కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 3/1 పేజీలు 3-4
  • మరణించిన వారికి ఏ నిరీక్షణ కలదు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మరణించిన వారికి ఏ నిరీక్షణ కలదు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘మరణించిన వారు జీవించియున్నారా?’
  • మరణించినవారు తిరిగి జీవించెదరా?
  • మరణానంతర జీవితం—బైబిలేమి చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • పునరుత్థానంలో మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఆత్మ అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 3/1 పేజీలు 3-4

మరణించిన వారికి ఏ నిరీక్షణ కలదు?

దక్షిణ ఆఫ్రికాలోని తూర్పు తీరమున ఒక యవ్వన కుటుంబము సెలవున ప్రయాణించుచుండిరి. భార్యయొక్క తల్లిదండ్రులు వారికి ముందుగా వేరొక కారులో ప్రయాణించుచుండిరి. అకస్మాత్తుగా ఒక టైరు ప్రేలింది. రోడ్డు ప్రక్కన దానిని మార్చుటకు వారు ప్రయత్నించుచుండగా వేరొక డ్రైవరు ఈ రెండు కారులలోనికి దూసుకొని వచ్చి ఢీకొన్నాడు. ఆ వృద్ధవ్యక్తి మరియు అతని భార్య అక్కడే చనిపోయారు. ఆ యవ్వనుడు కొన్నిరోజుల తరువాత చనిపోయాడు. అతని భార్య ప్రక్కటెముకలు విరిగి మరి యితర గాయములతో బాధపడింది. ఆమె పాపకు పక్షవాతము కలిగించు తీవ్రమైన మెదడు దెబ్బ తగిలినది.

ఆ దురదృష్ట కుటుంబమునకు అది ఎంత విశాద సంఘటన! ఆ యవ్వన భార్యయొక్క సహోదరి కారోలాన్‌ ఆ వార్త వినినప్పుడు ఆమె ప్రాణము చల్లబడింది. ఇటువంటి విశాద సంఘటనలు అన్నిదేశాలలోను జరుగుతాయి. దుఃఖభరితులైన బంధువులు మరియు స్నేహితులు తరచుగా ఇలా ఆలోచింతురు, ‘మరణించినవారు నిజంగా మరణించారా,’ లేక. . .

‘మరణించిన వారు జీవించియున్నారా?’

ఇంచుమించు అన్ని మతములు ఆత్మ అమర్త్యమని బోధించును. కావున వాటిని అనుసరించువారు మరణించినవారు నిజముగా మరణించలేదు గాని పరలోకములో లేక పర్గేటరీలో లేక నరకములో సజీవముగా ఉన్నారని నమ్ముదురు. అనేక చర్చీలలో బోధించబడు ప్రకారము నరకములో ఉన్నవారు నిరంతరము ఘోరమైన బాధను అనుభవింతురు. అయితే ఒక ప్రేమగల దేవుడు నిజముగా తాను సృష్టించిన వారిపై అటువంటి బాధను విధించగలడా?—1 యోహాను 4:8.

అది అలా కనిపించుటలేదు. అయితే మనమెట్లు నిశ్చయతను కలిగియుండగలము? క్రింద చూపిన బైబిలు రుజువును జాగ్రత్తగా పరిశీలించుము. “దేవుడైన యెహోవా నేల మంటినుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.” (ఆదికాండము 2:7) దైవావేశము వలన కలిగిన ఈ లేఖనము ఆ మొదటి నరుడైన ఆదాముకు ఒక ఆత్మ ఇవ్వబడెనని చెప్పుచున్నదా? లేదు, అతడు ఆత్మ ఆయెను. ఒక జీవించు వ్యక్తి ఆయెను. ఇది అపొస్తలుడైన పౌలు ద్వారా నిర్ధారణ చేయబడినది. ఆయన ఇట్లు వ్రాసెను: “లేఖనము చెప్పుప్రకారము ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ఆత్మయాయెను.” పౌలు దానిని ఆదికాండము నుండి ఎత్తివ్రాసెను.—1 కొరింథీయులు 15:45, యెరూషలేము బైబిలు.

మనుష్యుని ఆత్మ మరణించగలదా? ప్రవక్తయైన యెహెజ్కేలు ఇలా వ్రాసెను: “ఆత్మలన్నియు నావశములో ఉన్నవి. తండ్రి ఆత్మయేగాని, కుమారుని ఆత్మయేగాని నావశములో ఉన్నవి. పాపముచేయు ఆత్మ ఏదో ఆ ఆత్మయే మరణించును.” (యెహెజ్కేలు 18:4, 20 NW; ప్రసంగి 9:5,10) స్పష్టముగా ఆత్మ మరణించినట్లయితే ఆవ్యక్తి ఏమియు ఎరుగడు, కావున అది బాధింపబడనేరదు. సా.శ. 33 పెంతెకొస్తు తరువాత ఇచ్చిన తన మొదటి బహిరంగ ప్రసంగములో అపొస్తలుడైన పేతురు ఇట్లు ప్రకటించెను: “ఆ ప్రవక్త (యేసు) మాట వినని ఆత్మ ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగును.” కావున ఆత్మ మర్త్యము.—అపొస్తలుల కార్యములు 3:23 NW.

మరణించినవారు తిరిగి జీవించెదరా?

బైబిలు సత్యమని నమ్మువారందరికి యేసు చనిపోయి మూడవ దినమున పునరుత్థానము చేయబడెనని తెలియును. (అపొస్తలుల కార్యములు 10:39, 40) అది ఎలా సాధ్యమాయెను? దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా.

యేసు యొక్క పునరుత్థానము ఒక అసాధారణ సంఘటనయై ఉన్నదా? కాదు. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన విధంగా: “ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను,. . .క్రీస్తునందు అందరు బ్రతికింపబడుదురు.” (1 కొరింథీయులు 15:20-22) అట్లయిన అనేకులు మృతులలోనుండి లేపబడుదురు. యేసు కూడా ఇట్లు చెప్పెను: “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒకకాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవపునరుత్థానమునకు . . .బయటికి వచ్చెదరు.” (యోహాను 5:28, 29) ఇది లక్షలకొలది వ్యక్తులు పునరుత్థానము పొందుదురన్న అభయము నిచ్చుచున్నది.

పైన వివరించబడినది పునరుత్థానమునందు మీ ఆసక్తిని రేకెత్తించిన యెడల మీరిట్లు అడుగవచ్చును, ‘పునరుత్థానము ఎవరు పొందగలరు, మరియు ఎప్పుడు?’ ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నలను ఇప్పుడు గమనించెదము. (w89 10/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి