివరి పస్కాను యేసు ఆచరించిన నీసాను 14నకు సరిపోవును. ఏమైనను, జ్ఞాపకార్థమును ఆచరించుట యూదా శేదరు జ్ఞాపకముచేయు రక్షణకంటె మిన్నయైన దానిపై కేంద్రీకరించుచున్నది. ప్రభువురాత్రి భోజనసమయములో ఏమిజరుగుతుందో, దాని భావమేమిటో మన రక్షణ అందు ఎట్లు ఇమిడియున్నదో గ్రహించుకొనవలసియున్నాము. (w90 2/15)

[అధస్సూచీలు]

a ది వాచ్‌టవర్‌ ఫిబ్రవరి 15, 1980, పేజీలు 8-24 చూడుము.

b యం’క్లింటాక్‌ మరియు స్ట్రాంగ్‌ వీరిని “యూదా సమాజమందిరపు తెగలలో అతిపురాతనమైన మరియు అత్యంత గుర్తింపుగలిగిన తెగగా గుర్తించుచున్నాడు. వ్రాయబడిన ధర్మశాస్త్రపు మాటకు ఖచ్చితముగా హత్తుకొనియుండవలెననుట వీరి ప్రత్యేక సిద్ధాంతము.”

c “వారు సాయంకాలమందు పశువును వధించి. . .మధ్యరాత్రి ప్రతికుటుంబము దాని మాంసమును తిని . . . ఉదయమునకల్లా మిగిలిన మాంసమును లేక ఎముకలను కాల్చివేతురు. కొందరు విద్వాంసులు రబ్బూయుల యూదా విధానము దానిని మార్చకముందు సమరయుల మతము అతి సన్నిహితముగా బైబిలు మతమును పోలియున్నదని సూచించియున్నారు.”—ది ఆర్జిన్స్‌ ఆఫ్‌ శేదర్‌.

మీరు ఎట్లు సమాధాన మిచ్చుదురు?

◻ పస్కా తగినవిధముగా ఎందుకు రక్షణతో సంబంధపరచబడియున్నది?

◻ పస్కా గొర్రెపిల్ల కంటె యేసు బలి ఎక్కువనెందుకు నెరవేర్చగలదు?

◻ యేసుద్వారా ఏ రక్షణ అందుబాటులో ఉన్నది?

◻ ప్రభువురాత్రి భోజనమునకు యెహోవాసాక్షులు ఎట్లు సరైన సమయమును స్థిరపరచుదురు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి