పునరుద్ధరింపబడిన పరదైసు దేవుని మహిమపరచును
నేను నా పాదస్థలమును మహిమపరచెదను—యెషయా 60:13.
1, 2. (ఎ) తన ప్రవక్తయైన యెషయా ద్వారా, దేవుడు ముందుగనే ఏమి చెప్పెను? (బి) వెయ్యి సంవత్సరములు భవిష్యత్తులోనికి గాంచుటద్వారా మనమేమి చూతుము?
యెహోవా, తన అలంకారార్థమైన పాదపీఠముగా భూమిని సృజించెను. తన ‘పాదపీఠమును మహిమపరతునని’ దేవుడు తన ప్రవక్తయైన యెషయా ద్వారా తెలియజేసెను. (యెషయా 60:13) శక్తివంతమైన దుర్భిణితో చూసినట్లుగా, ప్రేరేపిత బైబిలు సహాయముతో మనము మానవభవిష్యత్తులోని వెయ్యి సంవత్సరములను చూడవచ్చును. ఆనందపారవశ్యముతో నిండిన దృష్టి మనలను ఎంతగా పలకరించును! భూమియంతయు, విశ్వమంతటిలో మహాగొప్ప తోటమాలియైనవాని ద్వారా కలుగజేయబడిన స్వచ్ఛమైన అందముతో ఉప్పొంగును. మానవజాతికొరకు భూమిమీద పరదైసు పునరుద్ధరింపబడినదై యుండును!
2 అవును, పరదైసు తోటలో మానవ ఉనికిని ప్రారంభించిన సర్వోన్నతుడైన దేవునికి మానవుని కొరకైన మహానందము మనస్సునందున్నది. “దేవుడు ప్రేమాస్వరూపి”యని చెప్పుట అసంబద్ధమని ఏమాత్రము చెప్పజాలని, ఆ ప్రేమగల సృష్టికర్తను మానవజాతి కలిగియుండుట నిజముగా ఎంతటి విషయము! (1 యోహాను 4:8, 16) పునరుద్ధరింపబడిన పరదైసులో, పూర్ణసిద్ధికి ఎదిగిన స్త్రీ పురుషులు దోషరహిత మానవపరిపూర్ణతయందు ప్రేమగల సహోదర సహోదరీలవలె కలిసి నివసింతురు. (యెషయా 9:6) ప్రేమచే కదిలింపబడినవారై, వారు భూమ్యాకాశములకు మహిమాన్విత సృష్టికర్తయైన, యెహోవా దేవునికి సంపూర్ణముగా విధేయులై యుందురు.
3, 4. (ఎ) ఏ విధముగా భూమ్యాకాశములు పరస్పరము పొందికగలవైయుండును? (బి) భూమిమీద పరదైసు పునరుద్ధరింపబడినప్పుడు దేవదూతలెట్లు ప్రత్యుత్తరమిత్తురు?
3 గతములో వేలాది సంవత్సరముల క్రితము, తన రాజ్యముయొక్క దైవప్రేరణా వివరణయందు, దేవుడు తన ఎంపిక ప్రజలకు ముద్రవేయు ఈ మాటలను చెప్పెను: “ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము.” (యెషయా 66:1) పరదైసు భూమియగు, ఆయన “పాదపీఠము”యొక్క అద్దమువంటి మహిమ, సరియైన రీతిలో సర్వోన్నత స్థలములలోని ఆయన సింహాసనముయొక్క మహిమకు సరిసమానమై యుండును.
4 భూమి సృష్టింపబడిన సమయమున, పరలోక రాజ్యమందు దేవుని సింహాసముయొద్ద పనిచేయుచున్న వారు క్రింద భూమిమీద దృశ్యమును గాంచిరి. వారి కన్నులు దాని మహిమాయుక్త తేజమును చూసినప్పుడు, వారు ఎంతగా పారవశ్యము పొందియుండవచ్చును! వెంటనే ఏక కాలమందు స్తుతిగీతికలు పాడకుండా వారెట్లుండగలరు? (పోల్చుము జెఫన్యా 3:17, రివైజ్డ్ డర్డ్ వర్షన్; కీర్తన 100:2, ది జెరూసలేమ్ బైబిల్.) ప్రీతికరుడును శ్రీమంతుడును అయిన సృష్టికర్త, పరలోక దృశ్యమును ఖచ్ఛితముగా వర్ణించుటకు భూమి మీదగల తన శాస్త్రిని ప్రేరేపించి అతనితో ఇట్లనెను: “ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడిరి, మరియు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసిరి.” (యోబు 38:7) పరదైసు పునరుద్ధరింపబడినప్పుడు దేవుని మహిమ కొరకు, దేవుని కుమారులనబడు ఈ దూతలందరు మరి ఎంతగా జయజయ ధ్వనులు చేయుదురు!
5. భూమి విషయమై దేవుని ఆది ఉద్దేశ్యము సిద్ధించుటను గూర్చి మనమెట్లు భావించవలెను?
5 ప్రారంభమునుండి దివ్యమైన పరదైసును సిద్ధింపజేయవలెనని యెహోవా దేవుడు గురిగా కలిగియున్న ఉద్దేశ్యమును ప్రేరేపిత హెబ్రీలేఖనములు మరలా అభయమిచ్చుట నిజముగా మనకు ఎంతో హృదయానందకరము. తన సర్వోతృష్టతను తప్పిపోకుండా మహిమపరచుకొనుచున్న దేవుడు, భూమి విషయమై ఆనందభరితమైన, స్తుతిపాత్రమైన దేవుని సంకల్పమును చివరకు నెరవేర్చునని ఎదురుచూచుట సరియైయున్నది. సమస్త స్తుతియు ఆయనకు చెందును!—కీర్తన 150:1, 2; యెషయా 45:18; ప్రకటన 21:3-5.
పరదైసును పునరుద్ధరించుటలో పునరుత్థానమైనవారు సహాయపడుదురు
6. హార్‌మెగెద్దోను తర్వాత, భూమిమీద ప్రజలు ఎట్లు నింపబడుదురు?
6 హార్‌మెగెద్దోనును తప్పించుకొనువారు సారూప్యముగా కొద్దిమందియే అయినను, పూర్తిగా వారు కను పిల్లలతోనే ఈ భూమి నింపబడదు. సమాధులలో వున్నవారిని, క్రీస్తు విమోచనా బలి ప్రయోజనముల క్రిందికి వచ్చువారిని జీవమునకు పునరుద్ధరించుటద్వారా కూడా యెహోవా ‘తన పాదపీఠమును మహిమపరచును.’ మన భూగ్రహమును బహు ఉన్నతమైన పరదైసుగా మార్చు సంతోషభరితమైన పనియందు వీరును భాగమువహించు ఆధిక్యతను కలిగియుందురు.—అ.కార్యములు 24:15.
7. యేసు ఏ మాటలను హార్‌మెగెద్దోను నుండి రక్షింపబడినవారు మనస్సునందుంచుకొందురు?
7 “దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని. . .బయటికి వచ్చెదరు” అని ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన ఉత్తేజభరితమైన మాటలను హార్‌మెగెద్దోనును తప్పించుకొనువారు ఎల్లప్పుడు మదినందుంచుకొందురు. (యోహాను 5:28, 29) బేతనియలో శవమైయుండిన లాజరుతో, “లాజరూ, బయటకు రమ్ము” అని పిలిచిన మాటలవంటి మాటలను దేవుని కుమారుడు పలుకుటను సమాధులలోవున్న మానవ మృతులును విను ఆకాలము ఏమి కాలమైయుండును!—యోహాను 11:43.
8, 9. నూతన పరచబడిన భూమిమీదకు బహుశ మొదట ఎవరు పునరుత్థానము చేయబడుదురు, మరియు వారు హార్‌మెగెద్దోను నుండి రక్షింపబడిన వారికి ఎలాంటి సంతోషమును తెచ్చెదరు?
8 యేసు క్రీస్తు ఆజ్ఞకు ప్రత్యుత్తరముగా ఆయన వెయ్యేండ్ల పాలనలో నూతనపరచబడిన భూమిమీదికి ఎవరు బహుశ మొదట పునరుత్థానము చేయబడుదురు? వారు కారణయుక్తముగా ఈ యుగాంతమునకు ముందున్న అంత్యదినములలో చనిపోయిన “వేరె గొర్రెలలోని” వారైయుందురు. వారు మొదట పునరుత్థానులగుదురు. (యోహాను 10:16) వారికి బహుశ నూతనవిధానముతో సర్దుకొనిపోవుటకు చాలా సులభముగా యుండును.—పోల్చుము మత్తయి 25:34; యోహాను 6:53, 54.
9 “మహాశ్రమల” తరమునకు ముందున్న “వేరెగొర్రెలలోని” మృతులు పునరుత్థానమగుటను చూచుట హార్‌మెగెద్దోనునుండి తప్పించుకొనినవారికి ఎంత సంతోషకరముగా యుండును! (మత్తయి 24:21) గుర్తించు స్పష్టమైన శక్తితో హార్‌మెగెద్దోనునుండి తప్పించుకొనువారు వారిని ఆహ్వానించి, వారితో కలిసి సర్వోన్నతుడైన దేవునికి తాముచేయు ఐక్యసేవను మరలా నూతన పరచుకొనుటయందు కొనసాగుదురు!
10. హార్‌మెగెద్దోనును తప్పించుకొనుట ద్వారా, మీరు దేనిని కళ్ళారా చూడగలరు?
10 హార్‌మెగెద్దోనును తప్పించుకొనువారిలో ఒకనిగా నీవు భూమిమీద మీ స్వంత బంధువులలో మొదటివ్యక్తి పునరుత్థానమగుటను చూడవచ్చును. ప్రభువైన యేసు 12 సంవత్సరముల బాలికను బ్రతికించగా, ఆమె లేచి తమ చేతుల వ్రాలినప్పుడు ఆ తల్లిదండ్రులకు కల్గిన భావోద్రేకప్రభావమును మించి నీవును ఎట్లు ప్రభావితుడవు కాగలవు? “వెంటనే వారు బహుగా విస్మయమొందిరి.” (మార్కు 5:42) హేడిస్ మరియు సముద్రమునుండి మృతులు పునరుత్థానమైనప్పుడు, నిజముగా నీవు చెప్పలేనంత ఆనందమును అనుభవించెదవు. (ప్రకటన 20:13) ఒహ్, త్వరలోనే రానైయున్న ఆ రేపు, ఎంత దివ్యమైన రేపు!
భూమియంతట. . .అధికారులు
11, 12. (ఎ) కీర్తన 45:16 దేనిని నెక్కిచెప్పుచున్నది? (బి) ఎవరినుండి రాజైన యేసుక్రీస్తు “భూమిమీద అధికారులను” నియమించును?
11 ఎవరికొరకు తన పరిపూర్ణ మానవ జీవమును విమోచనా బలిగా అర్పించెనో ఆ మానవులలో మృతులైన వారిని పునరుత్థానులను చేయుటకు తన అధికారమును ఉపయోగించుట ద్వారా, యేసు కీర్తన 45:16లోని ప్రవచనమును నెరవేర్చును. ఈ కీర్తన ప్రవచనార్థకముగా యేసు క్రీస్తును నియమింపబడిన రాజుగా సంబోధించుచున్నది: “నీ [భూమిమీది] పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు, భూమియందంతట నీవు వారిని అధికారులనుగా నియమించెదవు.” ఈ భూమిమీదనున్న పిల్లలకు యేసు క్రీస్తు పరలోక తండ్రియగునని అలాగే ఆయన వారిలోనుండి కొంతమంది కుమారులను “భూమియంతట. . .అధికారులుగా” నియమించునని ఈ కీర్తన నెక్కితెల్పుచున్నది. “దావీదు కుమారునిగా,” యూదురాలైన కన్య మరియ ప్రధమ పుత్రునిగా యేసు మొదటి తండ్రియగు ఆదాము వరకు భూమిమీద మానవ పితరులను కలిగియుండెను.—లూకా 3:23-38.
12 పునరుత్థానులను గావించిన తరువాత గతములో యేసు సహజ పితరులుగాయున్నవారు ఆయన కుమారులగుదురని కీర్తన 45:16 చెప్పుచున్నదా? అవును. తాను వారి వంశమునుండి వచ్చితినను విషయమునుబట్టి వారియెడల ప్రత్యేక రాజరిక శ్రద్ధను చూపించి కేవలము వారిని మాత్రమే పరదైసు స్థితిలోయున్న “భూమియందంతట. . .అధికారులుగా” నియమించునని కూడా కీర్తన 45:16 చెప్పుచున్నదా? లేదు. ప్రవచనము ఆవిధముగా నెరవేరినట్లయిన, భూమియందంతట కేవలము పరిమితసంఖ్యలోనే “అధికారులు” ఉందురు. అదియేగాక, ఆయన పితరులందరు భూమిమీది వెయ్యేండ్ల పాలనలో ప్రత్యేకముగా ప్రాముఖ్యతనివ్వబడుటకు అంత అర్హులుగా లేరు. “అధికారులుగా” నియమించుటకు రాజైన యేసు క్రీస్తు భూమిమీది పితరులకంటే ఎక్కువ సంఖ్యను కలిగియుండును. కాగా వారిలో అర్హులుగాయున్న క్రైస్తవ-యుగమునకు ముందున్న విశ్వాసులతో సహా, హార్‌మెగెద్దోనునుండి తప్పించుకొనిన వారు, అలాగే పునరుత్థానులైన “వేరెగొర్రెల” వారు, చేరియుందురు. వీరందరిలోనుండి రాజ్యకార్యమును నిర్వహించుటకు అర్హులైనవారిని ఆయన తన భూప్రతినిధులుగా నియమించగలడు.
13, 14. హార్‌మెగెద్దోను నుండి రక్షింపబడినవారు పునరుత్థానులైన ఎవరిని కళ్ళారాచూచు ఆధిక్యతను కలిగియుందురు?
13 మెస్సీయా రాజ్యము క్రింద పునరుత్థానము వరుసలో వచ్చువారిని గూర్చి తలంచుము. ఇదిగో! మన కన్నులను మనము నమ్మగలమా? అదిగో, మొదటి హతసాక్షియైన హేబెలు మరియు ‘సత్యదేవునితో నడిచిన’ హనోకు. ఓడను నిర్మించిన నోవహు, ఇశ్రాయేలు జనాంగముయొక్క మూలపురుషులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ఉన్నారు. (లేవీ యాజక గోత్రికుడైన) మోషే, మరియు రాజ్యము కొరకై నిత్యనిబంధన చేయబడిన దావీదుయు కలరు. ఇంకా యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు, మలాకి వరకుగల బైబిలు రచయితలగు హెబ్రీప్రవక్తలందరు, అలాగే బాప్తిస్మమిచ్చు యోహాను, యేసును పెంచిన తండ్రియగు యోసేపును అక్కడ యుందురు.
14 ఒకానెక సంధర్భములో యేసు యూదులతో వారు, “అబ్రాహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు, (తాము) వెలుపలికి త్రోయబడుటయు చూతురని,” చెప్పెను. (లూకా 13:28) “సర్వోన్నతుడైన దేవుని మహాయుద్ధ దినము నుండి” తప్పింపబడిన భూమియందలి “గొప్ప సమూహము”లోని వారు, “అబ్రాహాము, ఇస్సాకు యాకోబు మరియు సకల ప్రవక్తలు” పునరుత్థానమగుటను, వారు దేవుని రాజ్యము క్రింద “నిత్యుడగు తండ్రియైన” యేసు క్రీస్తు ద్వారా రాజరిక సేవలోనికి వచ్చుటను అక్షరార్థముగా చూచు ఆధిక్యతను కలిగియుందురు.—ప్రకటన 7:9, 14; 16:14; యెషయా 9:6.
15. హార్‌మెగెద్దోను నుండి రక్షింపబడినవారికి పోల్చగరాని ఏ ఆధిక్యత నిలిచియున్నది?
15 సా.శ.పూ. 2370న భూవ్యాప్త జలప్రళయములో అప్పుడున్న ఆ మొదటి లోకనాశనమునుండి తప్పింపబడిన నోవహు అతని కుటుంబమునందలి “ఎనిమిది ఆత్మల”తో ప్రస్తుత దుష్టవిధానమునుండి తప్పింపబడిన మీరు విషయమును పోల్చుట మనస్సును ఎంతగా ఉత్తేజపరచునదై యుండును! మీకు కలుగు అనుభవము శాశ్వతకాలముల వరకు మరెవరికి ఉండదు, అలా అసాధారణమైన, పునరావృతము కాని ఈ విషయమందు యెహోవా దేవునికి సాక్షులై మీరు సేవచేయుదురు.—1 పేతురు 3:20; మార్కు 13:19; 2 పేతురు 3:5-7.
సానుభూతిచూపిన నేరస్థుడు జ్ఞాపకము చేసుకొనబడును
16, 17. (ఎ) సానుభూతిచూపిన నేరస్థుని యేసు జ్ఞాపకము చేసుకొనినప్పుడు, హార్‌మెగెద్దోను నుండి రక్షింపబడినవారికి అలాగే అప్పుడు జీవమునకు వచ్చినవారికి ఏ ఆధిక్యత ఉండును? (బి) పునరుత్థానుడైన నేరస్థుని విషయమై ఎలాంటి నిరీక్షణయుండెను?
16 నిస్సందేహముగా, భూపరదైసు పునరుద్ధరింపబడుట చాలావరకు పూర్తియగును. కల్వరీ అనబడిన స్థలములో యేసుతో కూడా వ్రేలాడదీయబడి, ఆయన తలకు పైభాగమునగల వ్రాతను గుర్తించి, “యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము” అని చెప్పిన వాడు, పునరుద్ధరింపబడిన పరదైసులోని భూజీవితమునకు పునరుత్థానము చేయబడును. (లూకా 23:42) హార్‌మెగెద్దోనునుండి తప్పించుకొనినవారు అప్పటికి బ్రతికియున్నవారు అతనిని మృతులలోనుండి ఆహ్వానించు ఆధిక్యతను కలిగియుందురు. సా.శ. 33 నీసాను 14న మిక్కిలి సానుభూతినిచూపిన అతనికి, ప్రస్తుతము రాజైయేలుచున్న యేసు క్రీస్తును గూర్చి వారు పూర్తిగా బోధింతురు.
17 తన వెయ్యేండ్ల పాలనా కాలములో ఏదో ఒక దినమున ప్రభువైన యేసు క్రీస్తు అతని తప్పక జ్ఞాపకము చేసుకొనును. నిస్సందేహముగా, విశ్వసార్వభౌమాధిపతియైన యెహోవా దేవుని యెడల తన విశ్వాస్యతను నిరూపించుకొనుట ద్వారా, పునరుత్థానుడైన నేరస్థుడు ఎవరికైతే తన పునరుత్థానమును అచ్చియున్నాడో ఆ పరిపాలించుచున్న రాజైన యేసు క్రీస్తు యెడల గుణగ్రహణను చూపించును. అప్పుడు అతడు పునరుద్ధరింపబడిన మిగతా విధేయతా మానవులతో కూడా పరదైసు నూతన లోకములో నిత్యము జీవించుటకు అర్హుడిగా లెక్కించబడును.
భూవ్యాప్తముగా పునరుద్ధరింపబడిన ఏదెను తోటలోని జీవితము
18. పునరుద్ధరింపబడిన పరదైసులో జీవితము ఎట్లుండును?
18 పునరుద్ధరింపబడిన పరదైసులో ప్రతివారికి ప్రతివారు స్నేహితులైయుందురు. ప్రపంచవ్యాప్త బాంధవ్యముల బంధములు ప్రతివానిలో బలముగా వేరుపారినవైయుండును. ప్రతివారు ఒకరినొకరు అర్థము చేసుకొందురు. వారందరు ప్రపంచవ్యాప్తముగా ఒకే భాషను మాట్లాడుదురు. సా.శ.పూ. 4026లో ఆదాము సృష్టి మొదలుకొని పెలెగు దినము వరకు (సా.శ.పూ. 2269-2030) “ఏలయనగా అతని దినములలో భూమి (భూప్రజలు) దేశములుగా విభాగింపబడెను.”—అనగా అది మానవ ఉనికిలోని మొదటి 1,800 సంవత్సరములు భూమిమీద ప్రతివారు మాట్లాడిన మానవజాతియొక్క ఆదిమ భాషయై యుండవచ్చును. (ఆదికాండము 10:25; 11:1) ప్రతివారు జీవించు ఆధిక్యతను కలిగియుండి, జీవితమునకు చేర్చబడు ప్రతి నూతన దినమును వారు కృతజ్ఞతతో పలుకరింతురు. కాలము గడచుకొలది శరీరము బలహీనపడదు. శారీరక సత్తువ నిర్మించబడును, దేహములు కృశించిపోవు.—యోబు 33:25 పోల్చుము.
19. క్రితము వికలాంగులుగాయున్న వారి విషయములో ఏమి గమనించబడును?
19 మరియు ఇదిగో, ఒకప్పటి కుంటివారు నడచుచున్నారు, అవును ఆనందముతో గంతులు వేయుచున్నారు. పోయిన చేతులు కాళ్లు అద్భుతరీతిన తిరిగి ప్రసాదించబడినవి. క్రితము గ్రుడ్డితనము గలవారు చూచుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మూగవారు మాట్లాడుచున్నారు ఆనందముతో పాటలు పాడుచున్నారు. (యెషయా 35:5, 6 పోల్చుము.) మానవ వికృత, వికారరూపములు మటుమాయమగును. మానవ పురుషతత్వము మానవ స్త్రీతత్వము ద్వారా చక్కగా సమతూకము చేయబడును. (ఆదికాండము 2:18) పరిపూర్ణ మానవ శరీరమునకు సృష్టికర్తయైన, యెహోవా దేవుని మానవ పరిపూర్ణత మహిమపరచును.
20. ప్రకృతి శక్తులు, ఆహారసరఫరా, జంతుసృష్టి విషయములో ఏమి గమనించబడును, మరియు భూమి ఎట్లు ఉపయోగింపబడును?
20 ఈ భూమి అంతయు అందమైన స్థలముగా మారబోవుచున్నది. భూమియందలి ఏప్రాంతమునుండి కూడా అతివృష్టి, అనావృష్టి, అల్పపీడన భీభత్సములు, ఉప్పెనలు, తుఫానులు, గాలిదుమారములను గూర్చిన వార్తలు రావు. (మార్కు 4:37-41 పోల్చుము.) జీవించుటకు సంతోషభరితమైన స్థలముగా ఈ భూమినిచేయుటకు ప్రకృతి శక్తులన్నియు పరిపూర్ణముగా సమతూకము చేయబడును. భూమి సమృద్ధిగా పండించును గనుక అక్కడ ఆహారకొరత ఉండదు. (కీర్తన 72:16) “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హానిచేయదు నాశనముచేయదు” అని యెహోవా సెలవిచ్చినట్లుగా మానవులు, జంతువుల కొరకు ప్రపంచవ్యాప్తముగా శాంతిభద్రతలు నెలకొల్పబడును. (యెషయా 11:9; 6-8 వచనములు కూడా చూడుము.) ఈవిధముగా భూమియొక్క సృష్టికర్త, యజమానియైన యెహోవా దేవుని సేవ మరియు ఆరాధనను చేయుటకు మరియు జీవించుటకు భూమి సంతోషమునిండిన స్థలముగా చేయబడును. సృష్టినిబట్టి ఇది ఆయన సొత్తు గనుక, ఆయనను ప్రీతిపరచుటకు మహిమపరచుటకు ఉపయోగించ అర్హమైయున్నది.—యెషయా 35:1, 2, 6, 7 పోల్చుము.
21. విడిపింపబడిన మానవజాతి భూమిమీదనున్న సమస్తమును ఎట్లు దృష్టించును, మరియు ఎలాంటి సంగీతము వినవచ్చును?
21 ఏ ఏదెను తోటలో మానవ జీవితము అందముగా పరిపూర్ణముగా ఆరంభించబడెనో ఆ పరదైసు తోటలోపల ఉండుటకు ఇప్పటివరకు అవకాశము లభించని విమోచిత మానవజాతి కొరకు భూమిమీద ప్రతిదీ నూతనముగా—సేదదీర్చునంత నూతనముగా ఉండును! (ప్రకటన 21:5) సమస్తమును యెహోవాను స్తుతించుటకు—ఎంత ఆనందదాయకమైన గళము మరియు వాయిద్యసాధనముల సంగీతము అక్కడ వినిపించును!—1 దినవృత్తాంతములు 23:4,5; కీర్తన 150:3-6.
22. నూతన పరదైసు లోకములో జీవించుటకు ఎట్లుండును?
22 ఎక్కడైతే మానవ జీవితము అంతకంతకు వికసించునో మరియు ఆదాము పాపమువలన వచ్చిన మరణకర స్థాయిలన్నియు సమసిపోవునో ఆ భూమియందు జీవించుట ఎంత అద్భుతకరము! (యోహాను 10:10 పోల్చుము.) మొదటి మానవుడైన ఆదాము చేయబడినట్లుగా, అక్కడ అంగీకరింపబడి జీవించు ప్రతి మానవప్రాణియు యెహోవా దేవుని స్వరూపమును పోలికను ప్రజ్వరిల్లజేయు స్థలముగా ఆ భూమి ఉండును! (ఆదికాండము 1:26, 27) అప్పుడు భూమి ఇక ఎంతమాత్రము సెరాపులు, కెరూబులు, తేజోవంతమైన దేవదూతల కన్నులకు బాధకల్గించునదిగా యుండదు. వారి మనోహరమైన ముఖారవిందములను భూమివైపు త్రిప్పి, అది పరదైసు అందముతో అలంకరింపబడి యుండుటను చూచినప్పుడు, తాము ప్రత్యక్ష్యముగా చూచు, విశ్వసార్వభౌమాధిపతియైన యెహోవాకు చెల్లించుటకు వారియొద్ద కేవలము కృతజ్ఞతలు, స్తుతులు మాత్రమే ఉండును.—మత్తయి 18:10.
ధన్యతగల, అనంతమైన భవిష్యత్తు
23. అభిషక్తులైన క్రైస్తవుల విషయములో ఏది సాధ్యము, మరియు అది భూపరదైసు వాసులకు ఎలాంటి ఫలితములను తెచ్చును?
23 భూపరదైసు నందలి మానవకుటుంబములు తెలుసుకొనుటకు, పరలోక రాజ్యమునకు తమ “పిలుపును ఏర్పాటును” నిశ్చయపరచుకొనిన మరియు ఈ ఉన్నతమైన పునరుత్థానము ద్వారా ఆశీర్వదించబడిన ఆ అభిషక్త క్రైస్తవులందరి పేర్లు భవిష్యత్తులో ఒక రోజున బహుశ ప్రచురము చేయబడును. ఆ సాధ్యత కలదు. (2 పేతురు 1:10; కీర్తన 87:5, 6) ఆవిధముగా యేసుక్రీస్తు ఆత్మాభిషేక 1,44,000 మంది శిష్యులు భూపరదైసులో కన్పించపోయినను, వారు ప్రతివారికి సంపూర్తిగా అర్థమగువారిగను, అలాగే వారినిబట్టి వారితో కూడా హృదయపూర్వకముగా ఆనందించుటకును వీలగును.
