ఘన చిత్రకారుడు యెహోవా!
“చిత్రకారులు సూర్యోదయ, అస్తమయముల చిత్రములను అసంఖ్యాకముగా వేయుదురు, కాగా వారి చిత్రపటములు వందల వేల డాలర్ల ఖరీదుకు విక్రయించబడును. అయితే ఘన చిత్రకారుడును, సూర్యోదయ అస్తమయములకు మూలకర్తయైన యెహోవా దేవుడు మనకు ప్రతిరోజు ఒకటి—ఉచితముగా—దయచేయుచున్నాడు. అసలు నఖలుకంటే ఎంతో ఉన్నతముగా యుండును. సృష్టికర్తగా ఆయనను గుణగ్రహించుటకు అది మనకు మంచికారణమును ఇవ్వవద్దా?” అని సంఘములలో ఇచ్చు ఒక ప్రసంగమునందు యెహోవా సాక్షుల ప్రయాణకాపరి ఒకరు తర్కించెను.
రాజ్యమందిరమునకు మొదటిసారి వచ్చిన నాస్తికురాలైన ఒక స్త్రీ ప్రేక్షకులలో కూర్చునియుండెను. పరిచారకుని తర్కమును ఆమె గమనించినను, దేవుని ఉనికిని గూర్చిన బలమైన సందేహములు ఇంకను ఆమెలో ఉండెను. ఏదిఏమైనను, దాదాపు రెండు సంవత్సరముల తర్వాత ఉద్యోగస్థలము నుండి ఇంటికి తిరిగి వెళ్లుమార్గమున ఒకచోట ట్రాఫిక్ రద్దీలో ఆమె ఆగిపోయెను. ఈ సమయములో ఆమె ప్రత్యేకముగా కంటికి ఇంపైన సూర్యాస్తమయమును చూచుట సంభవించెను. ఆమె ఆలోచనలు ప్రయాణకాపరి మాటలవైపుకు సాగినవి.
ఆమె విషయమును ఇలా వివరించుచున్నది: “ట్రాఫిక్‌లో ఇరుక్కు పోయినందుకు విసుకుచెందుటకు బదులు, ఒక చక్కని సూర్యాస్తమయమును నేను చూచితిని, కాగా ఇది యెహోవా దేవుని ఒక సృష్టికర్తగా, చిత్రకారునిగా గుణగ్రహించుటను గూర్చి ఆ ప్రసంగీకుడు చెప్పిన మాటలను నాకు జ్ఞాపకము చేసినది. ‘ఆయన చెప్పినదే బహుశ నిజమేమో; తప్పక సృష్టికర్త ఉన్నాడేమో,’ అని నేను ఆలోచనలో పడ్డాను. నేను ఇంటికి వెళ్లుదారిలో నేను అలా ఆలోచిస్తునేయున్నాను, ఆ రోజురాత్రి నన్ను మొదట రాజ్యమందిరమునకు ఆహ్వానించిన స్నేహితురాలిని పిలిపించుకొన్నాను. నేను బైబిలును పఠించుటకు ఆరంభించాను, ఇప్పుడు నేను యెహోవాను నా దేవునిగా మరియు సృష్టికర్తగా ఆరాధించుచున్నాను.”
కీర్తనల రచయిత వలెనే, ఈ స్త్రీ యెహోవా సృష్టియొక్క ఘన చిత్రకారునిగా గుణగ్రహించుటకు వచ్చుటయే గాక, ఇలా స్తుతి కీర్తనలను చేయుచున్నది. కీర్తనల రచయిత ఇట్లు వ్రాసెను: “ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. . .సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి. . . .యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక.”—కీర్తన 148:1-5. (w89 1/15)