కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 3/1 పేజీలు 4-7
  • పునరుత్థానము ఎవరికి మరియు ఎప్పుడు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పునరుత్థానము ఎవరికి మరియు ఎప్పుడు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అసలు ప్రజలు ఎందుకు మరణించవలెను?
  • మరణించిన వారు ఏ స్థితిలో ఉన్నారు?
  • భూ సంబంధమైన పునరుత్థానము
  • పునరుత్థానము ఓదార్పునకు మూలము
  • పునరుత్థానము—ఎప్పుడు?
  • చనిపోయిన మీ ప్రియమైనవారి కోసం నిజమైన నిరీక్షణ
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ఏకైక పరిష్కారం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • పునరుత్థానం—చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 3/1 పేజీలు 4-7

పునరుత్థానము ఎవరికి మరియు ఎప్పుడు?

లాజరు తన ఇద్దరు సహోదరీలైన మార్త మరియు మరియలతో జీవించుచున్న బేతనియలో సా.శ. 32లో అది జరిగెను. ఆ సహోదరీలు లాజరుయొక్క అస్వస్థతను గూర్చి యేసుకు వర్తమానము పంపిరి. యేసు లాజరును మరియు అతని సహోదరీలను ప్రేమించెను. కావున ఆయన వెంటనే బేతనియకు బయలుదేరెను. ఆయన ప్రయాణించుచుండగా తన శిష్యులకు ఇట్లు చెప్పెను: “మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అతనిని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” శిష్యులు యేసు అక్షరార్ధమైన నిద్రనుగూర్చి మాట్లాడుచున్నాడనుకొనిరి. కావున యేసు వారితో “లాజరు చనిపోయెను” అని స్పష్టముగా చెప్పెను.—యోహాను 11:1-15.

ఆ దర్శకులు లాజరు చనిపోయిన నాల్గవ దినమునకు చేరుకొనిరి. యేసు మరియ మరియు ఇతరులు ఏడ్చుట చూచి నప్పుడు ఆయన తన లోతైన ప్రేమను మరియు సానుభూతిని ప్రకటించుచు “కన్నీళ్లువిడిచెను.” (యోహాను 11:17, 35) లాజరు మృతదేహమును ఒక గుహలో సమాధిచేసిరి. ఆ సమాధి ద్వారమున ఉన్న రాయిని తీసివేయుడని యేసు చెప్పెను. ఆయన తన తండ్రికి ప్రార్థనచేసిన తరువాత “లాజరూ బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా” లాజరు బయటికి వచ్చెను. అది అతని సహోదరీలకు ఎంతటి సంతోషమును కలుగజేసియుండవచ్చును!—యోహాను 11:38-45.

ఈ సంఘటన పునరుత్థానమునకు నిజమైన నిరీక్షణనిచ్చుచున్నది. అయినప్పటికి సాధారణముగా మరణము, యేసు వెంటనే వారిని పునరుత్థానము చేయు పరిస్థితులులేక, మనకు ప్రియమైన వారిని తీసికొనిపోవు క్రూరమైన శత్రువైయున్నది. మనకు తెలిసిన రీతిగా ఈ ప్రియమైన వారిలో అనేకులు, మంచివారు మరియు దయకలిగినవారైయున్నారు. కావున ఒక సమంజసమైన ప్రశ్న ఉత్పన్నమగును. . .

అసలు ప్రజలు ఎందుకు మరణించవలెను?

మనకు సరియైన, నమ్మదగిన జవాబు కావలెనన్న ఏదెనుతోటలో మానవజాతియొక్క ఆరంభములోనికి వెనుతిరిగి చూడవలెను. ఆదాము విధేయతను పరీక్షిస్తూ దేవుడు ఆ తోటలో ఒక్క వృక్షఫలమును తినరాదని ఆజ్ఞాపించెను. ఒకవేళ ఆయన లేక హవ్వ ఆ ఫలమును తిన్నట్లయితే వారు నిశ్చయముగా చచ్చెదరని దేవుడు చెప్పెను. (ఆదికాండము 2:17) కాని, సాతాను ద్వారా శోధించబడినప్పుడు, వారు దేవునికి అవిధేయులై ఆ కీలకమైన పరీక్షలో ఓడిపోయిరి. మరణము సంభవించెను.