24. (ఎ) తన “పాదపీఠము” విషయములో యెహోవా ఏమి నెరవేర్చినవాడైయుండును? (బి) నూతన లోకము ఎన్నటికిని అంతముకాదని మనకెట్లు తెలియును, మరియు ఏ ప్రవచనార్థక కీర్తన నెరవేరును?
24 సమస్త విశ్వములో ఆదర్శ సార్వభౌమాధిపతియైన యెహోవా యెడల విడిపోని భక్తికలిగియుండు వారికి నిరంతర భవిష్యత్తు ఉండుట ధన్యకరము. సౌకర్యవంతముగా నింపబడిన పరదైసు భూమి దేవుని అలంకారార్థ పాదము మోపుటకు సరియైన మరియు ఘనమైన స్థలముగా ఉండును. అవును, యెహోవా శాశ్వత కాలము వరకు ‘తన పాదపీఠమును మహిమపరచును,’ కాగా మానవజాతియంతయు ఆయనకు స్థిరమైన విధేయతను కలిగియుండును! (మత్తయి 5:34, 35; అ.కార్యములు 7:49) నూతనలోకము అంతములేనిదై యుండును, ఏలయనగా “ఇది మొదలుకొని మితిలేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును.” (యెషయా 9:7) అప్పుడు, సా.శ.పూ. 2లో యూదయ బేత్లెహేములో యేసు జన్మమప్పుడు పరలోకములోని దూతలు, “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక” అని ప్రవచనార్థకముగా పాడిన పాట నెరవేరును.—లూకా 2:13, 14.
25. (ఎ) “వేరె గొర్రెల”లోని “గొప్ప సమూహము”నకు చెందినవారు ఇప్పుడు ఏమి గుణగ్రహింతురు? (బి) మన హృదయపూర్వక కోరిక ఏమైయుండవలెను?
25 మంచి కాపరియొక్క “వేరెగొర్రెల”లోని “గొప్ప సమూహము”నకు చెందినవారు, పరదైసు పునరుద్ధరణయొక్క వాగ్ధాన ఉత్తేజభరితమైన మాటలను ప్రశంసింతురు. ఇప్పుడు దేవుని సంస్థతో సహవాసము చేయుటయు, చివరి సాక్ష్యముగా సమస్త నివాసులకు రాజ్యసువార్త ప్రకటించబడునని ప్రభువైన యేసుక్రీస్తు ముందే చెప్పిన పనియందు చురుకుగా పాల్గొనుటయు వారికి ఆధిక్యతయైయుండును. (మత్తయి 24:14; మార్కు 13:10) విశ్వసార్వభౌమాధిపతియగు యెహోవా దేవుని, ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యపాలన క్రింద, నిరంతరము ఆయన మహిమకొరకు ఘనతకొరకు, ఎల్లకాలము మన నిష్కళంక యథార్థతను కాపాడుకొనవలెనని యెహోవా సాక్షులుగా మన నమ్మకమైన మరియు హృదయపూర్వకమైన కోరికయైయున్నది. “హల్లెలూయా!”—ప్రకటన 19:1, 3, 4, 6, ఆర్‌ఎస్‌వి, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్; సామెతలు 10:9. (w89 8/15)
మీరెట్లు జవాబు చెప్పుదురు?
◻ అలంకారార్థమైన తన పాదపీఠము విషయమై యెహోవా ఏ వాగ్దానము చేసెను?
◻ పరదైసును పునరుద్ధరించుటలో ఎవరు సహాయము చేయుదురు?
◻ ఎవరినుండి రాజైన యేసుక్రీస్తు “భూమి మీద అధికారులను” నియమించును?
◻ పునరుత్థానము జరుగుచుండగా ఆత్మను-ఉత్తేజితము చేయు ఎలాంటి అనుభవము మీదగును?
◻ యెహోవా యెడల తెగిపోని భక్తియందు నిలిచియుండువారికి ఎలాంటి భవిష్యత్తు నిలిచియున్నది?