బంగారు సూత్రము అంటే ఏమిటి?
“ఇదిగో చూడండి! నేను నా పొరుగువారికి యిబ్బంది కల్గించను. ఇక నా విషయానికి వస్తే, తాము చేయదల్చుకున్నది వారు నా యెడల చేయవచ్చు. అయితే, ఒకవేళ వారు యిబ్బందిలో ఉంటే, నేను చేయదగిన సహాయంచేస్తాను.” నీ దృక్పధము కూడ యిదేనా? విపత్తులు సంభవించినప్పుడు, తరుచు అనేకులకు ఆశ్చర్యము కల్గించేటట్లు దయతోకూడిన కార్యములు, నిస్వార్థచర్యలు పెల్లుబకవచ్చును. అయితే అది సరిపోతుందా?
నీవు తండ్రివైతే, తమతోటి ఆటగాళ్లకు కోపంతెచ్చునట్లు ప్రవర్తింపవద్దని నిస్సందేహముగా నీ పిల్లలకు సలహా ఇచ్చియుందువు. అట్టి నియమావళిని అలక్ష్యముచేస్తే ప్రతీకార చర్యకునడుపునని చూపేందుకు మన యౌవనకాలమందు మనకు పడిన మచ్చలను మనలో చాలామందిమి కల్గియున్నాము. అవును, తూర్పుదేశీయుడైన తత్త్వవేత్త కన్‌ఫ్యూషియస్‌చే పేర్కొనబడిన నీతివాక్యమందలి జ్ఞానాన్ని మనము నేర్చుకున్నాము: “నీకు ఏది చేయబడడం నీవు కోరుకొనవో దానిని యితరులకు చేయకుము.” అయితే అది బంగారు సూత్రమని పిలువబడే దానికి కేవలం తక్కువ ప్రభావముతో, ప్రతికూలంగా చూపిన వర్ణన మాత్రమేనని మీరు గుర్తించుదురా?
ఒక అనుకూల సూత్రము
వెబ్‌స్టర్స్ న్యూకాలేజియట్ డిక్షనరీ ప్రకారం, “బంగారు సూత్రమనేది” [మత్తయి] 7:12 మరియు [లూకా] 6:31 నందు తెల్పబడిన నైతిక ప్రవర్తనకు సంబంధించిన సూత్రమని, ఒకడు యితరులు తనకు చేయాలని కోరుదానిని తాను యితరులకు చేయాలని చెప్పుచున్నదని” నిర్వచించబడెను. ఈ పేజి అడుగు భాగమునున్న బాక్స్‌ను గమనించండి మత్తయి 7 అధ్యాయం 12 వచనముయొక్క వివిధ బైబిలు తర్జుమాలు యిట్టి మార్గదర్శక సూత్రముయొక్క విజ్ఞానమును ఎలా ప్రకాశింపజేయుచున్నవో చూడుము.
ఒక తర్జుమాకు మరొక తర్జుమాకు మాటలు తేడా ఉన్నప్పటికిని ఆ సూత్రము మాత్రము అనుకూలంగా ఉన్నదని గమనించుము. అయితే, యేసు యింతకు ముందు కొండ మీది ప్రసంగములో చర్చించినట్లు: “అడుగుడి మీ కియ్యబడును; వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును. వెదకువానికి దొరకును. తట్టువానికి తీయబడును.” (మత్తయి 7:7, 8) అడుగుట, వెదకుట, తట్టుట ఇవన్నీ అనుకూల చర్యలే. యేసు యిలా చెప్పసాగెను: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.”—మత్తయి 7:12.
ఈ సూత్రమును పాటించి జీవించుట మూలంగా యేసు శిష్యులు కూడ దీనిని ప్రచురపర్చినట్లు బైబిలు తెల్పుచున్నది. (రోమీయులు 15:2; 1 పేతురు 3:11; 3 యోహాను 11) విచారకరంగా, నేడు అనేకులు వారు నామకార్థ క్రైస్తవులైనను, కాకపోయినను దీనిని అనుసరించుటలేదని ప్రస్తుత మానవసంబంధముల స్థితి సాక్ష్యమిచ్చుచున్నది. ఇట్టి నైతిక ప్రవర్తనా సూత్రము యిక విలువలేనిదని దీని భావమా? దానికి కాలం చెల్లిపోయిందా? (w89 11/1)
[3వ పేజీలోని బాక్సు]
“ఇతర మనుష్యులు నీకు చేయగోరువాటన్నిటిని వారికి చేయుము.”—ది హోలి బైబిలు ఆర్. ఎ. నాక్స్ చేసిన తర్జుమా.
“ఇతరులచే ఎలా చూడబడాలని నీవు కోరుదువో ఆలాగే వారినీ చూడుము.”—ది న్యూటెస్ట్‌మెంట్ యిన్ మోడరన్ ఇంగ్లీష్. జె. బి. ఫిలిప్స్.
“ఇతరులు ఏమేమి చేయాలని మరియు నీకు చేయాలని నీవు కోరుచున్నావో, ఆలాగే నీవును చేయుము మరియు వారికి చేయుము.”—ది ఏంప్లిఫైడ్ న్యూటెస్ట్ మెంట్.
“ఇతరులు నీకు చేయాలని కోరు ప్రతిదానిని వారికిని చేయుము.”—దిన్యూటెస్ట్‌మెంట్ ఇన్‌ది లాంగ్వేజ్ ఆఫ్ టు డే, డబ్ల్యు. యఫ్. బెక్ తర్జుమా.
“అన్నివిషయములలోను నీతోటి వారు నిన్ను ఎలా చూడగోరుదువో ఆలాగే నీవును వారిని చూడుము.”—ది ఫోర్ గాస్పెల్స్ ఇ. వి. రియు చే తర్జుమాచేయబడెను.
“ఇతరులు నీ విషయములో వ్యవహరించాలని కోరువిధంగా నీవు వ్యవహరించుటకు అభ్యాసం చేయాలి.”—దిన్యూటెస్ట్‌మెంట్ సి. బి. విలియమ్స్ తర్జుమా.