కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/07 పేజీ 1
  • మనుష్యులందరు రక్షణపొందుతారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనుష్యులందరు రక్షణపొందుతారు
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు కేవలము బాహ్యరూపమును మాత్రమే చూచెదరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • మీరు బాహ్యరూపాన్ని మాత్రమే చూస్తారా?
    మన రాజ్య పరిచర్య—1999
  • “పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ఇతరులను మీరు యెహోవా చూసినట్లే చూస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 7/07 పేజీ 1

మనుష్యులందరు రక్షణపొందుతారు

1. దేవుని ముందు మనకుండే పేరు దేనిపై ఆధారపడివుంది?

1 దేవుని కృప రక్షణకు మార్గాన్ని తెరిచింది. ‘మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై ఉండాలనేదే’ యెహోవా చిత్తం. (1 తిమో. 2:3, 4) దేవుని ముందు మనకున్న పేరు మన భాషపై, ఆర్థిక స్థోమతపై, సామర్థ్యాలపై లేదా పైరూపంపై ఆధారపడదు గానీ, యేసు విమోచన క్రయధనంపై మనం చూపించే విశ్వాసంపైనే ఆధారపడివుంది. (యోహా. 3:16, 36) దేవుని జతపనివారిగా, మనం యెహోవా అంగీకరించడానికి ఇష్టపడే ప్రజలను తిరస్కరించేలా మనలను ప్రభావితం చేయగల ఎలాంటి వివక్షనైనా మనలోనుండి తీసివేయాలి.

2, 3. ప్రజల పైరూపాన్నిబట్టి తీర్పుతీర్చకుండా ఉండేందుకు ఏది మనకు సహాయం చేస్తుంది?

2 తీర్పుతీర్చకండి: యెహోవా ద్వేషం లేదా పక్షపాతం కనబరచకుండా ప్రజల అంతరంగాన్ని చూస్తాడు. (1 సమూ. 16:7) మార్పులు చేసుకునే అవకాశం ఉన్నవారిగా వారిని చూస్తాడు. ఆ విధంగా, ఆయన తనను సంతోషపెట్టాలనుకుంటున్నవారిని తనకు ఇష్టులైనవారిగా దృష్టిస్తాడు. (హగ్గ. 2:7) మనం కూడా ఇతరులను దేవుడు దృష్టించినట్లే దృష్టిస్తున్నామా?

3 పరిచర్యలో మనం కలిసే కొందరి పైరూపాన్ని బట్టి మనం దిగ్భ్రాంతికి గురికావచ్చు. వారు చినిగిపోయిన లేదా అమర్యాదకరంగావున్న బట్టలను వేసుకొనివుండవచ్చు, మాసిన గడ్డంతో ఉండవచ్చు లేదా పేదరికంలో జీవిస్తుండవచ్చు. కొందరికి ఇళ్ళు లేకపోవచ్చు. ఇతరులు మనతో కఠినంగా ప్రవర్తించవచ్చు. అయితే వారు యెహోవా సేవకులు ఎన్నడూ కాలేరని వారి గురించి తీర్పుతీర్చేబదులు, మనం ఆశావహ దృక్పథం కనబరచాలి, ఎందుకంటే, “మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారము.” (తీతు 3:3) మనం దాన్ని గుర్తిస్తూ, ప్రతీ ఒక్కరికీ, చివరికి తమ పై రూపాన్నిబట్టి యోగ్యులు కారు అని అనిపించే వారికి కూడా ప్రకటించడానికి ఉత్సాహాన్ని కనబరుస్తాం.

4, 5. యేసు, పౌలు ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకుంటాం?

4 నిష్పక్షపాతియైన మన దేవుణ్ణి అనుకరించండి: యేసుక్రీస్తు, యెహోవా ఆరాధికులయ్యే అవకాశమే లేదని ఇతరులు పరిగణించినవారికి సహాయం చేసేందుకు సమయం తీసుకున్నాడు. (లూకా 8:26-39) ఆయన తప్పుడు పనులను ఎన్నడూ మన్నించకపోయినా, ప్రజలు తప్పుడు జీవన విధానంలో చిక్కుకుపోయే అవకాశం ఉందని ఆయనకు తెలుసు. (లూకా 7:37, 38, 44-48) ఆ విధంగా, ఆయన “కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి” వారిని అర్థంచేసుకున్నాడు. (మార్కు 6:34) మనం ఆయన మాదిరిని పూర్తిగా అనుకరించవచ్చా?

5 అపొస్తలుడైన పౌలు రాళ్ళతో కొట్టబడ్డాడు, గాయపర్చబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. (అపొ. 14:19; 16:22, 23) అలాంటి చేదు అనుభవాలు ఆయనకు కోపాన్ని తెప్పించి, ఫలాని జనాంగాల మధ్య, జాతుల మధ్య తాను తన సమయాన్ని వృధాచేసుకుంటున్నాననే ముగింపుకి వచ్చేలా చేశాయా? ఎంతమాత్రం కాదు. యథార్థ హృదయులు ‘మనుష్యులందరిలో’ కనుగొనవచ్చని ఆయనకు తెలుసు, అంతేకాక వారిని కనుగొనాలని ఆయన నిశ్చయించుకున్నాడు. భిన్నమైన నేపథ్యాల నుండి, సంస్కృతుల నుండి వచ్చిన మన క్షేత్రంలోని ప్రజలను మనమూ అలాగే దృష్టిస్తామా?

6. నిష్పక్షపాతియైన మన దేవుణ్ణి మనమెలా అనుకరించవచ్చు?

6 నిష్పక్షపాతియైన దేవుణ్ణి మనం అనుకరిస్తూ, దేవుని కృప నుండి పూర్తి ప్రయోజనం పొందమని మనం ప్రతీ ఒక్కరికీ ప్రకటిద్దాం.​—అపొ. 10:34, 35.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి