వ్యర్థమాటలను ఎలా అణగగొట్టగలము
“యెహోవా, నానోటికి కావలియుంచుము. నా పెదవుల ద్వారమునకు కావలిపెట్టుము.”—కీర్తన 141:3.
1. మనకు దేవుడిచ్చిన మెదడుకు ఎటువంటి సామర్థ్యమున్నది?
యెహోవా మనకొక మెదడునిచ్చాడు, మరెదంత ఆశ్చర్యకరమైనదో! ది ఇన్ క్రెడిబుల్ మెషిన్ అనే పుస్తకమిలా చెబుతోంది: “మానవ మెదడుయొక్క అనంత మేధాశక్తికి, మృదుత్వమునకు పోల్చిచూస్తే మనకున్న అత్యంత పరిజ్ఞానంగల కంప్యూటర్లు సహితం వట్టి బురదవంటివే . . . ఏ క్షణములోనైనా నీ మెదడునుండి వెలువడే లక్షలాది సంకేతాలు అసాధారణమైన బరువుతోకూడని సమాచారమును తీసుకుని వెళ్తున్నవి. నీ శరీరములోని అంతర్గత, బహిర్గత పరిస్థితులనుగూర్చి సమాచారాన్ని అవి మోసికొనివెళ్లును. . . . ఇతర సంకేతాలు సమాచారాన్ని తయారుచేసి పరిశీలించగా అవి ఓ నిర్ణయానికి నడిపించగల కొన్ని భావోద్రేకాలను, జ్ఞాపకాలను, ఆలోచనలను లేక పథకాలను ఉత్పత్తిచేస్తాయి. ఆ వెనువెంటనే, నీ మెదడులోని సంకేతాలు, నీ శరీరంలోని ఇతరభాగాలు చేయవలసిన పనినిగూర్చి వాటికి సూచనలిస్తాయి. . . . ఈ మధ్యలోనే నీకు తెలియకుండగనే నీ మెదడు నీ శ్వాసనిశ్వాసలను, రక్తప్రసరణను, ఉష్ణతను మరియు ఇతర అవసరతలను నిర్వహిస్తునే వుంటుంది.”—పుట 326.
2. ఏ ప్రశ్న ఇప్పుడు పరిశీలించతగినది?
2 నిశ్చయంగా, దేవుడిచ్చిన అట్టి అద్భుతకరమగు భాగ్యాన్ని బహుమానాన్ని ఓ చెత్తకుండిలా, లేక చెత్తబుట్టలా ఎన్నటికీ వుపయోగించకూడదు. అయిననూ, హానికరమగు వ్యర్థమాటలను వినుట, చెప్పుటద్వారా మెదడును మనము దుర్వినియోగం చేయగలము. అట్టి వ్యర్థమాటలను మానుకునేదెలా, మరి ఇతరులట్టి వాటినుపయోగించకుండ వారికెలా సహాయపడగలము?
నీకు దేవుడిచ్చిన మెదడును అభినందించుము
3. ఎందుకు నిజమైన ఏ క్రైస్తవుడును హానికరమైన మాటలు మాట్లాడడు?
3 మనకు దేవుడిచ్చిన మెదడును అభినందిస్తే మనము హానికరమగు వ్యర్థమాటలు వినకుండ వాటినిగూర్చి ఇతరులతో మాట్లాడకుండ వుంటాము. యెహోవా ఆత్మ, ఎవ్వరునూ అట్టి తలంపులతో తమ మనస్సులను నింపుకొని ఎవ్వరినీ తమ నాలుకతో హానికల్గించేటట్లు మాట్లాడుటకు పురికొల్పదు. బదులుగా దేవుని వాక్యమిట్లు చెబుతుంది: “భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను.” (యెషయా 55:7) దుష్టుని మనస్సు చెడు తలంపులతో నిండియుండును, అతడు యథార్థవంతుని మోసగించుటకు త్వరపడును. కాని దేవుడిచ్చిన మనస్సును అభినందించేవారు అలా మాట్లాడెదరని మనమెన్నటికిని అనుకోకూడదు.
4. మన మెదడును, మాట్లాడే మన సామర్థ్యాన్ని మనం మెచ్చుకుంటే, మన మనస్సును నాలుకను మనమెట్లు వుపయోగిస్తాము?
4 తగిన అభినందనవుంటే, మన పాపపు శరీరాశలను తీర్చుటకు మన మనస్సును, నాలుకను ఉపయోగించకుండ అది మనకు సహాయపడును. దానికి మారుగా మనం మన తలంపులను మాటలను శ్రేష్ఠమైన వాటిపై కేంద్రీకరిస్తాము. మన తలంపులకంటె ఎంతో ఉన్నతమైన వాటిని కలిగియున్న ఆయనపై ప్రార్థనాపూర్వక నమ్మకమును చూపుటద్వారా మనం హానికరమగు వ్యర్థమాటలను మానుకోగలం అపొస్తలుడైన పౌలు ఇలా హెచ్చరించాడు: “ఏ యోగ్యతయైనను [చెడుకాదు], మెప్పైనను [శపింపబడినవికావు] వుండిన ఎడల, ఏవి సత్యమైనవో [అబద్ధము లేక మోసపూరితమైనవికావు], ఏవి మాన్యమైనవో [చిన్నచిన్నవికావు], ఏవి న్యాయమైనవో [దుష్ట, హనికరమైనవికావు], ఏవి పవిత్రమైనవో [అపవిత్రమగు మోసం లేక దురాలోచనలుకావు], ఏవి రమ్యమైనవో [అసహ్యించుకొను, అవమానపరచునవికావు], ఏవి ఖ్యాతిగలవో [అగౌరవమైనవికావు] వాటిమీద ధ్యానముంచుడి.”—ఫిలిప్పీయులు 4:8.
5. పౌలు విషయంలో తోటి విశ్వాసులు ఏమిచూశారు, విన్నారు?
5 పౌలు ఇంకా ఇట్లనుచున్నాడు: “మీరు నావలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో నా యందున్నట్లుగా ఏమివింటిరో ఏవి చూచితిరో అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధానకర్తయగుదేవుడు మీకు తోడైయుండును.” (ఫిలిప్పీయులు 4:9) పౌలునుగూర్చి ఇతరులు ఏమిచూశారు, విన్నారు? పవిత్రమైన, ఆత్మీయాభివృద్ధి కల్గించేవాటినిగూర్చి కని, వినిరి. ఆయన లూదియ, తిమోతినిగూర్చిన వ్యర్థమాటలతో వారి చెవులను నింపలేదు. యెరూషలేమునందలి పెద్దలనుగూర్చి పౌలు చెప్పుడు మాటలు వినలేదు అంతట చెప్పలేదు.a బహుశ, తనకు దేవుడిచ్చిన మనస్సుయెడలగల గౌరవమే పౌలు హానికరమగు వ్యర్థమాటొల్ల జోక్యం చేసుకోకుండ ఆయనకు సహాయపడింది. మనకు యెహోవా దయచేసిన మనస్సును నాలుకను నిజముగా అభినందిస్తే మనమాయన మాదిరిని అనుకరిస్తాము.
దేవునిని ఆయన వాక్యాన్ని గౌరవించుము
6, 7. (ఎ) అదుపులేని నాలుకవలన వచ్చే ప్రభావాలనుగూర్చి యాకోబు ఎట్లు చూపించాడు? (బి) మనం దేవునిని ఆయన వాక్యాన్ని గౌరవిస్తే ఏమి జరుగదు?
