కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 1/1 పేజీలు 4-7
  • బంగారు సూత్రము ఎందుకు ఇంకా విలువైయున్నది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బంగారు సూత్రము ఎందుకు ఇంకా విలువైయున్నది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ఇది ధర్మ శాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైయున్నది”
  • క్రీస్తు తన సంఘమును నడుపును
  • ఇంకా విలువైనదే, ఇంకా పనిచేయుచునేయున్నది
  • బంగారు సూత్రమును బట్టి జీవించుట
  • బంగారు సూత్రం అంటే ఏంటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • బంగారు సూత్రం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • బంగారు సూత్రం విశ్వవ్యాప్తమైన ఒక బోధన
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • పరిచర్యలో బంగారు సూత్రాన్ని పాటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 1/1 పేజీలు 4-7

బంగారు సూత్రము ఎందుకు ఇంకా విలువైయున్నది?

స్వచ్ఛమైన బంగారమెప్పుడూ కాంతివిహీనము కాదు. కనుకనే బంగారు ఆభరణాలు బహుమానములుగా యివ్వబడి విలువైనవిగా ఎంచబడును. పాడైపోయిన బంగారు వస్తువులను పారవేయక కంసాలులు ఆ విలువైన లోహమును తిరిగి ఒక నూతన కళగా రూపుదిద్దుతారు. ఎందుకంటే బంగారము దాని విలువను నిల్పుకొంటుంది.

ఆలాగే రెండువేల సంవత్సరముల క్రితం యేసు ఆ బంగారు సూత్రమును పల్కినప్పటికిని దానివిలువ మాత్రం పోలేదు. దాని విలువను గూర్చిన కారణములను పరీక్షించుట మూలంగా లేదా నిర్ణయించుటమూలంగా, నేడు మనకు గలదాని విలువను గూర్చి బహుగా మెచ్చుకొనగలము.

యేసు మనకు ఈ బంగారు సూత్రమునిచ్చినప్పుడు “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని, మీరు కోరుదురో, ఆలాగుననే మీరును వారికి చేయుడి,” అని చెప్పి యింకా యిట్లనెను: “ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైయున్నది.” (మత్తయి 7:12) యేసు శిష్యులు ఆయనమాటలను వినుచున్న యితరులు దీనిని ఎలా అర్థం చేసికొన్నారు?

“ఇది ధర్మ శాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైయున్నది”

“ధర్మశాస్త్రము” అనగా ఆదికాండమునుండి ద్వితియోపదేశకాండము వరకు గల బైబిలు తొలి వ్రాతలైన ఐదుపుస్తకములను సూచించుచున్నది. చెడుతనమును పారద్రోలు సంతానమును ఉత్పన్నముచేయు యెహోవా సంకల్పమును ఇవి బయల్పరచును. (ఆదికాండము 3:15) ఆ తొలి బైబిలు పుస్తకములలో యెహోవా సా.శ.పూ. 1513లో సీనాయి పర్వతముమీద మోషే మధ్యవర్తిగా ఇశ్రాయేలు జనాంగమునకు యిచ్చిన ధర్మశాస్త్రము లేదా ఒక ఆజ్ఞలపట్టిక యిమిడియుండెను.

ఈ ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులను తమ చుట్టునున్న అన్య జనాంగముల నుండి వేరుపర్చెను. యెహోవా యెదుట తమకుగల అనుగ్రహ స్థానమునకు హానిని కలిగించే ఏ పనినైనను ఇశ్రాయేలీయులు చేయతగదు. వారు ఆయన స్వకీయసాంపాద్యము, ఆయన దీవెనలను పొందునిమిత్తము వారు అట్లు నిలిచి యుండాల్సిందే. (నిర్గమకాండము 19:5; ద్వితీయోపదేశకాండము 10:12, 13) కాని దేవునియెడల తమకున్న కర్తవ్యములకుతోడు, ఇశ్రాయేలునందు పరదేశులైయున్నవారికి మేలుచేయు ఇశ్రాయేలీయుల బాధ్యతను మోషే ధర్మశాస్త్రము విశదీకరించెను. ఉదాహరణకు అది తెల్పినదేమనగా “నీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వానివలె ఎంచవలెను, నిన్నువలెవానిని ప్రేమించవలెను, ఐగుప్తుదేశములో మీరుపరదేశులైయుంటిరి. నేను మీదేవుడైన యెహోవాను”. (లేవీయకాండము 19:34) ఇశ్రాయేలు రాజులకాలములో యెరూషలేమునందు దేవుని ఆలయ నిర్మాణములో భాగము వహించుటవంటి అనేక ఆధిక్యతలను ఈ పరదేశులు అనుభవించారు.—1 దినవృత్తాంతములు 22:2.

ఇశ్రాయేలునకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము వ్యభిచారము, నరహత్య, దొంగతనము మరియు దురాశను నిషేధించింది. ఈ ఆజ్ఞలు వీటితోపాటు ఏ ఆజ్ఞయైనను ఉన్నయెడల “నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను” అను ఆజ్ఞలో సంక్షేపముగా యిమిడియుండెను. అపొస్తలుడైన పౌలు యిలా అనెను: “ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.”—రోమీయులు 13:9, 10.

ధర్మశాస్త్రమే బంగారు సూత్రమునకు మూలమును తెలియజేస్తే మరి “ప్రవక్తల” విషయమేమిటి?

హెబ్రీలేఖనముల ప్రవచనాత్మక పుస్తకములు కూడా ఆలాగుననే బంగారు సూత్రముయొక్క విలువను స్థిరపర్చినవి. తన సంకల్పమును నమ్మకముతో నెరవేర్చు దేవుడు యెహోవా అని అవి చూపుచున్నవి. తన నమ్మకమైన సేవకులు, అపరిపూర్ణులైనప్పటికిని, త్రోవతప్పి చేసిన క్రియల విషయమై నిజమైన పశ్చాత్తాపమును కనుపర్చి తన చిత్తమునుచేయుటకు ప్రయత్నించినయెడల ఆయన వారిని ఆశీర్వదించును. “మిమ్మును కడుగుకొనుడి శుద్ధిచేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మాని మేలుచేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడువానిని విడిపించుడి. తండ్రిలేని వానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.”—యెషయా 1:16, 17.

దేవునియెడల, పొరుగువానియెడల మేలైనదానిని దేవునిప్రజలు చేయుచున్నప్పుడు యెహోవా తన ప్రోత్సాహమును నిశ్చయపర్చెను. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: ‘న్యాయవిధిని అనుసరించుడి. నీతిని అనుసరించి నడచుకొనుడి. . .ఏ కీడు చేయకుండ తనచేతిని బిగబట్టువాడు ధన్యుడు’”—యెషయా 56:1, 2.

క్రీస్తు తన సంఘమును నడుపును

ధర్మశాస్త్రమును, ప్రవక్తల ఉపదేశమును నెరవేర్చుటకై క్రీస్తువచ్చెను, ఈయన కాలమునుండి, యెహోవా యొక్క నిత్యసంకల్పము వృద్ధిచెందుట కొనసాగియున్నది. (మత్తయి 5:17; ఎఫెసీయులు 3:10, 11, 17-19) మోషేయొక్క పాతధర్మశాస్త్రము స్థానే క్రొత్తనిబంధన వచ్చింది, అది యూదులైన అభిషక్త క్రైస్తవులను, అన్యులైన అభిషక్త క్రైస్తవులను యిరువురను చేర్చుకొనెను. (యిర్మీయా 31:31-34) అయినప్పటికిని నేటి క్రైస్తవసంఘము యింకను ఆ బంగారు సూత్రమును అనుసరించుచున్నది. ఆ సూత్రముయొక్క విలువను అంగీకరించుటకు మరి యితరకారణమున్నది: ఆధునిక క్రెస్తవసంఘమునకు క్రీస్తే చురుకైన శిరస్సు ఆయన తన ఉపదేశములను మార్చలేదు. ఆయన ప్రేరేపిత సలహా యింకను మేలైనదే.

యేసు ఈ భూమిని విడిచి వెళ్లకముందు, అన్నిదేశముల ప్రజలను శిష్యులను చేయుమని “నేను మీకు ఆజ్ఞాపించినవాటినన్నిటిని గైకొనవలెనని” వారికి బోధించుమని ఆజ్ఞాపించెను. ఆ ఉపదేశములో బంగారు సూత్రము కూడ చేర్చబడింది. యేసు తనశిష్యులకు యిట్టి అభయమిచ్చెను: “ఇదిగో! నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడా ఉన్నాను.”—మత్తయి 28:19, 20.

లూకా 6:31 లో వ్రాయబడినట్లు యేసు యిలా ఆజ్ఞాపించెను: “మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికిచేయుడి.” ఇతరులకు మేలుచేయుటలో చొరవ తీసుకొనుటయందు యేసు ఎంతటి శ్రేష్టమైన మాదిరి కనుపర్చెను!

తన భూపరిచర్యకాలములో ప్రజలు అనుభవిస్తున్నదానిని జాగ్రత్తగా గమనించి వారినిగూర్చి చింతించెను. ఒకానొక తన ప్రచారయాత్రలో, జనసమూహమునుచూచి, వారిని గూర్చి జాలిపడెను. అంతేకాదు, వారికి సహాయ ఏర్పాట్లను ఆయన చేయించెను. ఎట్లు? తన శిష్యులు ప్రజలయిండ్ల యొద్దకు తీసుకొనివచ్చే విస్తృత ప్రచార దండయాత్రను వ్యవస్థీకరించుట మూలంగా దీనినిచేసెను. ఆయన ఆజ్ఞాపించినట్లు: “మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.” ఈ పనికి తన సహకారము తన తండ్రి ఆశీర్వాదము ఉన్నవని యేసు తదుపరి మాటలలో స్పష్టముగా కన్పించును: “మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నన్నుచేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. మరియు శిష్యుడని యెవడు ఈచిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడుతన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”—మత్తయి 9:36-10:42.

ఇతరులయెడల అనుకూల చర్య చేయుట బంగారు సూత్రముయొక్క గూఢార్థమని యేసు మరో సందర్భములో చేసిన తర్కనయందు కన్పించును: “మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించువారిని ప్రేమింతురుకదా. మీకు మేలు చేయువారికే మేలుచేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును ఆలాగే చేతురుకదా. మీరైతే ఎట్టివారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి. అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును.” (లూకా 6:32, 33, 35) ఆలాగుననే, వ్యక్తిగతంగా మనము ఎరుగని వారికి సహితము మేలుచేయుటకు ఇంకనూ విలువను కల్గిన ఈ బంగారు సూత్రము మనలను పురికొల్పును.

ఇంకా విలువైనదే, ఇంకా పనిచేయుచునేయున్నది

బంగారు సూత్రము ఇంకనూ విలువైనదే అనుముగింపు నిదర్శనమునకు దానిని పాటించి జీవించువారి నిజ అనుభవాలనుండి కల్గును. దేవుని శాసనముల కనుగుణ్యముగా ప్రతిదినము నడచుకొను క్రైస్తవులు గొప్ప ఆనందమును, తరుచు ఊహించని ఆశీర్వాదములను అనుభవిస్తారు. ఒక క్రైస్తవ స్త్రీ తాను వెళ్లే వైద్యశాలయందలి సిబ్బందితో మర్యాదగాను, దయతోను వ్యవహరించినందుకు, ఆమెకు చికిత్సచేసే విషయములో డాక్టర్లు, నర్సులు, తమ హద్దునుదాటి పనిచేసే విధంగా ఆమె ప్రయోజనం పొందగల్గింది.

వేగంగా నిర్మించుచున్న రాజ్యమందిరపు ప్రాజెక్టులందు యెహోవాసాక్షులు చేయుచున్న పనికూడా బంగారుసూత్రముయొక్క విలువను సాటిచెప్పుచున్నది. వేయబడిన పథకమునుగూర్చి తెలియజెప్పుటకు నిర్మాణ ప్రదేశపు పరిసరములందు నివసించుచున్నవారిని సందర్శించినప్పుడు మంచి ప్రతిస్పందన లభించినది. గతంలో సాక్షులను వ్యతిరేకించినవారు, సాక్షులు పొరుగువారికి మేలుచేసేవారని, ముఖ్యంగా దేవునిప్రజలు తమపనిలో మంచి సహకారంతో పనిచేస్తారని వారు ఆవిధంగా గ్రహించగాల్గరు. తత్ఫలితంగా, కొందరు ప్రత్యక్షంగా సహాయముచేయుటకు గాని లేదా సామాగ్రిని సమకూర్చి పెట్టుటలో సహాయపడుటకుగాని ముందుకువచ్చారు.—జెకర్యా 8:23 పోల్చుము.

ఇంగ్లండ్‌నందు లండనులో నివసించుచున్న ఒక ఇరాని సాక్షి ఒక స్టొరునుండి ఆహారమును కొనుచున్నప్పుడు, అతడు విదేశీయుడైనందున స్టొరునందు పనిచేసేవాడు అతనిని అగౌరపర్చాడు. అతడు భయపడక, యెహోవాసాక్షులలో ఒకనిగా తనకు ఇతర జాతీయులంటే ఎటువంటి చెడుభావన లేదని ఆ సాక్షి దయతోను, వివేకముతోను వివరించాడు. అంతేకాకుండా ఆ ఇరుగుపొరుగువారినందరిని బైబిలు వర్తమానముతో సందర్శించాడు. ఫలితం? ఆ స్టొరు యజమాని, ఆ సాక్షి ఆర్డరు చేసిన ఆహారమునకు అదనంగా మంచి రుచికరమైన ఆహారమును యిచ్చాడు.

అయితే బంగారు సూత్రము అటువంటి స్వల్పమైన దయార్ధ సంఘటనలకు మాత్రమే పరిమితముకాదు. నిశ్చయంగా దేవునిరాజ్యవర్తమానముతో యెహోవా సాక్షులు ప్రపంచమందంతట తమ పొరుగువారిని క్రమంగా సందర్శించుటమూలంగా మరింత ఎక్కువగా మంచిని వ్యక్తపర్చుచున్నారు.

బంగారు సూత్రమును బట్టి జీవించుట

బంగారు సూత్రమును అన్వయించుట అంటే యితరుల యెడల అవధానమును మరల్చుట అని భావము. అది మంచినడిపింపు. నీచుట్టు నున్నవారికి మేలుచేయు అవకాశములను నీవు వెదకవలసియున్నావు. వారిని సమీపించి, లక్ష్యముచూపి, వారియెడల వ్యక్తిగత శ్రద్ధతీసుకొనుము! (ఫిలిప్పీయులు 2:4) అలా చేయుటమూలంగా నీవు గొప్ప ఆశీర్వాదములను పొందగలవు. నీవు యేసు సలహాను పాటించిన వాడవగుదువు: “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పర్చునట్లు వారియెదుట మీ వెలుగును ప్రకాశింపనియ్యుడి. (మత్తయి 5:16) నీవు యెహోవాను అత్యంత శ్రద్ధతో వెదకి ప్రతిదినము బంగారు సూత్రమును అనుసరించి జీవించుచున్నయెడల ఆయనే నీకు ప్రతిఫలమిచ్చును.—హెబ్రీయులు 11:6. (w89 11⁄1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి