“సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట”
కొండమీది ప్రసంగములో యేసు “ధర్మశాస్త్రమును మరియు ప్రవక్తల ఉపదేశమును” గూర్చి ప్రస్తావించెను. హెబ్రీలేఖనములలోని మూడవ భాగము కీర్తనలు మరియు సామెతలు వంటి పద్యకావ్యములతో కూడిన వ్రాతలైయున్నవి. (మత్తయి 7:12; లూకా 24:44) ఇవికూడా దేవుని జ్ఞానమును కల్గియున్నవి.
ఉదాహరణకు ప్రాచీన ఇశ్రాయేలీయులలో న్యాయాథిపతులను సామెతలు యిలా హెచ్చరించెను: “నీయందు దోషములేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టివానియందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పుతీర్చువారికి మేలుకలుగును. క్షేమకరమైన దీవెన అట్టివారి మీదికి వచ్చును. సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును.”—సామెతలు 24:24-26.
ఒక న్యాయాధిపతి లంచము లేదా స్వాభిమానముయొక్క వత్తిడికి లొంగిపోయి ఒక దుష్టుని నీతిమంతునిగా ప్రకటిస్తే అతడు ఆ స్థానమునకు అనర్హుడని యితరులు పరిగణిస్తారు. చివరకు న్యాయమును చెరుపు అట్టి కార్యమునుగూర్చి విను “అన్యజనాంగము వారును” తిరస్కరిస్తారు! అలా కాకుండా, ఒక న్యాయాధిపతి తనవద్దనున్న కేసులోని దుష్టుని, ధైర్యముతో గద్దించి సరియైన మాటలతో ప్రత్యుత్తరమిస్తే ప్రజల గౌరవమును ప్రేమను చూరగొంటాడు. అనేకులు ఆయనను కలుసుకొని “క్షేమకరమైన దీవెనలను” యిస్తారు. సామెతలు తదుపరి వర్ణించినట్లు: “సరియైన మాటలతో ప్రత్యుత్తర మిచ్చుట పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును”.
ఆ ముద్దు ఏమిటంటే—సలహాదారునికి సరియైన మాటలతోయిచ్చిన గద్దింపును గమనించుచున్న వారికి మధ్యగల పరస్పర గౌరవమును చూపుచున్నది. గద్దించబడినవాడు సహితం ప్రతిస్పందించి న్యాయాధిపతి యెడల అనురాగము చూపవచ్చునేమో. సామెతలు 28:23 ఇట్లనుచున్నది. “నాలుకతో యిచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును.” నేడు సంఘములో పెద్దలుగా పనిచేయుచున్నవారు స్నేహమునుగాని కుటుంబ బంధములనుబట్టిగాని తమ తీర్పులను పెడత్రోవను పోవునట్లు అనుమతించకూడదు. సరియైనమాటలతో అవసరమగు సలహానిచ్చిన యెడల పెద్దలు సంఘముయొక్క గౌరవమును పొందుతారు. (w89 11⁄1)