సూక్ష్మముగా కనిపించు ఆ అపరాధమునకు అంతటి శిక్ష ఎందుకు? వారి క్రియ చిన్నదయినప్పటికి వారి అపరాధము మరణకరమవునంత గంభీరమైనది. పరిపూర్ణ ప్రజలైన ఆదాము మరియు హవ్వ తమ సృష్టికర్త యెడల తిరుగుబాటును చూపిరి. వారు తమ పరిపూర్ణతను కోల్పోయిరి. మరియు దేవుడు వారిపై మరణ శిక్షను విధించెను. అయినను ఆ న్యాయమైన తీర్పు ఆదాము సంతతి వారిపైనుండి తీసివేయుటకు దేవుడు ఏర్పాటుచేసెను. ఎట్లు? అపొస్తలుడైన పౌలు వ్రాసిన రీతిగా “క్రీస్తుయేసు . . .అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతాను సమర్పించుకొనెను.”—1 తిమోతి 2:5, 6; రోమీయులు 5:17.

మరణించిన వారు ఏ స్థితిలో ఉన్నారు?

లాజరు నాలుగు రోజులు మరణించియుండెను. ఒకవేళ నీవు చనిపోయి ఆత్మీయ జగత్తులో నాలుగు రోజులు నిజంగా జీవించియుండి, తరువాత పునరుత్థానము పొందిన యెడల నీవు దానిని గూర్చి ఇతరులకు చెప్పవలెనని ఇష్టపడవా? అయితే లాజరు వేరొక జగత్తులో జీవించియుండుటను గూర్చి ఏమియు చెప్పియుండలేదు. బైబిలు చెప్పునదేమనగా: “చచ్చినవారు ఏమియు ఎరుగరు.”—ప్రసంగి 9:5; కీర్తన 146:3, 4.

దాని భావము ఆలోచించుము. లక్షలాది వ్యక్తులు పర్గేటరీ అను పదము బైబిలులో కనిపించక పోయినను దానిని నమ్ముదురు. ఇంకా ఎక్కువమంది మండుచున్న నరకము కలదని నమ్ముదురు. అయితే నీ శత్రువును కూడా నీవు నిరంతరం మంటలో కాల్చవు. నీవు అటువంటి క్రూర క్రియను చేయుటకు నిరాకరించినట్లయితే మన ప్రేమగల సృష్టికర్త వ్యక్తులను నరకాగ్నిలో బాధించుట ద్వారా అట్లు చేయునా? అయితే దయచేసి పైన చూపిన బైబిలుయొక్క ఓదార్పుకరమైన హామీని గూర్చి మరలా ఆలోచించుము.—మరణించినవారు “ఏమియు ఎరుగరు.”

లేఖనముల ప్రకారము క్రీస్తుతో పరలోకములో పరిపాలించు వారి సంఖ్య దానిమట్టుకు చిన్నది. యేసు వారిని “చిన్నమందా” అని వర్ణించెను. (లూకా 12:32) అపొస్తలుడైన యోహాను చూచినదేమనగా “ఆ గొఱ్రె పిల్ల (యేసు క్రీస్తు) సీయోను (పరలోక) పర్వతము మీద నిలువ బడియుండెను. . .భూలోకమునుండి కొనబడిన నూట నలువది నాలుగువేల మంది ఆయనతో కూడా ఉండిరి.” (ప్రకటన 14:1-3) దీని అర్థమేమనగా, అటువంటి వ్యక్తులు మనుష్యులైయుండి, మరణించి, తరువాత క్రీస్తుతో పరలోకములో జీవించుటకు పునరుత్థానము చేయబడిరి.

మీరు ఊహించగలిగిన రీతిగా పర్గేటరీగాని, మండు నరకముగాని లేవని, మరియు చనిపోయినవారు పరలోకమునకు పునరుత్థానము పొందగలరన్న నిరీక్షణ కలదు అను బైబిలు సత్యములను అర్థము చేసికొనుటవలన ప్రజలు లాభము పొందిరి. అయినప్పటికి పరలోకమునకు పునరుత్థానము పొందువారు కొందరు మాత్రమే అయినప్పుడు, మరి ఇతరులకు ఏ నిరీక్షణ కలదు?

భూ సంబంధమైన పునరుత్థానము

పరలోకములో జీవించుటకై పునరుత్థానము పొందు మార్గమును యేసు తెరచెను లేక ప్రారంభించెను. (హెబ్రీయులు 9:24; 10:19, 20) అందుచేత బాప్తిస్మమిచ్చు యోహాను పరలోక పునరుత్థానములో భాగము వహించడు. ఎందుకంటే యేసు చనిపోయి పరలోక జీవితమునకు మార్గము తెరవక ముందే యోహాను హత్య చేయబడ్డాడు. యేసు ఇట్లు చెప్పెను: “స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతనికంటె గొప్పవాడు.” (మత్తయి 11:11) నమ్మకస్థుడైన ఈ మనుష్యునికి మరియు అతనివలె ఉండి మరణించిన వారికి దేవుడు ఎట్టి బహుమానమును ఏర్పాటు చేసెను?

మీ బైబిలును లూకా 23నకు త్రిప్పి 39 నుండి 43 వరకు గల వచనములను చదువుము. యేసు ప్రక్కన వ్రేలాడదీయబడిన నేరస్థులలో ఒకడు: “యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.” అందుకు యేసు అతడు పరదైసులో ఉండునని హామీ ఇచ్చెను. అది పరలోకము కాదుగాని, మొదటి పరదైసులాగానే భూసంబంధమైన పరదైసై యున్నది.

పునరుత్థానము ఓదార్పునకు మూలము

ఆ నమ్మదగిన బైబిలు ఉత్తరాపేక్ష మనము ఆశించునట్లే ఓదార్పుకరంగా ఉండగలదు. ఎందుకు? ఎందుకనగా దేవుడు ప్రేమాస్వరూపి. (1 యోహాను 4:8) ఆయన తన కుమారున్ని సిగ్గుకరమైన మరణమును పొందుటకు అనుమతించినపుడు దేవుడు వాస్తవముగా ఈ అపురూప గుణమైన ప్రేమను ప్రదర్శించుచున్నాడు. కొద్దిసమయము ముందు యేసు ఇట్లు చెప్పెను: “దేవుడు లోకమును (మానవజాతిని) ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”—యోహాను 3:16.

యేసు కూడా విశ్వసించు మానవజాతి కొరకు తన ప్రాణమును విమోచనగా అర్పించుటలో అసాధారణమైన ప్రేమను చూపెను. ఆయన స్వయంగా ఇట్లు చెప్పెను: “మనుష్యకుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదుగాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను.”—మత్తయి 20:28.

మొదటి వ్యాసములో చెప్పబడిన కారోలాన్‌ తాను ప్రేమించిన వారిని ఘోరమైన ప్రమాదములో కోల్పోయినప్పుడు ఆమె ప్రాణము చల్లబడింది. అయితే మరణించిన ఆ ప్రియమైన వారు బాధపడుటలేదని తెలిసికొని ఓదార్పుపొందింది. తాళుకొనుటకు ఆమెకు ఇంకా ఏమి సహాయముచేసెను? తన ఆత్మీయ సహోదరులైన యెహోవాసాక్షులు వ్యక్తపరిచిన ప్రేమ మరియు నిశ్చలమైన సానుభూతి ఎంతో సహాయము చేసెను.—కీర్తన 34:18.

యెహోవాకు ప్రార్థన కూడా ఆమెకు ఎంతో సహాయము చేసెను. ఎన్నోరాత్రులు ఆమె మేలుకొని అది అంతా ఒక పీడ కల అనుకొనేది. కాని వాస్తవము కొట్టెచ్చినట్లు గుర్తుకు వచ్చేది. యెహోవాకు చేసిన విజ్ఞాపన ఆమెకు సమాధానము ఇచ్చెను. తరువాత ఆమె పౌలు వ్రాసిన దానిని ఇంకా ఎక్కువగా గుణగ్రహించెను. “దేనిని గూర్చియు చింతించకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.—ఫిలిప్పీయులు 4:6, 7.

పునరుత్థాన నిరీక్షణ ఎలా ఓదార్పునివ్వగలదో షర్లీ మరొక ఉదాహరణమైయున్నది. బాలప్రాయంలో ఉన్న ఆమె కుమారుడు రిక్కార్డొ ఛాతిపై ఒక బరువుగల కాంక్రీటు ముక్క పడగా ఆ చిన్నారి గుండె నలిగి అక్కడికక్కడే చనిపోయాడు. 1986 జనవరిలో జరిగిన ఈ విశాద సంఘటన తరువాత షర్లీ తన స్నేహితులతో ఇట్లనెను: “అది ఒక పీడకలవలె ఉండెను.” ఆమె కాథోలిక్‌ చర్చీలో ఈ మాటలు వినెను. “దేవుడు జీవించువారికిని మరియు మరణించిన వారికిని తీర్పుతీర్చును.” “దేవుడు జీవించువారికిని మరియు మరణించినవారికిని తీర్పుచేస్తే ప్రజలు మరణించిన తరువాత ఎక్కడకెళ్తారో ఒకరికెలా తెలుస్తుంది? వారు పరలోకంలో ఉంటే వారిని తీర్పుకొరకు పునరుత్థానము చేయు అవసరమేముంది? అంతేకాకుండా వారు పరలోకంలో జీవించి ఉంటే వారిని ఎలా పునరుత్థానము చేయగలరు?’ అని షర్లీ ఆలోచించడం మొదలు పెట్టింది. బైబిలులో ఎక్కడా జీవించువారి పునరుత్థానము గూర్చి చెప్పబడలేదు. అది మరణించిన వారికే వర్తిస్తుంది.

షర్లీ బైబిలుతో పరిచయం ఉన్న తన భర్తను ఈ సమస్యను గూర్చి అడిగింది. ఒక్కసారి బైబిలు ఈ విషయం గూర్చి ఏమి చెపుతుందో తెలిసికొన్న తరువాత షర్లీ తిరిగి చర్చీకి వెళ్లలేదు. యెహోవాసాక్షి అయిన ఒక బంధువు షర్లీ మరియు ఆమె భర్తతో బైబిలు పఠనాన్ని మార్చి 1986లో ఆరంభించారు. మరికొద్ది సమయంలోనే వారిరువురు బాప్తిస్మము పొందారు. ఆమె ఇప్పుడు ఇట్టి ముగింపునకొచ్చియున్నది: “సత్యమును తెలిసికొనుట, పునరుత్థానమును గూర్చి మరియు యెహోవా ఎంతటి అద్భుతమైన వ్యక్తియో తెలుసుకొనుట ఎంతటి ఆశ్చర్యకరమైన విషయము.”

పునరుత్థానము—ఎప్పుడు?