6 దేవునియెడల ఆయన పరిశుద్ధ వాక్యముయెడల హృదయపూర్వక గౌరవం మనం హానికరమగు వ్యర్థమాటలను మానుకొనుటకుకూడా మనకు సహాయం చేస్తుంది. నిజానికి, అట్టి గౌరవం నాలుకనుగూర్చి ప్రస్తావించిన శిష్యుడగు యాకోబు సలహాను లక్ష్యపెట్టుటకు మనలను పురికొల్పుతుంది. (యాకోబు 3:2-12) ఒకడు తన నాలుకను అదుపులో పెట్టుకుంటే, గుర్రంనోటిలోని కళ్లెం ఆ జంతువును నడిపించునట్లే, అతడు తన సర్వశరీరాన్ని స్వాధీనపరచుకోగలడు. నిప్పురవ్వ అరణ్యాన్ని తగులపెట్టగలిగినట్లే, నాలుక జీవన చక్రానికి చిచ్చుపెట్టగలదు. మానవుడు మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతిజాతిని సాధుచేయగలడు కాని, “యే నరుడును నాలుకను సాధు చేయనేరడు,” అని యాకోబు అన్నాడు. అయితే హానికరమగు వ్యర్థమాటలను అణగగొట్టుటకు ప్రయత్నించని సాకు అంటూ ఏమీలేదు.
7 నాలుక ఆశీర్వచనాన్ని శాపవచనాన్ని ఒకే నోటినుండి పలికించుననికూడ యాకోబు తెలిపాడు. ఇది సమంజసముకాదు, ఎందుకంటే ఒకే నీటిబుగ్గనుండి తియ్యని, చేదునేళ్లు రెండును రావు. అంజూరపు వృక్షము ఒలీవ ఫలములను, ఉప్పునీరు మంచినీటిని ఉత్పత్తిచేయలేవు. క్రైస్తవులు అసంపూర్ణులుగా ఉన్నంతవరకు నాలుకను పూర్ణముగా సాధువు చేయలేరు, నిజమే. ఇందువల్ల మనం పశ్చాత్తాపమునొందిన తప్పిదస్థుల విషయంలో కరుణ చూపెదంగాని హానికరమగు వ్యర్థమాటలు పలుకము. మనమీదనే ఆధారపడినంతవరకు దేవునికి ఆయన వాక్యానికి నిజంగా గౌరవమిస్తే నాలుకను అట్టి విషపూరితపద్ధతిలో ఉపయోగిస్తూనే వుండము.
ప్రార్థనెట్లు సహాయపడగలదు
8. ప్రార్థన ఎట్లు హానికరమగు వ్యర్థమాటలను అణగగొట్టుటకు మనకు సహాయపడగలదు?
8 వ్యర్థమాటలను విని వాటిని వ్యాపింపజేయడమనే శోధనచాలా బలమైనది. గనుక నీవు గతంలో అట్టి శోధనకు లొంగిపోయినట్లయితే దేవుని క్షమాపణ అడిగి ఆయన సహాయాన్ని కోరవా? యేసు మనమిట్లు ప్రార్థించాలని ఉపదేశించాడు: “మమ్మును శోధనలోనికి తేక దుష్టునినుండి తప్పించుము.” (మత్తయి 6:13) అట్టి శోధనలోనికి తేవద్దని దేవుని మనఃపూర్వకముగా ప్రార్థించే క్రైస్తవులు సాతాను కుయుక్తివల్ల యిట్టి చెడ్డమాటలకు లోబడకపోతే, వారు ఆ గొప్ప మోసగాడి బారినుండి తప్పించబడుదురు.
9. ఎవరిమీదనైనా అపవాదు వేయాలనే శోధన కలిగినప్పుడు మనమెట్లు ప్రార్థించగలం?
9 మనం ఇతరులపై అపవాదు వేయాలనే శోధనలో పడితే మనమిట్లు ప్రార్థించవచ్చును: “యెహోవా నానోటికి కావలియుంచుము. నా పెదవుల ద్వారమునకు కావలిపెట్టుము.” (కీర్తన 141:3) శోధనకు లోబడి, అసహ్యుడు, అబద్ధికుడు, నరహంతకుడు, మోసగాడైన అపవాదిని అనుకరిస్తుంటే మనం మన భవిష్యత్ జీవితాన్ని నాశనం చేసికోగలం. (యోహాను 8:44) అపొస్తలుడైన యోహాను ఇట్లు వ్రాసాడు: “తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.”—1 యోహాను 3:15.
ప్రేమ వ్యర్థమాటలను పారద్రోలును
10. ఇతరులనుగూర్చి వ్యర్థమాటలు మాట్లాడే బదులు వారికి మనమేమి అచ్చియున్నాము?
10 మనమందరం ఇతరులకు ఏదోఒకటి అచ్చియున్నాం గాని హానికరమగు వ్యర్థమాటలను పురికొల్పే ద్వేషమును మాత్రం ఎవ్వరికి అచ్చియుండలేదు. “ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు,” అని పౌలు అన్నాడు. (రోమీయులు 13:8) ఇతరులనుగూర్చి చెడుగా చెప్పి వారిని అప్రతిష్టపాలు చేసేకన్న మనం రోజూ ఆ అప్పు తీర్చుతూ ఉందాం. మనం యెహోవాను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూవుంటే, తోటి ఆరాధికున్ని మోసం చేయలేం, “ఏలయనగా, తానుచూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తానుచూడని దేవుని ప్రేమింపలేడు.”—1 యెహాను 4:20.
11. గొర్రెలు, మేకలనుగూర్చిన యేసు ఉపమానం, హానికరమగు వ్యర్థమాటలనుగూర్చి మనకు కొంత ఆలోచనను ఎలా అందిస్తుంది?
11 యేసు ఇచ్చిన గొర్రెలు మేకల ఉపమానాన్ని పరిశీలించండి. క్రీస్తు సహోదరుల యెడల చేసినది ఆయనకు చేసినట్లే పరిగణింపబడుతుందని మేకవంటి వారికి తెలుపబడింది. క్రీస్తునుగూర్చి వ్యర్థంగా పలికెదవా? నీ ప్రభువును, యజమానునిగూర్చి చెడుగా మాట్లాడకపోతే ఆయన అభిషేక సహోదరులనుగూర్చికూడ ఆలాగే మాట్లాడవద్దు. “నిత్యనాశనానికిపోవు” మేకలవలె నీవును తప్పుచేయవద్దు. నీవు యేసు సహోదరులను ప్రేమిస్తే నీవు వారినిగూర్చి చెప్పేవాటిని క్రియలద్వారా కనబరచుము.—మత్తయి 25:31-46.
12. సామెతలు 16:2 యొక్క సారాంశమేమిటి, మరియు అది మన తలంపులు, క్రియలు, మాటలపై ఎట్టి ప్రభావాన్ని కలిగివుండాలి?
12 మనందరం పాపులమై, యేసు విమోచన క్రయధనం మనకవసరమై యున్నందున, ఎవరైనా మనలనుగూర్చి అయుక్తంగా మాట్లాడగోరితే, అతనికి అలా అనుటకెంతో వున్నది. (1 యోహాను 2:1, 2) బహుశ, మనమెంతో బాగా ప్రవర్తిస్తున్నామని మనమనుకోవచ్చును. “ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దొషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును.” దేవుని త్రాసు స్వాభిమానం లేక పక్షపాతంవైపు మొగ్గివుండదు. (సామెతలు 16:2; అపొ.కార్యములు 10:34, 35) ఆయన మన ఆత్మను తూచి, తలంపు, క్రియ, మాటలను పురికొల్పే భావోద్రేక, ప్రేరణలను గమనిస్తాడు. గనుక నిశ్చయంగా, మనం పవిత్రులమని ఇతరులు పనికిమాలినవారును వ్యర్థులునని తప్పుగా తలంచుచున్నట్లు దేవుడు మనలను గమనించకోరుకొనము. యెహోవావలె మనం నిష్పక్షపాతం, కరుణ, ప్రేమగల వారమైవుండాలి.
13. (ఎ) “ప్రేమ దీర్ఘశాంతం, దయ చూపించుననే” వాస్తవం హానికరమగు వ్యర్థమాటలను అణచివేయుటకు ఎట్లు సహాయపడును? (బి) మనకు లేనటువంటి సేవా ఆధిక్యత పొందిన వ్యక్తికి విరుద్ధంగా మాట్లాడకుండ ఏది మనలను ఆపుచేస్తుంది?
13 పౌలు 1 కొరింథీయులు 13:4-8 లో చెప్పినదాన్ని అమలుపెడితే హానికరమగు వ్యర్థమాటలను మనం అణగగొట్టగలం. ఆయనిట్లు వ్రాసాడు: “ప్రేమ దీర్ఘకాలం సహించును. దయచూపించును.” విశ్వాసమందు బేధాభిప్రాయాలున్న కుటుంబములో హింసననుభవించు ఓ సహోదరి మనలను ఆనందంగా పలకరించలేక పోవచ్చును. లేదా కొందరు బహుశ అనారోగ్య కారణంగా అంత హుషారుగా పనులు చేయలేకపోవచ్చును. అట్టివారినిగూర్చి విమర్శనాత్మకమైన వ్యర్థమాటలు పలికే బదులు వారియెడల సహనం, దయచూపునట్లు ప్రేమ మనల్ని ప్రోత్సహించదా? ‘ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు.’ అట్లు, మనకులేని ఒక సేవాధిక్యత ఇతర క్రైస్తవుడు పొందితే, ప్రేమనుబట్టి అతనికి విరుద్ధంగా మాట్లాడుటగాని, ఆ పనికి అతడు తగడు అని సలహా ఇచ్చుటకుగాని చేయుము. మన గొప్పలే చెప్పుకొని తక్కువ ఆధిక్యతగలవారిని నిరాశపరచు డంబమును పలుకకుండ ప్రేమ మనల్ని అడ్డుకుంటుంది.
14. ఇతరులనుగూర్చి మనం చెప్పే దానిపైవుండే ప్రభావమునకు సంబంధించిన ప్రేమనుగూర్చి మరేమిటికూడ ఉన్నది?
14 ‘ప్రేమ అమర్యాదగా ప్రవర్తింపదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు లేక అపకారమును మనస్సులో వుంచుకొనదు’ అనికూడ పౌలు తెల్పాడు. ఇతరులనుగూర్చి క్రైస్తవేతరులవలె అమర్యాదగా మాట్లాడే బదులు, వారినిగూర్చి మంచిగా మాట్లాడి వారి శ్రద్ధాసక్తులను పరిశీలించునట్లు ప్రేమ మనల్ని ప్రేరేపించునట్లు చేయాలి. అది మనం త్వరగా కోపపడకుండ, వాస్తవమైన లేదా ఊహాజనితమైన హానికలుగునట్లు వారికి విరుద్ధముగా మాట్లాడకుండునట్లు చేస్తుంది. ‘ప్రేమ దుర్నీతి విషయంగాక సత్యంనందు సంతోషిస్తుంది’ గనుక అన్యాయాన్ని అనుభవించే విరోధులనుగూర్చి సహితం హానికరమగు వ్యర్థమాటలు మాట్లాడకుండ చేస్తుంది.
15. (ఎ) ‘ప్రేమ అన్నిటిని నమ్మును, నిరీక్షించుననే’ సత్యము మనకెట్టి ప్రభావం కలిగివున్నది? (బి) ఇతరులు యెహోవా సంస్థనుగూర్చి వ్యతిరేకంగా మాట్లాడినను మనం దానికి హత్తుకొనివుండుటకు ప్రేమయొక్క ఇతరభాగాలు మనకెట్లు సహాయపడగలవు?
15 ప్రేమ దేవుని వాక్యమందు కనుగొనబడు ‘వాటన్నింటిని నమ్మును’ మరియు అబద్ధికులగు మత భ్రష్టులైన వారి మోసపూరిత మాటలు వినే బదులు మన ‘నమ్మకమైన దాసుని’ తరగతిద్వారా ఏర్పాటుచేయబడిన ఆత్మీయాహారాన్ని ప్రశంసించేటట్లు మనల్ని పురికొల్పుతుంది. (మత్తయి 24:45-47; 1 యోహాను 2:18-21) ‘ప్రేమ అన్నిటిని సహించును, ఎన్నటికిని నిరర్థకం కాదు’ గనుక “అబద్ధ సహోదరులు” లేక ఇతరులు దాన్ని గూర్చిగాని దాని సభ్యులనుగూర్చిగాని మాట్లాడినను దేవుని సంస్థకు నమ్మకముగా వుండుటకుకూడ అది మనకు సహాయపడుతుంది.—గలతీయులు 2:4.
గౌరవం వ్యర్థమాటలను ఆపివేస్తుంది
16. కొరింథులో పౌలును అబద్ధ సహోదరులెట్లు చూశారు?
16 తోటి విశ్వాసులయెడల చూపే గౌరవం హానికరమగు వ్యర్థమాటలు అణచివేసికొనుటకుకూడ సహాయంచేస్తుంది. వారు దేవుని కిష్టులైయున్నారు గనుక వారిని బాధపెట్టకూడదు. పౌలుకు తటస్థించిన “అబద్ధ సహోదరల” వలె మనము ఉండకూడదు. నిస్సందేహముగా వారాయననుగూర్చి చెడ్డగా మాట్లాడారు. (2 కొరింథీయులు 11:26) మతభ్రష్టులు తప్పక ఆయనను బాధపెట్టివుండవచ్చును. (యూదా 3, 4 వచనములు పోల్చుము.) కొరింథులో కొందరు వ్యక్తులు ఇలా అన్నారు: “అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవియునైయున్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిది.” (2 కొరింథీయులు 10:10) ప్రజలు వారు ప్రేమించే వారినిగూర్చి అలా వ్యాఖ్యానించరు.
17. అపొస్తలుడైన యోహానునుగూర్చి దియొత్రెఫే ఎటువంటి మాటలను ఉపయోగించి మాట్లాడెను?
17 దియొత్రెఫే చెడుగా మాట్లాడిన అపొస్తలుడైన యోహాను విషయం పరిశీలించండి. “నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని,” అని యెహాను అన్నాడు. “అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మునుగూర్చి చెడ్డమాటలు వదరుచున్నాడు. అందుచేతనే నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును.” (3 యోహాను 9, 10) అట్టి వదరుబోతు మాటలు చాలా తీవ్రమైన తప్పైయుండెను, మరి మనమీనాడు అట్టివాటిని విని లేక వాటిని వదరుతువుంటే వెంటనే మనం అలా మాట్లాడకుండ మానుకోవాలి.
18. దేమేత్రి దియొత్రెఫేకు ఎట్లు భిన్నమైయున్నాడు మరియు వీరికున్న భేదం మన ప్రవర్తనపై ఎట్టి ప్రభావాన్ని చూపిస్తుంది?
18 నీతిమంతులను గౌరవించాలనే విషయాన్ని చెప్తు యోహాను గాయునకు యిలాచెప్పాడు: “ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలుచేయువాడు దేవుని సంబంధి. కీడుచేయువాడు దేవుని చూచిన వాడుకాడు. దేమేత్రియు అందరివలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేముకూడ అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు.” (3 యోహాను 1, 11, 12) మనలో ప్రతివారును ఇలా ప్రశ్నించుకోవాలి: నేను దియొత్రెఫేవంటి వదరుబోతునా, లేక దేమేత్రివంటి మంచివాడనా? మనం మనతోటి విశ్వాసులను గౌరవిస్తే, ఇతరులు మనల్ని వదరుబోతులని భావించేరీతిగా ఎదుటివారికి విరుద్ధంగా మాట్లాడము.
19. అబద్ధ సహోదరులెట్లు సి. టి. రస్సెల్‌ను అప్రతిష్టపాలు చేయచూశారు?
19 అబద్ధ సహోదరులు మొదటి శతాబ్దములో మాత్రమే వుండలేదు. 1890వ దశాబ్దకాలంలో దేవుని సంస్థతో సహవాసంచేసిన భయభక్తిలేని వ్యక్తులు వాచ్‌టవర్ సొసైటీని తమ స్వాధీనం చేసికోవాలని ప్రయత్నించారు. చార్లెన్ టేజ్ రస్సెల్ మీద కుట్రపన్ని ఆయనను సొసైటి తొలి అధ్యక్య్షునిగా లేకుండ తొలగించాలని ప్రయత్నించారు. దాదాపు రెండు సంవత్సరాలు దాగిన ఈ కుట్ర 1894వ సంవత్సరములో బయటపడింది. రస్సెల్‌గారు వ్యాపారంలో అపనమ్మకస్థుడని ముఖ్యంగా ఆయనచుట్టు తప్పుడు నిందలుమోపారు. సి. టి. రస్సెల్‌ను అప్రతిష్టపాలు చెయ్యాలనే విషయంలో—నేరారోపకుల కొన్ని చిన్నచిన్న నిందలు వారినే మోసపుచ్చినవి. నిష్పక్షపాత క్రైస్తవులు వీటిని పరిశోధించి ఆయన సత్యవంతుడని కనుగొన్నారు. ఆవిధంగా “రస్సెల్‌గారిని ఆయన పనిని ఆకాశమంత ఎత్తుగా దుమ్మెత్తి పోయాలనే” పథకం విఫలమైంది. గనుక పౌలువలె సహోదరుడైన రస్సెల్‌కూడ అబద్ధసహోదరుల దాడికి గురయ్యాడుగాని ఈ శోధన సాతాను కుట్రేనని అర్థమైంది. తదుపరి ఈ కుట్రదారులు క్రైస్తవ సహవాసమునకు అనర్హులని పరిగణించబడిరి.
సత్క్రియలు హానికరమగు వ్యర్థమాటలను త్రుంచివేయును
20. పౌలు కొందరు యవ్వనస్థులైన విధవరాండ్లలో ఏ తప్పిదమును గమనించాడు?
20 హానికరమగు వ్యర్థమాటలు సత్క్రియలవలన గాక తరచూ సోమరితనము వలన వచ్చినవేనని పౌలుకు తెలుసు. “ఇంటింట తిరుగులాడుచు బద్దకు రాండ్రగుటయేగాక ఆడరాని మాటలాడుచు, వదరుబోతులును పరులజోలికి పోవువారగుటకు” యవ్వనస్థులైన కొందరు విధవరాండ్రు నేర్చుకున్నందుకు పౌలు సంతోషించలేదు. దీనికి పరిష్కారమేమైయుండెను? సత్క్రియలలో పాల్గొనుటయే. అందుకే పౌలు ఇలా వ్రాశాడు: “కాబట్టి యవ్వనస్త్రీలు వివాహము చేసికొని, పిల్లలనుకని గృహపరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమియ్యవద్దు.”—1 తిమోతి 5:11-14, బైయింగ్టన్.
21. హానికరమగు వ్యర్థమాటల ఉరిలో పడకుండుటకు 1 కొరింథీయులు 15:58 నందేమి ఆధారమున్నది?
21 స్త్రీలు గృహాన్ని నడిపిస్తు, పిల్లలను దైవభక్తిలోపెంచుతూ, ఇతర యోగ్యమగు పనులయందు నిమగ్నులైవుంటే, హానికరమగు వ్యర్థమాటలు మాట్లాడటానికి వారికి సమయమే దొరకదు. పురుషులుకూడ సత్క్రియలందు నిమగ్నమైతే అట్టి మాటలకు వారికి సమయముండదు. “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులైవుంటే.” మనం హానికరమగు వ్యర్థమాటలు పలికే ఉరిలో పడకుండ అది మనందరికి సహాయపడుతుంది. (1 కొరింథీయులు 15:58) ముఖ్యముగా, క్రైస్తవ పరిచర్యలోను, సంఘకూటముల్లోను, ఇతర దైవక్రియలలో హృదయపూర్వకంగా పాల్గొంటూవుంటే, మనం అనవసరమైన వ్యర్థమాటలు మాట్లాడకుండ, పరులజోలికి పోకుండ ఆత్మీయ విషయాలపై ధ్యానముంచునట్లు చేయును.
22. సామెతలు 6:16-19 దేవుడు అపవాదకులనెట్లు పరిగణిస్తాడని తెల్పుచున్నది?
22 మనం దైవక్రియలలో నిమగ్నమై, ఇతరులను ఆత్మీయంగా ఆశీర్వదించుటకు ప్రయత్నిస్తే మన నిజమైన స్నేహితులమగుదుము కానీ కట్టుకథలల్లే అపనమ్మకస్థులంకాము. (సామెతలు 17:17) మనం నాశనకరమగు వ్యర్థమాటలను మానుకుంటే, మనకు అందరికంటే శ్రేష్ఠమైన స్నేహితున్ని—యెహోవా దేవునిని కలిగియుండగలం. ఆయనకు హేయములైన ఏడు సంగతులను మన జ్ఞాపకం చేసికుందాం, “అవేవనగా అహంకారదృష్టియు కల్లలాడునాలుకయు నిరపరాధులను చంపు చేతులును లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.” (సామెతలు 6:16-19) వ్యర్థమాటలు పలికేవారు ఉన్నవాటినిమార్చి లేనిపోని వాటిని చెప్తారు, మోసగాళ్లకు అబద్ధపు నాలుకలుండును. కథలను వినుటకు పరుగులిడు వారి పాదాలను కదిలించగలశక్తి వీరిమాటల్లవుండును. ఇక నిశ్చయంగా వచ్చే ఫలితం కలహమే. అయితే దేవుడు అసహ్యించుకొనుదానిని మనం అసహ్యించుకుంటే నీతిమంతులను చెడగొట్టి గొప్పమోసగాడైన అపవాదియగు సాతానుకు ఆనందాన్నిచ్చే హనికరమగు వ్యర్థమాటలను మానుకుంటాము.
23. మన మాటలద్వారా మనమెట్లు యెహోవా హృదయాన్ని సంతోషపర్చగలము?
23 కనుక, మనం యెహోవా హృదయాన్ని ఆనందపరచుదాం. (సామెతలు 27:11) ఆయనకు హేయమైన మాటలను మానుకుందాం, మోసపు మాటలను వినకుండ తిరస్కరిద్దాం, హానికరమగు వ్యర్థమాటలను అణగగొట్టుటకు మనం శ్రమీద్దాం. నిశ్చయంగా, మన పరిశుద్ధ దేవుడైన యెహోవా సహాయంవల్ల అలా చేయగలము. (w89 10/15)
[అధస్సూచీలు]
a ఈనాడుకూడ ఉద్రేకపరచు కట్టుకథలనుగూర్చి వినకూడదు వాటిని వ్యాపింపజేయకూడదు. (తరచు ఏ సత్యంమీదకూడ ఆధారంలేని) అనగా నిర్వాహక సభ సభ్యులు లేక వారి ప్రతినిధులు చెప్పేవి లేక చేసే వాటివిషయాలలో.
నీవెట్లు ప్రత్యుత్తరమిత్తువు?
◻ ప్రార్థనెట్లు మనం ఇతరులపై అపవాదు వేయకుండ సహాయపడుతుంది?
◻ 1 కొరింథీయులు 13:4-8 అన్వర్తింపజేస్తే హానికరమగు వ్యర్థమాటలు అణచివేయుటకు సహాయపడును?
◻ తోటి విశ్వాసులనుగూర్చి వ్యర్థమాటలు పలుకు శోధనను ఆపుటకు స్వగౌరవము ఎట్లు తోడ్పడుతుంది?
◻ హానికరమగు వ్యర్థమాటల ఉరిలో పడకుండ ఉండుటకు 1 కొరింథీయులు 15:58 నందేమి ఆధారమున్నది?
[13వ పేజీలోని చిత్రసౌజన్యం]
U.S. Forest Service photo