ఒక దృశ్యములో అపొస్తలుడైన యోహానుకు “ప్రతి జనములోనుండి, ప్రతి వంశములోనుండి, ప్రజలలోనుండి ఎవడును లెక్కింపజాలని యొక గొప్పజనసమూహము కనబడెను.” (ప్రకటన 7:9) ఆ గొప్ప సమూహము సింహాసనము ఎదుట నిలిచియుండుట సమంజసమే. ఎందుకంటే వారు ఈ భూమిపై జీవించనైయున్నారు. (యెషయా 66:1) వారిలో కొందరు ఇప్పుడు మరణించినట్లయితే, వారెప్పుడు పునరుత్థానము చేయబడుదురు? బైబిలు ఒక తేదీని తెలుపుట లేదుగాని దేవుని నీతియుక్త ప్రమాణముల ప్రకారము జీవించుటకు అయిష్టపడు వారిని తీసివేయుటకు త్వరలో రానైయున్న యుద్ధము తరువాత అది జరుగును. (2 థెస్సలొనీకయులు 1:6-9) అది తీర్పుదినమునకు మరియు భూసంబంధమైన పునరుత్థానమునకు అర్హులని దేవుడు ఎంచిన వారియొక్క పునరుత్థానమునకు దారితీయును. (యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15) బైబిలు ప్రవచనముయొక్క నెరవేర్పు రుజువుపరచున దేమనగా ఈ ఆసక్తికరమైన మరియు పులకరింపజేయు సంఘటనలు అతి త్వరలో జరగనైయున్నవి.—ప్రకటన 16:14-16.

యేసు శిష్యులు ఆయనను ఒక పర్యాయము ఇట్లు అడిగిరి: “నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” దానికి ప్రత్యుత్తరముగా యేసు యుద్ధములు, కరవులు, భూకంపములు, తెగుళ్లు మరియు ఈ రాజ్యసువార్త భూవ్యాప్తముగా ప్రకటించుటను గూర్చి చెప్పెను.—మత్తయి 24:3-14; లూకా 21:7-11.

ఈ గుర్తింపదగిన ప్రవచనము మొదటి ప్రపంచ యుద్ధము మొదలైన 1914వ సంవత్సరమునుండి నెరవేరుతూ ఉన్నది. అది లక్షలాది ప్రజలను చంపి ఎన్నోదేశాలలో కరవు మరియు ఆహారకొరతలకు కారణమైంది. రెండవ ప్రపంచ యుద్ధము జరుగు సమయములో మరియు దాని తరువాత లోక పరిస్థితి మరీ అధ్వానముగా తయారయింది.

తెగుళ్ల విషయంలో అనేకులు భావించిన రీతిగా ఎయిడ్స్‌ ఒక తీవ్ర ఉదాహరణ. ఈ తెగులు ఎంత విస్తరించిందంటే మరియు ఎంత నాశనకారి అంటే నిపుణులు 14వ శతాబ్ధములో ఐరోపాలోని జనాభాయొక్క నాల్గవ భాగాన్ని చంపిన బ్లాక్‌డెత్‌తో పోల్చారు.—రీడర్స్‌ డైజెస్ట్‌ జూన్‌ 1987.

ఈ ప్రస్తుత భీకర పరిస్థితులతో పోల్చితే పునరుత్థానము ఎంతటి అద్భుత సంఘటనయైయుండును! మరణము ద్వారా విచ్ఛిన్నమైన కారోలాన్‌ మరియు షర్లీ వంటి కుటుంబాలు ఐక్యపరచబడు సమయము ఏదియు అణచివేయలేనట్టి సంతోషకరమైన సమయమైయుండును. స్పష్టముగా మనలో ప్రతి ఒక్కరికి బుద్ధివంతమైన మార్గమేమనగా మన జీవితములను దేవుని చిత్తానుసారముగా అమర్చి పునరుత్థానము జరుగునప్పుడు అక్కడ ఉండుటకు అర్హత పొందుటయే. (w89 10/15)

[7వ పేజీలోని చిత్రం]

వృక్షము నరకబడిన యెడల అది మరలా చిగుర్చునట్లు, దేవుడు తన జ్ఞాపకములోనున్నవారిని మృతులలోనుండి లేపగలడని బైబిలు చెప్పుచున్నది.—యోబు 14:7-9, 14, 15.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి